Posts

SREESUKTAM-05-CHANDRAAM HIRANMAYEEM

Image
    శ్లోకము    చంద్రాం ప్రభాసా జ్వలంతీ శ్రియంలోకే  దేవజుష్టాముదారాం  తాం పద్మినీం శరణం  అహంప్రపద్యే అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే.    -ఓ జాతవేద అంటు,   లక్ష్మీ దేవి అనుగ్రహమునకై అగ్ని సహాయమును అర్థించుచున్న సాధకుడు, 1.మొదటి శ్లోకములో "మ ఆవహ" అంటూ అహ్వానించమని కోరాడు.     అహ్వానమును మన్నించి వచ్చుటయే కాదు, 2."అనపగామినీం' అంటూ  రెండవ శ్లోకములో వచ్చిన తరువాత తనను వీడక శాశ్వతముగా  ఉండునట్లు చేయుము.     అంతేకాదు,ఓజాతవేద 3"అశ్వపూర్వాం రథమధ్యాం" అంటూ ఆమె తన దగ్గరకు వచ్చు సన్నివేశమును,తన ఇంద్రియములనే ఆశ్వములను సరైన మార్గములోఉంచుతూ,తన గుణ్డెచప్పుడు చేయు ప్రణవనాదము  అనుసరించుచుండగా హ్రిదయరథ మధ్యమున ఆసీనమై తల్లి రావలెనన్న దర్శనాభిలాషను  కోరాడు. 4.నాల్గవ శ్లోకములో,  కాం  అనిర్వచనీయమైన  ఆ పరశక్తి నాకు అత్యమ్య విడదీయరాని సాన్నిహిత్యములో "ఉపహ్వయే" నా శ్వసగా మారిపోయి ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాడు.     ప్రస్తుత శ్లోకములో శరణాగతి,ప్రపద్యే శరణమహం" అంటూ,  బాహ్య-అంతర్ శుచికి సానుకూలతను క...

KRSHNAM VAMDE JAGADGURUM

Image
     కృష్ణం వందే జగద్గురుం *************************         కృష్ణా నేను   .ముస్తాబు చేయగలుగు కస్తూరిని కాను    వక్షస్థలమందున్న కౌస్తుభమును కానేకాను     సఖ్యత శిఖి చేరగ బర్హిపించమును కాను     ముక్కు చివరి చక్కని ముత్యమును అసలుకాను   .చల్లదనమును అందించగ చందనమును కాను    వేణువునై నినదించగ వెదురును కానేకాను     బెదరగొట్ట సేనల పాంచజన్యమును కాను     చెదరని భక్తిగల పాంచాలిని అసలు కాను    ఆరగింపును అందించిన అరటితొక్కను గాను    అడిగి ఆరగించిన అటుకులు కానేకాను    మిన్నతనము కన్నులుంచ మన్నైనా నేగాను    వెన్నుడవని వెల్లడించ వెన్నపూస అసలుకాను    ఉల్లము ఝల్లనిపించిన గోవర్ధన నగముగాను    గజ్జెలు ఘల్లనిపించిన కాళియమర్దనము కానేకాను    ద్వంద్వ యుద్ధము అందించిన జాంబవంతుడిని కాను    ద్వాదశిఫలమును పొందిన అంబరీషుడిని అసలుకాను    సూచనతో స్తుతియించగ శాంతనవుడిని కాను    సూటిగా కీర్తించ సూరదాసుని కానేకాను  ...

SREESUKTAM-04--KAAM SAHA-SMITAAM-SOSMITAAM

Image
   శ్లోకము   "కాం సోస్మితాం హిరణ్యప్రాకారం అర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం     పద్మేస్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం.   జాతవేదుని ప్రార్థిస్తున్న భక్తుడు ప్రస్తుత శ్లోకములో,  ఇహ ఉపహ్వయే-లక్ష్మీదేవి తనకు ఎంతదగ్గరగాఉండాలంటే,తన శ్వాసలో  నిలిచియుండునట్లు సహాయపడుమని  ప్రార్థిస్తున్నాడు.    లక్ష్మీదేవి తనదగ్గరకు రావాలి,వచ్చితనను వీడకుండాలి,తన మనో సంకల్పమును దృఢపరచినిరంతరము ప్రణవమును నినదించునట్లుచేయాలి వానితో పాటుగా తనశ్వాసలో నిరంతరము నర్తిస్తుండాలి అని కోరుకుంటున్నాడు.   ప్రస్తుత శ్లోకము పరబ్రహ్మము కాం  అను శబ్దముతో సూచించబడినది.క కారము బ్రహ్మ స్వరూపము.   వాజ్మానస గోచరము కానిది "కాం" ఇది  అని విశేషించి చెప్పజాలనిది.చూపించజాలనిది.    ప్రకృతికి మూలకారణమై ఆధారభూతమైనది.   పంచదశి మంత్రమే శరీరముగా భాసించునది కనుక "కాం"     లక్ష్మీదేవి సోస్మితాం.సుందర దరహాసముతో తప్తకాంచన వర్ణముతో ప్రకాశించుచున్నది.    ఆ తల్లి పద్మములో స్థిరముగా కూర్చునియున్నది.ఆ పద్మము పద్మాసనస్థయై పద్మవర్ణమ...

SREESUKTAM-03 ASVAPURVAM

Image
  శ్లోకము   ప్రస్తుత శ్లోకములో భక్తుడు తల్లి తనను అనుగ్రహించుతకు వచ్చు సుందర దృశ్య దర్శనమును అనుగ్రహింపమని కోరుచున్నాడు.   మొదటి స్లోకములో లక్ష్మీదేవిని ఆహ్వానము చేయమనిన సాధకుడు రెండవ శ్లోకములో వచ్చ్చి తన దగ్గర శాశ్వతముగా ఉండునట్లు సహాయముచేయమని కోరాడు.మూడవ శ్లోకములో తల్లి తనను అనుగ్రహించుతకు ఏ విధముగా రావలెనో తెలియచేయుచున్నాడు.  మూడు కోరికలను కోరుచున్నాడు. 1. తల్లి రథమధ్యమున ఆసీనురాలై యుండాలి. 2.రథమునకు ముందర అశ్వములు అలంకరింపబడియుండాలి. 3.రథమునకు వెనుక భాగము ఏనుగుల ఘీంకారముతో చైతన్యప్రద సంకేతముగా ఉండాలి.    తల్లి నా హృదయమనే రథమును అధిష్ఠించి యుండాలి.    నా ద్ర్ఢసంకల్ము అశ్వములవలె అకుంఠితముగా ఉండాలి.    నా అనాహతమునిరంతరము ఏనుగుల ఘీంకారము వలె ప్రణవ నాదోపాసన చేస్తుండాలి.    ఓ జాతవేద !       నా మనోఫలకమున అట్టి సుందర దృశ్యము నిండి నన్ను 

SREESUKTAMU-02-TAAM AAVAHA JATAVEDO

Image
  శ్లోకము  "తాం మ ఆవహ జాతవేదో లక్ష్మిం అనపగామినీం   యస్యాం  హిరణ్యం  విందేయం గామశ్వం పురుషానహం.   పూర్వ శ్లోకములో లక్ష్మీదేవిని తన దగ్గరకు చేర్చమని జాతవేదుని ప్రార్థించిన భక్తుడు జాతవేదునికి మరొక విన్నపమునుచేయుచున్నాడు.   ఓ జాతవేదుడా!      నీవు నిత్యపూజలలో జ్యోతిగాను,అగ్నికార్యములలో  మేము అందించు యజ్ఞవస్తువులను దేవతలకు అనుకూలమగు హవిస్సులుగా చేర్చి,వారి అనుగ్రహమును అందించు సంధానకర్తగా కీర్తింపబడుతున్నావు.దానికి కారనము, 1ఆశ్రిత ఆశ్రయము 2.ఆర్ష వాజ్మయము 3.అనంత సంపద అను నీ మూడు శుభలక్షణములు.    లక్ష్మీదేవి ప్రసన్నతను అందచేయగల జ్ఞానచైతన్యము నీవేసుమా.   నీ ఆశ్రిత ఆశ్రయముతో నిన్ను చేరగలిగినాను.నీ ఆర్ష వాజ్మయ శక్తితో ఆ తల్లి శాశ్వతముగా నాలో నిండియుండునట్లు ,నన్ను సౌభాగ్య సౌశీల్యునిగా దీవించునట్లు చేయుము.   ప్రస్తుత శ్లోకము రాజ్యలక్ష్మి "రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ'గా ,భక్తుని అనుగ్రహింపమని జాతవేదుని అర్థించుచున్నాడు భక్తుడు.  ఓజాతవేద! అమ్మకు నే పలుకు ఆహ్వానము తాత్కాలికము కాదు.  నా హృదయపీఠమున శాశ్వత నివాసమ...

SREESUKTAM-01 -HIRANYAVARNAM

Image
  శ్రీసూక్తము-01  ************  "ఓం హిరణ్యవర్ణాం  హరిణీం సువర్ణరజతస్రజాం   చంద్రాం  హిరణ్మయీం లక్ష్మీం " జాతవేదో" మ ఆవహ."   ఇది అమ్మవారి సాకార సంకీర్తనము.సహాయకుడు జాతవేదుడు.అమ్మ బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్నది.మేనిఛాయకు మెరుగులు అద్దుతూ సువర్ణ వెండి ఆభరణములు కదులుతూ కాంతులను వెదజల్లుతున్నవి.తల్లి బంగారు మేనిఛాయయే బంగారుమయముగా మరింత ముచ్చట గొలుపుతున్నది.దానికి తోడుగా తల్లి ధరించిన చంద్రరేఖ ఆహ్లాదమును కలిగించుచున్నది.అట్టి పరాశక్తి కరుణతో నా చుట్టు ఉన్న మాయతెరలను తొలగించివేసి,అనుగ్రహరూపముగా నన్ను నిండియుండుటకై,చైతన్యస్వరూపమైన ఓ జ్ఞానమా నీవు నా విన్నపమును అమ్మకు హవిస్సు రూపముగా అందించి,ఆమె అనుగ్రహము నాలో సంపూర్ణముగా నిండియుండునట్లు ఆశీర్వదించుటకు సహాయపడుము.  ఇది బాహ్యార్థము.సాకార దర్శనము.   ఇంకొంచము నిశితముగా అర్థము చేసుకొన కలిగితే అమ్మ "ఈం "బీజ ప్రదాయిని.సర్వానుగ్రహకారిణి.ఆమె లక్ష్మీ-హరిణీం.  హరి మనోవల్లభి కనుక హరిణి  ప్రకృతి స్వరూప-స్వభావము కనుక హరిణి  అశుభములను హరించివేసే తల్లి హరిణి.   అమ్మ ధరించిన సువర్ణ-రజత స్రజములు కే...

SREE SUKTAM-INTRODUCTION

Image
    శ్రీ సూక్తము   **********  లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం-      శ్రీరంగ ధామేశ్వరీం  దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం   శ్రీమన్మంద  కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం  త్వాం  త్రైలోక్య కుటుంబినీం సరసిజాం       వందేముకుందప్రియాం.   "శ్రీ  అను నాదము ఆరువిధములుగా అభివర్ణింపబడినది."  1.స్రీయతే ఇతి శ్రీః-చేతనులచే ఆశ్రయింపబడు పరబ్రమము "శ్రీ."  2,శ్రేయతి ఇతి శ్రీః-చేతనులకు శ్రేయోదాయకమైనది "శ్రీ"  3.శ్రుణోతి ఇతి "శ్రీః".-మొరలను ఆలకించేది "శ్రీ"  4.శ్రావయతి ఇతి శ్రీః-లక్ష్మీమాతగా చేతనుల ఆర్తిని స్వామికివిన్నవించే దయ/సహాయము "శ్రీ"  5.శ్రుణాతి ఇతి శ్రీః-పాపములను నశింపచేసేది శ్రీ"  6.శ్రీణాతి ఇతి శ్రీః-జగద్ధాత్రియై తనకరుణతో మాయ అను తెరను తొలగింపచేయునది.   శ్రేయతే లక్ష్యతే శ్రీః-శ్రేయతే దృశ్యతే శ్రీః   లక్ష్యమును మార్గమును సుగమముచేసే అవ్యాజకరుణయే "శ్రీ"    సూక్తము అనగా శక్తివంతములైన-ఫలప్రదములైన మంత్రముల కూర్పు.సూక్తములు అపౌరుషేయములు.  సు-శుభ...