Posts

SARVA SAMKSHOBHANA CHAKRAMU.

Image
   "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై     అష్టాదశ  మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి"   పూర్వభాగ పరిచయము   ***********************    "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే   సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః"  అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన, సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు.    సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా , కుసుమా ఏఖలా మదనా  మదనాతురా  రేఖా  వేగినీ  అంకుశా/కుశా  మాలినీ అను     గౌణనామములతో,  అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి.    హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది.  ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆ...

SARVAASAA PARIPURAKA CHAKRAMU

Image
   "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై     అష్టాదశ  మహాద్వీపాం సమ్రాడ్భోక్తా భవిష్యతి"   పూర్వభాగ పరిచయము   ***********************  " లకారః పృథ్వీ బీజం తేనభూబింబముచ్యతే"    ఫ్పార్వతీ ల కారము  ప్ర్ఠ్వీతత్త్వమునకు మూలబీజముగానున్నది.విశ్వములో త్రైలోకమోహన చక్రముగాను,జీవుల ఉపాథులలో  మూలాధారచక్రముగాను అమరియున్నది.  విద్య-అవిద్యా స్వరూపిణి అయిన జగన్మాత ,  అవిద్య గా చేతనులలోను,విద్యా స్వరూపిణిగా ప్రకటయోగినులు-చక్రేశ్వరి గా విరాజిల్లుతు సాధకుని తమోగుణమును మాయా మలమును దూరము చేసి గమనమును సుగమము చేస్తున్నది.   " సర్వాశా పరిపూరక చక్రము"     *******************  అమ్మ అనుగ్రహముతో ఒక్క మెట్టు ఎక్కి రెండవ ప్రాంగనములోనికి ప్రవేశించిన సాధకుడు,వికసిస్తున్న పదహారు రేకులతో వృత్తాకారముగా నున్న ఆవరణములోనికి ప్రవేశించాడు.    విశ్వములో "సర్వాశా పరిపూరక చక్రము"అని ఉపాధిలో "మణిపూరక చక్రము అని పిలుస్తారట.   "షోడశ కళానిధికి షోడశోపచారములు" అను నాదము నినదిస్తుండగా,పదహారుగురు మాతృమూర్తులు సాధకుని సాదరముగ...

SREECHAKRADHAARINI-01

Image
  శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01   ****************************    ప్రార్థన    ********    " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై     అష్టాదశ మహాద్వీపం  సమ్రాడ్భోక్తా  భవిష్యతి"     తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల  అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే.    పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు.  దేవీ!  " చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే    ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం    త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం"     ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహ...

SREECHAKRADHAARINI-INTRO

Image
     "  దేవీ ఖడ్గమాల స్తోత్రము"       ******************  " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"-    ఆదిశంకరులు భావించినట్లు,    " శివ ఏవ గురు సాక్షాత్-గురుః ఏవ శివః స్వయం" అన్న సూక్తికి ఊఅహరనముగా సక్షాత్ పరమేశ్వరుడు గురువై "శ్రీచక్రధారిణి" యైన అమ్మ యొక్క ప్రకటిత మేరుస్వరూపము యొక్క స్వరూప-స్వభావములను పార్వతీదేవికి అనుగ్రహించిన స్తోత్రమే ,  " శ్రీ శుద్ధ శక్తి మహామాలా స్తోత్రము " అను దేవీ ఖడమాలా స్తోత్రము.   ఖడ్గము అంటే స్తుతి.స్తుతిమాల.పరివారదేవతా సమేత స్తుతి మహా మాల.శక్తివంతమైనది కనుక శక్తి మహా మంత్ర మాల.సత్-చిత్ స్వరూపము కనుక  శుద్ధశక్తి మాల మహామంత్రము.  శుభప్రదమైనది కనుక     శ్రీ శుద్ధశక్తి మహా మాల మంత్రము.     శాక్తేయ సంప్రదాయానుసారముగా దేవీ అర్చనావిధానము, మంత్ర-యంత్ర-తంత్ర విధానములలో కొనసాగుతున్నది.   శక్తివంతమైన శబ్దము మంత్రమైతే-దానిని ఒకచోట నిలుపగలిగేది యంత్రము.ఇక తంత్రము,  ఒక అద్భుతమైన అల్లిక/నేత.ఆత్మ-పరమాత్మలు...

SREESUKTAM-12-AAPAHA SRUJAMTU SNIGDHAANI

Image
   శ్లోకము  "ఆపసృజంతు స్నిగ్ధానీచిక్లీత వసతు మే గృహే  నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే"

SREE SUKTAM-11-KARDAMAEVA PRAJAABHUTA

Image
  శ్లోకము  "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ   శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."     శ్లోకము  "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ   శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."     'మనస@కామమాకూతిం" శ్లోకములో ధాన్యలక్ష్మి-విద్యాలక్ష్మి స్వరూపముగా మహా లక్ష్మి(అనుగ్రహము)తన దగ్గరకు చేర్చి,తనను సత్యవంతునిగా అనుగ్రహించమనిన సాధకుడు,ప్రస్తుత శ్లోకములో సృష్టి రచనను అనేక పర్యాయములు అవిచ్ఛిన్నముగా నిర్వహిస్తున్న "సంతాన లక్ష్మి" ని   విశ్వరచనలు అన్న పద్మములను ఈం అనుగ్రహిస్తున్న మహాలక్ష్మి అనుగ్రహమునకు సహాయపడమని జాతవేదుని ప్రార్థిస్తున్నాడు.    తల్లి పద్మమాలను ధరించి ప్రకాశిస్తున్నది.ఏవిధముగా మహాలక్ష్మి జగమంతా అంతర్యామిగా నిండియున్నప్పటికిని ప్రపంచమాయను తాకనిదై వెలుగొందుచున్నదో మనము గ్రహించుటకు ,నీటినుండి బురదతో నిండిన ప్రదేశములో నుండి పుట్టినప్పటికిని ఆ నీటిని తన ఆకుపై కాని,పుష్పముపై కాని ఏ మాత్రము నిలువనీయని   శుద్ధ సత్వ చైతన్య మూర్తికి సంకేతమైనది.   అతువంటి వైరాగ్యమును తరతరములకు అందీయకలిగినది పద్మమాలిని అయిన మహాలక...

GAM GAM GANESHA-2024

Image
  మహా గణపతిం మనసా స్మరామి ******************************** నలుగురి మేలును కోరి,నలుగు ముద్దతో గౌరి, పరమ శివుని స్మరియిస్తూ,"వరపుత్రుని" చేసినది. సమరమైన చేయగలుగు సామర్థ్యపు కాపరి, కర్తవ్యము శుభకర " కరివదనుని" చేసినది. తల్లిని,తండ్రిని భక్తితో చుట్టిన బాలుని వైఖరి, అగణిత వాత్సల్యముతో "గణనాథుని" చేసినది. అహంకరించు అసురునిపై మోగించిన యుద్ధభేరి, "ఏకదంతుని," "మూషిక వాహనుని" చేసింది. మేరు పలకపై దంతపు ఘంటపు వ్రాత మహా కావ్య నాటకాది ప్రియునిగా కీర్తించినది పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత్వము విఘ్నములను తొలగించు వినాయకుని చేసినది. అపహాస్యము చేసిన ఆ చంద్రుని తిక్క కుదిరి, "భాద్రపద శుద్ధ చవితి" బహుళ ప్రాచుర్యము పొందినది. ................. మట్టి ముద్దలో దప్పిక తీర్చు జలము, జలములో దాగినది జ్వలనము అగు అనలము, అనలమునకు సహాయము అనువైన అనిలము, అనిలముపై ఆధారము సకల ప్రాణి జీవనము, అలలతో ఆడునది ఆ పున్నమి ఆకాశము, స్థూల,సూక్ష్మ తత్వముతో-భక్త సులభ వశత్వముతో, పంచ భూతాత్మకముగా మా మంచిని కోరుచున్న, మట్టి ముద్దతో ముద్దుగా మమేకమైనది నీ రూపు నేడు. .....................