Posts

TANOTU NAH SIVAH SIVAM-11@SIVATANDAVASTOTRAMU

Image
     తనోతు నః శివః శివం-11    *******************  "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతః పితరం  వండే పార్వతీ పరమేశ్వరౌ"    " కనిన జనని కన్న ఘనదయ దాయక      ఇదియ అనుగ్రహము అరుణాచల " అంటున్నాడు రావణుడు.(ఇది నా ఊహ)    తన తల్లి నిత్యశివపూజ-సైకత లింగము సముద్ర తరంగములచే రూపు మారుట-తల్లి ఆవేదనము-ఆత్మలింగమును అభ్యర్థించుటకై తన కైలాస ప్రయాణము-స్వామి దర్శనమునకు అనుమతించని నందీశ్వరునిపై/స్వామిపై ఆగ్రహం కైలాసమును కదిలించబోయి   తన అహంకారము అన్నీ అదృశ్యమైనవి.   స్వామి తాండవమును తన్మయుడై చూడగలుగు దర్శనశక్తి లభించినది.   "అళగు సుందరముల వలె చేరి నేను    నీవు ఉందము అభిన్నమై అరుణాచలా" అంటున్నాడు.   అవ్యాజకరుణ తథాస్తు అన్నదా అన్నట్లుగా,     "ఓం జాతవేదసే సునవా మసోమ" అంటూ దుర్గా సూక్తము      శ్రవణానందమును కలిగిస్తున్నది.     మరొక పక్కన  " తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనపగామినీం" అంటూ శ్రీసూక్తము శృతి శుభగముగా వినిపిస్తున్నది.   " త్రయంబకం యజామహే సుగంధిం...

TANOTU NAH SIVAH SIVAM-10

Image
      తనోతు నః  శివః  శివం-10     ********************  "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే     జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ".     పరమేశ్వరుడు తన తాండవములో విస్తరిస్తున్న జటలను పిల్లనాగులతో బంధించుకుంటు మనందరికి సంపదలను వర్షిస్తూఅడట.మొదటి చరణ్ అములో శుభములను వర్షిస్తున్న స్వామి శుభములతో పాటుగా సంపదలను వర్షిస్తున్నాడట ప్రస్తుత తాండవములో.సిరి-సంపదలను అనుగ్రహిస్తాడన్న మాట.ధన-ధాన్యాలు అంటుంటాము  అదేకదా.మనపైననే మాత్రమే కాదు మన తదుపరి తరములవారిపై కూడ అనవతర అనుగ్రహవర్షము.    ధన్యోస్మి మహాదేవా.    "సహస్రలోచన ప్రభ్యుత్యశేష లేఖ శేఖర   ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూః   భుజంగరాజ మాలయ నిబద్ధ జాటజూటక   శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః."       "శుభమంగళం-నిత్య జయమంగళం"        అజాయమాన-బహుధా విజాయతే'           పుట్టుక లేని పరమాత్మ ఎన్నో అద్భుతములను సృష్టిస్తున్నాడు.     స్వామి సంపదలతో కూడిన మంగళములను జ...

TANOTU NAH SIVAH SIVAM-09@SIVATANDAVASTOTRAMU

Image
          తనోతు నః శివః శివం-09      *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరం  వందే పార్వతీపరమేశ్వరౌ."     పరమాత్మ తనతాండవమును మరింత ప్రకాశవంతమే కాక పరిమళభరితము గావింపనున్నాడనుటకు సంకేతముగా ప్రసూనమాలలు-ప్రసూనమాలాధారణముచేసిన  అశేషదేవతా పాదనమస్కారములు-అదేఅదనుగా వారి ప్రసూనములలోని పుప్పొడి స్వామి పాదపీఠమునకు అభిషేకమై-అలంకారమై-ఆత్మార్పణమై ఆనందించబోవుచున్నదేమో అనిర్వచనీయముగా.      "పర చిదంబర నటం హృది భజ."              జగదంబ   " పంచమీ పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి"      అమ్మ పంచభూతేశి.పంచభూతములకు ఈశ్వరి.పంచభూతములుగా ప్రకటితమైన పంచమి స్వామిని పంచసంఖ్యలతో పాదసేవనము చేయాలని తలచినది.  " దివ్"  అను ధాతువునకు ప్రకాశము/తేజము అని భావము.అమ్మ తన ప్రకాశమును కొన్ని ప్రత్యేక ఉపాధులలో నిక్షిప్తముచేసి "లేఖ/దేవత/దేవుడు" అంటూ పేరు పెట్టినది.వారికి తమ తండ్రిని చూపించి-సేవింపచేయాలనుకున్నది.పరిమళభరిత ప్రసూనముల మాలలను వారిచ...

TANOTU NAH SIVAH SIVAM-08@SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు న#హ్ శివః శివం-08     *******************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."     స్వామి ప్రకాశమైతే అమ్మ వ్యాపినీ వివిధాకార /ఆ ప్రకాశమును సర్వత్రా వ్యాపింప చేసే విమర్శ.స్వామి స్థావరమైతే అమ్మ జంగమాత్మకము.స్వామి జంగమయైతే అమ్మ స్థావరముగా స్వామిలో ఒదిగి పోతున్నది.స్వామి తాందవిస్తున్నాడు.తల్లి స్థిరముగా తానుండి స్వామిని తాందవింపచేస్తున్నది.ఒకపరి అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ.మరొకపరి స్వామి స్వామి భిభర్తు భూత భర్తరి.అర్థనారీశ్వర పరమార్థము అనిర్వచనీయము.  " జటా భుజంగ పింగళః స్పురత్పణా మణిప్రభా    కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిక్వధూముఖే    మదాంధ సింధుర స్పురత్వగుత్తరీయమేదురే    మనోవినోదమద్భుతం భిభర్త్ భూత భర్తరి."  1.స్వామి జటలలో భుజంగము పడగలమీది మణులు ఎరుపుతో కూడిన పసుపువర్ణమైన పింగల వర్ణముతో ప్రకాశించుచున్నవి.అవి మంగలకరమైన "పసుపుకుంకుమలా" అనిపిస్తున్నవి.స్వరూపమునుతో పాటుగా తమ స్వభావమును సైతము మార్చుకుని జగత్కళ్యాణమునకై,  2.కదంబ కుంకుమద్ర...

TANOTU NAH SIVAH SIVAM-07@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః  శివః శివం-07   **********************   "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"     మూలపదార్థమును అన్వేషించే మనసు తిరిగి సాకారమును సాధనముగా చేసుకుందా      మనుకున్నట్లున్నది.           " ఈశుని మ్రోలా-హిమగిరి బాలా  కన్యతనము ధన్యమైన గాథను " వినిపిస్తూ-     కనిపించేటట్లు చేస్తున్నది ఈశ్వరానుగ్రహము.    స్వామి భూత భర్తరి-సకలజీవులను సంరక్షించేవాడు.జగత్కళ్యానమునకై పలుమార్లు     పార్వతిని పరిణయము చేసుకుంటాడు -పరిపాలనమును నిర్వహిస్తాడు.         అదేజరుగబోతున్నట్లున్నది  ఇప్పుడు.            మన్మథుని క్షమించి మంగళగౌరిని ను వివాహమాడిన మహాదేవుడు     మరొకసారి తన సృష్టి ప్రకటనమును విస్తృతము చేస్తున్నాడు.         అది ప్రపంచముగా భాసించుచున్న పార్వతీదేవికి-ప్రపంచవిస్తరనమును గావిస్తున్న     పరమేశ్వరునికి మనదృష్టిల...

TANOTU NAH SIVAH SIVAM-06@SIVATANDAVASTOTRAMU

Image
    తనోవ నః శివః శివం-06    ****************   "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః  పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ"    మహాద్భుతమైనది ప్రస్తుత చరణము  శివశక్త్యాత్మకతను మరింత ప్రస్పుటము చేస్తోంది  " ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర    స్పురత్ దిగంతసంతతి  ప్రమోద మాన మానసే    కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది    క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని."      సర్వమంగళా దేవి సమక్షములో మహాదేవుడు మహదానందముతో తాందవిస్తున్నాడు.  1.ధరేంద్ర నందనందిని విలాస బంధు బంధుర         లీలగా తనను తాను అలంకరించుకొనినది జగన్మాత.ఆలంకారములకు లక్ష్యము  మహాదేవుని ప్రమోద మానసునిచేయుటయే.     అవలీలగా తాండవిస్తున్నాడు త్రయంబకుడు.ఆ తాండవమునకు   లక్ష్యము మహాదేవిని ప్రమోద మానస చేయుటయే.   వారిరువురి పరస్పరావలోకన లక్ష్యము వారి సంతతిని ప్రమోదమానసులను చేయుటయే.      అమ్మది విలాసము-అయ్యది వినోదము.   అమ్మ నందిని-ఆనందప్రదాయిని.   అ...

TANOTU NAH SIVAH SIVAM-05@SIVATANDAVASTOTRAMU

Image
        తనోతు నః శివః శివం-05   *****************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      "శివగంగ శివమెత్తి పొంగగా       నెలవంక సిగపూవు నవ్వగా       హరిహరాత్మకమగుచు       అఖిలప్రపంచమ్ము          ఆనందమయముగా       భవతిమిరహంశుదా        విశాలాక్షికై నిటాలాక్షుడే          " నటకా వతంసుడై"       తకధిమితక యని           నటనం  ఆడెనే.(శ్రీ  వేటూరి)      తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.   కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.     ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.   ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,  " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటా...