AMBA VANDANAM-01
అంబ వందనం ********** " ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం శిరః శంఖం సందధీతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం యాం హంతుం మథుకైటభౌ జలజభూస్తుష్టావ సుప్తే హరౌ నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం" ఖడ్గము-చక్రము-గద-బాణములు-విల్లు-పరిఘ-శూలము-ఆయుధములుగా ధరించి,చేతిలో అగ్నిపాత్రతో,శంఖముతో,మూడుకన్నులతో,తెగినశిరముతో, భూషణములతో,నీలమణి కాంతులతో ప్రకాశించుచు , ఎవరు కలవరపడుచున్న కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మను,యోగనిద్రలో నున్న అనంత పద్మనాభుని మధుకైటభుల బారి నుండి రక్షించినదో, ఆ జగన్మాత నిర్హేతుక కృప,నా కరమున కలముగా మారి,కళ్యాణప్రదమైన తన అనుగ్రహమును వివరించుచున్నవేళ,నన్ను గమనించనీయకుండా నా అహము దానిలో తప్పులను కుప్పలుగా కుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. " యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం".....తత్సర్వం క్షమ్యతాం దేవి" ఆ తల్లి నా దోషములను సవరించి,నన్ను మన్నించును గాక. ఎవరీ మధు-కైటభులు? వారికి బ్రహ్మ-నారాయణుల దగ్గరకు వెళ్ళి-విజృంభించగల ధైర్యము ఎలా వచ్చింది? అను విషయమును చర్చించుటకు ము...