Posts

Showing posts from January, 2018

TIRUPPAAVAI-INTRODUCTION

Image
జై శ్రీమన్నారాయణ. ***************** భగవత్ బంధువులారా! మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో . " అందరికి వందనములు." మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి, " నీ పాదము పట్టి నిల్చెదను పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అని పలికించినది. అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"ఒక గోపిక అంతరంగం...

TIRUPPAAVAI-01

 మార్గళి తింగళ్ మదినిఱైండ నన్నాళాల్  నీరాడప్పోదు వీర్ పోదు మినో నేరి జైఈర్  శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱు మీర్గాళ్  కూర్వేల్ కొడుందొళినన్  నందగోపన్ కుమరన్  ఏరారంద కణ్ణి యశోదై ఇళంశింగం  కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ముగత్తాన్  నారాయణనే నమక్కే పఱై తరువాన్  పారోర్ పుగళ్ప్పండింద్ ఏలో రెంబావాయ్.   ఓం నమో నారాయణాయ-1 *********************** విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" గా మారినది "విష్ణు చిత్తీయమై" శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది బ్రాహ్మీ ముహూర్తమనే సత్వగుణ ప్రధానమైన సమ శీతోష్ణత గల " శ్రీ మహా విష్ణు మాసములో" ధన్యతనందించ గలుగు "ధనుర్మాస వ్రతమైన" అంగనలారా! మంగళ "శ్రీ రంగనాథుని సేవలలో" భక్తి తత్పరతయే భవతారణ భాగ్యమైన బాహ్యాభ్యంతర శుచియగు " భాగీరథీ స్నానములో" "పర-రూప-విభవ-అర్చ-ఆంతర్యాది" రూపమైన " ధర్మార్థకామమోక్ష" భాసురమను పాశురములలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ "భక్తి"పూల మాలలతో నేడె భావము "మార్గళి" సుప్రభాత సమయము శుభ ప్రదమైన ...

tiruppaavai-02

వైయత్తువాళ్ వీర్గాళ్ నాముం నం పావైక్కు శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ర పరమ నడిపాడి నెయ్యిణ్ణోం  పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టెళుదోం మలరిట్టు నా ముడియోం శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్రోదోం ఐ యమాం పిచ్చెయుం ఆందనైయుం కైకొట్టి ఉయ్యు మాఱెణ్ణి ఉగంద్  ఏలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-2 ్్్్్్్్్్్్్్్్్్్్్్్ విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది "విష్ణు చిత్తీయమై" శ్రీ హరి సంకీర్తనమే కోరుతోంది 'పాలు-నీరు--దేహాలంకరణ" నిరాకరణమైన పాలకడలి నాథుని '"వ్రత నియమ సం యమనములో" నిస్తుల వైభవ స్తుతులే " కస్తూరి తిలకమైన" నాసాగ్ర మౌక్తికమూర్తి భక్తుల " సత్య వాక్య పాలనలో" హరిచందనమూర్తిని సంకీర్తించు "వేదాంత దేశికులైన" సాధు సజ్జనుల సమర్పణము " సవినయ భిక్ష రూపములో" కృతకృత్యులనొనరించు " నిత్య నిరంజనమైన" "కాత్యాయినీ వ్రతమును" చేయుచున్న గోప కాంతలలో "తెల్లవార వచ్చెనమ్మ" చెలులారా రారె తెల్లబరచగ "భక్తి" పూలమాలలతో నేడె. భావము వ్రత ని...

TIRUPPAAVAI-03

 ఓంగి ఉంగళంద ఉత్తమన్ పేర్ పాడి  నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీరాడినాల్  తీంగిన్రి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్ దు  ఓంగు పెఱుం శెన్నెలూడ కయలుగళ  పూంగువళై ప్పోదిల్ పోఱివందు కణ్పడుప్ప  తేంగాదే పిక్కిరిందు శీర్ త్తములై పత్తి  వాంగక్కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్  నీంగాద  శెల్వం నిఱైంద్ ఏలో  రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-3 ********************** విచిత్రముగ నామది " శ్రీ విల్లి పుత్తూరు" గా మారినది "విష్ణుచిత్తీయమై" శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది. పునీతులు-గోపికలు పురుషార్థ ప్రదమైన పుణ్య స్నానములు చేయుచున్న తీర్థములలో నింగి-నేల స్నేహముతో హితము రంగరించినదైన పల్లెతల్లి పులకింతల పచ్చని పంట పొలములలో నింగి-నేల-జలము దాగుడుమూతలాడుచున్నవైన పారుచున్న సరసులోని చేపల కేరింతలలో మరుగుజ్జు రూపమున ముజ్జగములు కొలిచిన వాడైన ఆ వామనమూర్తి త్రివిక్రమ పరాక్రమములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పుష్కర తీర్థములలోను,పంట పొలములలోను,వాటి మధ్యనున్న సరసులలో ఆడుచున్న చేపలలో...

TIRUPPAAVAI-04

ఆళిమళైకన్నా! ఒన్రు నీకై  కరవేల్ ఆళిఉళ్ ఉక్కు ముగందు కొడు ఆర్తి ఏఱి ఊళి ముదల్వ నురువం పోళ్ మెయ్ కఱుత్తు పాళియన్ తోళుడై పఱ్పనాబన్ కైయిల్ ఆళిపోళ్ మిన్ని వలంబురిపోల్ నిన్ర అదిరింద్ తాళాదే శార్ఙ్ ముదైత్త సరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మళిజింద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-4 ************************* విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది " విష్ణు చిత్తీయమై" శ్రీహరిని కీర్తించుటనే కోరుతోంది. పాండవ రథ సారథి " శౌర్యపు గర్జనయైన" కడలినీరు కడుపునిండ " గర్జనవలె త్రేంచు మేఘములో" దుష్టశిక్షణార్థము " రాముని శరవేగ పోలికయైన" వేగముతో వర్షించే " అలుపెరుగని మేఘములో" శిశుపాలుని వధియించి శ్రీకరముగ" మెరయుచున్నదైన" "సుదర్శన చక్రము" వలె " మెరయుచున్న మేఘములో" " నామ,రూప,సారూప్యములు" అవిభాజ్యములైన "సాక్షాత్ నీలమేఘ శ్యాముడైన" ఆ నీలి మేఘములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము శ్రీ కృష్ణుని పరాక్రమము...

TIRUPPAAVAI-05

Image
మాయనై మన్ను వడ మదురై మైందనై తూయ పెరునీర్ యమునైత్ తుఱైవనై ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై తాయైక్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తూ మలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళయుం పూగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం శెప్పేలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-5 ************************ విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది పాలుతాగినంతనే పూతన పాపాలు పరిహారమైన మురిపాల బాలగోపాలుని మేలుకొలుపులలో యశోదమ్మ పున్నెమేమో తనకుతాను కట్టుబడిన వాడైన మన్నుతిన్న వాడన్న దామోదర రూపములో వ్యత్యస్త పాదారవిందములతో కాళియమర్దనమైన ప్రస్తుతించి పులకించిన పశుపక్షి గణములలో మధుర నిర్వాహకుడు మన వ్రతనాయకుడైన ఆగామి సంచిత హరుని ఆగమ స్తుతులలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా! రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె భావము పాలుతాగి,పూతన పాపాలను తొలగించిన నల్లనయ్య మేలుకొలుపులలో,అమ్మకు పదునాలుగు లోకములు చూపించి,తనకు తానుగా దొరికి యశోదచే రోటికి కట్టబడిన దామోదరునిలో,( పొట్ట మీద తాటిగుర్తు కలవాడు),కాళియ మర్దనముతో ప...

TIRUPPAAVAI-06

పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరైయన్ కోయిలల్ వెళ్ళై విళి శంగన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్ఎళుందిరాయ్  పేయ్ములై నంజుండు కళ్ళాచ్చగడం కలక్కళియక్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుకొండు మునివర్గళుం యోగిగళుం మెళ్ళ ఎజుంద్ అరి ఎన్న పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-6 ************************* విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది నాయందే కలడనుకొనుచు బృందావన వాసుడైన గోవిందుని అనుగమించు గొల్లెతల పెడకొప్పులలో వేదవేదాంత వేద్యుని వేణుగాన పరవశులైన యమునా రాస విహార రమణుల కుడిపైటలలో మధురానగర విహారి మధుర గంభీర ధ్వనియైన శంఖధ్వనితో కూడిన మోగిన జేగంటలలో ఆ మాయావి ఏమిచేసెనో శతక్రతు సమానమైన వ్రత వైభవమును మరచి నిదురించుచున్న గోపికలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె భావము పదిమందికి స్వామి అనుగ్రహమును పంచదలచి,గొల్లెతగా కుడిపైట-పెడకొప్పు ధరించి,శంఖధ్వనిని వినమని,వ్రతము మరచి నిదురించుచున్న గోపికను జేగంట వినపడుచున్నది కనుక నిద్రలెమ్మ...

TIRUPPAAVAI-07

కీశు కీశెన్రెగుం మానై  చత్తాన్ కలందు పేశిన పేచ్చరవం కేట్టిరయ్యో పేయ్పెణ్ణే కాశుం పెఱప్పుం కలకల్ప్పైకె పేర్తు వాశ నఱుం కుజలాయిచ్చయర్ మత్తినాల్ ఓశై పడుత్త తయిర రవం కేట్టిలైయో నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణ మూర్తి కేశవునై పాడవుం నీ కేట్టే కిడత్తియో తేశ ముడైయాడ్ తిఱన్వేలో  రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-7 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది భరధ్వాజ పక్షులకు భగత్చింతన యైన ఖగరాజ వాహనుని సుప్రభాత సేవలలో ముద్దరాలు ఈమె అని నిద్దురలేపుచున్నదైన ప్రేమ పూరితమగు "పిచ్చి పిల్లా " అను పిలుపులో నవ మన్మథుని మించిన నగధర రూపమైన అగణిత గుణగణుని కొలుచు అగరు ధూప పరిమళములో రేపల్లెలో గొల్లెతలు చల్ల చిలుకు వేళయైన నల్లనయ్యను పిలుచు కవ్వపు సవ్వడులలో తెల్లవర వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పుణ్యాల పంటైన భరధ్వాజ పక్షుల కిచకిచలలోను,ఆండాళ్ తల్లి గోపికను ప్రేమతో పిలిచిన "పిచ్చిపిల్ల" అను పిలుపులోను,స్వామి కైంకర్యములో ధన్యమగు చున్న అగరుధూపముల లోను,గొల్లెతల కవ్వపు శబ్దములలోను ని...

TIRUPPAAVAI-08

Image
కీళ్ వానం వెళ్ళెన్రు ఎరుమై శిఱువీడు మేయ్వాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై క్కూవువాన్ వందు నిన్న్రోం కోదుకుల ముడైయ పావాయ్ ఎళుందిరాయ్ పాడిప్పఱైకొండు మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై చెన్రురాం శేవిత్తాల్ ఆవా వెన్రా రాయుందరుళ్ ఏలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-8 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది వేణుగానలోలునినయన భానూదయ ప్రసాదమైన లేగ దూడలు మేయుచున్న లేలేత చిగురు పచ్చికలో రేపల్లెలలో రేయి-పవలు గోవింద రూపములైన గోపాలుర-గొల్లెతల పావై-పామర భాషలలో చందన చర్చిత ధారి చదరంగపు పావులమైన ఇదిగో! అని ఇస్తున్న "పఱి" అను పురుషార్థములో పదిమందికి పంచగలుగు పారమార్థికమైన భువనమోహనుని కొలుచు బుద్ధి పాశురములలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము ఉదయముననే లేత పచ్చిక తినుచున్న లేగ దూడలలో,రేపల్లె వాసుల పండిత-పామర భాషలలో,స్వామి అనుగ్రహించబోతున్న పఱి అను వాయిద్యములో,పదిమందితో కలిసి జరుపుకునే పరమ పావనమైన పెరుమాళ్ సేవతెలుపు బుద్ధి...

TIRUPPAAVAI-09

తూమణి మాడత్తుచ్చుత్తం విళక్కెరియ తూపం కమళత్తుయిలణైమేల్ కణ్వళరుం మామాన్ మగళే! మణిక్కదవం తాళ్తిరవాయ్ మామీర్! అవళై ఎజుప్పీరో ఉన్మగళ్ తాన్ ఊమైయో అన్రి చెవిదో అనందలో ఏమపెర్రుందుయిల్ మందిరప్పట్టాళో మామాయన్ మాధవన్ వైగుండన్ ఎన్రెన్రు నామం పలవుం నవిన్ర ఏలో రెంబావాయ్ . ఓం నమో నారాయణాయ-9 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది వేద సం రక్షణార్థము " వేదాంతవేద్యుడైన" జలచరమై జయమొసగిన "మత్స్యావతారములో" "ధర్మ సంస్థాపనకు" క్షీరసాగర మథనమైన ఉభయచరమై ఉద్ధరించిన " శ్రీకూర్మావతారములో" " పరమపునీత భూమాత" అసురహస్తగతమైన అమ్మను రక్షించిన " ఆదివరాహరూపములో" "దశేంద్రియములు మేల్కొలుపు" దశావతారములైన వివిధరూపములు ధరించిన " విరాట్రూపములో" తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పరిశుద్ధమైన మణిసదనములో ఆదమరచి నిదురించుచున్న గోపిక స్వామిసేవకు సిద్ధముకాలేదని,పిలుచుచున్నను మేల్కొనుటలేదని,అమె పక్కనున్న తల్లిని మే...

TIRUPPAAVAI-10

నోత్తుచువర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్ నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళ్ పోత్తపఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్ కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో ఆత్త అనందలుడయాయ్ అరుంకలమే తేత్తమాయ్ వందుతిఱ ఏలో రెంబావాయ్ ఓం నమో నారాయణాయ-10 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ప్రభువుల,పడతుల,ద్విజుల కర్తవ్యపాలనమైన నెలకు, ఆరక కురియుచున్న మూడు వానలలో బురద అంటనీయని వైరాగ్యపు భాష్యమైన "మణి కైరవ" దిగుడుబావి విరబూసిన తామరలలో పూర్వ పుణ్యఫలముగా యోగ తాదాత్మ్యమైన అంభోరుహనేత్రి పోవుచున్న కుంభకర్ణుని నిద్రలో 'ఉడైయార్ ఆరుఙ్ లమే"అని అగస్త్యుని తలపించినదైన అమ్మ కీర్తించుచున్న ఆ ఆభరణపు పాశురములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము. మాయ తెరను తొలగించుకొని,మాధవ సరస భావనలో నున్న గోపికను,తలుపును (మాయతెర) దాటలేని గోపికలు,స్వామిని సేవించుటకు నిదురను చాలించి తమతో రమ్మనుచున్నారు.కుంభకర్ణుని గెలిచి,అతన...

TIRUPPAAVAI-11

కత్తు కఱవై కణంగళ్ పలకఱందు శెత్తాల్ తిఱల్ అరయ చెన్రు శెరుచ్చెయుం కుత్తం ఒన్రిల్లాద కోవలర్ దం పొఱ్కొడియె పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుత్తత్తుత్తోరిమార్ ఎల్లారుం వందు నిన్ ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ శిత్తాదే పేశాదే శెల్వ పెణ్డాట్టి నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-11 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది " మాధవ కణంగల్" అనబడు సాధురూపములైన అరిషడ్వర్గములంటని సురభుల గోష్ఠములో అస్ఖలిత బ్రహ్మమునకు అనిశము శిరోధార్యమైన అస్ఖలిత బ్రహ్మచారి ఆ బర్హి పింఛములో "సెండ్రుం-సెరుం-సెయ్యం" అంటు అతిపరాక్రమములైన అరి సం హారముచేయు బుద్ధికుశలతలో పుట్టలోపల చుట్టినదేహముతో పడగ విప్పినదైన పుట్టినింటి గౌరవమును పెంచు ఆ " బంగరు మొలకలో" తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము లెక్కపెట్టలేనన్ని సద్గుణముల ప్రోవులైన గోగణములున్న గోశాలలలోను,ప్రశాంత ప్రసన్న సౌందర్యమైన నెమలి లోను,దుష్టత్వమను శత్రువును గుర్తించి,తనకు తానుగా ...

TIRUPPAAVAI-12

Image
కనైత్కిళంక తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములై వరియే నిన్రుపాల్ శోర నన్నైత్తిల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్ ప్పనిత్తిల్లె వీజనిన్ వాశల్ కడైపత్తి శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త మనత్తు కినియానై పాడవుం నీ  వాయ్ తిరవాయ్ ఇనిత్తాల్ ఎజుందిరాయ్ ఈదెన్న పేరుఱక్కుం అనైత్తిల్లత్తారుం అరిందే ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-12 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది మూగదో,చెవిటిదో అని, ముదితల పరిహాసమైన ముద్దరాలు నిద్దరోవు అద్దాలున్న పానుపులో ఉవిద భక్తి ఉత్కృష్టమై కృష్ణునితో మమేకమైన వక్షస్థలమందు నున్న పుండరీకాక్షునితో పక్కనున్న అత్తను నిద్దురలేపమనిన వారైన బద్ధకమును వదిలి,లేచి గడియ తీయమనుటలో అనవరత ధ్యానములో ఆమె-అంతర్ముఖమైన బహిర్ముఖము చేయుటకు "ఎన్ఱెన్ఱు నామం పలవుం" అనుటలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. సురభులు వర్షించిన పాలమడుగుల అడుసుగల ఇంటిలో నిద్రించుచున్న గోపికను నిద్రలేపుచుండుట సామాన్యార్థమైన ఈ పాశురములోని పాలమడుగు సత్వగుణ భూయిష్టమైన గోపిక మనసుయే. పాలమడు...

TIRUPPAAVAI-13

పుళ్ళిన్ వాయ్ కీండానైప్పొల్లా అరక్కనై కిళ్ళిక్కళైందానైకీర్తిమై పాడిప్పోయ్ పిళ్ళైగళ్ ఎల్లారుంపావైక్కళం పుక్కార్ వెళ్ళి ఎజుందువియాజ ముఱంగిత్తు పుళ్ళుం శిలంబిన కాణ్పోదరిక్కణ్ణినాయ్ కుళ్ళ కుళిరక్కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీవన్నానాల్ కళ్ళం తవిరిందు కలంద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-13 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది శిరములజారిన క్షీరము "స్థితికారణ గుణమైన" సురభుల పాలను తడిసిన " అడుసంటిన గోపికలో" మంచు కురియుచున్నదని " హేమంతపు ఛత్రమైన" ఇంటిచూరు కిందచేరి నిలబడిన గోపికలో "గురు నక్షత్రపు చీకటి " కనుమరుగైనదైన శుభకరమగు" ఉదయించుచున్న శుక్ర నక్షత్రములో" భక్తులు కొలిచెడి దైవము " భక్త పరాధీనమైన" "రామ -కృష్ణ రూపములను ప్రీతి పాశురములలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము. గోవుల పాలతో తడిసిన బురద అంటుకున్న గోపికలో,మంచు కురియు చున్నదని ఇంటిచూరుకింద నిలబడిన గోపికలో,అస్తమించిన గురు నక్ష...

TIRUPPAAVAI-14

Image
ఉంగళ్పుళుక్కడై త్తోట్టత్తు వావియుళ్ శెంగళ్ నీర్వాయ్ నెగిజింద్ ఆంబల్వాయ్ కుంబినగాణ్ శెంగల్ప్పొడి క్కూరై వెణ్పల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్ ఎంగళై మన్నం ఎజుప్పువాల్ వాయ్ పేశుం నంగాయ్ ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడయాయ్ శంగోడు చక్కరం ఏండుం తడక్కైయన్ పంగయ కణ్ణానై ప్ప్పాడ్ఏలో రెంబావాయ్ . ఓం నమో నారాయణాయ-14 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది "ముష్టికాసుర చాణూరులను" మట్టికరిపించినవారైన ఉల్లము ఝల్లనిపించిన " మల్లయుద్ధ క్రీడలలో" " చింతచెట్టు క్రింద కూర్చున్న" చిత్ప్రకాశరూపమైన మధురకవితో మాట్లాడిన " శ్రీ నమ్మాళ్వారులో" "త్రేతా-ద్వాపర యుగముల" రామ-కృష్ణ నామభేదాలైన భక్తిభావము ఎక్కువైన " చీలిన రెండు వర్గములో" శ్రీ రామాలింగనమునకు " ధ్యానించిన వారైన" "శ్రీ కృష్ణ పరిష్వంగమును" కోరుచున్న గోపికలలో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె తామ్రపర్ణీ నదీ దక్షిణతీరములో కురుకూరులో ఉదయనంగ-కారికి దంపతులకు ...

TIRUPPAAVAI-15

ఎల్లే! ఇళం కిళియే! ఇన్నం ఉరంగుదియో శిల్ ఎన్రారై యేన్మిన్ నంగైమీర్ గిన్రేన్ వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయదిఱిదుం వల్లీర్గళ్ నీంగళే నానే తానాయిడుగ ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై ఎల్లారుం పోందారో పోందార్ పోంద్ -ఎణ్ణిక్కొళ్ వల్లానై కొన్ఱావై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై పాడ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-15 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది. లేమ!" లేత చిలుకతో' పోల్చబడినదైన పరిణితముగ పలుకుచున్న "పదియవ గోపికలో" "నీంగళే-నీవల్లే" అను వాదోపవాదములైన కృష్ణమాయ కమ్ముకునిన " గోపికల సం శయములో" బంధింపబడిన తలుపు అటు-ఇటు వాక్చమక్కులైన చక్కని చుక్కల మక్కువ పరిహాసోక్తులలో " తిరు-పావై" అను వేదబీజ స్వరూపమైన పదిహేను రోజుల వ్రత పుణ్య పూర్వ భాగములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము అమ్మచే నిద్రలేపబడుతున్న చిన్ని చిలుకవలె పలుకుతున్న పదియవ గోపికలో,ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని నిందించుకొనుచున్న గోపికలలో,మూసిఉన...

TIRUPPAAVAI-16

నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ కోయిల్కాప్పానే! కొడి తోన్రు తోరణ వాశల్ కాప్పానే మణిక్కదవం తాళ్ తిరవాయ్ ఆయర్ శిరు మియరో ముక్కు అఱై పఱై మాయన్ మణివణ్ణన్ నెన్న వేవాయ్, నేరందాన్ తూయో మాయ్ వందోం తుయిలెరప్పాడువాన్ వాయాల్ మున్నం మాత్తాదే అమ్మ నీ నేశ నిలైక్కదవం నీక్కు ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-16 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది. "మాధవం-మణివణ్ణన్ సేవకు ఆటంకించుచున్న వారైన ద్వారకాపతి " ఆ"నందభవనపు ద్వారపాలకులలో "శిఱు మియరో ముక్కు " అనుభావము అనుభవైకవేద్యమైన చిన్నవారమని అన్న గోపికల ఉన్నత సంస్కారములో సంకల్పము సాధ్యపరచు భక్త కల్పతరువైన శిరమొడ్డిన పరవశమై విడిన అడ్డ గడియలో సిరిసంపదలను మించిన సౌభాగ్యప్రదమైన తులసిదళముతో స్వామిని తులతూచిన తక్కెడలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె " ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము ఐదు జ్ఞానేద్రియములు-ఐదు కర్మేంద్రియములు కలిపి పది ఇంద్రియములు పది గోపికల రూపమున నిద్రించుచున్న సమయమున అమ్మ ఆండాళ్ వాటిని జాగృ...

TIRUPPAAVAI-17

Image
అంబరమే తన్నీరే శోఱే అఱుం శెయ్యుం ఎంబెరుమాన్ నంద గోపాలా! ఎళుందిరాయ్ కొంబనార్క్కెల్లాం కొళుందే! కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అంబరం ఊడ~అరుత్తు ఓంగిఉళగళంద  ఉంబర్ కోమానే! ఉఱంగాదు ఎళుందిరాయ్ శెంబుఱ్ కరలడి శెల్వా బలదేవా ఉంబియుం  నీయుం ఉఱంగ్ ఏలో రెంబాయ్. ఓం నమో నారాయణాయ-17 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది మోదపు ప్రదానముతో " దానపు నిధానమైన" ఆనంద గోపాలుని తండ్రి " ఆ నంద మహారాజులో" " నదీతీరముల మొలుచు" అతిసుకుమారములైన " ప్రబ్బలి" చిగురుబోడి గొబ్బెత" యశోదమ్మలో" " ఆదిశేషుడే" స్వయముగ స్వామికి" అన్నగారైన" హలాయుధుడు " బలరాముని కాలి కడియములో" స్థూల-సూక్ష్మములన్నింట్లో " మూలము" తానేయైన పంకేరుహలోచనుని " శంఖు-చక్ర పాదములలో" అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె " ఆముక్తమాల్యద" ఆండాళ్ " అమ్మ వెంట" నేడె. భావము గోపికలు యశోదను-నంద ప్రభువును,బలరామ కృష్ణులను కీర్తించ...

TIRUPPAAVAI-18

ఉందు మద కళిత్తన్ ఓడాద తోళ్వళియన్ నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ కందం కమరుంకురలికడై తిఋఅవాయ్ వంద్ ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాధవి ప్పందల్ మేల్ పల్గాల్ కుయిలినంగళ్ కూవిన కాణ్ పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్ పాడ శెందామరై క్కెయాల్ శీరార్ వళై ఒళిప్ప వందు తిఱవాయ్ మగిరింద్ ఏలో రెంబా వాయ్. ఓం నమో నారాయణాయ-18 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణిచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది. "భక్తాంఘ్రిరేణుం- భగవంతుమీడే" అని కీర్తించుచున్నవైన తొండరడిప్పొడి ఆళ్వార్ విరచిత " తిరుప్పళ్ళి యళుచ్చి"లో ముదితలార! ముచ్చటగ "మదమును స్రవించుచున్నవైన" మాతంగములను "మర్దించు " మదన గోపాలునిలో పోటీ పడుచు చేరుచున్న " మళ్లలేని నోళ్ళవైన" కోళ్ళ కొక్కొరోకో అను " కోటి కోటి పిలుపులలో" "మాధవీలత"" పందిరిపై " గుంపులుగా కూర్చున్నవైన గోపికమ్మలను నిద్రలేపు" కోకిలమ్మ గానములలో" అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె " ఆముక్తమాల్యద ఆండాళ్" అమ్మ వెంట నేడె...