Monday, April 25, 2022

ARE WE TWINS? PL SAY YES OR NO


 kavalalamu kaadaa?
 *****************
 konnipadamulaloenu kavalalu unnappaTikini avi doeboochulaaDutoo tikamakapeDutumTaayi.
 vaaTi saaroopyamu halludi kaavachchunu.achchudi kaavachchunu.komta saaroopyatatoe marikomta vairudhdhyamutoe umDavachchunu.manamu tappulaekunDaa vraayaalannaa/chadavaalannaa vaaTini niSitamugaa gamanimchi,saaroopyatanu,vairudhyamunu gamanimchi vaeruchaesukonagaligi umDaali.
 konnipadamulanu pariSeeliddaamu.
 *********************
 1.seesaalu
 2.koekila.
 3.raaramDi
 4.pipaasa.
 5.maamiDikaaya
 6.yayaati.
 7.daedeepyamu.
 8.bheebhastamu.
  
   manamu kanuka aksharamuloeni achchunu/hallunu vaeruchaesiyumDagaa unnaroopamunu kanuka chooDagaligitae ,manamu sulabhamugaa aksharamuloe okae vidhamugaa unnadi hallaa laeka achchaa annadi telusukoegalamu.
 udaaharanamunaku okka padamunu pariSeeliddaamu.
 seesaalu annadi padamu.viDadeesi choostae,
 s+I++ s+ A++ l+u= seesaalu.
 imduloe s anu hallu remDusaarlu,l anu hallu okkasaari guNimtapugurtulanu amTaeachchulanu kalupukoni unnadi.amtae s anae hallulu kavalalu anavachchunu.vaaTitoe kaliyunna guDideerghamu-deerghamu I A anu vaeruvaeruchchulu kanuka avi kavalalu kaavu.
 I padamuloe hallulu puaraavRtamainavi kaani aksharamulu kaadu.
 marikonni padamulanu pariSeeliddaamu.
 1.mitratrayamu.
 2.vyaahyaaLi.
  padamuloeni aksharamulaloeni achchunu/hallunu viDiviDigaa choostae kaani manamu gurtimchalaemu.
 manamu imtaku mumdu oka hallu achchu kalistae aksharamu ani,oka aksharamu maroka aksharamu alistae ottu chaerina dvitva,samyukta,saMslaesha aksharamulugaa gurtimchabadataayi.

 mitratrayamu padamuloe,
ma hallu-i-t-r-a-t-r-a-y-a-mahallu-u gaa vibhajimchukumTae,
 tra anu saMyuktaaksharamu remDusaarlu vemTavemTa vachchinadi.
 avi nissamdaehamugaa kavalalae.aksharamuottu okkaTae.
 kaani vyaahyaaLi anae padamunu gamanistae,v+h+y+A++h+y+A++L+i.
 va anu aksharamu,ha anu aksharamu deerghamunu,ya vattunu saaroopyamugaa kaligiyunnappaTikini,hallulu va ha anu vibhinnamulu.
 I padamuloeni guNimtamu ottu saaroopyatatoe,hallumaatramu vibhinnatatoe unnadi.
  marikonni padamulanu jataparachuTaku prayatniddaamu.
   dhanyavaadamulu.

 కవలలము కాదా?
 *****************
 కొన్నిపదములలోను కవలలు ఉన్నప్పటికిని అవి దోబూచులాడుతూ తికమకపెడుతుంటాయి.
 వాటి సారూప్యము హల్లుది కావచ్చును.అచ్చుది కావచ్చును.కొంత సారూప్యతతో మరికొంత వైరుధ్ధ్యముతో ఉండవచ్చును.మనము తప్పులేకుండా వ్రాయాలన్నా/చదవాలన్నా వాటిని నిశితముగా గమనించి,సారూప్యతను,వైరుధ్యమును గమనించి వేరుచేసుకొనగలిగి ఉండాలి.
 కొన్నిపదములను పరిశీలిద్దాము.
 *********************
 1.సీసాలు
 2.కోకిల.
 3.రారండి
 4.పిపాస.
 5.మామిడికాయ
 6.యయాతి.
 7.దేదీప్యము.
 8.భీభస్తము.
  
   మనము కనుక అక్షరములోని అచ్చును/హల్లును వేరుచేసియుండగా ఉన్నరూపమును కనుక చూడగలిగితే ,మనము సులభముగా అక్షరములో ఒకే విధముగా ఉన్నది హల్లా లేక అచ్చా అన్నది తెలుసుకోగలము.
 ఉదాహరనమునకు ఒక్క పదమును పరిశీలిద్దాము.
 సీసాలు అన్నది పదము.విడదీసి చూస్తే,
 స్+ఈ++ స్+ ఆ++ ల్+ఉ= సీసాలు.
 ఇందులో స్ అను హల్లు రెండుసార్లు,ల్ అను హల్లు ఒక్కసారి గుణింతపుగుర్తులను అంటేఅచ్చులను కలుపుకొని ఉన్నది.అంతే స్ అనే హల్లులు కవలలు అనవచ్చును.వాటితో కలియున్న గుడిదీర్ఘము-దీర్ఘము ఈ ఆ అను వేరువేరుచ్చులు కనుక అవి కవలలు కావు.
 ఈ పదములో హల్లులు పూరావృతమైనవి కాని అక్షరములు కాదు.
 మరికొన్ని పదములను పరిశీలిద్దాము.
 1.మిత్రత్రయము.
 2.వ్యాహ్యాళి.
  పదములోని అక్షరములలోని అచ్చును/హల్లును విడివిడిగా చూస్తే కాని మనము గుర్తించలేము.
 మనము ఇంతకు ముందు ఒక హల్లు అచ్చు కలిస్తే అక్షరము అని,ఒక అక్షరము మరొక అక్షరము అలిస్తే ఒత్తు చేరిన ద్విత్వ,సమ్యుక్త,సంస్లేష అక్షరములుగా గుర్తించబదతాయి.

 మిత్రత్రయము పదములో,
మ హల్లు-ఇ-త్-ర్-అ-త్-ర్-అ-య్-అ-మహల్లు-ఉ గా విభజించుకుంటే,
 త్ర అను సంయుక్తాక్షరము రెండుసార్లు వెంటవెంట వచ్చినది.
 అవి నిస్సందేహముగా కవలలే.అక్షరముఒత్తు ఒక్కటే.
 కాని వ్యాహ్యాళి అనే పదమును గమనిస్తే,వ్+హ్+య్+ఆ++హ్+య్+ఆ++ళ్+ఇ.
 వ అను అక్షరము,హ అను అక్షరము దీర్ఘమును,య వత్తును సారూప్యముగా కలిగియున్నప్పటికిని,హల్లులు వ హ అను విభిన్నములు.
 ఈ పదములోని గుణింతము ఒత్తు సారూప్యతతో,హల్లుమాత్రము విభిన్నతతో ఉన్నది.
  మరికొన్ని పదములను జతపరచుటకు ప్రయత్నిద్దాము.
   ధన్యవాదములు.



 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...