ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-02

 


" యస్యామిదం కల్పితమింద్రజాలం

  చరాచరం భాతి మనోవిలాసం

  సచ్చిత్ సుఖైకా పరమాత్మరూపా

  సాకాశికాహం నిజబోధరూపా."


 పద విభజన

 యస్యాం-ఇదం-కల్పితం+ఇంద్రజాలం+ భాతి+చరాచరం_ మనోవిలాసం+ పరమాత్మరూపా+సుఖ=ఏక సత్+చిత్+అహం+స+కాశికా+రూపా+నిజబోధ.



 " ఎవ్వనిచే జనించు,జగమెవ్వని లోపలనుండు " అన్నారు మహాకవి పోతన.ఎందుకు పరమాత్మను ఎవ్వడు అన్నాడో ఆలోచిస్తే అపరిమిత మూలశక్తికి పరిమిత నామరూపములతో సంబోధించలేము కనుక."

 దిక్కెవ్వరు ప్రహ్లాదుకు?దిక్కెవ్వరు పాండు సుతకు? దీనులకెపుడున్,


 ఆనిర్వచనీయ పరమాత్మ ఇంద్రజాల ప్రసక్తి/ప్రశస్తియే ప్రస్తుత శ్లోకము.


 యస్యాం ఇదం-ఇద్గా/దీనిగా/ప్రపంచముగా చెప్పబడుతున్న చరాచరము 

 స+ పరమాత్త్మ= ప్రపంచము. ఈ ప్రపంచము,

1.యస్యాం సః ఇదం పరమాత్మ నిర్మితం

2.యస్యాం సః ఇదం చరాచరమయం

3.యస్యాం సః ఇదం మనోవిలాస కల్పితం

4. యస్యాం సః ఇదం (భాతి)ప్రకాశం

5. యస్యాం ఇదం సః కాశికా నామం

6.యస్యాం సః ఇదం తత్త్వ బోధా రూపం

7. యస్యాం సః సత్+చిత్  ఇంద్రజాలం.

  జగద్గురువులు మొదటి శ్లోకములో జీవుల మనో ప్రవృత్తి-నివృత్తుల ఫలితములను విశ్లేషించిన తదుపరి,ప్రస్తుత శ్లోకములో పరమాత్మ మనోవిలాస పంచకృత్యములను అనుగ్రహిస్తున్నారు.

   దానినే ఈంద్రజాలమని ప్రస్తుతిస్తున్నారు.

 సర్వం శివమయం జగత్.

  ఏక బిల్వం శివార్పణం.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)