ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAMU -NIJABOEDHA-01
జగద్గురువులు "కాశీపంచక" స్తోత్ర రాజమును మనోనివృత్తిః అంటూ
ప్రారంభించి,కిం అస్తి అనిపూర్తిచేశారు.ఇదే విషయమును శ్రీకృష్ణభగవానుడు సైతము "శ్రీమద్భగవద్గీట"లో చివరిదైనమోక్ష సన్యాస యోగములో,
" ప్రవృత్తించ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః"
అంటూ సకల చరాచర బంధ-మోక్షములకు కారణము వారి మానసిక ఆలోచనల ప్రవేశము-నిష్క్రమణము (ప్రవృత్తి-నివృత్తుల) పేరిట చేయున్న వింతాసములు.
ప్రవృత్తులు అసత్తులో దాగియున్న సత్తును చూడనీయదు.దానికి కారనమును గుణత్రయవిభాగ యోగము
' అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహమేవచ,తమస్యేతాని జాయంతే'
చీకటితోనున్న మనసులో ప్రవృత్తులు చేరి ప్రమాదకరమైన మోహమును కలిగిస్తూ,ప్రకాశమును చూడనీయవు.
ఆ చీకటి తొలిగించేందుకు ,వెలుతురునుచూపించేందుకు ఒక సహాయము కావాలి.ఆ సహాయము స్వఛ్చమైనదిగా-సారవంతమైనదిగా ఉండాలి.అదియే తీర్థరాజమైన జ్ఞానగంగా ప్రవాహము. ఆ ప్రవాహము నిన్ను మణికర్ణిక శ్రవనభాగ్యమునందించునదైన-శత్రువులను దహించగలిగినదైన మణికర్ణిక నుచేర్చుతుంది.
ఇదిమొదటి మజిలీ.
ఆ మణికర్ణిక మనచీకట్లను తొలగించి చూపుతున్న ప్రకాశములో మనలో నిండియున్న పరమాత్మను దర్శింప చేస్తుంది.దగ్గరకు చేరుస్తుంది.పరమునకు దగ్గరగా ఉన్న మనమనస్సు నివృత్తి తత్త్వముతో మూర్తీభవించిన శాంతముగా రూపుదిద్దుకుంటుంది.
సర్వం శివమయం జగత్.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment