ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM GURUBODHA-05

  

 " కలిగినదిదియె కాశీయోగము

   కలనైనను బాయని ఘనశివయోగము


   వేలతీర్థములు విదితోత్సవములు

   శూలి నగరిలో కోలాహలములు


    సతతము గంగా స్నానపుభాగ్యము

    వ్రతముగ విశ్వేశ్వర సమార్చనము."


  జగద్గురు  ఆదిశంకర "కాశీ పంచక" స్తోత్రము లోని మొదటి శ్లోకము మానవ ఆలోచనలైన వృత్తుల  రాకపోకల గురించి కాశీదర్శన భాగ్యమును పొందాలంటే  మనోనివృత్తి ఎంత ఆవశ్యకమో తెలియచేసింది.

   రెండవ శ్లోకము ఆలోచనలకు కారణమైన ఇంద్రియములగ్యురించి-ఇంద్రజాలము గురించివివరించినది.

   మూడవశ్లోకము  పంచకోశ గేహములో ప్రకృతిరూపముగా ప్రకాశించుచున్న భవానీ తత్త్వమును బోధపరచినది.

   నాల్గవ శ్లోకము సాకాశికాహం అంటూ కాశిలో ఇండియున్న కాశికను  చూపిస్తూ తురీయము యొక్క ఉన్నతత్త్వమును కన్నులకు కట్టినట్లు చూపిస్తూ,చేతనుని,

  కరువుతీరగ కాశీ వీధులలో హరహర యనుచు తిరిగెడి సౌఖ్యమును ప్రసాదిస్తుంది.

    అంతేకాదు,

 నిలకడగ  ఇది  నిత్యనివాసము అని గ్రహింపచేస్తుంది.మరుక్షణము నుండి,

  చేతనుని శరీరము కాశీక్షత్రముగా కళకళలాడుతుంటుంది.

  జ్ఞానము గంగా ప్రవాహమై పరవళ్ళుతొక్కుతుంటుంది.

  శ్రద్ధ గయ గా 

  గురుభక్తి ప్రయాగ గా ప్రకాశిస్తూ,

  హృదయములోని విశ్వేశ్వరునితో మమేకము చేస్తుంది.


   ఎంతటి మహద్భాగ్యము. పరిపూర్ణ విశ్వాసముతో,

  అన్య-కిం-అస్తి అంటూ  పరవశించిపోతుంటాడు ప్రకాశముగా.


   సర్వంశివమయం  జగత్

 ఏకబిల్వం  శివార్పణం.


Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI