Posts

SAUNDARYA LAHARI-28

Image
  సౌందర్య లహరి-28.  పరమ పావనమైన  నీపాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వారూపము  నీ చేలమును కోరగ  నేను కుచేలుడిని కాను  ఆప్తుడవని వరమడుగని  అభిమానము తోడుగా  నీ సారధ్యమును కోరగ  నేను అర్జుడిని కాను  నన్నునేను తెలుసుకొన్న  భగవద్గీత  తోడుగా  నీకు సహాయమును చేయ నేను సుగ్రీవుడను కాను  వానరుడనై చూపగ వనమునున్న సీతమ్మ జాడగా  నలుగుముద్దతో పాటుగ నీ ఒడిలో కూర్చున్నది మనసు  నా ఉపాఖ్యానములో సఖ్యభక్తి సంతసించుచున్న వేళ  నీ మ్రోలనేనున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి  ఓ  సౌందర్య లహరి.   " పట్టి విడువరాదు రామా ,నా చేయి" అని సంకీర్తనలతో పాటుగ సఖ్యమును కోరి,ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. భగవంతునికి-భక్తునికి మధ్యగల స్నేహభావమే  సఖ్య సేవనము.హీనాధికములకు ఇందులో చోటులేదు.అర్జునుడు,కుచేలుడు,సుగ్రీవుడు,మానిక్య వాచగరు పరమాత్మకు సఖులుగా తరించినారు.మరెందరో మహదానందమును పొందినారు.ఇది బాహ్యమునకు కనిపించే స్నేహము కాదు.జీవాత్మ-పరమాత్మల అనుసంధానము.మహోత్కృష్టము.పరమాత్మతో అర్జును...

SAUNDARYA LAHARI-27

దాస్యము   పరమపావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   ఉద్ధరిస్తుందంట ఉలిదెబ్బలు తిన్నబొమ్మ   పుడమిని పాలిస్తుందంట పూజలందుకుంటున్నదమ్మ   అడుగుతడబడనీయదట ఆరడుగులు లేనిబొమ్మ   కరుణను కురిపిస్తుందట కనురెప్పలు వేయదమ్మ   చేయందిస్తుందట  చలనమేలేని బొమ్మ   రాతను మారుస్తుందట  రమ్మని ఈ రాతిబొమ్మ   అమ్మలను గన్నయమ్మ  ఆ మల గన్న అమ్మ   నా అపహాస్యములన్నీ  దాస్యములగుచున్న వేళ   నీ చెంతనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా   మానసవిహారి  ఓ సౌందర్య లహరి.  "జనని వరదాయిని త్రిలోచని   నీ పద దాసిని కావగదే."అని తల్లిని వేడుకొనిన లీలావతి (ప్రహ్లాదుని మాత) దాసినని స్వచ్చందముగా ప్రకటించినది.   " బంటు రీతి కొలువు ఈయవయ్య రామా" అని త్యాగరాజు కీర్తించినాడు.ఆంజనేయ స్వామితో పాటు తనని కూడ దాసునిగా స్వీకరించమని ప్రార్థన.   బానిసత్వము దాస్యము రెండు వేరు వేరు అర్థములనిచ్చు ఒకటిగా తోచు పదములు.పుట్టు బానిస/కట్టుబానిసలు తమ అభిప్రాయముతో నిమిత్తము లేకుండా ...

SAUNDARYA LAHARI-26

  సౌందర్య లహరి-26   పరమపావనమైన  నీపాదరజ కణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   మధుకైటభ సంహారివి  మాధవ సోదరి   భండాసురుని జయించిన భువనభాండ రక్షిణివి   రక్తబీజునికి ముక్తినందించిన శక్తిస్వరూపిణివి   విషంగ విశుక్రుల విషమును అరికట్టితివి   మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి   అవనీ పాలనకై  ఎన్నో అవతారములనెత్తితివి   అరిషడ్వర్గములనడచు  అసుర సంహారములు   మదరహితములై తల్లికి వందనములగుచున్న వేళ   నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా   మానస విహారి  ఓ సౌందర్య లహరి.  అంబ వందనం  జగదంబ వందనం  సంబరాన కొలువుతీరె శక్తి, వందనం  భవతారిణి భగవతికి, భక్తి వందనం పారిజాత అర్చనల  పాదములకు వందనం పాపనాశిని పావని  పార్వతి వందనం. గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం గణపూజిత గుణాతిశయ  గౌరి వందనం. ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ వందనం. అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం గిరితనయ విరిపూజిత దుర్గ వ...

SAUMDARYA LAHARI-25

Image
 సౌందర్య లహరి-25  పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  తామస గుణములను వదిలి తామరస దళ నేత్రికి  తాదాత్మ్యతతో చేయుచున్న తామరపూల పూజలు  రాజస గుణములను వదిలి రాజీవదళనేత్రికి  పరవశముతో చేయుచున్న పరిమళ ద్రవ్య పూజలు  చంచల గుణములను వదిలి మంచుకొండ తల్లికి  మించిన భక్తితో చేయుచున్న  ధూపదీప పూజలు  వాదములను గుణములను వదిలి  వేదమైన తల్లికి  చర్చలు వీడిన మనసు దేవతార్చన యైన వేళ  నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.   " పూజ చేయుదము రారె-పొద్దుపోయె శ్రీదేవికి"   ఏలా లవంగి పూలతో జాజి చంపకములతో   మాలతి మందారలతో  మాహేశ్వరి పాదములకు "   పూజా ద్రవ్యములతో, శాస్త్రోక్త-మంత్రోక్త  ప్రకారముగా చేయు విధానము అర్చనము.సాకార మూర్తికి ద్రవ్యభక్తితో కొలుచు ప్రక్రియ.పంచామృతములు,పంచేంద్రియములు,పంచభూతములు పూజలో పాలు పంచుకుంటాయి.అగ్ని కార్యము,యజ్ఞ యాగాది క్రతువులు అర్చనకు సంబంధించినవే.సమయ సందర్భమున...

SAUMDARYA LAHARI-24

Image
సౌందర్య లహరి -24  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  శారీరక సౌందర్యములు అశాశ్వతమను తెలివిలేక   ఐహిక సుఖములు బహు స్వల్పములను ఊహ లేక  సంసార సాగరమును నిస్సారముగ ఈదలేక  అహంకార ప్రాకారపు హుంకారము వినలేక  నిరాకార నిరంజన నిర్మల ఆకారము చూడలేక  పాతాళమునకు జారి అటుఇటు పారిపోవ దారిలేక పాద ధూళి రేణువును  పాహి-పాహి యనగానే  పాప ప్రక్షాళనమై  పాద సేవనమగుచున్న వేళ  నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి  ఓ సౌందర్య  లహరి.  " సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి    నీ పాదాంబుజములే సదా నమ్మినానమ్మా        శుభమిమ్మా  శ్రీ కామాక్షమ్మా అంటు శ్రీ శ్యామశాస్త్రి ధన్యుడైనాడు.   " నీ పాద కమలసేవయు-నీ పాదార్చకులతోడి నెయ్యము"నొందిన వాడు బమ్మెర పోతన.   "బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము" అని పాదమహాత్మయమును దర్శించిన అన్నమయ్య.   చరణములే నమ్మితి  నీ దివ్య చరణములే నమ్మితి అని పాదసేవనమోత...

SAUNDARYA LAHARI-23

 స్మరణ భక్తి  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  చపలత్వముతో ఎగురుచున్న చేపవంటి నన్ను చూస్తూ  కపటత్వముతో మింగనున్న  కొంగనుండి రక్షిస్తూ  తప్పుడు పనులనే మునుగుతున్న ఉప్పెనలో నన్ను చూస్తూ  చెప్పరాని దయతో తేలుతున్న  తెప్పవేసి  రక్షిస్తూ  పాతాళములోని సుడిగుండములో  నన్ను చూస్తూ  మాతవై  పడనీయక పైకిలాగి  రక్షిస్తూ  వీక్షణమాత్రమైన పాదధూళి విస్తారణ కరుణగా  విస్మయ పరచుచు నాలో  స్మరణభక్తియైన వేళ  నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి  ఓ సౌందర్య లహరి. " ప్రాతః స్మరామి లలితావదనారవిందం  బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |  ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం  మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్"   ఆది శంకరాచార్య స్మరణభక్తి కనక ధారలనే వర్షించి అమ్మ దయను అనుభూతిగ మలిచినది.నిరాటంక-నిశ్చల-నిర్విరామ భగవత్ తపనయే,ఎప్పుడు తల్లి దర్శన-సంభాషణ-అనుగ్రహ రసానుభూతిలో మునకలు వేయుచుండుటయే స్మరణము.ఒక విధముగ...

SAUNDARYA LAHARI-22

కీర్తనము  పరమ పావనమైన నీ  పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  పనులను చేయించుటకు పగటిపూట సూర్యునిగా  అలసట తొలగించుటకు అమృతమూర్తి చంద్రునిగా  ఆహారము అందించే ఆదిత్యుని రూపుగా  ఆ జోలను తేలించే ఆ చంద్రుని చూపుగా  కలతలు కనపడనీయని కాళికా రూపుగా  మమతలు కరువు కానీయని మా తల్లి గౌరిగా  అనవరతము ఏమరక అవనిలో అలరారుతున్న  సూర్య-చంద్ర ప్రవర్తనలు సంకీర్తనములగు వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  "రమా వాణి సంసేవిత సకలే   రాజరాజెశ్వరి రామ సహోదరి"   భగవంతుని గుణగణములను యశోపూర్వకముగా గానముచేయుట సంకీర్తనము/కీర్తనా భక్తి.వశిన్యాది దేవతల అనుగ్రహముతోనే కీర్తనము సాధ్యమగును.   అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్నవి   ఉచ్చారణ విధానమును ...