Posts

NAH PRAYACHCHAMTI SAUKHYAM-20

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-20   *******************************  భగవంతుడు చర్మధారుడు-భక్తుడు చర్మకారుడు   " గజచర్మావృత తనుం స్ఫురత్ ప్రహరణోజ్వలం     సర్వపాపహరం ధ్యాయేత్ దేవం కుంజర భేదినం."  పరమేశ్వరుడు గజచర్మమును ధరించి యుండెను.శత్రువులపై ప్రయోగించుటకై చేతిలో చేతిలో ఆయుధములతో ప్రకాశిస్తున్నాడు.భక్తుల సర్వపాపములను హరించుచున్న రుద్రునకు నమస్కారము.  లోకకళ్యాణమునకై త్రిలోక సంచారి-త్రిలోకవేది యైన నారద మహర్షి గజాసురుని సభకు వెళ్ళి,గజాసురా! నీవు అతిబలవంతుడవు కావున నీ తపోమహిమతో శివుని నీ ఉదరమునందు నివసించు వరము కోకోమనెను.ఉచితానుచితములను మరచిన గజాసురుడు అదేపని చేసెను.స్వామిని కైలాసమునకు తిరిగి తీసుకొనివెళ్ళుటకు గంగిరెద్దుల మేళముతో బ్రహ్మ-విషుణు ంతక్కిన సురలు విచిత్రవేషములతో గజాసురుని కొలువునకు వచ్చిరి.గంగిరెద్దుల మేళముపై అత్యంతాసక్తి గల అసురుడు వారు ఆడుటకు అనుమతినిచ్చెను.విష్ణువువు చేయుచున్న స్తుతులకు భోళా శంకరుడు అమితముగా పొంగిపోవుటచే,భరించుటకు గజాసురునికి కష్టమాయెను.మాయతొలగిన మనసు విషయమును గ్రహించినది.వినయముతో తలవంచినది.జాలిగుండె శివుడు వా...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-19

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-19     ******************************   భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే   " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం     యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."     రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.    " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః      అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."     రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదీయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము.    అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో .హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్యాకులు.అదే విధముగా ఒకసారి బ్రహ్మగారు చేయుచున్న యజ్ఞమునకు పరమేశ్వరుడు ప్రత్యక్షముగా విచ్చేసి యున...

NAH PRAYACHCHANTI SAUKHYAM-18

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం-18     **************************   భగవంతుడు-భక్తుడు నాదమయులే-నాద ప్రియులే    " నాదతనుం అనిశం శంకరం-నమామి మనసా-శిరసా"  త్యాగరాజులవారు.   ప్రణవమే పరమేశ్వరుని శరీరము.అనిశము ఎల్లప్పుడు ప్రణవమును స్మరిస్తుంటుంది.ప్రణవము "ఓం" సూక్ష్మము,"ఓం నమః శివాయ" స్థూలము.అంతేకాదు స్వామి డమరుకము సైతము పంచాక్షరిని శబ్దిస్తూనే ఉంటుంది.( అక్షరాభ్యాస సమయమున)ఓ పరమేశా నీ అనుగ్రహ నాదమును మా పిల్లలపై వర్షించమని ప్రార్థిస్తుంటారు.   " బ్రహ్మ మురారి సురార్చిత లింగం -నిర్మల భాసిత శోభిత లింగం "మొదటి సారిగా పరమేశ్వర తత్త్వమును గ్రహించిన బ్రహ్మ-విష్ణులు అగ్నిస్తంభము నుండి వెలువడినస్వామిని దర్శించి స్తుతించినవి. ఆదిదేవుడు,తన సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ఐదు ముఖముల నుండి పంచాక్షరిని-సప్తస్వరములను ప్రకటించి నాదమయముగా మలిచాడట.   " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన పరమేశ్వరా ప్రణామములు.త్రికరణశుద్ధిగా చేయుచున్నాను అంటున్నాడు త్యాగయ్య.మనసా-వచసా-శిరసా.స్వామి పాదముల వద్ద శరణాగతి కోర...

NAH PRAYACHCHANTI SAUKHYAM-17

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-17   ****************************  భగవంతుడు- భక్తుడు మీడుష్టులే    సంపదలను వర్షించువారే.  "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"  మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.   " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.   కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం.   ఉత్కళరాజ కుమారుడైన దమనకుడు పరమ శివభక్తుడు.పూర్వజన్మల సంస్కారమును పుణికిపుచ్చుకొన్నవాడు.గతజన్మల గురుతులతో తన గమ్యమును తెలిసికొని ,గంగాతీరమున శివలింగమును ప్రతిష్టించుకొని ప్రార్థించుచుండెడి వాడు.  " నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే" స్వామి నీవు సహస్రాక్షుడవు.అనంతదర్శన శక్తిసంపన్నుడవు.జగత్కళ్యాణమునకై  గరళమును కంఠమునందుంచుకొనిన నీలగ్రీవుడవు.భక్తుల మనసెరిగి వారికి శుభములనందించు కృపావర్షుడవు.నా మనసెరిగి నన్ను నీదరి చేర్...

NAH PRAYACHCHANTI SAUKHYAM-16

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-16    ************************    భగవంతుడు జలస్వరూపుడు-భక్తులు జలస్వరూపులు.     " ఓం నమో శీభాయచ శుభకరాయచ"     ప్రసాదగుణముతో ప్రవహించు పరమేశ్వరునకు నమస్కారములు.   పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.  జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.   "ఓం నమో వైశంతాయచ"    "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"   పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.  జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంత...

NAH PRAYACHCHANTI SAUKHYAM-15

Image
      నః ప్రయచ్చంతి సౌఖ్యం-15      *******************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.   ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."    స్థితికారుడుగా పరమాత్మ విశ్వపాలన చేయుటే వృక్షరక్షణ.దానిని పోషించునవి హరికేశ్వములు.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీసైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట." ఊర్థ్వమూలం అథః శాఖః" అని శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినాడు.మహాభారతములోను ధర్మరాజు ధర్మవృక్షముగాను,తమ్ముళ్ళు దాని శాఖలుగాను ,అదేవిధముగా దుర్యోధనుడు అధర్మ వృక్షముగాను వర్ణించబడినారు.పవిత్ర మర్రివృక్షము క్రింద స్వామి దక్షిణా మూర్తిగా దర్శనమిస్తున్నాడు.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణ్తీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినదట.అమ్మవారు స్వామివారి గురించి చూతవృక్షము క్రింద ఆసీనురాలై అత్యంతశ్రధ్ధాభక్తులతో తపమును సలిపినదట.సంస...

NAH PRAYACHCHANTISAUKHYAM-14

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-14  ***************************  భగవంతుడు-భగవదంశ  ఇద్దరు క్షేత్రపాలకులే.  " నమో రుద్రాయ ఆతతాయినే క్షేత్రాణాం పతయే నమః." స్థలము దైవత్వముతో మేళవించిన క్షేత్రముగా భాసిల్లుతుంది.కాశము అనగా వెలుగు-ప్రకాశము అనగా ప్రకృష్టముగా తేజరిల్లునది.  " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం    విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా    సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం    వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ    అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః    త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."             గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రె...