Posts

falasritu.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-ఫలశృతి-శివోహం.   ************************************  " గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర    త్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే    దహనున్ కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవచే    సి,హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వరా!   అని పలికిన మహాకవి ధూర్జటి వాకు శివ శాసనము.   ఎల్లవేళలా సర్వజీవులకు శివమును-శుభమును కలిగించే స్వభావము కలవాడు శివుడు.జ్యోతిర్మయ శివలింగము ఏకము-అనేకము రెండును తానై విశ్వములోని విశ్వేశ్వరత్వమును మనకు ద్యోతకమగునట్లు చేయుచున్నది.ఈశ్వరేతరము సృష్టిలో లేదను విషయమును తెలిసికొనుటయే ఈశ్వరానుగ్రహము.   "అడుగడుగున గుడి ఉంది-అందరిలో గుడి ఉంది    ఆ గుడిలో దీపముంది-అదియే దైవం."    ఎంత అర్థవంతమైన పాట.  " విశ్వేభ్యో-విశ్వపతిభ్య్శ్చవో నమో నమః."   శివానుగ్రహమును తెలిసికొనుటకు ప్రయత్నించే ముందు మనము శివశబ్దము యొక్క గొప్పతనమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము .  నమో శ్రుతాయచ-శ్రుత సారాయచ."  శివ శబ్దముచేత శి...

meedushulu.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-17   ****************************  భగవంతుడు- భక్తుడు మీడుష్టులే    సంపదలను వర్షించువారే.  "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"  మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.   " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.   కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం. " ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్."  కుబెరుని అసలుపేరు వైశ్రవణుడు.యక్షులకు రాజు.రావణునిచే ఓడింపబడిన వాడు.  కు అనగా వక్రము/వంకర.బాహ్యములో ఇతడు వంకర శరీరముకల వికారస్వరూపుడు బేరము అను పదమును శరీరమునకు అన్వయించుకుంటే.ఒకవిధముగా కుబ్జ వలె సరైన శరీరసౌష్ఠవము లేవి వికారరూపుడైనప్పటికిని విశ్వేశ్వర కృపాపాత్రుడు.గుణనిధి జన్మపరంపరలలో కుబేరునిది ఒకటి అని పెద్దల అభిప్రాయము.   జన్మతః లభించిన జంగమదేవ...

CHETTU

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-24      *******************************   " ఊర్థ్వమూలం అథః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం     ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స దేదవిత్."      ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా,బ్రహ్మయే ముఖ్య శాఖలుగా,వేదములే పర్ణములుగా గల ఈ సంసారరూప అశ్వస్థవృక్షమునకు నమస్కారములు.దానిని మూలసహితముగా తెలిసికొన్నవారికి నమస్కారములు.  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.   ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."    నింగి-నేలలను అనుసంధించే పరమేశ్వరుని అద్భుత ఆవిష్కరణలు వృక్షములు.చేతనాచేతనత్వములను భగవత్ప్రసాదములుగా కలిగినవి.కాండం అచతనమై-పై భాభాగములు చేతనత్వముతో చల్లని ప్రాణవాయువును అందించుచు పరమేశ్వర ప్రతి రూపములు.  సింధునాగరికతయు వృక్షపూజను నిర్వహించినదని,నాటి నుండి వృక్షములలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత పరిశోధకులు కాదనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నది.    జమ్మిచెట్టు,మారేడు చెట్టు,తెల్ల మద్దిచెట్టు,నేరేడు చెట్టు,ప్రత్యేకముగా ఉసిరి చెట్టు దైవస్వరూపములుగా ఆరాధనలనందుకుంటున్నాయి.     వృక్ష...

pandits.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-25   ***********************   భగవంతుడు-భక్తుడు ఇద్దరు పండితులే  " నమః శ్లోక్యాయచ-అవసాన్యాయచ."  వైదిక మంత్రములందును  వేదాంత సారమైన  మేథా దక్షిణామూరితి తత్త్వమైన రుద్రునకు నమస్కారములు.   " ఓం అక్షరాయ నమః-ఆద్యంతరహితాయ నమః. తిరుమురుక్కరు పాలై రచయిత మధుర  తమిళ కవి నక్కీరర్ నమ్మినసత్యమునకు నిలిచి,పరమేశ్వరునే చర్చకు రప్పించెను "తివిలై యడయల్" తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు ఆటకు నాందియైనది అమ్మ "ఘనపూంగదై" పరిమళ సందేహము పరిష్కారమునకై పసందుగ రాజుచే  ప్రకటితమైనది బహుమానము పరమేశుడు రాసిన "పద్యము" ప్రవేశించినది ధారుమి చదువగ నక్కీరుడు పట్టిన" దోషము", నడిపించెను శివుని సభకు చర్చకు అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.  చర్చా అర్చనము నక్కీరుని చిదానందునితో వాదులాడు అవకాశమును కలిగించినది.శివోహం.  " ఆపాతాళ నభః స్థలాంత భువన  బ్రహ్మాండమావిస్పురత్    జ్యోతిః స్పాటిక ...

BANISA

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-26   ************************  పరమాత్ముని దక్క అన్యవస్తువులు అభిలషింపని భక్తి అనన్యభక్తి.అనన్యభక్తికి ఆదిదేవుడు తక్షణమే వశమవుతాడు.భక్తి భగవంతుని స్వాధీనము చేసుకోగలిగినట్లే-భగవంతుడు సమస్తము తన స్వాధీనమే అయినప్పటికిని,భక్తుని స్వాధీనపరచుకుంటు లీలలను అవలీలగా ప్రసాదించున్న. పరమాద్భుతమే ఈ సుదరభక్తుని-సుందరేశుని హేల.( బానిస అను పదము ప్రయోగించిన నావివేకమును పరమేశ్వరుడు మన్నించును గాక.)   భగవంతుడు భక్తికి బానిస   భక్తుడు భగవంతునికి బానిస-ఇద్దరు బానిసలే  " నమః శంగాయచ-పశుపతియేచ"   బ్రహ్మ నుండి చీమ వరకు గల సమస్త ప్రాణుల రోగములను భయములను పాపములను పోగొట్టుచు,సర్వ సుఖములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.    విడిచిపెట్టలేనిది వ్యసనము.దానిని కలవాడు వ్యసనపరుడు.వాడికి వ్యసనము యజమాని.వాడు దాని బానిస.భక్తరక్షణమను  వ్యసనము యజమానియై భగవంతుని బానిసగా చేయుటయే శివలీలలు.ఎందుకంటే  శివుడు భక్తికి పరవశుడై దానిని యజమానిని చేస్తూ,తాను దానికి బానిస అవుతాడు. " నమో కృత్స్నవీతాయ ధావతే సత్వానాం పతయే నమః"  పులస్తు...

bhookailas

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-21   ******************************   భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.  " నమ: శష్ట్ప్యాయచ ఫేన్యాయచ    నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ"  లేతగడ్డియందున్న వాడు శష్ప్యుడు నీటి నురుగునందున్న వాడు ఫేన్యుడు.ఇసుకగల ప్రదేశములు తనస్వరూపములుగా గలవాడు ప్రవాహములలో గలవాడు.అసలింతెందుకు?   పవిత్రగంగాస్నానమాచరించి  ప్రవాహముతో,దానిలోదాగిన నురుగుతో పునీతులై,తీరప్రదేశ ఇసుకతో శివలింగమును తయారుచేసుకొని,పక్కనే మొలిచియున్న దర్భలతో,అకుంఠిత దీక్షతో అర్చించు సాధకులలో,ఉదాహరణకు రావణబ్రహ్మ తల్లి కైకసి మాతగా ప్రజ్వరిల్లుచున్న పరమేశ్వరునకు ప్రణామములు. " దేవ మహదేవ మము కావుము శివా".  జరుగవలసిన పరీక్షకు శ్రీకాళహస్తీశ్వరుడు జంబుకేశ్వరునికి తోడై జలధరుని లింగమును జరిపివేసినాడు.దైవ నిర్ణయములు దయాపాత్రములే అయినప్పటికిని కైకసి మాత దైనందిన పూజకు దారిని మార్చినది.తల్లడిల్లుచున్న తల్లిని చూసి తాళలేని కుమారుని,అందులోను పరమ శివభక్తుని ఆత్మలింగ అనుగ్రహమునకై కైలాసము వైపునకు అడుగులను కదిలించినది.కామితార్థమునిస్తాడో లేక కాగల కార్యమునక...

dakshayajnam20

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-20     ******************************   భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే   " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం     యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."     రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.    " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః  అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."     రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము. యజ్ఞో యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగా యజ్ఞభూషణః నమోవాకములు.     అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో అగ్నిహోత్రుని ద్వారా.హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్...