Posts

MARGALI MALAI-12

Image
  మార్గళి మాలై-12  *******************   పన్నెండవ పాశురం   ******************  కనైత్తిళం గత్తెరుమై కన్రు క్కిరంగి  నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర  ననైత్తు ఇల్లం శేర్కాక్కుం నర్చెల్వన్ తంగాయ్  పనిత్తలై వీళనిన్ వాశల్ కడైపత్తి  శినత్తినాల్ తెన్నిలంగై క్కోమునై చ్చెత్త  మనత్తుక్కు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్  ఇనిత్తాన్ ఎళుందిరాయ్ ఈ తెన్న పేరు రక్కం  అనైత్తు ఇల్లత్తారుం అరిందు ఏలోరెంబావాయ్.    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో   ************************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ గోదారంగనాధుల అనుగ్రహము అనవరతము   పాడిగేదెలు పిలుచుచున్నవి పాలనీయగ దూడలకును  పాడి కాదిది పనిని వదిలి కన్నడిని మీ అన్న కూడుట  శిరముల వర్షించిన క్షీరము చిత్తడిని చేసినది నేలను  గగనము వర్షించు హిమము తడుపుతున్నది గోపికలను  రామబాణము తాకినంతనే రమ్యమైనది లంకద్వీపము  రామ నామము సాగుచున్నది రక్షయైనది గోకులమును  చూడవమ్మ మేము నీకై చూరు కిందనే ఉన్నాము ...

MARGALI MALAI-11

Image
   మార్గళి మాలై-11    *************   పదకొండవ పాశురం   *************** కత్తుక్కరవై క్కలుంగళ్ పలకరందు శెత్తార్ తిరల్ అళియచ్చెన్రు శెరుచ్చెయ్యుం కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్కిడియే పుత్తు అరవు అల్గుల్ ! పునమయిలే! పోదరాయ్ శుత్తత్తు ట్టోళిమార్ ఎల్లారుం వందు నిన్ ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ పేర్పాడ శిత్తాదే పేశాదే శెల్వ ప్పెణ్డాట్టి ! నీ ఎత్తుక్కు ఉరంగు పొరుళ్ ఏలో రెంబావాయ్.   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.  గోపాలుని రేపల్లెలో గోసంపద పుష్కలము  ప్రతివారు బలవంతులె దరిచేరలేదు వైరము  పుట్టలోని పామువలె ,పురివిప్పిన  నెమలివలె  ఓ భాగ్యశాలి!నిదురవీడి బయటకు రావమ్మా  స్నేహితులు-బంధువులు నీ ఇంటికి వచ్చినాము  నీలమేఘశ్యాముని,  నెనరుల కీర్తిస్తున్నాము  వీడలేని నీ నిదురను కూడిన కారణమేమి?  తరలివచ్చినది తల్లి, తానొకగోపికయై  పాశురములు పాడుతు పాశములన్నింటిని విడిచి  నప్పిన్నా...

margaLi maalai-10

Image
  మార్గళి మాలై-10 *****************     పదవ పాశురము    ******************  నోత్తు చ్చువర్క్కం పుగుగిన్ర అమ్మనాయ్  మాత్తముం తారారో వాశల్ తిరవాదార్?  నాత్తత్తుళాయ్ ముడి   నారాయణన్ నమ్మాల్  పోత్త  ప్పరై తరుం పుణ్ణియనాల్ పండు ఒరునాళ్  కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం  తోత్తు మునక్కే పెరుం  తుయిల్ తాన్ తందానో?  ఆత్త అనందలు డైయాయ్! అరుంగలమే!  తేత్తమాయ్ వందు తిర ఏలోరెంబావాయ్!   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో. **************************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము  నోము ఫలముగా సువర్గసంగములో నున్నావో  తలుపుగడియ తీయవు, బదులైన పలుకవు  తులసిమాల పరిమళములు స్వామిజాడలైనవిలే  ఏదో ఒకనాడు, మాకు ఫలమును అందించునులే  మృత్యువాత పడిన ఆ కుంభకర్ణుని మొద్దునిద్ర  నిన్ను చేరినదా ఏమి? అన్నిటిని మరచినావు  తత్తరపాటును వీడి, తలుపుతీయ రావమ్మా  తరలివచ్చినది తల్లి, తానొక గోపికయై  పాశురములు పాడు...

MARGALI MALAI-09

Image
  మార్గళి మాలై-09   **************   తొమ్మిదవ పాశురం   ***************  తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియె  తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం  మామాన్! మగళే! మణికదం తాళ్ తిరవాయ్  మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్  ఊమైయో? అన్రిచ్చెవిడో? అనందలో?  ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?  "మామయన్-మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు  నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.  అత్తరు వాసనల గదిలో మెత్తటి పరుపులమీద  మొద్దునిద్ర శాపమైన ముద్దుగుమ్మ మేలుకో  మణిదీపముల మేడలో, మనసున దాచిన వానితో  మమేకమై మము మరచిన మరదలా మేలుకో  ఓ అత్తా! నీ కూతురు ఎంతకీ లేవదు సోమరియా??  చెవిటిదా ? మూగదా ? మంత్ర ప్రభావితమైనదా?  హరినామ కీర్తనమే అసలైన మందు తనకు  తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై  పాశురములు పాడుతు, పాశములన్నిటిని వదిలి  నప్పిన్నాయ్ తిరుప్పావై కు...

MARGALI MALAI-08

Image
  మర్గళి మాలై-08   ******************   ఎనిమిదో పాశురము   *************** కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు  మేయ్ వాన్పరందన కాణ్! మిక్కుళై పిళ్ళైగళుం  పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై  క్కూవువాన్ వందు నిన్రోం కోదుకుల ముడియై  పావాయ్! ఎళుందిరాయ్ పాడిపరై కొండు  మావాయ్ పిళిందానై మల్లరై మాట్టియ  దేవాదిదేవనై చ్చెన్రు నాం శేవిత్తాల్  ఆవావెన్రు ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో  ************************* శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము  తూరుపు చీకట్లు తొలగి తెల్లవారినది నేడు  గేదెలు చిన్నమేతకై  పయనమైనవి చూడు పూజకు వెళుతున్నవారిని నీకొరకై నిలిపినాము నిన్ను తోడ్కొని పోవగ అందరము వచ్చినాము ముష్టిక-చాణూరులను మట్టుబెట్టిన స్వామి పావన సంకీర్తనముతో పావాయ్ మేలుకో వచ్చేసారా మీరు  అను దేవాదిదేవుని కొలువ తరలివచ్చినది తల్లి తానొక గోపికయై  పాశురములు పాడుచు,పాశములన్నింటిని వదిలి  నప్పిన్నాయ్ ...

MARGALi-07

Image
   మార్ఘలి మాలై07    ***************    ఏడవ పాశురం    ************  కీశు కీశెన్రు ఎంగుం ఆనైచ్చాత్తం కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే!  కాశుం పిరప్పుం కలగల ప్పక్కై పేర్తు  వాశ నరుం కుళల్ ఆయ్ చ్చియర్ మత్తినాల్  ఓశై పడుత్త త్తయిర్ అరవం కేట్టిలైయో?  నాయగపెణ్ణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి  కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో?  లేశముడయాయ్! తిర్ ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో. ************************  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము  భరద్వాజ పక్షుల సత్సంగములు వినబడుటలేద  భావతాదాత్మతతో బాహ్యము విడనాడినావు  చల్లచిలుకు గొల్లల కవ్వడి సవ్వడులు వినలేద  నల్లనయ్యా తలపులో తలమునకలవుతున్నావు  నీ తలుపు సందునుండి ప్రసరించు నీ మోము కాంతి  మా కేశవ స్మరణమును ప్రతిబింబిస్తున్నది  నాయికవై మా అందరికి,నారాయణ మహిమ పంచు  తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై  పాశురములు పాడుచు,పాశములన్...

MARGALI MALAI-06

Image
     మార్గళి మాలై-06     *******************    ఆరవ పాశురం    *************  పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళ్రైయన్ కోయిలల్  వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?  పిళ్ళాయ్ ఎళుందిరాయ్! పేయ్ మాలై నంజుండు  కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి  వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై  ఉళ్ళత్తు కొండు మునివర్గళుం యోగిగళుం  మెళ్ళ ఎరందుకళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి  వెళ్ళత్తరవిల్ తు ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము  శ్రీ గోదా రంగనాథుని అనుగ్రహము అనవరతము  పక్షులు కిలకిలరవముల  ప్రస్తుతించు చున్నవి  పక్షిరాజు శంఖము మార్మ్రోగుచున్నది.విను  చక్కదనపు పూతనను పాలుతావి సంహరించె  చీకటిభావపు శకటుని కాలదన్ని నేలగూల్చె  యోగులు-మునులు మెల్లగ బహిర్ముఖులైనారు  యోగీశ్వరుని సుస్వరముల కీర్తించుచున్నారు  స్వామి-సేవక తత్త్వము,తెలిసికొన  మేలుకో  తల్లి తానె తరలివచ్చె తానొక గోపికయై  పాశురములు పాడుకుం...