Posts

PRAPASYANTEE MAATAA-06

Image
ప్రపశ్యంతీ మాతా-06 ******************* యాదేవి సర్వ భూతేషు ఛిన్నమస్తక రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః. పనసపండు ముళ్ళతో మనకు దర్శనమిస్తుంది.తొనలు చూస్తే మధురమే.సీతాఫలము కళ్ళతో కనిపిస్తుంది కాని లోపల మధురమే.రూపము కొంచము ఇబ్బంది కరముగా నున్నప్పటికి అర్థము చేసుకోగలిగితే ఇష్టమైనదే అవుతుంది.తేజస్సును రేణువులుగా విభజించి కాంతిసంవత్సరమును (మిల్కి వే) సృష్టించి,అది అథోముఖముగా పయనించుటకు మార్గమును ఏర్పరచి,స్థూల విశ్వము దానిని గ్రహించుటకు తన కట్లను విప్పుకుని పైపైకి ఎగబాకి అమృతధారలను తాను ఆస్వాదించుటయే కాక అఖిలజగమును అమృతమయము చేయించగల శక్తి ఛిన్నమస్తక దేవి.తల్లి వర్గీకరణను నాడీవ్యవస్థ ద్వారా మనకు పరిచయము చేయుచున్నది.యుక్తాయుక్తముతో కూడినది ఈ వర్గీకరణ.పైనుండి కురియుచున్న అమృతధారలను అందుకోవాలన్న-ఆస్వాదించాలన్న పైకెగిరి పట్టుకోగలగాలి.విశ్వము అమృతమయము కావాలంటే నిరోధములు లేని నిచ్చెన వంటి ఊర్థ్వ మార్గము కావాలి.పట్టు తప్పకుండా ఉండాలి లేకుంటే పడిపోవుటయే కదా.అందులకు విశ్వ మార్గము వజ్రాయుధము వంటి గట్టితనమును కలిగియుండాలి.పైన పట్టుకోగలవారుండాలి అందుకే తల్లి తేజోశక్తి...

PRAPASYAMTEE MAATA-5

Image
ప్రపశ్యంతీ మాతా-05 ******************* భగత్వ-రమణత్వ-వమనత్వముల మేలు కలయికయే భైరవీమాత.కాంటి భగత్వము-సౌందర్యము రమణత్వము-శక్తివంత చలనము వమనత్వము.ఉదయిస్తున్న అనంత సూర్యుల కాంతి సమూహమును భైరవిగా కీర్తించవచ్చును.భ అనగా కాంతి,ర అనగా శబ్దము.తేజోపూరిత శబ్దమే భైరవి శక్తి.అఖండ మేధా శక్తి.అనంత ప్రాణ శక్తి.విశ్వ పరిణామములను నిర్దేశించే విశేష శక్తి యైన తల్లిని జాగృత కుండలిని అని కూడా అంటారు.కుండలినీ శక్తి తటస్థ స్వభావముతో మూలాధార చక్రములో నిదురిస్తుంటుందంతారు.ఆ నిద్ర మన నిద్ర వంటిది కాదు.పరిసర జ్ఞానమును విస్మరించిన అపరిణత దశ.సస్వరూపమును స్వశక్తిని గుర్తించలేని మందత్వము.ఆ మందత్వమును తోసివేసి తన వేడిచే-వెలుగుచే కుండలిని తన చుట్లు విప్పుకుని,పైపైకి ఎగబాకి పరమాత్మ తో పరిచయము చేసే శక్తి.అంతే కాదు తల్లి దుర్గ అను నామముతో రెండు విధములైన దుర్గములను మనకు చూపిస్తూ,దేనిని మనముండుటకు ఎంచుకోవాలో తెలియచేసే శక్తి.అరిషడ్వర్గమనే ఎత్తైన గోడలు గలిగి మనలను బంధించు దుర్గమునకు దూరముగా ఉండి అవ్యాజ కరుణ-ఆశ్రిత వాత్సల్యము-ఆనందాబ్ధి మొదలగు ఎత్తైన గోడలతో కట్టబడిన అమ్మ దయ అనే దుర్గమును ఆశ్రయించవలెనను విషయమును వివరించు మ...

PRAPASYANTEE MAATAA-04

Image
ప్రపశ్యంతీ మాతా-04 ****************** యాదేవి సర్వభూతేషు భువనేశి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః వేదములచే అదితి ( అఖండము) గా కీర్తింపబడుచున్న భువనేశ్వరి మాత,ఇచ్ఛా-క్రియా శక్తుల సంగమమై,తన బిడ్డల కోసం ఆకాశాన్ని సృష్టిస్తుంది.అవసరమైతే తానే ఆకాశముగా మారుతుంది.అందులో ఎన్నో మనకు ఉపయోగపడే వాటిని నియమిస్తుంది.మన ఆరోగ్యము కోసము కాలమును వికసింపచేసి దిక్కులను స్పష్టపరుస్తుంది.సూర్య మండల మధ్యస్థయై సూర్య కిరణములను తన కరములతో సస్యములుగా-శాకములుగా-పండ్లగా-కలి (ఆహారము) రూపమును దాల్చి,సారవంతమై,మన ఆకలిని పోగొడుతుంది.మాతృవాత్సల్య పూరిత ఇచ్ఛాశక్తి కనుక అమ్మ "ఈక్ష" అని కీర్తింపబడుతు,తన సూచనలతో,స్థూలజగతిని సుభిక్షము చేస్తుంది. తల్లి సూక్ష్మ స్థితి-గతులను పరిశీలిస్తే,బయటి ఆకాశము వలె,మన లోపల నున్న దహరాకాశము (హృదయము) తల్లి నివాసస్థానము.నిజమునకు మన అన్నకోశము-ప్రాణ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన కోశము-ఆనంద కోశము జడములై ప్రేతస్థితిలో పడియున్నవేళ,భువనేశి,నిద్రాణమై యున్న కుండలినిని జాగృత పరచి వాటిని శక్తివంతము చేస్తుంది.అన్న కోశము ఆకలిని గుర్తించి ఆహారమును వెతుకుతు...

prapaSyantee maataa-03

Image
ప్రపశ్యంతీ మాతా-03 ****************** యా దేవి సర్వభూతేషు షోదశి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః. కాళి-తార మాతలు వామాచార పధ్ధతులలో పూజింపబడుతుంటే దానికి విరుధ్ధముగా వినూత్నముగా దక్షిణాచారా పధ్ధతిలో పూజింపబడు తల్లి షోడశి.తన నామములోని పదహారు మంత్రాక్షరములను చంద్రుని షోడశ కళలుగా ప్రకటింపచేసిన నిత్య కళయే షోడశిమాత. తన ముందరి శక్తులైన కాళి-తార బ్రహ్మవిద్యారూపాలుగా కనుక మనము పరిగణించగలిగితే,బ్రహ్మవిద్యతో పాటుగా సుందరీయోగమును జోడించి,తాను మాత్రమే కాకుండా,సకల జగములను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దినది.పూవులు-పళ్ళు-పక్షులు-నెమళ్ళు-వివిధ వృక్షములు-సువాసనలు-శుభసంకేతములు.అద్భుతము అద్వితీయము తల్లి కల్పనాచాతుర్యము. వీటన్నిటితో ఆడుతు-పాడుతు తల్లి లలితయై ,సుందరియై(,కాళి తత్త్వమును సత్యము అనుకుంటే-తారా తత్త్వమును శివముగా భావిస్తే)-షోడశి సుందరమై కను విందు చేస్తున్నది. సుందరము అంటే బాహ్యము తాత్కాలికము కాదు అనే విషయమును తెలియచేయుటకై తల్లి సత్యమును-శుభమును కలుపున్న సుందరత్వముగా భాసించుచున్నది. కాళి-తార మాతలు తటస్థమును అధిరోహిస్తే,షోడశి మాత పంచకృత్య సింహాసన...

PRAPAsYANTEE MAATAA-02

Image
ప్రపశ్యంతీ మాతా-02 ******************* యా దేవి సర్వభూతేషు తారా రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః. శక్తి చిఛ్చక్తిగా ప్రకటింపబడుతోంది తారాదేవిగా.తృ అనే ధాతువునుండి ఏర్పడిన నక్షత్రము అనే భావమిచ్చునది తల్లి నామము.అంతే కాదు తరింపచేయునది. కాళి అను మూలము నుండి వేరొక రూపకల్పనకు సహాయపడు నాభీస్థాన నివాసిని తల్లి.బొడ్డుతాడు ఏవిధముగా తల్లికి పెరుగుచున్న శిశువుకు వారథిగా ఉండి సహాయపడుతుందో అదేవిధముగా కాళి తత్త్వమునుండి తనకు కావలిసినవి స్వీకరించి కొత్తరూపును సంతరించుకున్నది తారాదేవి. కాళిని నల్లని చీకటిగా కనుక మనము భావిస్తే దానిని చీల్చుకొని తేజమును-శబ్దమును వెంట తీసుకుని వచ్చిన శక్తి తార.మూలమైన శక్తి కాళియై సృష్టిని చేసింది.ఇంకొక శక్తిని ప్రకటింపచేసి,సృష్టిలోని అజ్ఞానమును కత్తిరించమంది.అందుకు వెలుగును వాక్కును సహాయకారులుగా పంపించింది. తారాదేవి ముఖ్యముగా వాగ్రూపశక్తి .వాక్కు పర-పశ్యంతీ-మధ్యమ-వైఖరి అని నాలుగు విధములుగా విభజింపబడినది.స్థూలములో గమనిస్తే ఉరుములు-చెట్టు కొమ్మలనుండి వచ్చు శబ్దములు-అలల ఘోష-జంతువుల అరుపులు-మానవ సంభాషణలు తల్లి వాగ్రూపముగా చెప్పుకొన...

prapaSyanti maata-01

Image
ప్రపశ్యంతి మాతా -01 *************** యా దేవి సర్వభూతేషు కాళి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః. పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి. ************************ ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు..ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్రీ-పురుషులు ఉన్నట్లు శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాచారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా భావించి భయపడుట తల్లిని సరిగా అర్థము చేసుకొనలేని మాయపొరయే. తల్లి మనలో సూక్ష్మముగా జగతిలో స్థూలముగా మనలను రక్షించుటకు ప్రకటింపబడుతు,పరిపాలిస్తుంది.ఇది నిర్వివాదము. అంధకారములో సమస్త ఆకారములు సమానమయి గుప్తస్థితిని పొందినపుడు ఇచ్చాశక్తి స్వరూపిణి అయిన కాళిమాత తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది.శివశక్తైక స్వరూపములో శివ స్వరూపముగా అచేతముగా నుండి సృష్టి కార్యమును ప్రారంభించలేని దశలో తటస్థమైన శివశక్తిని కుండలిని ద్వారాజాగృత పరచే శక్తియే కాళిమాత. అంతే కాదు.శివ శక్తి ...

SIVA SANKALPAMU-108

Image
ఓం నమః శివాయ-108 ****************** కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా. పరబ్రహ్మము ఒక్కటే.పైపై తొడుగులు వేరువేరుగా గోచరిస్తుంటాయి.పరమాత్మను అనుభవించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన దర్శనశక్తిని కలిగియుండాలి.ఈ శక్తి అచేతనములను చైతన్యవంతము చేయు చిత్-శక్తి.దీనిని ఆత్మ యొక్క (పరమాత్మలోని చిన్ని మచ్చుతునక)అఖండశక్తిగా కూడ భావించవచ్చును.నేను-నాది అను అపరిమితమైన అహము అఖండశక్తిచే ప్రభావితమై మంచుకరిగినట్లు కరిగి,అంతఃకరణ శుధ్ధితో అసలు నిజము తెలుసుకోగలుగుతుంది.తాను నీడను మాత్రమేనని తెలుసుకొని నిజమైన పరమాత్మకు దూరముగా నుండి నడవలేక కదులు...