Posts

TIRU NAVUKKU ARASAR APPAAR NAAYANAAR

తిరునవుక్కు అరసర్ నాయనారు/అప్పార్ నాయనార్ **************************** "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే" వైదిక ధర్మమునకు గ్లాని సంభవించుచున్నవేళ దానిని పునరుధ్ధరించుట్కు పరమాత్మ ప్రత్యేక నామరూపములతో ప్రకటితమవుతాడు అని తెలియచేస్తునది శ్రీమద్భగవద్గీత. నాయనారుకుగల మరో పేరు అప్పర్/తండ్రి. జ్ఞానసరస్వతీదేవి నాయనారును కాళిదాసును శ్యామలాదేవి అనుగ్రహించినట్లు బీజాక్షరములతో అనుగ్రహించినది కనుక, తిరు పవిత్రమైన నవుక్కు-మాటలకు అరసర్-అధిపతి. నామములకు అధిపతి కనుక నవుక్కు అరసర్ అనియు,నామములు పవిత్రమైనవి కనుక తిరు నవుక్కు అరసర్ గా నాయనారు కీర్తింపబడుతున్నాడు. కొన్నివర్గముల వారి అభిప్రాయము ప్రకారము రావణాసుర రుద్రవీణాగానమునకు సహాయము చేసిన వాగీశ్వర్ అను మునియే శాపవశమున నవుక్కు అరసర్ గా జన్మించాడని నమ్ముతారు. అప్పర్ని-అతని అక్కయైన తిలకవతిని వేదాధ్యన సంపన్నులను చేశారు వారి తండ్రి అప్పటి మతవిద్వేషములు చేయుచున్న మారణకాండలను దృష్టిలో నుంచుకొని.వేదధ్యయనందు తన పిల్లలకు ఆసక్తిని కలిగించారు.ఆకర్షితులను చేసారు.కాని, ...

NESA NAYANAR

నేశ నాయనారు *************** " శంభో మహాదేవ శంభో శివ శంభో మహాదేవ శంభో ఫాలావలనమ్రత్ కిరీటం ఫాలనేత్రార్చిధా దగ్ధ పంచేషు కోటం శూలాహలా రాతి కూటం శుధ్ధమర్థేంద్రుచూదం భజేమార్గ బంధుం భజే మార్గబంధుం.(శ్రీ అప్పయ్య దీక్షితులు) శిరస్సున కిరీటమును ధరించినవాడు,మూడవనేత్రముతో మన్మథుని జయించినవాడు,త్రిశూలముతో శత్రువులను సంహరించినవాడు,శుభకరుడు,మాయాతీతుడు,సిగలో చంద్రకళను ధరించినవాడు,మార్గ బంధువు అగు శివునికినమస్కరించుచున్నాను. *** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ, వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తముళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి. కామేశుని భక్తులకు పం...

TIRUNEELA NAKKAR NAAYANAAR

తిరునీల నక్కర్ నాయనారు ******** " బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రనమామి సదాశివ లింగం." సాక్షాత్తుగా బ్రహ్మయే దిగివచ్చి ఆరాధించిన శివుని ఆలయము , అయ-వంద-ఈశ్వర ఆలయము.అయవందీశ్వరుని అనుగ్రహపాత్రుడైన నాయనారు నక్కర్ నాయనారు. చోళరాజ్యములో అనవరతము వేదము నినదించు "తిరుచత్తాత మంగై పురములో జన్మించిన మన నాయనారు అసలుపేరు మరుగునపడి,నక్కర్ వేదవిజ్ఞానమును అవగతము చేసుకొని ఆచరించువానిగా ,తిరునీలకంఠుని భక్తునిగా, తిరునీల నక్కర్ నాయనారుగా కీర్తింపబడుచున్నాడు. నిత్యము తన ధర్మపత్ని తో పాటుగా,నీలకంఠుని నిండార సేవిస్తూ,అన్యమెరుగక ధన్యతనొందుచుండెడివాడు. ఉన్నచోట,ఉన్నతీరున,ఉండనీయడు కదా తన భక్తులను ఆ మూడుకన్నులవాడు..కరుణ చూపుతాను అంటూ,కఠిన పరీక్షలను పెట్టుతూ,వానిని దాటిస్తుంటాడు.కొంతసేపు కరుణను దాటవేస్తుంటాడు. చిక్కులు కల్పిస్తూ,మక్కువతో తొలగిస్తూ వేడుకగ కొందరిని పాపులుగా/ పావులుగా మారుస్తూ,నిరపరాధులైనను నిందలకు గురిచేస్తూ,మోదమందుతుంటాడు ఆ నందివాహనుడు. పాలించేవాడు సాలెపురుగును లాలించదలిచాడో/నాయన...

MANA KAMCHARA NAYANAR

మన కంచార నాయనారు ******************* స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము శాశ్వతత్త్వ పునీతముగాగ గంగావతరణము మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము మరువకే ఓ మనసా! శివ నామస్మరణము. శ్రీ వేదసార శివస్తోత్రము. కంచార-సఖుడు. మన కంచార-మనసులో నిండిన సఖుడు. పరమేశుని తన మనసులో నిండిన సఖునిగా భావించి పూజించుట వలన ఈ నాయనారు కంచార నాయనారు/మన కంచార నాయనారుగా ప్రసిధ్ధిపొందినాడు.(ఆంతరంగికము) కాంచారూరు పట్టణములో భూస్వాముల కుటుంబమునందు జన్మించిన వాడగుటచే మన కాంచార నాయనారు అని కూడా భావిస్తారు.(బాహ్యము) వంశానుగతముగా లభించిన/వారసత్వముగా లభించిన చోళ సేనా నాయకత్వమును వృత్తిగాను/ షడ్వర్గ సేనలను సమర్థవంతముగా శివభక్త పాదసేవార్పనమునకు పరమార్థవంతముగా పనిచేయించు ప్రవృత్తిగాను కాలమును సద్వినియోగము చేసుకునే వాడు. మన నాయనారును శివానుగ్రహము గృహస్థాశ్రమములోనికి ప్రవేశింపచేసినది. కాలముతో పాటుగా సాగుతున్న శివుని మాయాజాలము మనలను ఆశ-నిరాశలను ఊయలలో ఊగిస్తుంది కదా. నాయనారు ఇంట ఊయలలో బిడ్డ ఊగే తరుణము కరుణను మరచినదా యన్నట్లుగా తాత్సారముచేస్తూ,శరణాగత రక్షకుని చరణసేవాసక్తతకు నాయనారున...

RUDRA PASUPATI NAYANAR

ఉరుత్తిరు రుద్ర పశుపతి నాయనారు. ***************************** " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్ఫురతి తేన చతుర్య్హ కాండః కాందేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామ మధ్య మణివాచ విభాంతి వేదా" నమః శివాయ అను పంచాక్షరి మంత్రము "శివ" అను పదము చేత ప్రకాశించుచున్నది. శివపంచాక్షరిని ప్రశంసించి నిర్దేశించుటచే రుద్రాద్యాయము ప్రశస్తమగుచున్నది. రుద్రుడు తేజోరూపము. రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రాధ్యాయమనగా నమకము మరియు చమకము.నమః అను శబ్దము పలుమార్లు ఆవృత్తమగుటచే నమకము అనియును,చ-మే పలుసార్లు చెప్పబడుటచే చమకము అనియు సార్థకనామములను సంతరించుకున్నవి. "తిరుతొండర్దొగై" సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు. " నమః కాట్యాయచ-నీప్యాయచ నమః సూద్యాయచ-సరస్యాయచా" కొండమీది నుండి జారిపడే జలము నీప్యము.కొద్దిపాటి జలము కాటము. " నమో నాద్యాయచ-వైశంతాయచ" నదీ జలములములలో నుండువాడు నాద్యాయచ, స్వల్పజలము కలది వేశంతము.అవి మన భాషలో చెప్పుకోవాలంటే, కోవెలలోని దైవ తర్పణము కొరకు ఏర్పరచిన దేవ ఖాతములు.పుష్కరిణులు. ...

KAMCHARA NAYANARU

" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." చిదానందరూపా-కంచార నాయనారు ***************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా కంచార నాయనారు చోళదేశ సేనాపతి శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును" విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు. " ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు." భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుట...

DANDI ADIGAL NAYANAR

దండి అడిగళ్ నాయనారు ********************* బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం. ఏ సంకేత రూపముగా నున్న పరమాత్మ లింగమును బ్రహ్మ విష్ణువు మొగిలిన దేవతలు అర్చింతురో,నిర్మలమైన ఏ లింగము సకల చరాచర జన్మలకు ముడిపడియున్న కర్మపాశములను విడదీసి,దుఃఖములను నశింపచేయునో అట్టి సదాశివునికి నా నమస్కారములు. ******** చోళదేశములో తిరునావూరులోని పరమ శివభక్తుడు దండి అడిగళ్ నాయనారు. అడిగల్ పాదపద్మములు-పరమేశ్వర పాదపద్మములను దండిగా అపరిమితముగా నమ్మిన వాడగుటచే దండి అడిగళ్ గా కీర్తింపబడుచున్నాడు.వారు సార్థకనామధేయులే సదాశివునికి ప్రియమైన వారే. దండి అడిగల్ బాహ్యమునకు అంధుడు.అంతర్దర్శనశక్తిమంతుడు. కన్ను తక్క నాలుగు ఇంద్రియములను స్వామిసేవకు మిక్కిలి ప్రేమతో సమర్పించే సమర్థుడు. స్వామి లీలలు వినుచు తన శ్రవణేంద్రియమునకు సౌఖ్యమును కలిగించేవాడు. స్వామిని తాకుతు స్పర్శను పరవశమొందించేవాడు. సామి కరుణ యను సుగంధములను ఆఘ్రాణించుచు ఆనందపడేవాడు .పరమేశుని గుడి చుట్టు ప్రదక్షిణములను లక్షణముగా చేస్తూ మురిసిపోయేవాడు. నిర్మల...