Posts

ERIPATTA NAYANAR

ఎరిపత్త నాయనార్ *************** ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. " నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః". రుద్రా! తే- నీయోక్క మన్యవే-కోపమునకు నంస్తే- నమస్కారము రుద్రా నీ కోప ప్రకటనమునకు నమస్కారము. ఉతో-మరియును తే-నీయొక్క బాహుభ్యాం-బాహువులు, కోపమును సూచించు ఆయుధములను ధరించిన బాహువులకు నమస్కారము. రుద్రమంత్రములను సనాతనులు ప్రత్యక్ష మంత్రములుగా భావించి,గౌరవిస్తారు. నీ కోపము,దానిని సూచిస్తూ నీ బాహువులలో ఒదిగిన ఆయుధములు ధర్మసంరక్షనమునకు మాత్రమే ప్రయోగింపబడును గాక. అంతే కాదు, యా తే హేతిః మీడుష్తమ య-ఏ-తే-నీ యొక్క ఖడ్గము/గొడ్డలి మీడుష్టమ- సజ్జనులను స...

VIRALMINDA NAYANAR

నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు." చిదానందరూపా- విరాల్మిండ నాయనారు ************************************** "బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో" చిదానందరూపా-విరాల్మిండు నాయనారు ************************************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు ...

MURUGA NAYANARU

మురుగ/మురుగర్ నాయనార్ ********* " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము...

KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులత...

SOMASIRA NAYANAR

" జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ | సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ" చిదానందరూపా--సోమశిర నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు పరహితమును కోరు అనిశమును పూజను మానడు గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక . యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడ...

ERIPATTA NAAYANAARU

ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు, చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు. ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో. భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో. ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరిక...

MURUGA NAYANAR

మురుగ/మురుగర్ నాయనార్ ************************ " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నుండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాసక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సమ్హరనము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరా...