Posts

PUGAL CHOLA NAYANAR

పుగల్ చోళ నాయనార్ ******************** కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం బొందరే వారేరీ సిరిమూటకట్టుకుని బోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా పోతనామాత్యుడు పుగల్ -ప్రభువు/పెంపొందించు స్వభావము కలవాడు. చోలన్-చోలరాజ్యమ్ను పెంపొందించి/పాలించు స్వభావము కలవాడు. సమర్థవంత రాజ్యపాలన వృత్తి. సదాశివార్చన ప్రవృత్తి. ఎరిపత్త నాయనారు అభిరామి ఆండారును పై దూకి,నెట్టి,కిందపడవేసినందుకు వచ్చి,క్షమాపణలను చెప్పిన రాజుగా భావిస్తారు. ఉరైయూరును రాజధానిగా చేసుకుని,ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ,పశుపతీశ్వరుని సేవిస్తూ పరమానందముగా కాలమును గడుపుచున్నవేళ, తలపున యైనను శివభక్తులకు చెడును తలపెట్టని నాయనారుకు విషమ పరీక్షను పెట్టదలచాడు. " పరమం పవిత్రం సాంబం విభూతిం పరమ విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం సాంబం విభూతిం ఇదమాశ్రయామి. విభూతి అనగా ఐశ్వర్యము/మహిమ/కరుణ అను అర్థమును కనుక మనము భావించుకుంటే," వి-విశేషమైన-భూతి/బూది-అనుగ్రహమును ఉపకరనమ...

KOTPULI NAYANARU

కోట్పులి నాయనారు ********************* దృశ్యాదృశ్య విభూతి వాహనకరీబ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. తిరునాత్తియన్నగుడి లో వ్యవసాయ కుటుంబము నందు నాయనారు జన్మించెను. చోలరాజునకు సైన్యాధ్యక్షత వృత్తి. ధాన్యరాశులను దేవాలయములోని నైవేద్యమునకు,అన్న సంతర్పణములను అర్పించుట ప్రవృత్తి. అన్నింటిని సరిగా సాగనీయడు కదా అన్నపూర్ణేశ్వరుడు. భక్తి చేయు గమ్మత్తులను బాహ్యప్రపంచమునకు తెలియచేయాలనే సంకల్పముతో ఎన్నో చిత్ర-విచిత్రములను చేస్తుంటాడు. భక్తినే ఆయుధముగా మలచి భక్తుని అరిషడ్వర్గములతో ఆడుకోమంటాడు.తాను వేడుక చూస్తుంటాడు. ఇక్కడ అదే జరిగింది.వ్ర్త్తి-ప్రవృత్తిని రెండు పాచికలుగా మలచుకున్నాడు మహేశుడు. కర్తవ్యపాలనము అంటూ నాయనారుకు ధాన్యము దేవాలయములలోని పంచే అవకాశమును తుంచివేశాడు. రాజాజ్ఞగా ఊరువిడిచి పొరుగు దేశమునకు సైన్యముతో వెళ్ళవలసిన సందర్భమును సృష్టించాడు నాయనారును పరీక్షించుటకై వాని ఇష్టదైవమైన శివుడు. ఒక పక్క కర్తవ్యము.మరొక ప...

cheramaan naayanaar

చేరమాన్ నాయనార్ *************** " ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు. కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను. ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను. రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును, కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు. చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు. సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవ...

VIRAALMINdA NAAYANAARU

విరాల్మిండ నాయనార్ ******************** "ధావతే సత్వానాం పతయే నమః" భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు. విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు. విరాల్మిండా నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను. విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు. శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు. విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా. హర హర మహాదేవ శంభో శంకర మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమ...

KALIKAMBA NAAYANAAR

కలికాంబ నాయనారు *************** " నీ పాదకమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయకదె" సహజకవి బమ్మెర పోతన. ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి. అన్నమాచార్చార్యులు సైతము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము అని సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి. నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు. స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము, శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని , అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దాన...

cheraman nayanar

ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) చిదానందరూపా-చేరమాన్ నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్...

SOMASIRA MAARAN NAYANAR

సోమశిర నాయనారు ******* " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం." శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. " యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము. ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు. ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము ...