Posts

ILANGUdI MARAN NAYANAR

ఇలయాంగుడి మారన్ నాయనారు ***************************** హరిలీలా విలాసమో/సిరి కేళీ వినోదమో రంతిదేవుడు అను విష్ణుభక్తుడు ,తన కుటుంబముతో సహా 48 రోజులు ఆకలిదప్పులతో బాధించబడినాడు.అది ఊరటయో/ఊరట అనుపేర తనను పరీక్షించు గారడియో వారికి పాలు-అన్నము-రొట్టెలు -నీరు లభించినది. స్నానాదికములు పూర్తిచేసుకొని,హరిని మనసారా స్మరించుకొని,అహారమును తినుటకు సిధ్ధమవగానే, "భవతి భిక్షాందేహి" అంటూ బ్రాహ్మణుడు రానే వచ్చాడు. హరికి అర్పిస్తున్నానన్న భావనతో ,తమ దగ్గర నున్న ఆహారములో కొంత భాగమును సవినయముగా సమర్పించి,వెనుదిరుగగనే ,వెనుకనే నిలచి మరొక అభ్యాగతి అకలికేకలు వినపడగానే మరికొంత పదార్థములనిచ్చి తృప్తిపరచినాడు రంతిదేవుడు.ఇంతలో నాలుగు కుక్కలతో నలిగిన దుస్తులతో నకనకలాడుచున్న కడుపుతో నాలుగు మెతుకులకై ఎదురుగా మరొక దీనుడు రంతిదేవుని ముందు నిలిచాదు. కటకట! ఆకలిని జయించుట కానిపనికద అనుకొని తన దగ్గరనున్న మొత్తము ఆహారమును ఇచ్చివేసి నిశ్చింతుడైనాడు రంతిదేవుడు . హరినామ స్మరణముతో తమ ప్రానములను నిలుపుకొనుటకు జలాహారమును స్వీకరించ సిధ్ధమగుచున్నవేళ రానేవచ్చాడు జలజాక్షుడు...

KALIKKAR AMMAYAAR NAAYANAAR

కరైక్కల్ అమ్మయార్ నాయనారు *************************** మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణందుచంద్రికా చకిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయిన్ ఏల. బమ్మెర పోతన సహజకవి సాహిత్యమునకు నిలువెత్తు తార్కానము కలికంబ అమ్మయార్ నాయనారు. కరైక్కల్ గ్రామమునకు సంబంధించిన పరమ శివ భక్తురాలు. వైశ్య కులసంజాతుడైన ధనదత్తుని కుమార్తె .మహాలక్ష్మి అవతారముగా వారు తమ కుమార్తెను భావించి" ఔనీతవతి" అని నామకరనమును చేసినారు .చిన్నతనమునుండి శివభక్తితో ,శివపాదార్చులను వినయముతో సేవిస్తూ ,తల్లితండ్రులను సంరోషపరుస్తు ,సార్థక నామముతో జన్మపరమార్థమునకు త నను మలచుకుంటూ అందరికి ఆదర్శముగా అల్లారుముద్దుగా పెరుగుచున్న సమయమున " నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం" ...

TIRUNALAI POVAR NAYANAR

" నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!" తిరునాలైపోవార్ నాయనారు ********************** తిరునాలై -మరుసటిరోజు పోవర్-శివదర్శనమునకు పోవుచున్నాను అని భావించెడివాడు. తనకు చిదంబర నటరాజ దర్శనమునకు తనకున్న ఆర్థిక పరిస్థితి,అసమాన కుల స్థితి అవరోధనమును కలిగించునని తెలిసి నప్పటికి,సదాశివునికరుణపైగల నమ్మకము నందనారును మరుసటిరోజు తాను శివదర్శనమును చేయగలనన్న నమకముగా మారినది. నంది తలను పక్కకు జరిపించిన మహనీయుడు కనుక నందనారుగా ప్రసిధ్ధిని పొందెను. ఆదనూరు మురికివాదలో చెప్పులుకుట్టే వంసమునందు జన్మించిన నాయనారు తనకు జన్మతః లభించిన కళతోచెప్పులను మాత్రమే కాక డమరు-మద్దెల మొదలగు చర్మవాతిద్యములను అయంతభక్తితో తాయారుచేసి స్వామిసేవకు సమ్ర్పిమచేవాడు. **** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరునాలై పోవార్ నాయనారు తిరిపమెత్తువాని భక్తుడు "గీతం సమర్పయామి" అంట...

PUGAL CHOLA NAYANAR

పుగల్ చోళ నాయనార్ ******************** కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం బొందరే వారేరీ సిరిమూటకట్టుకుని బోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా పోతనామాత్యుడు పుగల్ -ప్రభువు/పెంపొందించు స్వభావము కలవాడు. చోలన్-చోలరాజ్యమ్ను పెంపొందించి/పాలించు స్వభావము కలవాడు. సమర్థవంత రాజ్యపాలన వృత్తి. సదాశివార్చన ప్రవృత్తి. ఎరిపత్త నాయనారు అభిరామి ఆండారును పై దూకి,నెట్టి,కిందపడవేసినందుకు వచ్చి,క్షమాపణలను చెప్పిన రాజుగా భావిస్తారు. ఉరైయూరును రాజధానిగా చేసుకుని,ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ,పశుపతీశ్వరుని సేవిస్తూ పరమానందముగా కాలమును గడుపుచున్నవేళ, తలపున యైనను శివభక్తులకు చెడును తలపెట్టని నాయనారుకు విషమ పరీక్షను పెట్టదలచాడు. " పరమం పవిత్రం సాంబం విభూతిం పరమ విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం సాంబం విభూతిం ఇదమాశ్రయామి. విభూతి అనగా ఐశ్వర్యము/మహిమ/కరుణ అను అర్థమును కనుక మనము భావించుకుంటే," వి-విశేషమైన-భూతి/బూది-అనుగ్రహమును ఉపకరనమ...

KOTPULI NAYANARU

కోట్పులి నాయనారు ********************* దృశ్యాదృశ్య విభూతి వాహనకరీబ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. తిరునాత్తియన్నగుడి లో వ్యవసాయ కుటుంబము నందు నాయనారు జన్మించెను. చోలరాజునకు సైన్యాధ్యక్షత వృత్తి. ధాన్యరాశులను దేవాలయములోని నైవేద్యమునకు,అన్న సంతర్పణములను అర్పించుట ప్రవృత్తి. అన్నింటిని సరిగా సాగనీయడు కదా అన్నపూర్ణేశ్వరుడు. భక్తి చేయు గమ్మత్తులను బాహ్యప్రపంచమునకు తెలియచేయాలనే సంకల్పముతో ఎన్నో చిత్ర-విచిత్రములను చేస్తుంటాడు. భక్తినే ఆయుధముగా మలచి భక్తుని అరిషడ్వర్గములతో ఆడుకోమంటాడు.తాను వేడుక చూస్తుంటాడు. ఇక్కడ అదే జరిగింది.వ్ర్త్తి-ప్రవృత్తిని రెండు పాచికలుగా మలచుకున్నాడు మహేశుడు. కర్తవ్యపాలనము అంటూ నాయనారుకు ధాన్యము దేవాలయములలోని పంచే అవకాశమును తుంచివేశాడు. రాజాజ్ఞగా ఊరువిడిచి పొరుగు దేశమునకు సైన్యముతో వెళ్ళవలసిన సందర్భమును సృష్టించాడు నాయనారును పరీక్షించుటకై వాని ఇష్టదైవమైన శివుడు. ఒక పక్క కర్తవ్యము.మరొక ప...

cheramaan naayanaar

చేరమాన్ నాయనార్ *************** " ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు. కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను. ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను. రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును, కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు. చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు. సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవ...

VIRAALMINdA NAAYANAARU

విరాల్మిండ నాయనార్ ******************** "ధావతే సత్వానాం పతయే నమః" భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు. విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు. విరాల్మిండా నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను. విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు. శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు. విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా. హర హర మహాదేవ శంభో శంకర మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమ...