Posts

PASURAMU-06

Image
తిరుచిట్రంబలం-పాశురము-06 **************************** మానే నీ నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులర్దిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ నిజమేదో కల్లయేదో నీలకంఠుండెరుంగు ********************************** అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగక యున్న ఈశ్వరుడెరుగడా, అని వేమన నుడివి నట్లు ,తిరుమాణియవాచగరు మేల్కొలుపబడిన చెలుల వాక్చాతుర్యమును వివరిస్తూనే,ఒకామె తిత్తిక్క పేశువాయ్-వట్టి మాతలను మాత్రమే చెప్పినదని,మరొకామె పాలూర్ తేన్ పేశుం తేనెలో పాలలో నానిన పదార్థములు ఎంత మధురముగా ఉంటాయో వాటికంటె మధురమైన మాటలను మాత్రమే పలికినదని,ప్రస్తుత పాశురములోని చెలి,వీరిని మించిన వాక్చాతుర్యముతో తాను ముందటిరోజే వారి దగ్గరకు వెళ్ళి,తానే వారి నిదురను మేల్కొలుపుతానని చెప్పినది.కాని కార్యాచరణము జరుగలేదు. నీలవేణి మాటలు నీటిమూటలు-అన్నట్లుగా త్రి...

PASURAMU-05

Image
తిరుచిట్రంబలం-పాశురము-05 **************************** మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్ న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్ కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు శీలముం పాడి శివనే శివనే ఎన్రు ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్ ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్. తమస్వజ్ఞానజం విధ్ధి మోహనం సర్వదేహినాం ********************************** ప్రస్తుత పాశురములో మేల్కొలుపబడుతున్న చెలిని తమోగుణముతో నిడి,మాయచే కప్పబడిన దానిగా , ఏలా కుళలి అని సంబోధిస్తున్నారు. ఆమె, ఏళా-నల్లని తుమ్మెదరెక్కల వంటి,వత్తైన-పుడుగైన, కుళలి-కేశ సంపద కలిగినది. అంటే తమోగుణముచే కప్పివేయబడి,మాయ యను మోహమను సుగంధమనుకుని ఆఘ్రాణించుచున్నది. ఆత్మ స్వరూపమును అర్థముచేసుకొనలేక పోయినని పరమాత్మను దర్శించితి అనుచు ప్రగల్భములు పలుకు అమాయకత్వము కలది. కనుక ఆమె చెలులు ఆమెను , కడై తిరవాయ్ అని చెబుతున్నారు. చెలి ముందు నీవు నీవు నిదురించుచున్న తలుపు గడియను , తిరవాయ్-తెరువ వమ్మా.ఎందుకంతే బంధింపబడియున్న ఆ తలుపు గడియ ని...

PASURAM-04 TIRUVEMBAVAY

Image
పాశురం-04 ********** ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్ కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్. మందస్మిత ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా పోట్రి **************************************** మూదవ పాసురములోని చెలి యొక్క సత్వగుణశోభను ముత్యముల వంటి స్వచ్ఛమైన పలువరుసతో పోల్చారు మాణిక్యవాచగరు. నాలుగవ/ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలి అద్భుతతేజో విరాజితమైన నవ్వుకలది. ఆమెనుమేల్కొలుపుచున్న చెలికత్తెలు వణ్ణిన్ మొళియార్ కిళులు వణ్ణిన్-పంచవన్నెల మొళియార్ -చక్కగా మాట్లాదకలిగిన కిళులు-చిలుకులు. వారి మధ్యను జరుగుచున్న సంభాషనము పరమేశుని, వేదపొరుళ్ అని వేదస్వరూపమని, మరందై-భవరోగము తొలగించు ఔషధమునిచ్చు వైద్యుడు అని సంకీర్తించుచున్నారు. బాహ్యములో పరిహాసమును,ఆంతర్యములో పరమార్థమును మనకు అందించుచున్నారనుట నిస్సందేహము. కాలత్తై పోగాదే అంటూ కాలము మన ఎవర...

VEMBAVAY-03

Image
పాశురం-03 *********** ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్ అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్ పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్ పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో సిత్తం అళగియార్ పాడారో నం శివనే ఇత్తనియుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్. పత్తుడయీర్ ఈశన్ పోట్రి. ********************** రెండవ పాశురము మనోవృత్తులను వివరిస్తే ప్రస్తుత పాశురము సత్వగుణ సంశోభితమై , సత్వాన్ సంజాయతే జ్ఞానం అన్న భగవద్గీతా వాక్యమునకు ఉదాహరముగా మేల్కొలుపబడు చెలిగా ప్రకాశించుచున్నది. ఆమె సత్వగుణశోభిత.రజో-తమోగుణములను జయించినది.ఆ విషయమును తిరు మాణిక్యవాచగరు, ముత్తన్న వెణ్ నకయ అని ఆమెను సంబోధిస్తూ మనకు తెలియచేసారు. చెలులు వచ్చి ఆమెను, ముత్తన్న-మంచి ముత్యముల వంటి, వెణ్-తెల్లనైన,స్వచ్ఛమైన నకయ-పలువరుస కలదానా నీవు నిన్న మాతో స్వామియే మన, అత్తన్-తండ్రి -జగతః పితరో వందేం మన రక్షకుడు అని,అంతే కాదు, ఆనందన్-తలపే ఆనందాయకమని, అంతటితో ఆగక, అముదన్-అమృతస్వరూపుడు,మనకు జీవనాధారము అ...

PASURAM-02

పాశురము-02 ************** తిరువెంబావాయ్-02 ************ పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్ చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు కూశుం మలర్పాదం తందరుళ వందరుళం దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్ ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్. తందరుళ వందరుళం పోట్రి *************************** మనపై అవ్యాజకరుణతో తనకు తానే తరలివచ్చిన పరమాత్మ మనలకు మంగళమొనరించును గాక. మొదటి పాశురములోని చెలి అంతర్ముఖమును వీడలేదు.తనను మేల్కొలుపుటకు వచ్చిన చెలులతో సంభాషించనులేదు. కాని ప్రస్తుతము చెలులు మేల్కొలుపుచున్న చెలి వాగ్భూషNaమును భూషణముగా అలంకరించుకొనిన భాగ్యశాలిని.kanukanae naeriDayaar ani Amenu saMboedhimchaaru. ఆమె చెలులును పరమహంసలే.మహాజ్ఞానులే. మనలను ఉధ్ధరించుటకై అద్భుత సంభాషణలతో సమయస్పూర్తితో కూడిన నటరాజ కీర్తనముతో మనలను పరవశింపchaeస్తున్నది పాశురము. ఈ పాశురములోని పడుచు , ఎప్పోదు-ఎల్లప్పుడు తన చెలులతో సంభాషించునపుడు, తాను భవబంధములను అధిగమించితినని,తనకు ఉన్న ఒకేఒక్...

PASURAM-01

Image
పాశురం-01 ********** ఆదియుం అందముం ఇల్లారుం పెరుం శోదియై యాం పాడ కేట్టేయుం వాల్కడంగళ్ మాదే వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్ మదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్ వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు పోదార్ అమలి ఇమ్మేల్ పురండిగన్ ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్. పరంజ్యోతియే పోట్రి. *************** తిరు మాణిక్యవాచగరు మొదటి పాశురములో సంకీర్తనా భక్తిని సన్నుతిస్తూ,వ్రతమునకు సిధ్ధమవుతున్న కన్నెలు తమ చెలిని నిద్దురలేపుటకు వచ్చినారు. వారికి మరికొందరు స్వామియొక్క స్వరూప-స్వభావ సంకీర్తనము వీనుల విందుగా వినిపిస్తున్నది. ఆ సంకీర్తనము ఎంతటి సౌశీల్యమును కలిగినదంటే అది , వాల్ ఒళిపో-ప్రతిధ్వనించుచున్నది. వీధివాయ్-వీధి అంతా తన నోరు తెరుచుకుని కీర్తిస్తున్నదా అన్నట్లుగా శివనామము, స్వామి స్వరూపమును , అరుం-అద్భుతమైన, పెరుం-బహు పెద్దదైన,విస్తీర్ణమును కొలుచుటకు సాధ్యము కాని , స్వభావమందువా ఆదియుం-అంతముయుం, మొదలు చివర కనలేని/కనరాని అనగా, ఆద్యంతరహితుని,దివ్య చరణారవిందములను, వార్కళల్-పాదపద్మములను ప్ర...

TIRU VEMBAVAY INTRODUCTION

Image
[08:24, 15/12/2021] Vimala: భగవత్ బంధువులారా! మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో . " అందరికి వందనములు." మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి, " నీ పాదము పట్టి నిల్చెదను పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అనిప్రార్థించగానే తానే పలికినది. తిరు ఎం పావై ***** తిరు-శ్రీకరము-శుభకరము-పవిత్రము-ప్రపన్న ప్రసన్నము-పరమార్థ ప్రదాయకము ఇలా ఎన్నెన్నో అర్థములను పెద్దలు సమన్వయపరిచినారు. పావై -పాహిమాం-వ్రతము-అనుసరణీయము-అవ్యాజ అనుగ్రహము-అసమాన అదృష్టము...