Thursday, December 16, 2021
PASURAM-02
పాశురము-02
**************
తిరువెంబావాయ్-02
************
పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం
పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే
నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్
చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి
ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు
కూశుం మలర్పాదం తందరుళ వందరుళం
దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్
ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్.
తందరుళ వందరుళం పోట్రి
***************************
మనపై అవ్యాజకరుణతో తనకు తానే తరలివచ్చిన పరమాత్మ మనలకు మంగళమొనరించును గాక.
మొదటి పాశురములోని చెలి అంతర్ముఖమును వీడలేదు.తనను మేల్కొలుపుటకు వచ్చిన చెలులతో సంభాషించనులేదు.
కాని ప్రస్తుతము చెలులు మేల్కొలుపుచున్న చెలి వాగ్భూషNaమును భూషణముగా అలంకరించుకొనిన భాగ్యశాలిని.kanukanae naeriDayaar ani Amenu saMboedhimchaaru.
ఆమె చెలులును పరమహంసలే.మహాజ్ఞానులే.
మనలను ఉధ్ధరించుటకై అద్భుత సంభాషణలతో సమయస్పూర్తితో కూడిన నటరాజ కీర్తనముతో మనలను పరవశింపchaeస్తున్నది పాశురము.
ఈ పాశురములోని పడుచు ,
ఎప్పోదు-ఎల్లప్పుడు తన చెలులతో సంభాషించునపుడు,
తాను భవబంధములను అధిగమించితినని,తనకు ఉన్న ఒకేఒక్క పాశము/బంధము పరంజోతి పాదములవద్ద ఉంచు భక్తి యొక్కటే అని,దానిని ఇరాన్/వకల్
అహర్నిశలు విడిచి ఉండలేననిచెబుతుండేది.
కాని ఇప్పుడు తన దృష్టిని పరంజోతి నుండి పువ్వులు పరచిన తల్పమువైపునకు మరల్చినది అని చెలులు మేలమాలుడుతున్నారు.
పాశం పరంజోది అన్న నీవు పోదార్ అమలిక్కేani poolaparimaLamulanu aihikamulanu aghraaNistoo Adamarachi nidurapoetunnaavu.
అనగానే
చెలులారా! నేను మాత్రమే కాదు భాగ్యశాలిని,మీరును శివానుగ్రహమును పొందిన భాగ్యశాలురే,నేరుడ ఈఇర్,
శిలవో విళయాడి,
పరిహాసములా నాతో,చెలులారా అని కొంచము నొచ్చుకున్నట్లుగా కనిపించగానే,
అయ్యో చెలి,
ఇది పరిహాస సమయముకాదు/ప్రదేశమును కాదు
ఎందుకంటే మనము ఇప్పుడు ఇక్కడ ,
మలర్పాదం
ని ప్రస్తుతించటానికి సన్నధ్ధులమగుచున్నాము.
malapaadam
-పరమేశుని పాదపద్మములు
విణ్ణోర్కల్-దేవతా సమూహములను
కూసుం-పశ్చాత్తాపపడునట్లు చేయుచున్నవి.
విణ్ణోర్గళ్ దేవతా సమూహములు (అహంకారముతో)
తమకుతామే స్వామి పాదపద్మములను పట్టుకుని సేవించుదామని ప్రయత్నించి విఫలులైనారు.ఎవరికిని సులభముగా దొరకని స్వామి పాదములు,అత్యంత తేజోవంతములు-దయా సముద్రములు మన మీది అనురాగముతో,
తందరుళ వందరుళం-తమకు తామె తరలివచ్చినవి.
ఎక్కడికో తెలుసా?
తిల్లై చిట్రంబలం-చిదంబరములోని తిల్లై వనములో స్వామి కొలువుతీరి యున్నాడు.
చెలి నటరాజసేవలో తరించబోతున్న ఈ సమయమున మేము నీతో,
ఏసం-పరిహాసములు పలుకుతామా,
మనమM
దరము త్రికరణశుధ్ధులై జ్యోతిస్వరూపముగా ,mana cheekaTlanu పారద్రోలుటకు దయతో విచ్చేసిన నటరాజస్వామిని అర్చిచుటకు బయలుదేరుదాము అని మూడవ చెలిని తమతో పాటుగా తీసుకుని వెళ్లుటకు కదులుchunnaaru..
తిరుమాణిక్యవాచగరు ఈ పాశురములో పరస్పర పరిహాస సంభాషణములను జరుపుకొనిన,ఒకరి ఆలోచనను ఇంకొకరు సవరించినట్లుగా ,అటు-ఇటు జరుగుచున్న వారి మనో భవనములను-భాషNaములను సరిచేసుకొని,స్వామి అర్చనమునకు బయలుదేరినట్లు వాచ్యార్థముగా సూచించారు.
కాని వారు చెలులు కారు.మానవ చిత్తవృత్తులు.అవి నిరంతరము నిలకడ లేక అటు-ఇటు జారిపోతుంటాయి.వాటిని అనుక్షణము యుక్తాయుక్త విచక్షణమనే సాధనముతో సవరిస్తూ సక్రమమైన మార్గములో పయనించుటయే నిజమైన సాధన అను విషయమును విశదపరుస్తున్నారు.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
,
,
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment