Posts

BHAVANAAMAATRA SAMTUSHTAA-GUPTATARA YOGINULU

Image
  భావనా మాత్ర సంతుష్టా-గుప్తతర యోగినులు  ********************************  సర్వాశాపరిపూరకచక్రములోని 16 గుప్తయోగినులు పంచేద్రియములను పంచభూతములతో కర్మేంద్రియములను పంచతన్మాత్రలతో అనుసంధానముచేసి ఆత్మసాక్షాత్కారమునకు సిధ్ధముచేస్తుంటే,మరికొంచము ముందుకు సాధకుని సాధనను జరుపుతూ,8 మంది గుప్తతర యోగినులు సర్వసంక్షోభచక్రములో అనంగులై మానసిక పరిపక్వతకై పాటుపడుతుంటారు.ఆకర్షణ శక్తులైన గుప్తయోగినులు ఉపాధిని సిధ్ధము చసిన తరువాత,అనంగ శక్తులు అనగా శరీరమునకు సంబంధములేని ,మనసుతో శరీరమును సైతము నియంత్రించగలిగిన మహిమాన్వితములు.  అనంగ కుసుమా  అనంగమేఖలా  అనంగ మదనా  అనంగ మదనాతురా  అనంగ రేఖా  అనగవేగినీ  అనంగాంకుశా    అను ఈ మానసికశక్తులు మంచిభావములను సాధకుని మనసులో కలుగచేస్తూ,ధర్మబధ్ధ ప్రవర్తనను పెంపొందింప చేస్తాయి.అనంగ వేగినీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రవృత్తిగా,దురాలోచనలకు నివృత్తిగా అనంగాంకుసినీ శక్తి సహాయపడుతుంటే,అనంగమాలిని శక్తి తటస్థ భావమును కలిగిస్తూ,అనవసర భావనలకు దూరముగా ఉంచుతుంది.  అనంగదేవతలు సాధకుని అంతరంగములో కుసుమే ఒక సంకల్పమును పుష్పింపచేయుశక్...

BHAAVANAAMAATRA SAMTUSHTAA-GUPTAYOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-గుప్తయోగినులు  ***************************   త్రైలోక్య మోహన చక్రమును దాటిన తరువాత నున్న రెండవ ఆవరణమును "సర్వాశాపూరక చక్రము"గా కీర్తిస్తారు.ఇక్కడ పదహారు శక్తులు /ఆకర్షణ శక్తులు మనలను మనచుట్టునున్న ప్రకృతితో అనుసంధానమును చేసి సాధకుని ఇంద్రియములను శుభ్రపరుస్తుంటాయి.  కామాకర్షిణి,బుధ్ధ్యాకర్షిణి,శబ్దాకర్షిణి,రసాకర్షిణి,గంధాకర్ష్ణి,రూపాకర్షిణి,స్పర్శాకర్షిణి అను పంచతన్మాత్రలను,వాటికి మూలకారనమైన పంచభూతములను, మనలోని పంచ జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములతో సమన్వయ పరచి మనకు సహాయపడుతుంటాయి.  మనకు  గుడ్డితనము,మూగతనము,అవిటితనము మొదలగు ఇంద్రియ రుగ్మతలను నివారించుచు మనలను కాపాడుతుంటాయి.   కామాకర్షిణి ధర్మబధ్ధమైన కోరిక సర్వేజనా సుఖినో భవంతు అనేలా బుధ్ధిని సన్మార్గమువైపు నడిపిస్తూ,ఆత్మతత్త్వమనే అహంకారమును వివరిస్తూ స్వయంప్రకాశమును దర్శింపచేయుటకు సహాయపడుతుంటాయి.   

BHAVANAA MAATRA SAMTUSHUTAA-NIGARBHAYOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-నిగర్భయోగినులు  ****************************  సర్వరక్షాకరచక్రములో ఉండే 10 అద్భుత శక్తులను "నిగర్భయోగినులు"గా కీర్తిస్తారు.  మనలను గర్భస్థశిశువులుగా ఉన్నప్పటినుంచి మనలను రక్షించుచున్న మహిమాన్వితశక్తులు వీరు.సర్వ ఉపసర్గతోకూడిన వీరిని, 1.సర్జే 2.సర్వశక్తే 3.సర్వైశ్వర్యప్రదాయిని 4.సర్వజ్ఞానమయి 5.సర్వవ్యాధివినాశిని 6.సర్వధారాస్వరూపే 7.సర్వపాపహరే 8.సర్వానందమయీ 9.సర్వరక్షాకరీ 10.సర్వఈప్సితఫలప్రదే    అను దివ్యనామములచే సంకీర్తింపబడతారు వీరు.  వీరు సర్వమునకు ఆధారభూతులు.అంతేకాదు శక్తిమంతులు.శక్తిని ఏవిధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే జ్ఞాన సంపన్నులు.కనుకనే మన కోరికలను తీరుస్తూ,మనకు ఆనందమును అందించగలుగుతున్నారు.అంటే మన కోరికలను ధర్మబధ్ధముగా ఉండేటట్లు విచక్షన అను సంపదను  ప్రసాదిస్తున్నారు.   ఆ సంపద మనలను సర్వవేళలను రక్షిస్తోంది.   శారీరక పరముగా అన్వయించుకుంటే నిగర్భయోగినులు జీర్ణవ్యవస్థను సక్రమముగా పనిచేయిస్తుంటారు.దానికి అవసరమైన పది వాయువులను సమపాళ్ళలో ప్రసరింపచేస్తుంటారు.  అంతర్దశార శక్తులైన వీరు భక్ష్య-భోజ్య-చోష్య-ల...

BHAAVANAAMAATRA SAMTUSHTAA-SAMPADAAYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-సంప్రదాయ యోగినులు  ********************************  14 మంది సంప్రదాయ యోగినులు హృదయస్థానమైన సర్వసౌభాగ్యప్రద చక్రమునందు విరాజిల్లుతు సాధకుని మార్గమును సుగమము చేస్తుంటారు.వీరు నాడీ మండలమును పరిరక్షించుచుండుటయే కాక భావోద్వేగములను క్రమబధ్ధీకరిస్తు అనుగ్రహిస్తుంటారు.  సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,ఆహ్లాదిని,సమ్మోహిని,జృంభిణి,స్తంభిని,,రంజనీ,ఉన్మాదిని,సర్వార్థసాధిని,సర్వసంపత్తిపూరిణి,మంత్రమయి,ముఖ్యముగా ద్వంద్వ క్షయంకరి/సర్వద్వంద్వక్షయంకరీ.   నేను అనే దేహము నాలో దాగిని చైతన్యము రెండుగా నున్నవి అన్న భావనను పోగొట్టే పరమకరుణామయి సంప్రదాయయోగినులుగా మనలోని చిత్తభావములకు అదే మనోప్రవృత్తులకు వాటిని తొలగించే నివృత్తులకు ప్రతీకలు.  మన్వస్రం గా కీర్తింపబడే ఈ చక్రమును పదునాలుగు లోక విశేషములుగాను కీర్తిస్తారు.  నాడీమండలపరముగా కనుక సమన్వయించుకుంటే మానవ సరీరములోని 72000 నాడులను చైతన్యవంతముచేసే యోగినులు.  పరదేవతయొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు,బుధ్ధి,చిత్తము,అహంకారము అను అంతఃకరణములుగాను కీర్తిస్తారు.  ఇక్కడ మనమొక విషయమును ...

BHAVANAAMAATRA SAMTUSHTA-KULAYOGINULU.

Image
   కులయోగినులు  ************  శ్రీదేవి ఖడ్గమాల/శక్తి శుధ్ధమాలామంత్రములోని ఐదవ ఆవరణములో మనచే కీర్తింపబడుచున్న అద్భుతశక్తుల సాంకేతిక నామమే కులయోగినులు.     అసలు కులము అంటే ఏమిటి?యోగము అంటే ఏమిటి?యోగినులు అనగా ఎవరు? అనే సందేహమును పోగొట్టుకుంటేకాని మనము శ్రీమాత అవ్యాజకరుణాతత్త్వమును అర్థము చేసుకొనలేము.అమ్మదయతో పెద్దలు మనకు అందించిన అనుగ్రహముతో,తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.   శ్రీమాత్రేనమః.   *********  కులము అను పదమును దేహముగా.అవయవముల సమూహముగా మనము కనుక అన్వయించుకోగలిగితే,అప్పుడు మనము  యోగము అను శబ్దము యొక్క గొప్పతమును తెలుసుకునే ప్రయత్నము చేయగలము.  దేహములోదాగి (సూక్ష్మముగా) దానిని చైతన్యముచేయుచున్న మరొకశక్తి మరొకటి గలదని తెలుసుకొనగలుగుటయే యోగము.కన్ను దర్శనశక్తి అనే చైతన్యముపై ఆధారపడి చూడగలుగుచున్నదనుట ఎంత నిజమో ఆ దర్శనశక్తిని కన్నుకు భేదముగా గ్రహించగలుగుటయే యోగము.చూడకలుగుట కన్ను అన్న అవయవము యొక్క యోగ్యత.  ఏవిధముగా దర్శనశక్తి కన్ను అను అవయవముద్వారా ప్రకటింపబడుతున్నదో,అదేవిధముగా మనశరీరములోని ప్రతి అణువు మనలో దాగిన చైతన్యశక్తి యొక...

BHAVANAMAATRA SAMTUSHTA

Image
 హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!  శ్రీదేవిఖడ్గమాల అమ్మవారి యంత్రస్వరూప వివరనము.పది ఆవరణములలో అమ్మ సంకల్పముతో విస్తరింపబడిన ప్రకృతిశక్తులు సాధకునకు ఆత్మతత్త్వమును అర్థముచేసుకొనుటకు            ఏవిధముగా సహాయపడుచున్నవో ,అడ్దంకులను ఏ విధముగా తొలగించుచున్నవో,ఆకరషణలను ఏ విధముగా దూరముచేయుచున్నవో అమ్మ మనకు వివరించే అనుగ్రహము.   విస్తరించిన అనేకానేక శక్తులలో కొన్ని రహస్యముగా,మరికొన్ని ప్రకటనముగా,కొన్ని దండిస్తూ,కొన్ని దయచూపుతూ,కొన్ని శరీర వ్య్వస్థలను సక్రమముగా నియంత్రిస్తూ,మరికొన్ని మానిసిక స్థిరత్వమును కలిగిస్తూ,ఒక్కొక్క అవరనమనే మెట్టును ఎక్కిస్తూ మనలో దాగిన మనను పరిచయము చేస్తుంది.మనలోని చైతన్యముతో మమేకము చేస్తుంది.    ఐం క్లీం సౌం అను మూడు బీజాక్షరలు నన్ను నాలోఉన్న నన్ను మధ్యలో దాగిన ప్రపంచమనే తెరను ఒకే వేదిక మీద చూపిస్తుంది.    ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

Image
1. సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. **** 2. ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం గరళకంఠుని సతిగ మంగళముగ అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర. అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే *********** 3.నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు...