Posts

NA RUDRO RUDRAMARCHAYAET-16 (SIVAANAMDALAHARI)

Image
   విరించి దీర్ఘాయుః భవతు భవతాం తత్పర శిరః  చతుష్కం సంరక్షం స ఖలు భువి దైన్యం లిఖితవాన్  విచారః కోవా మం విశద కృపయా పాతి శివతే  కటాక్ష వ్యాపారః స్వయ మపిచ దీనావన పరః  విధిలిపిం కిం న హరసి అని వేదనలో స్వామి అశక్తుదనో.ఉపేక్షచేయుచున్నాడనిన శంకరులు,భక్తునకు దిశానిర్దేశము చేస్తూ,కఠినముగా కనిపిస్తున్న పరిస్థితులే కారుణ్యప్రదములుగా ఏ విధముగా స్వామిచే స్పురింపచేయగలవో ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.  మనసు అతిచంచలము.అప్పుడప్పుడు కాచేవారినే నిందిస్తుంది తరువాత నిజమును గ్రహిస్తుంది.  హే విభో-జగద్రక్షకా  తే కటాక్షవ్యాపార-నీకృపాకటాక్ష ప్రసరణముచే  మాం-నన్ను  పాతుం-రక్షించుము.  నేను పాహి పాహి అని ప్రర్థిస్తాను.నీవు పాతుం పాతుం అంటు రక్షిస్తాఉ.  శివా,నన్నే కాదు,నా నుదుటను దీనావస్థను లిఖించిన ఆ బ్రహ్మను సైతము రక్షించుము.కినికి తలలను తీసివేయకుము. శిరః చతుష్టం సమ్రక్యం-నాలుగు తలలను వాటి పనులను చేసుకోనిమ్ము.  నేను ఆయన వ్రాతను నిందించానని ఆయనపై ఆగ్రహించకుము.  బహిశా స్వార్థము తనరూపును మార్చుకుని పరమార్థమును చేరే ప్రయత్నమేమో.  దీ...

NA RUDRO RUDRAMARCHAYAET-5 ( SIVAANAMDALAHARI)

Image
 శ్లో : ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్-ధ్యాన-విముఖాం దురాశా- భూయిష్ఠామ్ విధి-లిపిమ్-అశక్తో యది భవాన్ శిరస్-తద్-వదిధాత్రం న నఖలు సువృత్తం పశు-పతే కథం వా నిర్-యత్నం కర-నఖ-ముఖేనైవ లులితమ్  కృపణులను రక్షించే కృపాళువుగా ప్రార్థించిన భక్తుడు స్వామి తనను రక్షించుతలో ఉపేక్షతో నున్నాడన్న తలపును ప్రస్తుతశ్లోకములో వివరించుచున్నారు.  ఓ శివా!  కిం -ఎందుకు  న హరసి-తొలగించుకున్నావు?    వేనిని అనగా  విధిలిపిం-బ్రహ్మ నా నుదుట వ్రాసిన వ్రాతను.  అంతేకాదు నన్ను అనుగ్రహించుటలో నీ జాప్యమునకు కారణము, 1.నీయొక్క ధ్యాన విముఖత్వము 2.దురాశాభూయిష్టము అను రెండు విషయములు కావచ్చును.కాని  నేనలా ఉండుటకు బ్రహ్మ నా నుదుటవ్రాసిన పాపకర్మల ఫలితము తక్క మరొకటికాదు.  నా ప్రవర్తనకాదు.శివా నీవు నాతో దానికి అశక్తము మమ-నేను అసక్తుడను కనుక ఉపేక్షించుచున్నాను అందువేమో,  కాని,అందులకు విరుద్ధమైన నీ పరాక్రం  సువృత్తములను నేను వినియుంటిని.  శంభో! నీవు నిః యత్నం-ప్రయత్నించకుండగనే కర-చేతుల-నఖ-గోర్ల ముఖ-చివరలతో  కొనగోటితో, లులితం-ఖండించితివి   ఖండించినది స...

NA RUDRO RUDRAMARCHAYAET-14(SIVAANAMDALAHARI)

Image
 శ్లో : ప్రభు స్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశు-పతే ప్రముఖ్యో(అ)హం తేషామ్-అపి కిమ్-ఉత బంధుత్వమ్-అనయోః త్వయైవ క్షంతవ్యాహ్ శివ మద్-అపరాధాశ్-చ సకలాః ప్రయత్నాత్-కర్తవ్యం మద్-అవనమ్-ఇయం బంధు-సరణిః  అ సంబంధమును మరింత స్పష్టము చేయుచు,పరమబంధు అని స్వామిని సంబోధిస్తూ,బంధు సరణి అని బంధువులను రక్షించే విధానము అని గుర్తుచేస్తూ,బంధుత్వం అనయో-మనమధ్యన నున్న బంధుత్వము కిముత-మళ్ళీ మళ్లీ గుర్తుచేయవలసివస్తుంది.ఎందుకంటే, ఆకలి-ఆహారము దప్పిక-జలం చీకటి-వెలుతురు జీవము-దైవము  పరస్పరాశ్రితములో అదేవిధమైన సంబంధమొకటి మన మధ్యన కలదు.అది ఏమిటంటే, త్వయేవ క్షంతవ్య-స్వామి నీయొక్క క్షమాగుణము మత్-నన్ను అనవదం-రక్షించునునని సకలాః ప్రయత్నాత్-ఏ విధముగా నైన  హే పశుపతీ!  నీవు ధర్మ నిరతిని వివరించినప్పటికిని,నేను సంసారభ్రాంతిలో సర్వమును మరిచి,అపరాధములను ఒకటి కాదు/రెండు కాదు/లెక్కలేనన్ని చేసితిని.అయినప్పటికిని  అతిదీనత్వముతో నున్నవాదను నేను  అతి దయాళువు నీవు  అపరాధిని నేను  అపరాధక్షమయే నీవు  లోక బాంధవా, మన మధ్య సంబంధము దేహమునది కాకపోవచ్చును.అయినప్పటికిని జగత్పితా నీవు సృష్టించిన చరాచర...

NA RUDRO RUDRAMARCHAYAET-13(SIVAANAMDALAHARI)

Image
  శ్లో :  అసారే సంసారే నిజ - భజన - దూరే జడ ధియా భ్రమన్తం  మామ్ - అంధం పరమ - కృపయా పాతుమ్ ఉచితమ్ మత్ - అన్యః కో దీన: - తవ కృపణ - రక్షాతి - నిపుణః   త్వత్ - అన్యః కో వా మే త్రి - జగతి శరణ్యః పశు - పతే     13 ఆదిశంకరులు అసార సంసారమును గురించి, "పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే " అని ఏవిధముగా నిస్సారమో తెలియచేసారు. ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు అవలక్షనములను చెబుతూనే వాటిని అర్హతలుగా భాసింపచేస్తున్నారు. ఇక్కడ రెండు పూర్తి విరుద్ధ భావములు ఒకటి ప్రకాశకత్వమునకు-మరొకటి అంధకారత్వమునకు ప్రతీకలుగా చెబుతున్నారు. భక్టుడు ఈ విధముగా తన అసమర్థలను చెబుతూ,దానిని నివారించగలిగిన శక్తి పరమేశ్వరునకు తక్క వేరెవరికి లేదని విన్నవించుకొనుచున్నారు. భక్టుడు-చైతన్యరహితుడు కాని భగవంతుడు -అజడుడు-సంపూర్ణ చైతన్యము. భక్తుడు-కృపణుడు-తన స్వస్వరూపమును తెలిసికొనలేని స్థితిలో నున్నవాడు-భగవంతుడు సమస్తము స్వస్వరూపముగా కలవాడు. భగవంతుడు కృపయ ధియ-కృపతో రక్షించు సుమనస్కుడు భక్తుడు కృపణుడు-భగవంతుడు కృపయనిపుణుడు. భక్తుడు పశువు-అనగా పశ్యంతీ త...

NA RUDRO RUDRAMARCHAYAET-12(SIVAANAMDALAHARI)

Image
  శ్లో :  గుహాయాం గేహే వా బహి: - అపి వనే వా ( అ ) ద్రి - శిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ సదా యస్యైవాంతఃకరణమ్ - అపి శంబో తవ పదే స్థితం చేద్ - యోగో ( అ ) సౌ స చ పరమ - యోగీ స చ సుఖీ 12 ఆదిశంకరులు అనన్యాశ్రయభక్తి మహిమను వివరిస్తూ,ఉపాధికాని,వయసు/ఆశ్రమముకాని ఆత్మాశ్రయభక్తికి అవరోధము కానేకాదను విషయమును మరింత స్పష్టము చేస్తు ప్రదేశములలో వైవిధ్యము సైతము సర్వాంతర్యామి అనుగ్రహమునకు అడ్దంకులు కానేకావనుచున్నారు. సర్వజ్ఞునకు సమయము-స్థలము నిరోధములు కావు అను అంశమును నొక్కి వక్కాణించుతు, కొండ గుహలలో నున్నగాని,స్వగృహములో నున్న గాని,వనములలో నున్నగాని,పర్వతశిఖరాగ్రమున నున్నగాని అంతేకాకుండా, జలములోగాని,అగ్నిలోగాని నున్నను స్వామి కరుణను పొందుటకు కంటకములు కావుకద శివా! మాణిక్యవాచగర్ మనకు అందించిమ్న పెరియపురాణ కథలు అందులకు చక్కని నిదర్శనము. ఆదిశంకరులు మనకు యోగము గురించి,పరమయోగి ప్రసాదగుణమును గురించి ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.ఒక విధముగా చెప్పాలంటే భిన్నత్వముగా మనకు గోచరించుదానిలో నిక్షిప్తముగా దాగిని ఏకతమును గుర్తించగలుగుటయే సాధన. మనలో నిరతము కదలాడుతూ...

NA RUDRO RUDRAMARCHAYAET-11(SIVAANAMDALAHARI)

Image
  శ్లో : వటుర్వా గేహీ వా యతిర్ - అపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్ - భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్ - పద్మం యది భవ - అధీనం పశు - పతే తదీయ: - త్వం శంభో భవసి భవ భారం చ వహసి       11 గభీరే కాసారే శ్లోకములో హృత్పద్మ సమర్పనమును గురించి,దానికి ఏ ఉపాధియైననౌ అర్హతగలిగినదే అని వివరించిన ఆదిశంకరులు,ప్రస్తుత శ్లోకములో నరత్వమును-మానవ ఉపాధియొక్క నాలుగు దశలను ప్రత్యేకించి వివరిస్తున్నారు.వాటిలో ఏ ఆశ్రమములో ఉన్నప్పటికిని ఈశ్వరానుగ్రహమునకు పాత్రులే అని వివరిస్తున్నారు. ఎందుకంటే, యదీయం హృత్పద్మం తవదధీనం కనుక హేశంభో! భవభారంచ తదీయం వహసి నా భారమును మోయువాడవు నీవు కనుక నా ఉపాధి బ్రహ్మచర్యములోనున్న,గృహస్థుగా నున్నను,వానప్రస్థములో నున్నను,సన్యాసిగా నున్నను ప్రతిబంధకము కాదు. యః కశ్చి-నేను ఉన్న ఆశ్రమము ఏదియైనను నీమీది అపారమైన భక్తి నన్ను విచలితము కానీయదు,  ఆత్మానాం గిరిజపతే-మనసునిండా పరమేశా నీవు నిండియున్నప్పుడు, అనన్యః చింత...యోగక్షేమ వహామ్యహం.అన్నట్లుగా ,నా భవభారమును మోయుటకు,పరిహరించుటకు నీ అనుగ్రహము సంసిద్ధముగా నున్న వేళ నాకేల ఇతర చింతలు?  ప్రస్తు...

NA RUDRO RUDRAMARCHAYAET-10 (SIVAANAMDALAHARI)

Image
  నరత్వం దేవత్వం నగ - వన - మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది - జననమ్ సదా త్వత్ - పాదాబ్జ - స్మరణ - పరమానంద - లహరీ విహారాసక్తం చేద్ - హృదయం - ఇహ కిం తేన వపుషా     10 ఆత్మనివేదనము గురించి పుష్పార్థం అంటూ మనకు తెలియచేసిన ఆదిశంకరులు,ప్రస్తుత శ్లోకములో స్మరణభక్తి విశేషములను వివరిస్తూ,ఉపాధి ఏ విధముగాను భక్తికి-భగవదనుగ్రహమునకు అడ్దురాదని,కావలిసినది పాప-పుణ్య ఫలములే యని మనకు వివరిస్తున్నారు.దానికి నిదర్శనముగా అనేకానేక ఉపాధులలో నున్నప్పటికిని,ముక్తిని పొందిన, నరత్వం-మానవ ఉపాధిని, దేవత్వం-దైవ ఉపాధిని, నగ మృగత్వం-కొండలలో చరించు మృగ ఉపాధి వన మృగత్వం-అడవులలో చరించు మృగ ఉపాధి సాధు జంతువులు-కౄరజంతువులు లేళ్ళు-పులులు మశకతం-దోమ ఉపాధి కీటత్వం-క్రిమి ఉపాధి విహగత్వం-పక్షి ఉపాధి అని చెపుతూ,శివా నిరంతరము నిన్ను స్మరిచగలిగినపుడు ఇహ కిం తేన వపుష- ఏ ఉపాధిలో నున్నప్పటికిని హృదయం విహారాసక్తం-మనసు నీ ధ్యానమనే ఆనందపు అలలతో పాటుగా తేలియాడుచున్నప్పుడు అంటూ ఆత్మతత్త్వమును అర్థము చేసుకొమ్మంటున్నారు. "పుణ్యేన యాతి దేవత్వం-పాపేన నారకే తనుం ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుషం" బాహ్య ఉ...