Posts

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

Image
  ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥  ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.  జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.  1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.  ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.  ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.  కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.  కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.    హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.  సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.  జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్న...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

Image
  రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥  ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.  ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.  మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.  అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.  ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.  ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.  అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు  సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా   కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.   అంతే కాకుండ  వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.  వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాద...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03

Image
   కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.  అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.  రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.  రఘువంశ కులదైవము సూర్యభగవ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(UPAGAMYAA AGASTYO)-02

Image
  దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః   ప్రస్తుత శ్లోకములో రెండు పాత్రలు ప్రవేశింపబడినవి.అవి, 1.అగస్త్య మహాముని 2.దేవతలు.  ఇంకొక విశేషము మొదటి శ్లోకములో యుద్ధమునకు సిద్ధముగా సమీపించిన రావణుని ప్రత్యర్థి రామచంద్ర ప్రభువుగాను పేర్కొనబడినది.  రాముడు భగవానుడు.  రామునికి ఉపాగమ్యా-సమీపమునకు వచ్చినవాడు ఋషి అగస్త్యమహాముని.  ఇంకొక విచిత్రము ఈ యుద్ధమును వీక్షింపచేయుటకు అగస్త్యుడు దేవతలందరిని తనతో కలుపుకొని/కూడి వచ్చెను.  అగస్త్య-గమ్య అగస్త్యుడు వచ్చెను.  అగస్త్య సమాగమ్యా-అగస్త్యుడు-దేవతలతో కలిసి వచ్చెను.   వచ్చిన అగస్త్యుడు  రామం ఉపాగమ్యా-రాముని దగ్గరకు సమీపించెను.   అంటే రామునికి అగస్త్యమహాముని ఆదిత్యహృదయమును ఉపదేశించునపుడు మిగిలినవారు వినలేదా/యుద్ధము జరుగలేదా అను అనుమానములు కలుగ వచ్చును.  అది సామాన్యమైన రామ-రావణ యుద్ధము కాదు.అంతా నిమేషము-రహస్యము-రమణీయము.  అంతే కాదు అభ్యాగతో అన్న పదం ప్రయోగించబడినది.అంటే వారు అనుకోకుండా,తిథి-వార-నక్షత్రములను గమనించకుండా వచ్చే అతిథులు కారు.ఎప్పుడెప్ప...

ANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01

Image
  తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥   ప్రస్తుత శ్లోకములో మహర్షి అనుగ్రహించిన పదములు,    తత్-ఆ  యుద్ధము,సమరము,చింత-అగ్ర-దృష్టి,రావణ-స్థితం-సముపస్థితం.పరిశ్రాంతం మొదలగునవి.  రావణ-అను ఒక్క నామము మాత్రమే చెప్పబడినది.  సమరము-యుద్ధము-పరిశ్రాంతము-దృష్ట్వా-(చూచెను)స్థితం-సముపస్థితం   అను క్రియా పదములు(పనుల) గురించి చెప్పబడెను.  అగ్రతో-పైకి,పరి-మిక్కిలి,విశేషములను చెప్పబడినవి.  రావణం చ-అనగా రావణునితో కూడి యున్నది ఆ యుద్ధరంగము అని,చ అను భూతకాలమును అన్వయించుకుంటే ఈ యుద్ధము ఎప్పుడో జరిగినది అని రెండు విధములుగా భావించవచ్చును.కాని రావణునికి ఎవరికి మధ్యన ఈ యుద్ధము జరిగినదో ప్రత్యేకించి చెప్పలేదు.  సమరే చింతయాస్థితం-అన్నారు మహర్షి.  యుద్ధమును గ్య్రించిన ఆలోచనలతో నున్నారట. అంటే ఇరుపక్షములవారా లేక కేవలము రావణుడు మాత్రమేనా అన్న సంసయము కలుగవచ్చును అజ్ఞానమునకు.  రావణ ప్రసక్తి వచ్చినది కనుక లంకలో యుద్ధము జరిగినదనుకొనుటలో తప్పులేదు.  కాని నిలకడలేని ఆలోచనలు స్థిరముగా నున్నవట.ఇది ఒ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO

Image
         ఆదిత్యహృదయము         *************  "ఏకం సత్ విప్రా బహుధా వదాతి"    వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము"  అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.  కథాకథన ప్రకారముగా,  దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.   మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.   పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.  తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.    అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".  పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆ...

SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15

Image
  పూజావసానసమయే దశవక్త్రగీతం యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే | తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.  ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.  కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.   స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.  తన స్వస్వరూపమును అర్థముచ...