Posts

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09

Image
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః    ప్రతి స్తోత్రము పూర్వము-పరము అను రెండు కొసలను కలుపుటకు సంగతి అను నడుమనున్న విషయములను ప్రస్తావించును.అదేవిధముగా ఆదిత్యహృదయ స్తొత్రము ఉపెద్ఘ్హ్తమను పూర్వభాగమును పఠించు అవశ్యకతను పూర్వభాగములో తెలియచేసినది.తరువాత సంగతిగా స్వామి యొక్క కిరనవ్యాపకత్వమును-లోక పాలకత్వమును తెలియచేయుచున్నాది.   ప్రస్తుత శ్లోకము గౌణ నామములైన బ్రహ్మ-విష్ణు-శివ-స్కంద-ప్రజాపతి-మహేంద్ర-ధనద-కాల-యమ-సోమ అను నామ విశేషముల ద్వారా స్వామి మనలను ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడో మరింత స్పష్టము చేస్తున్నది.  ఏష-బ్రహ్మ-నీవే బ్రహ్మ రూపములో దాగిన అంతర్యామివి.    బృహత్వాత్-బ్రహ్ణత్వాత్-ఇతి బ్రహ్మ  ------------------------  అన్నింటికన్నా ఏది ఉత్కృష్టమో అది బ్రహ్మము.అదియే బృహతత్త్వము.అన్నింటియందు ఏది వ్యాపించి యున్నదో అంతర్యామిగా అదియే బ్రహ్మణత్వము.బ్రహ్మణత్వము ను ప్రకటించువాడే బ్రహ్మ.సర్వజీవులయందలి ఆత్మస్వరూపమే బ్రహ్మము.స్థావర-జంగమ స్వరూపముగా భాసించుచున్నది బ్రహ్మము.తాను కదలకుండా యుండి అన్నింటిని కదిలించు ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ESHALOKAAN PAATI)07

Image
  సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥  ప్రస్తుత శ్లోకములో" ఏష" అను శబ్దము స్వామియొక్క అంతర్యామి తత్త్వమును వివరించుచున్నది.   మరియును స్వామి యొక్క లోకపాలకత్వమును ప్రతిబింబించుచున్నది.  సర్వ-అన్ని-సమస్త-  దేవగణాన్-దేవతా సమూహములలో  ఆత్మన్-అంతర్యామిగా నుండి వారిచే ప్రకటింపబడుతున్నది  దేవ-అసుర-గణాన్   సత్వ-రజో-తమోగుణములుగా ప్రకటింపబడుతున్న వానిలోదాగినది  ఏష-నీవే-ఏకైక ఛిత్శక్తివి.అనుపమానమైనది.  శ్రీ లలితారహస్య సహస్రనామములో చెప్పబడినట్లు  'సమానాధిక వర్జితా"   హే పరమాద్భుత శక్తి!  నీతో సమానమైనది కాని-అధికమైనది కాని లేదు.  ఆ శక్తియే ఆదిత్యహృదయ స్తోత్రములో ఏష శబ్దముగా సంబోధింపబడి-సంభావింపబడుచున్నది.  ఏష దేవ  ఏష సర్వదేవ  ఏష సర్వదేవాత్మక  ఏష-దేవాసుర గణ-గుణ  ఏష-తేజః  ఏష-తేజస్వి  ఏష-రశ్మి  ఏష ఏస్మిభావన  ఏష-గ-గమనము  ఏష-భ-ప్రకాశము  ఏష-గభస్తిభిః-గమనముతో ప్రకాశమును కలిగించువాడవు.  చీకట్లను తొలగించువాడవు.   ఏష-లోకాన్ ...

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(BHASKRAM-BHUVANESVARAM)-07

Image
 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥  ఆదిత్యహృదయ ఉపోద్ఘాత-ఫలశృతి   అనంతరము అగస్త్యుడు ప్రస్తుత శ్లోకములో స్వామి యొక్క అతిశయ గుణవిశేషములను  మనకు అనుగ్రహించుచున్నాడు.  ఇదే విషయమును విశ్వామిత్రుడు, "కౌసల్యా-సుప్రజా రామా-పూరాసంధ్యా ప్రవర్తితే  ఉత్తిష్ట నరశార్దూల-కర్తవ్యం-దైవమాహ్నికం"  అని తెలియచేసాడు.  స్వామి యొక్క ఉదయము సముద్యంతం గా ప్రస్తుతింపబడుతున్నది.  స్వామి" సమ్యక్-ఉద్యంతి" సమస్త లోకములను-చరాచరములను జాగృతము చేయుచున్నాడు.నిద్రావస్థ నుండి చేతనావస్థకు తరలించుచున్నాడు.అంటే స్వల్పకాలిక లయమును ముగించుకొని  అనుష్ఠానమును ప్రారంభించవలసిన  సమయమాసన్నమైనదన్నమాట.   సూర్య భగవానుడు భువనములకు సంపదలను-ఈశ్వరత్వమును ప్రసాదించువాడు.కనుక భువనేశ్వరుడు.భువనములను పరిపాలించువాడు.  ఇక్కడ మనము స్వామి అనుగ్రహమును-మనము చేయవలసిన అనుష్ఠానము ఒకచర్యకు గల రెండు పార్శ్వములను తెలియచేస్తున్నారు.  స్వామి రశ్మిమంతుడు.అనగా తన కిరణ ములతో సకలచరాచరములను జాగృతము చేయుశక్తి కలవాడు.  సకలదేవతా చైతన్య సంకే...

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06

Image
  సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥   ప్రస్తుత శ్లోకములో ప్రవృత్తి-నివృత్తి అను రండుచిషయములు చెప్పబడినవి.అంటే కొన్ని సుగుణములను అనుగ్రహిస్తాడు-మరి కొన్నింటిని తొలగిస్తాడు ఆదియ్త్య రూపములో స్తుతింపబడుచున్న పరమాత్మ.  పాపము అనగా బుద్ధిని -విచక్షణను విస్మరించి ఇంద్రియలోలులమై ప్రవర్తించిన తీరుకు కలిగే ఫలితము.అవి మానసికము కావచ్చును-కాయకము కావచ్చును.వాటిని నాశనము చేసేది/పూర్తిగా తొలగించేది ప్రణాసనం-పరిపూర్ణముగా నిర్మూలించునది స్వామి స్తుతి.  అంతే కాదు చింత-ఆలోచనము-విచారము అను రెండు అర్థములలో చింత అను పదమును అన్వయించుకుంటే " యద్భావం తద్భవతి" అన్నట్లుగా  మన ఆలోచనాప్రవృత్తులను అనుసరించి వాటి ఫలితములు అనుసరిస్తాయి.  కనుకనే ధూర్జటి మహాకవి,  చింతాకంతయు చింత చేయరు కదా శ్రీకాళహస్తీశ్వరా అని స్వామి నిన్ను స్మరించరు మోహభ్రాంతితో అన్నాడు.  అదియే కనుక  సత్ చింతయ న శోక అని అన్వయించుకుంటే   సత్తు-చిత్తు యైన పరమాత్మను స్మరించిన-తత్త్వమును ఆలోచించినను శోకముండదు కదా అని కూడ భావింపవచ్చును.  ప్రస్తుత శ్లోకము...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

Image
  ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥  ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.  జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.  1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.  ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.  ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.  కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.  కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.    హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.  సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.  జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్న...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

Image
  రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥  ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.  ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.  మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.  అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.  ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.  ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.  అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు  సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా   కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.   అంతే కాకుండ  వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.  వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాద...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03

Image
   కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.  అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.  రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.  రఘువంశ కులదైవము సూర్యభగవ...