Posts

ADITYAHRDAYAM-SLOKAM-14

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-14  *********************  ప్రార్థన  ******** "జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై  ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును  వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా          స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత,  ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు.   శ్లోకము.   *****  " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః    జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః."   తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు. ...

ADITYAHRDAYAM-SLOKAM-13

Image
    ఆదిత్య హ్రదయం-శ్లోకం-13  ***********************   ప్రార్థన   *********  " జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."   పూర్వరంగము   **********  ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి,   ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు.  శ్లోకము  *******  'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః   తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే".   ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాదహనలను అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు.  అనుసరిస్త...

ADITYAHRDAYAM-SLOKAM-12

Image
      ఆదిత్యహృదయము-శ్లోకము-12    **********************    ప్రార్థన    ******  "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం   హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  **********  ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.  శ్లోకము  ******  " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః    కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."   భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,  " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం    ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం ...

ADITYAHRDAYAM-SLOKAM-11

Image
    ఆదిత్యహృదయము-శ్లోకము-11  ********************  ప్రార్థన  *******  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *********  పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు.  శ్లోకము  *****  " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః    ఘనవృష్టిః అపాం మిత్రో  వింధ్యవీధి ప్లవంగమః"   స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము.   స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు.    స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున ఋగ్వేదముగాను -మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అ...

ADITYAHRDAYAM-SLOKAM-10

Image
      ఆదిత్యహృదయం-శ్లోకము-10    ********************  ప్రార్థన  ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."   పూర్వరంగము   ***********  పరమాత్మ హరిత గుఋరములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షనము గావిస్తున్నాడో వివరిస్తున్నారు.   ఋగ్వేదము-వాల్మీకి రామాయనము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది.  శ్లోకము  ******  " హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః    అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాసనః"    రిగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ, 1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు.   ************************   హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిర...

ADITYAHRDAYAM-SLOKAM-09

Image
    ఆదిత్యహృదయం-శ్లోకము-09    *********************  ప్రార్థన  ******  ' జయతు  జయతు సూర్యం-సర్వ లోకైకదీపం    హిరణ సమిత పాపద్వేష దుఃఖస్యనాశం    అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."   పూర్వ రంగము   ***********   రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరనముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు.   ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న ,  మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూరెయశక్తియే అని స్తుతిస్తున్నది.  శ్లోకము.  ******  " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్    త్మిరః ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్"       పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు. అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమన...

ADITYAHRDAYAM-SLOKAMU-08

Image
     ఆదిత్యహృదయం-శ్లోకము-08    *******************  ప్రార్థన  *****  "జయతు జయతు సూర్యం-సప్తలోకైదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరనగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."   పూర్వరంగము   *********    పరమాత్మ రశ్మిభావనతో సముద్యంతుడై సకల చరాచరములను సృష్టించి-పోషించుటకు తన నుండి వివిధ శక్తివంతములైన కిరనములను ప్రసరింపచేస్తూ,వానికి సంకేత నామములను అనుగ్రహించి,మరికొన్ని సహాయక బృంద సక్తులను వాటికి ఏర్పరచి,తాను "వాయుర్వహ్ని ప్రజారూప" గా పరిఢవిల్లుతున్నాడన్న భగవాన్ అగస్త్యుడు,   ప్రస్తుత శ్లోకములో ఏ విధముగా ,  అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప నారాయణో హరిః అన్నట్లుగా హిరణ్యగర్భుడై విరాజిల్లుతూ,అనేకానేక దివ్యశక్తులను వెదజల్లుతున్నాడన్న అనుగ్రహమును అనేకానేక సాంకేతిక నామములో సంకీర్తిస్తున్నాడు.  శ్లోకము  ******  "ఆదిత్య సవితా సూర్యః ఖగ పూషా గభస్తిమాన్   సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా  దివాకరః."   ప్రస్తుత శ్లోకము స్వామి అనుగ్రహిస్తున్న శక్తుల సామర్థ్యమునకు సంకే...