Posts

SARVA SAmKSHOBHANA CHAKRAMU-PARICHAYAMU

Image
    "అష్టదళ కమలమందు నిష్ఠతో నీ ప్రతిమ నిలిపి    సృష్టికర్తవనువనుచు తెలిసి ఇష్తముగ సేవించుచుంటి      ఈశ్వరి నీకిదిగోమంగళం      త్రిపురంతకవాసిని దేవి నీకిదిగో మంగలం"    పరమేశ్వరి దయతో మనము అష్టదళ విలసితమైన సర్వసంక్షోభణ చక్రములోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడానంగశక్తులు గుప్తతర యోగినులుగా త్రిపురసుందరి సమేతులై విరాజిల్లుచున్నారు.  అమ్మవారిని లక్ష్మీ స్వరూపముగాకీర్తించేటప్పుడు,  అనంగ పాయనీ/అనంగపారగావీక్షణ శబ్దములు వింటుంటాము.   అనంగా అను శబ్దమునకు అవిభాజ్యము/అఖందము/అనంతము/అవిఛ్చిన్నము/ఆది-మధ్య-అంతరహితము అన్న భావముతో సమన్వయిస్తారు.  మనము ఇంతకుముందు "సర్వాశాపరిపూరక చక్రములో" కామాకర్షిణి మొదలగు గుప్తయోగినుల అనుగ్రహమును తెలుసుకున్నాము.  సామాన్యముగా ఆకర్షణ అనునది ఒక వస్తువుపైనగాని/ఒకమనిషిపైన కాని/ఒకప్రాంతమునందు గాని/ఒక సంఘటనమునందుగాని నిలిచి,కాలక్రమేణ తగ్గుతుంటుంది.అది ప్రాపంచిక విషయసంబంధమైతే పరిణితి చెందక ఉంటుండి.  కాని "సర్వసంక్షోభణ చక్రము"నందలి గుప్తతర యోగినులు అనంగులు.అపరిమిత శక్తి సంపన్నులు.వారి అనుగ్రహమ...

SARVASAPARIPURAKA CHAKRAMU-PARICHAYAMU

Image
    పరమేశ్వరి అనుగ్రహముతో మనము రెండవ ఆవరనమైన "సర్వాశా పరిపూరక చక్రము"లోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడ"త్రిపురేశి" చక్రేశ్వరి.పదహారు తిథినిత్యా దేవతల 'షోడశదల కమలము" గుప్తయోగినులతో,  "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా   శ్రీ- షోదశ అక్షరీ విద్యా త్రుకూట కామకోటికా" గా విరాజమానమై యుంటుంది.  పరమేశ్వరినిరుపప్లవ-అనగా వృద్ధి/క్షయములు లేని మోక్షస్వరూపము.అట్టి తల్లి మనలను అనుగ్రహించుతకై వృద్ధి/క్షయ స్వభావితములైన తిథినిత్యదేవతలతో విరాజమానమై మనలను అనుగ్రహించుచున్నది.   ఇది ఒక సంభావనమైతే.మరొక విధానములో 16 షోడశ ఉపచారములు-షోడశ సంస్కారములు-షోడశ అక్షరములు తానైనది షోదసదళాస్థిత యైనజగన్మాత.   అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ-  ఏ మార్పులు లేని త్వరిత కళను శిరోభూషనముగా ధరించిప్రకాశించునది.  ఈ త్వరిత కళ ఎటువంటి మార్పులు లేని "నిర్గుణ తత్త్వమునకు"ప్రతీకగా ప్రకాశిస్తుంటుంది.  గుణములు ఉపాధిని ఆశ్రయించి ఉండునుకాని ఆత్మను చేరలేవు.   షోడశ దళ పద్మములోని పదహారు రేకులను పంచభూతములు+పంచేంద్రియములు జ్ఞాన+పంచేంద్రియములు కర్మకు+ మనసుకు అన్వయిస్తారు.  ఇవి అంతర్ముఖమున...

TRILOKAMOHANACHAKRAMU-PARICHAYAMU-03

Image
   అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా      అని శ్లాఘిస్తున్నది పరమేశ్వరిని లలితారహస్య సహస్రనామ స్తోత్రము.   న-ఇతి,ఇది కాదు ఇదికాదు అంటూ ముందుగా చిత్శక్తి ని గుర్తించే విధానములో కానిదానిని గుర్తించి,తొలగించుకొనమని "కేనోపనిషత్తు"చెబుతోంది.   " శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా     శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా"   ఈ మానవ ఉపాధి ఎంత విచిత్రమైనది." ఆహార నిద్రా భయ మైథునశ్చాఅన్న నాలుగు అవసరములను తీర్చుకుంటూ,తన మనసును ఇంద్రియభోగములపై కేంద్రీకరించి,తన అవసరములు ఏ విధముగా తీరుతున్నాయి? ఎవరు తీరుస్తున్నారు? బాహ్యములో కనపడుతూనా/లేక అంతః ముఖముగానుండి  అనే ఆలోచన రానీయకుండా ఆజగజ్జనని మాయ తెరలను కప్పుతూనే ఉంటుంది.అంతలోనే దయాంతరంగయైవాటిని విప్పుతుంటుంది.   ఆ ప్రక్రియలో మనకు సులభముగా అర్థమగుటకై ఎన్నోరూపములను ధరించి,ఎన్నెన్నో స్వభావములతో,సహాయకారిగా    ఆశివప్రకాసమైన శివాని సర్వాభీష్ట సిద్ధికై,సర్వ మంగళకారిణిగా,ప్రకృతిగా/ప్రపంచముగా  తనను తాను ప్రకటించుకుని,  "ఆహో పూరిషికగా" ఆవిర్భావము చెంది వాటన్నింటికి మూలముగా/ఆధారముగా అలరారుచు...

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02

Image
   1-    అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.  కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.  స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.  అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.  చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు. నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు. 1.బ్రాహ్మీ 2.మహేశి 3.కౌమారి 4.వైష్ణవి 5.వారాహి 6.మాహేంద్రి 7.చాముండా     మహాలక్ష్మి,  యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,  ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడు...

TRILOKAMOHANCHAKRPARICHAYAMU --01

Image
  1-  "విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"   అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.   శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.  నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము "ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.  మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.  మన ఆలోచనలకు అనుగుణముగా/సులభ...

CHAKRESVARI-PARICHAYAMU

Image
   " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం    మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం    దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం    త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."    శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,  మహత్తు-అహంకారము  శివశక్తులు  స్థావర-జంగమము  ప్రకృతి-పురుషులు గా   ప్రకటింపబడుతూ,   పంచకృత్యాసక్తులై,  పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి, మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.  ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.   సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.  త్రిపురాను ఉపసర్గనుపొందిన,  1.త్రిపుర ...

AMGADEVIS-PARICHAYAMU-02

Image
   " హంస హంసాయవిద్మహే    పరమహంసాయ ధీమహి    తన్నోహంసః ప్రచోదయాత్"   హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.  పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.   షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.   పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.   దానినితొలగించుకొనినతరువాత,  ప్రతిశబ్దము  ఓంకారమే  ప్రతి దృశ్యము మమకారమే  పంచభూతములు స్నేహితమే  పంచకృత్యములు పరమార్థమే.    క్షణభంగురములకు తావులేదు.   సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్  సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు, 1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి  అరుణాం కరుణా తరంగితాక్షిమ...