Posts

TIRUPALLI ELUCHCHI-01

Image
       తిరుపళ్ళి ఎళుచ్చి-01       ****************  "కృపాసముద్రం  సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి.   సందర్భము.   ********  సాక్షాత్తుగా రుద్రరూపమే అయిన-స్వామి జన్మనక్షత్ర భాగ్యమును పొందిన-స్వామిచే పాలింపబడుచున్న "ఆరుద్ర" నక్షత్ర దర్శనము తరువాత పునీతులైన మన చెలులు శివనోమును తిరుపళ్ళి ఏళుచ్చితో ప్రారంభిస్తూ, స్వామి పుండరీక నేత్ర శోభను సంకీర్తిస్తూ తరిస్తున్నారు.       తిరుపళ్ళి ఎళుచ్చి-01 ********************* పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్ తిరుపెరుత్తురైయురై శివపెరుమానే ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె. ...... జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత. ********* పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద...

TIRUVEMBAAVAAY-20

Image
     తిరువెంబావాయ్-20    ***************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీవామభాగం   సదాశివం రుద్రం  అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి"   సందర్భము    ********   స్వామి మీద భక్తి వాత్సల్యముగా పరిణామము చెంది స్వామి పాదములకు మంగళాశాసనములను పలికింపచేస్తున్నది.   పాశురము   ******** పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్ పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్ పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్ పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్ పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్ పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్. సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః సత్కృతాయాశ్చ మంగళం ******************* సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు. భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును. అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీ...

TIRUVEMBAVAY-19

Image
  తిరువెంబావాయ్-19  *************  "కృపా సముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి"      సందర్భము    ***********  చిదంబరేశుని దివ్య పాదసేవనము తక్క అన్యము కోరక "శివనోమునకు" ప్రాతః కాలమున     మేల్కొని,దివ్యగుణవైభవమనే మడుగులో మునకలు వేస్తూ,ఆడుతూ-పాడుతూ,వారి భక్తిని సామీప్యమునకు చేర్చిన వీరు, పుణ్యవతులు ,సాలోక్యమును కోరుచున్నారు.  ఇంతవరకు తమలో తామే మాట్లాడుకొనిన వీరు మహాచతురులు.సమయస్పూర్తితో స్వామినే మూడు వరములను అనుగ్రహించమని వేడుకుంటున్నారు.అవి,శివభక్తునితో మాత్రమే వారి కళ్యాణము,శివార్చనమునకే వారి చేతులు,శివదర్శనమునకే వారి నయనములు.బాహ్యమును అధిగమించి తేజోమయమైన వారి త్రికరణములకు ఇప్పుడు సూర్యోదయ-సూర్యస్తమయములతో పనిలేదు.   పాశురము   ******** ఉన్ కయ్యర్ పిళ్ళై ఉనక్కే అడిక్కలం ఎన్రు అంగ పళంసోల్ పుదుక్కు ఎం అచ్చ్చత్తాల్ ఇంగళ్ పెరుమాన్ ఉనక్కొండ్రు ఉరేయ్ పోంగే ఎం కొంగై నిన్ అంబర్ అల్లార్ తోళ్ శేరక్క ఎంగై ఉన కళ్ళాదు ఎప్పడియుం శేయర్క కంగు...

TIRUVEMBAVAY-18

Image
    తిరువెంబావాయ్-18   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీవామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."    సందర్భము    **********  స్వామి పాదపద్మముల ప్రాభవించిన సౌభాగ్యశీలురు ఏ విధముగా విష్ణువు/బ్రహ్మ/తక్కిన దేవతలు స్వామి పాదార్చన కు జపతప/స్నాన-వ్రతాదులను ఆచరించుచున్నారో,అట్టి పాదార్చనమునకు స్వామి అవ్యాజకరుణతో తమకు అనుగ్రహించినాడు ఓ చెలీ! సీఘ్రమే మేల్కొని శివనోమునకు సిద్ధముకమ్మని చెబుతున్నారు.    ప్రస్తుత పాశురములో స్వామి నిరాకార-నిర్గుణ-నిరంజన స్వరూపమును సంకీర్తిస్తున్నారు.    పాశురము    ******** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు...

TIRUVEMBAVAY-17

Image
   తిరువెంబావాయ్-17  ***********  కృపాసముద్రం  సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృదిభావయామి."      సందర్భము  ధీయతే రక్షతే.ధీయతే పశ్యతే దీక్ష అంటుంది సనాతనము.ధీ అంటే బుద్ధి.దానిని చైతన్యపరచి ఉపాధిలోని స్వస్వరూపమును అందించగలిగే ఏకైక మార్గము.శివనోమును సంకల్పించి,ప్రాతఃకాలమునక ఒకరినొకరు మేల్కొలుపుచుకొనుచు,స్నానఘట్టమునకు చేరిన మన భాగ్యశాలురు నిన్న కృపావర్షమున మునిగి పునీతులైనారు.   ప్రస్తుత పాశురములో స్వామి పాదపద్మముల విశిష్టతను ,కారుణ్యమును సంకీర్తిస్తున్నారు.     పాశురము    *********  శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె  శంగమల పొర్పాదం తందరుళం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారముదై  నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్  పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ .  కొంగుం-కురల్-అరుళీ-నల్లని అందమైన-పరిమళభరితమైన కేశపాశము కల...

TIRUVEMBAVAY-16

Image
    తిరువెంబావాయ్-16   ***************  కృపా సముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం  పార్వతీవామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి"    సందర్భము    *********  సకలచరాచరములలో సర్వకాల సర్వావస్థలలోను శివనామస్మరణము తక్క అన్యము లేదను స్థితిలో నున్న తమ చెలిని ప్రస్తుత పాశురములో వానకురుస్తున్న విశేషములను,ఆ వాన సందర్భమున మెరుస్తున్న మెరుపులను,ఉరుముతున్న ఉరుములను,హరి విల్లును జగన్మాత సాకార రూపముగా దర్శిస్తూ,చెలిని మేల్కొలుపుచున్నారు.     పాశురము.     ********* మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ"   గోదమ్మ తిరుప్పావై నోములో "ఆళిమళై కన్నా" అంటూ వర్షప్రాశస్త్యమును మనకు అందిస్తే తిరు మాణిక్యవాచగరు "మున్ ఇక్కడల్ పుక్కి" అంటూ వర్షస్వరూపమునకు-సుధాసారాభివర్షమునకు అన్...

TIRUVEMBAVAY-15

Image
    తిరువెంబావాయ్-15   **************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి.    సందర్భము    **********   ఇప్పటివరకు మడుగు,మడుగులోని జలము,ప్రవహాము,తెల్లని కొంగలబారు,వికసిస్తున్న నల్లకలువలు,ఎర్రని పద్మములు సకలము శివానుగ్రహ సంకేతముగా భావిస్తూ,దివ్యమంగళ స్నానము చేస్తూ మాయను విడిచిపెడుతున్న వారి దృష్టిని వారిలో ఒకరైన ధన్యురాలి వింతప్రవర్తనము వైపునకు మరల్చాడు ఆ చిదంబరేశుడు.ఈ పాశురము నామసంకీర్తనా వైభవమును,నామికి-నామమునకు కల అభేదమును మనకు అందిస్తుంది.    పాశురము   ***********   ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్   "మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా   ...