SAUMDARYA LAHARI-43
సౌందర్య లహరి-43
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సంసార సాగరపు సారము గ్రహియింపనెంచి
అంధకార బంధురమౌ అజ్ఞాన మంథరమును ఉంచి
ఆశాపాశములను వాసుకి అని భ్రమించి
దైవాసుర గణములను చెరివైపున ఉంచి
నిలకడలేని మనసుతో చిలుకుట ప్రారంభించి
విషజ్వాలల విజృంభణకు నే వివర్ణమగుటను గాంచి
జాలితో హాలాహలమును హరింపగా హరుడు,మించిన
అంతర్మథనములో అమృతము జనించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
Comments
Post a Comment