ASYA ASTI ITI KASI@ KASI PAMCHAKAM-01



 " మనో నివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికాచ
   జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశీకాచ నిజబోధరూపా"

   పదవిభజనము


 
 మనోనివృత్తి-పరమ-ఉపశాంతి-సా-తీర్థవర్యా-మణికర్ణికాచ-జ్ఞానప్రవాహ-విమలాది గంగా-నిజబోధ రూపాచ-సా కాశికా.
 
 













 సా-దేనినైతే ఇది అని వర్ణించలేమో/ఏదైతే నామరూపములు లేనిదానిగా 
  కాశికా-కాశ/ప్రకాశ స్వభావముతో నున్నదో
    అది- ఆ మూలపదార్థము
 నిజబోధ రూపా-తన గురించి మన బుద్ధికి తెలియచేసే స్వభావముతో ఉన్నది.
 ప్రకాశము దాని రూపము
 ప్రబోధము దానిలక్షణము.ప్రవాహ రూపముగా  ప్రకటనమగుచు జ్ఞానమును  ప్రబోధనము  చేయుట దాని  ప్రత్యేకత.

చూడగలిగిన ఒక పుణ్య  క్షేత్రము

 చూపిస్తూ


అందులో సాక్షిగా నున్న మూలపదార్థమును దర్శింపచేయుట దాని ధ్యేయము.
    ఆ బోధనము ఐదు ప్రయోజనములను జీవులకు కలిగిస్తున్నది.


 1.మనో నివృత్తి
 2.ఉపశమనము
 3.మణికర్ణిక గట్టు పరిచయము
 4.ఉపశమనము
 5.ఆత్మబోధనము.
     
  బాహ్యమునకు కాశీపట్తనము మానసిక అలజడులను తగ్గిస్తుంది.తన గంగా శీతల జలప్రవాహము ద్వారా మనసును చల్లబరుస్తుంది.తన ప్రవాహ వేగముతో మనలకు మణికర్ణికా గట్టును పరిచయము చేస్తుంది.తలి చెవి ఆభరనమైన ఆ  గట్టు మన మొరలను విని,అడ్డంకులను దహించివేస్తుంది.పునీతమైన మనస్సు ఆత్మదర్శనమును పొందగలుగుతుంది.ఇది బాహ్య కాశీయాత్ర ఫలితము.

    జగద్గురు శ్రీ ఆదిశంకరులు ఈ అర్థమును పోలికగా మనకు చెబుతూ అంతర్ముఖ కాశీయాత్రను అనుగ్రహిస్తున్నారు.

   సర్వం శివమయం జగత్.
 ఏక బిల్వం శివార్పణం.



 1.

 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)