Posts

TANOTU NAH SIVAH SIVAM-22@SIVATANDAVASTOTRAMU

Image
       వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతః పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ     కథానుసారముగా పార్వతీపరమేశ్వరానుగ్రహమునక్సిఉ పాత్రుడైఉనకై అ రావణుడు వారికరుణమహిమయాయనునట్లుగా ,  మంగళాది-మంగలమధ్యాని-మంగళాంతాని అను సమొరదాయానుసారముగా జయధ్వానముతో ప్రారంభించి,మంగళ శబ్దమునుమధ్యనుంచి,శివః శబ్దముతో మంగళాంతము చేస్తూ స్తోత్ర ప్రస్తుత భాగమును ప్రారంభించాడు.   జయత్వదభ్ర విభ్రమ భ్రమద్ భుజంగ మశ్వస   ద్వినిర్గ మత్క్రమ స్పురత్ కరాల ఫాల హవ్యవాట్   ధిమిధిమి ధిమీధ్వనన్ మృదంగ తుంగ మంగళ   ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః       అభ్ర కాలములు ఆశ్చర్యముతో కదులుతూ తీస్తున్న శ్వాసలు జయజయధ్వానములుగా స్వామికి మంగళములు కలగాలని దీవిస్తున్నాయి.దానినిగమనించిన శివుని హవ్యవాహనుడు సైతము పైకుబికి పరవశిస్తున్నాడు.  ఇక్కడ కాలములను మనము కాలముగా కనుక అన్వయించుకుంటే స్వామి ప్రళయానంతర సృష్తిని సలిపి ఆ సృషికి కావలిసిన       పోషనమునకు తానే విష్ణువుగా ప్రకటింపబడుతూ హరి మద్దెల సవ్వడులకు అనుకూలముగా తన తాండవమును చేస్త...

TANOTU NAH SIVAH SIVAM-21@SIVATANDAVASTOTRAMU

Image
       " ఆంగికం భువనం యస్య-వాచకం సర్వ వాజ్మయం     ఆహార్యంచంద్ర తారాది తం  నమః సాత్వికంశివం."     అమ్మ అందించిన సకల కళల సమాహార మధూను తనివితీర గ్రోలిన స్వామి తాండవమును ప్రారంభించాడట అమ్మ లాస్యమును జతకలుపుతు.     స్వామి ఒకసారి తనుమరచు ఉప్పొంగు నాట్యమున     ఒకసారిమరపించు,     మరచి మరువక ఒకపరి,    ఓహో హోహో ఊహాతీతంబీ ఆనందము అంటున్నాడు రావణుడు.  (పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి నమస్కారములతో)    " స్వామి గలమున నున్న కాళములు ఆశ్చర్యముగా కదులుతు తమ శ్వాసలతో జయత్ జయత్ అంటున్నాయట.ఆ సంభ్రమ నాదమునకు పరవశయైన స్వామి ఫాలనేత్రము పైకుబికి పరవశసిస్తున్నదట.    ఇది జరుగుచున్న కథ.రావణునికి స్పురించిన దృశ్యము.     ప్రస్తుత భాగములో రెండు స్వామీనుగ్రహ విశేషములు సంకేతించబడినవి.    కిందటి భాగములో స్వామిగలము నల్లకలువగా  చల్లదనమునందించుచు ప్రపంచవికసనమునకు నాంది పలికినది.  స్వామి తాండవము సృస్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్య పరాయనము.స్వామి పదవిన్యాసము ప్రపంచ అవస్థా సంక...

TANOTU NAH SIVAH SIVAM-20@SIVATANDAVASTOTRAMU

Image
       " ఝణ ఝణ ఝణఝణం ఝణిత మథుర శబ్ద సంభరితం       తక తక తకిట తకిట లాస్యతాండవార్పితం       ధిమి ధిమి ధిమి ధిమితహృదయ మర్దన ద్వారం       ఖలు ఖలు ఖలు కణ్విత రుద్రభద్ర చరణరజం       అనుదిన గౌరీశంకర  పదాంభోజనివేదితం          (శ్రీ సామవేదం వారి)    ధ్యానం-వచనం-చరణం-పరమపదం-శివపదం.      పరమేశ్వరానుగ్రహము పదేపదే పలుకరిస్తుంటే,   ఎంతటిభాగ్యము, ఆభక్తాగ్రేసరుడు అమ్మనుచూడగలుగుతున్నాడు.తల్లిసర్వమంగళ.అంతేకాదు.దోషములు అసలు లేనేలనిది. ఆ జగజ్జనని తన కళలను సౌరభకుసుమములుగా విరగపూయిస్తూ స్వామిని అనురాగముతో చూస్తున్నది.ఆ శక్తి సృష్టించిన పుష్పముల మహిమలన్నీ మధువుగా మారుతూ మరింత మహదేవుని ఆస్వాదనమునకై ఆహ్వానిస్తున్నాయి.  మహదేవుడు కేవలము మధువును మాత్రమే స్వీకరించే మధూవ్రతి అయినాడు.మధురాతిమధురము ఆ మహదేవునికటాక్షము.    స్తోత్ర ప్రస్తుత భాగము పితరం జగతం వందే పార్వతీ పరమేశ్వరం ను దర్శింపచేస్తున్నది. మధువు-మధుపము-మధువ్రతము అన్నవి ముఖ్యాంశములు.  అమ్మ సర్వమంగళములన...

TANOTU NAH SIVAH SIVAM-19@ SIVATANDAVASTOTRAMU

Image
   వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతహ్ పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ.   కథా పరముగా మహాదేవుని నీలకంథరము ప్రళయానంతర సృష్టివికసనమునకు సంకేతముగా చైతన్య/చల్లదనపు కాంతులతో మనలను స్వామి కరుణకు మరింత చేరువచేస్తున్నది.  " ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలిమప్రభా    వలంబి కంఠకంథలీ రుచిప్రబద్ధకంథరం    స్మరఛ్చిదం పురఛ్చిదం భవఛిదం మఖఛ్చిదం    గజఛ్చిదాంధకఛ్చిదం  తమంతకఛ్చిదం "భజే"   కథాపరముగాసర్వమంగళ తనశక్తులనన్నింటిని/కళలనన్నింటిని పుష్పగుత్తిగా/కదంబమంజరిగా మలచినది.ఆ చేతిలో విరిసినపుష్పములు తమ మహిమలనే పరిమళములను ప్రసరిస్తూ/ప్రకాశిస్తూ పరమేశ్వరునికి భక్తి అనే మకరందమును నైవేద్యముగా సమర్పించుకొనుటకు పరుగులిడుచునవి.స్వామి పరమప్రీతితో తననుతాను మధుపముగా మలచుకుని మధువ్రతమునకు సిద్ధపడినాడు.కేవలము మకరందమును మాత్రమే స్వీకరించు నియమమును మధువ్రతమంటారు పెద్దలు.  " అఖర్వ సర్వమంగళా కళాకదంబ మంజరి    రస ప్రభావమాధురి విఝృంభణా మధువ్రతం    స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం    గజాంతకాంధకాంతకం తంతకాంతకంభజే"  ...

TANOTU NAH SIVAH SIVAM-18@SIVATANDAVASTOTRAMU

Image
    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      మహాదేవుని కరుణను మరింత స్పష్టము చేస్తూ నీలపంకజకాంతులు  ముచ్చతగొలుపుతున్నాయి తమ చల్లదనముతో.అంటే స్వామి గళమున నల్లగా అమరియున్నది కాలకూట విషమనుకున్న రావణుడు ఇప్పుడు ఆ నల్లతనమును చల్లదనమునందించుచున్న నల్లకలువల మాలగా దర్శించగలుగుతున్నాడు.  " ఇప్పటి దాకా నీ-నా సంబంధము    ఎప్పటిదో చెప్పలేనుగానీ"      ఓ పరమేశ్వరా! నీ కరుణను  " కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది(ఈ ఉపాధి)    ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"      అని అడిగిన రావణుని భాగ్యమే భాగ్యము.   స్వామి అనుగ్రహము నిత్యానిత్య వివేకమును కలిగిస్తున్నది విశ్వదర్శనమును చేయిస్తున్నది ఒక నాటక రంగస్థలమై.  1. ఆ జీవితనాటక రంగస్థలము నందు ప్రారంభముగా వచ్చాడు . స్మరుడు(మన్మథుడు).తన పంచబాణ ప్రయోగముతో ప్రపంచమనే వేదికను సృష్టించాడు.వసంత ఋతువు మామిడి చిగుల్లతో-కోకిలారవములతో,పచ్చదనముతో పరవశింపచేస్తున్నది ప్...

TANOTU NAH SIVAH SIVAM-17@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః శివః శివం-17     ******************  ' వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం"     మహాదేవ! తం భజేహం.   స్వామి,  " ఇప్పటిదా సామీ నీ-నా సంబంధము    ఎప్పటిదో చెప్పలేను గానీ    కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది    ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"  స్వామి నీకథరము నవీనమేఘమండలిగా భావించిన నాపై అనుగ్రహ వర్షము కురిపించినది.ఆ నల్లదనము కాలకూట విషమునదని కొందరి అభిప్రాయము.భగభగమని మండుతూ సకలమును దహించివేస్తుందట.నీ మూడో కన్నుతో పాటుగా,నీ కంఠమున నల్లగా నున్న గరళము సైతము     నడుమ వచ్చి వంచించిన నానా లౌల్యములను ఖండించుటకు మాత్రమే అనుమతినిస్తున్నావా ఓకృపాసింధు!  శివుని కరుణ అర్థముకానిదైనప్పటికిని అద్భుతమైనది కనుకనే అప్పుడే వికసిస్తున్న నల్లకలువల మాలయై చల్లదనమును వెదజల్లుతున్నది సర్వేశ్వరా.సదా భజామి.

TANOTU NAH SIVAH SIVAM-16@SIVATANDAVASTOTRAMU

Image
     తనొతు నః శివః శివం-16     *****************  "వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థా ప్రతిపత్తయే   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"     స్వామి అగ్నితత్త్వమును మనందరిచే దర్శింపచేసిన రావణుడు ప్రస్తుత శ్లోకములో స్వామి జలతత్త్వమును సంకీర్తించుతతో పాటుగా స్వామి అగ్నిసోమాత్మకమును హర్షాతిరేకముతో అందిపుచ్చుకుంటున్నాడు.    చరణము    *******  "   " నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్    "కుహు నిశీధినీ" తమః ప్రబంధ బంధుశేఖరః    నిలింప నిర్ఝరీధరః తనోతు కృత్తి సింధురః    కళానిధాన బంధురః శ్రియం జగత్ దురంధరః"    మహాదేవుని మహిమలను మరింత భక్తితో సంకీర్తిస్తున్నాడు రావణ బ్రహ్మ.  స్వామి తనోతు శ్రియం-స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.  స్వామి తనోతు శ్రియం జగత్-జగములన్నింటి యందు స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.       పరమేవ్శ్వరుడు రెండు తమోగుణ సంకేతములచే తనను తాను బంధించుకొని యున్నాడు.(అలంకారములుగా )    1.స్థిరరేఖను సైతము కనబడనీయని కొత్తగా ప్రక...