Posts

Showing posts from May, 2018

HAPPY BIRTHDAY-BALUGARU

Image
  పుట్టినరోజు జేజేలు  ***************   ప్రతిఫలమునకై చూడదు-ప్రజాసేవ వీడదు   అన్నార్తుల కడుపు నింపు అనురాగపు ఈ కోవెల    కోవెలను నిర్మించిన "కన్నతల్లి" పాదాలకు వందనం.  మధుమాసమునకై  ఆగదు-మావిచిగురు  అడుగదు  కొంగ్రొత్త  స్వరముల  కోటిరాగాల  ఈ కోయిల    మధురసమును వర్షించిన  "కన్నతండ్రి" పాదములకు వందనం.  అధికప్రసంగమంటుంది-అద్భుతములు చేస్తుంది  అభ్యాసముతో కూడిన  అంకితభావపు పదము    పదప్రవాహమందించిన  "గురువులకు" వందనం.    అందుకే గద  పండితారాధ్యుని  ప్రతిపాట నడక  పూదారి  ఆడంబరమసలెరుగని  సప్తస్వర  పూజారి   వీనులవిందు చేయుచున్న  "విద్వత్తుకు"  వందనం.  ఆర్యుల ఆశీర్వచనము-ఆత్మీయుల అభిమానము  స్వయంకృషి సంస్కారము త్రివేణి సంగమమై    "శ్రీరామ రక్ష" చుడుతుంటే, మీకు  "శతమానం భవతి"  బాలు గారు. .

MADHURAKAVI

Image
సంభవామి  యుగే యుగే  సాక్ష్యములు హరి సైన్యములు  ధర్మ సంస్థాపనమే  లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుక్కోవలూరులోని పుణ్య బ్రాహ్మణ దంపతులకు  విష్వక్సేనుని  అంశయె జన్మించెను  మధురకవిగ  వయసులో చిన్నయైన నమ్మాళ్వారును గురువుగ దలచెను  "వాలా ఇరుం" అనే దివ్య ప్రబంధమునే రచించెను  గురుభక్తికి-గురుశక్తికి గురుతర రూపము తానై  శంఖపీఠ పరీక్షలో విజయ శంఖమునే పూరించెను  పెరుమాళ్ళ  అనంతానంత ధనరాశుల భాండాగారముగ  అనన్య భక్తితో చాటెను ఆ నమ్మాళ్వారు మాహాత్మ్యము  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థముచాటి మధురకవి  పూజనీయుడాయెగ.  నమ్మాళ్వారు-మధురకవి విష్ణుతత్త్వమను నాణెమునకు రెండు వైపులుగా మనము భావింపవచ్చును.  రాతిని నాతిని చేసిన స్వామికొరకు రాయి నమ్మాళ్వారు మౌనమునకు భంగమును కలిగించి,లోకళ్యాణము చేయించగలను అని చెప్పకనే చెబుతూ మధురకవికి నమస్కరిస్తూ ,పెద్ద శబ్దముచేస్తూ క్రిందపడినది.అది మన నమ్మాళ్వారుకు నమోనారాయణ మంత్రమైనదో ఏమో,స్వామి ఆదేశమును పాలిస్తూ,జ్ఞాన కాంతులను నలుదిశలా వ్యాపింపచే...

NAMMAALWAR

Image
  అదివో-అలదివో-నమ్మాళ్వారు    ****************************  సంభవామి యుగే యుగే సాక్ష్యములు  హరి  పాదుకలు  ధర్మ సంస్థాపనమే  లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరునగరిలో కొలివీరి ఉదయనంగ  దంపతులకు  మారన్ గా ప్రకటితమాయెను శ్రీహరిశఠగోపురము  కనుతెరువడు-ఏడువడు-పాలను స్వీకరించడు  వింతగ చింతచెట్టు తొర్రలో పద్మాసనుడాయెను  ఉత్తర  దక్షిణ దిక్కుల ఉజ్జ్వలించు జ్యోతులుగ  మధురకవితో  ప్రథమముగ  మాటలాడినాడు  నాలుగు వేదములను తమిళ తిరుగ్రంథములుగ రచించి  నాలుగు దిక్కుల హరితత్త్వమును  అందించెగ   నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని   పరమార్థము చాటిన "నమ్మాళ్వారు"  పూజనీయుడాయెగ.   నమ్మాళ్వారు అంటే మన ఆళ్వారు.కురుగురుంగుడి గ్రామములో సంతానమునకు నోచుకోని కరి-ఉదయనంగై అను వెల్లాల దంపతులు,వారి క్షేత్రదైవమైన వామన మూర్తిని ప్రార్థించగా,ప్రసన్నుడైన స్వామి తన పాదుకలను (శఠారిని)వారికి పుత్రునిగా అవతరింపచేసెను.బాలుని దివ్యతేజమును గమనించి వారు వానికి "మారన్" అను పేరుపెట్టిరి.ఆళ...

TIRUMANGAI ALWARU

Image
 సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనయే లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుక్కరయులూరులో  తిరువాలి దంపతులకు  నీలుడుగా ప్రకటితమైనది శ్రీహరి శార్ఙము  శత్రువులకు  కాలుడుగా శౌర్యము వెలువరచుచు  పరకాలుడు అను పేరుతో ప్రసిద్ధుడైనాడు  అప్సరస కుముదవతిని అర్థాంగిగా కోరిన  అద్భుత పంచ సంస్కారములతో పునీతుడై  అతివమీది  ప్రేమతో ఆచరించుచున్న వ్రతము  పెట్టిన పరీక్షలే భక్తికి పెట్టని గోడలాయె  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొను  పరమార్థము చాటిన తిరుమంగై ఆళ్వారు పూజనీయుడాయెగ .   శ్రీహరి శారంగముతిరుకురైయలుర్ లో నీలం అను చోలరాజ్య సైన్యాధికారికి పుత్రునిగ అవతరించెను.తల్లితండ్రులు కలియన్ అను నామమును పెట్టిరి.సర్వసమర్థుడైన కలియన్ చోళరాజుని మెప్పించి,బహుమతిగా ఒక చిన్నరాజ్యముతో పాటుగా,పరకాల-కాలాతీతుడు అను బిరుదును పొందెను.ఆయనకు లభించిన రాజ్యపు రాజధాని తిరుమంగై.తిరుమంగై రాజధానిగా రాచకార్యములు సమర్థతతో నిర్వహించు కలియన్ తిరుమంగై గా కొత్తనామముతో ప్రసిధ్ధిపొందెను.   "నారాయణ నీ లీల నవరసభరిత...

TIRUPAANNAI ALWAR

Image
సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరిఆభరణములు  ధర్మ సంస్థాపనమేలక్ష్యమైన మన ఆళ్వారులు  ఉరైయూరులోని వరివెన్ను నుండి అయోనిజుడుగ  ప్రశంసలతో ప్రకటితమైనది హరి శ్రీవత్సపు అంశ(పుట్టు మచ్చ)  మాల దాసరి ఇంట గోక్షీరముతో  పెరుగుచు  విష్వక్సేనునిచే పంచకర్మ సంస్కారములనందినది  ఆలయ ప్రవేశము లేకున్నను, అద్భుత వీణాగానము  సారంగ ముని భుజమునెక్కి యోగివాహనునిగా చేసెను  పక్కకు తొలగలేదని ఆళ్వారును  రాళ్ళతో కొట్టగా  చక్కని భక్తిని  తెలుపగ స్వామి తాను భరించెనుగా  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము చాటిన  తిరుప్పాణాళ్వారు పూజనీయుడాయెగ. శ్రీ తిరుప్పాణాళ్వారు శ్రీహరి శ్రీవత్సపు 9ఎదమీది పుట్టుమచ్చ) అంశగా గానముతో-వాద్యవిశేషములతో స్వామిని అర్చించు పనర వంశమున,శ్రీ రంగపట్టణ సమీపమునందలి అలకాపురిలో అవతరించెను.తన ఆరాధనలతో పెరుమాళ్ గా ప్రఖ్యాతిగాంచెను. అంటరానితనమును అంటుకొనియున్న నాటి సమాజపు పెద్దలు తిరుపాణ ను ఆలయప్రవేశమునకు అనుమతించలేదు.అంతేకాదు వారు ఉపయోగించుకొను జలతీర్థములను తాకరాదని ఆంక్షలను విధించిరి.వారి...

KULASEKHARA ALWARU

Image
 సంభవామి యుగే యుగే-సాక్ష్యములు  హరి ఆభరణములు   ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు   చేర రాజవంశములో దృఢ మహారాజు పుణ్యము   పుత్రునిగ ప్రకటితమైనది శ్రీహరి  కౌస్తుభమణి   ముదలి ఆళ్వారుచే  పంచ సంస్కారములను పొంది   అవతారములలో  రాముని,అర్చావతారములలో వెంకటేశుని   నిరతము భాగవతులలో  దర్శిస్తూ-సేవిస్తూ   పెరుమాళ్ భక్తి  అనే  పెద్ద మడుగులోని చేపయై   జీవిత నాలుగుదశలను  జీవుడిగా  తరియిస్తూ   "కుల శేఖర పడి" పేరిట గర్భగుడి ముందర గడపగ   నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని   పరమార్థముచాటిన కుల శేఖర ఆళ్వారు పూజనీయుడాయెగ. శ్రీహరి కౌస్తుభమణి అంశయే చేరరాజుకు కులశేఖరునిగా అవతరించినది.స్వామిభక్తులలో సాక్షాత్తు స్వామిని దర్శించి-సేవించగలిగిన మహానుభావుడు.తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గర్భగుడి గదపగా,"కులశేఖర ఆళ్వారుపడి"గా నేటికిని స్వామిని సేవించుకుంటున్న ముకుందమాలను మనకు ప్రసాదించిన పెరుమాళ్ళు వీరు. జై శ్రీమన్నారాయణ.

TIRUMASAI ALWAAR

Image
అదివో అల్లదివో-తిరుమళిశై ఆళ్వార్  సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనయే  లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుమళిశై నగరములో కనకాంగి-భార్గవ మునికి  చిరు  మాంసపు ముద్దయాయె  శ్రీ హరి సుదర్శనము  లక్ష్మి-నారాయణుల అనుగ్రహము లక్షణ బాలుని సేయగ  పంకజవల్లి-తిరువాలన్ దత్త పుత్రుడాయె ధర్మమై  వృద్ధ దంపతులను కరుణించగ క్షీరమును సేవించి  కణి కృష్ణుని అనుగ్రహించె ఆనందమును కలిగించె  భక్తిసారుడు అనుపేర భగవత్తత్త్వమును చాటగ  తన మూడవ కన్నుతో ముక్కంటితో తలపడెగ  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము చాటిన తిరుమశై ఆళ్వార్ పూజనీయుడాయెనుగ. శ్రీవైష్ణవ సంప్రదాయం ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చక్రాయుధం, సుదర్శనం అవతారంగా భావిస్తారు. తిరుమళైశాయిలోని జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో భగవత్ కృపచే జన్మించారని నమ్ముతారు. తిరువాలన్, పంకయా చెల్వి అన్న పిల్లలు లేని, గిరిజన దంపతులు కట్టెలు కొడుతుండగా బాలుడిని చూసి, ఇంటికి తెచ్చుకున్నారు. దంపతులకు కనికణ్ణన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతను తిరుమళిశై...

ANDAAL AMMA

Image
 సంభవామి యుగేయుగే  సాక్ష్యము హరి కళత్రము  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు  శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా  పసిపాపగ  ప్రకటించబడినది తులసివనములో  విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు  వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో  గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది  తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది  చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది  రంగనాథుని దేవేరిగా  శ్రీరంగమున కొలువైనది  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థమును చాటిన ఆండాళ్ తల్లి పూజనీయురాలాయెగ.  ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే మన ఆండాళ్ తల్లి.తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించిన మహాపతివ్రత.ధర్మసంస్థాపనకై శ్రీవిల్లిపుత్తూరులో తులసివనమున అయోనిజగా ప్రకటించబడినది.చూడికొడుత్తాల్ అంటే తాను ధరించిన పూలమాలలతో స్వామిని ఆరాధించినది.ఆళ్వారులు పదిమంది అని వారు నారాయణుని దశావతారములు అని నమ్మువారు తండ్రి-తనయ లైన వీరిని ఒక అవతారముగానే లెక్కిస్తారు.పన్నెండు అను వారు వీరిని వి...

PERIYAALWAR

Image
 సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి వాహనము  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు  ధన్వినవ్య పురములో ముకుందాచార్య దంపతులకు  విష్ణుచిత్తుడుగ జనియించె గరుత్మంతుడ్  విశిష్టతను తెలియచేయు అష్టాక్షరి మంత్రము  వటపత్ర సాయికిచేయు పుష్పమాలా కైంకర్యము  వాక్కు స్వామి వరమైనది  వల్లభదేవునితో  విజయము  ఘనతను చాటుచు మధుర వీధులలో గజారోహణము  ప్రత్యక్షమైన స్వామికి దృష్టి తగులునేమో యని  ఏనుగు గంటలే తాళాలైన పల్లాండు ప్రబంధము  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని  పరమార్థముచాటిన పెరియ ఆళ్వార్ పూజనీయుడాయెగ. గరుత్మంతుని అంశతో శ్రీవిల్లిపుత్తూరునందు ముకుందాచార్యులు దంపతులకు పెరియాళ్వారు జన్మించారు.తల్లితండ్రులు ప్ర్ట్టిన పేరి విష్ణుచిత్తులు.చిన్నతనము నుండి అష్టాక్షరీ మంత్రమును అనవరతము మననము చేసెడివారు.స్వామివారి తోమాలాలచే ప్రభావితుడై,పుష్ప కైంకర్యముతో స్వామిని సేవించ దలచి,నిష్ఠగా పూమాలా కైంకర్యము చేయసాగెను.పాండ్యరాజు బ్రహ్మణోత్తముని వలన జీవిత పరమార్థమును తెలిసికొని,పరతత్త్వమును తెలియచేసినవారికి సువర్ణనాణెముల సంచిని బ...

PAEYAALWAR

Image
 అదివో-అల్లదివో-పేయ్  ఆళ్వారు  సంభవామి యుగే యుగే -సాక్ష్యములు  హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు  మైలాపురమున మణికైరవ బావిలోని ఎర్ర కలువ పుష్పములో  ప్రకటింపబడినది నందకము మైలపురాధీశునిగ  పిచ్చిభక్తికి సంకేతమైన మహాయోగి  ముక్తిని అందీయగ  'తిరండాల్ తిరువందాది" ని తీరుగ అందించెనుగ  జోరైన వర్షమున తలదాచుకొనుటకు తిరుక్కవలూరులో  అరుగుపైనముగ్గురితో పాటుగ చేరెను  నారాయణుడు  భక్తి వెలిగించిన దీపమనే  భగవంతుని రూపమును  దర్శించిన పొంగినవి కొంగు బంగారు స్తుతులు కరుణగ  నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థముచాటిన పేయ్ ఆళ్వారు పూజనీయుడాయెగ.   హరి నందకాంశము మైలాపూరులోని మణికైరవ బావిలోని,ఎర్రకలువ పుష్పములో పూదత్తాళ్వారు అవతరించిన మరునాడు ప్రకటితమాయెను.మహాద్భుతము.ఒకరి తరువాత ఒకరు,ఒకరోజు తరువాత ఒకరు.పేయ్ అను పదము తమిళభాషలో పిచ్చి అను అర్థమును తెలియచేయునది.మితిమీరిన హరిభక్తి తన్మయత్వపు చేష్టలతో నున్న వీరిని, అజ్ఞానులు పిచ్చివానిగా తలచి,పిలిచెడివా...

POODATTAALWAR

Image
 అదివో-అల్లదివో-పూదత్తాళ్వారు  ***************************** **  సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనమే- లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుక్కడల్మల్లె సముద్రతీరమున గల మాధవీపుష్పమున  ప్రకటింపబడినది కౌమోదకము బాలునిగ  భక్తికి సంకేతమైన భూతయోగి ముక్తిని అందీయగ  "ఇరండాల్ తిరువందాది" ని ఇలను ప్రసాదించెనుగ  మానసమె ఒక ప్రమిద, మాయని భక్తియె  తైలము  వివేకమె జ్వలనజ్యోతి ,వినయమె శరణాగతి  పురుషోత్తముని  ఆనతిని  శిరసావహించి పూదత్త  పురుషార్థములందీయ దివ్యదేశముల సంచరించె  నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము చాటిన పూదత్తాళ్వారు పూజనీయుడాయెగ. భూతయోగి గా సంకీర్తనలందు పూదత్తాళ్వారు వారు,పొయిగై ఆళ్వారు జన్మించిన మరుసటి దినమున,మహాబలిపుర సముద్రతీరమున,మాధవీ కుసుమమున,పెరుమాళ్ళు (గద) కౌమోదక అంశమున అవతరించినారు.పూత అనగా యదార్థము,ఆత్మ అను అర్థములు కల పదమని పెద్దలుచెబుతారు.వీరు యదార్థమైన స్వామిని నూరు పాశురములతో కీర్తించిన గ్రంథము " "ఇరణ్డాన్ ...

POIGE ALWAR

Image
అదివొ-అల్లదివొ--పొయిగై  ఆళ్వారు   ****************************** **   సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు   ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన  మన ఆళ్వారులు   యథోత్తకారి సన్నిధిని పుష్కరిణి స్వర్ణపుష్పమున   ప్రకటించబడినది పాంచజన్యము తిరుసంగు గ   జ్ఞాన సంకేతమైన  సరోయోగి ముక్తిని అందీయగ   ముక్త పదగ్రస్తమైన ముదల్ "తిరువందాయ్" తేనెలు చిందెగ   ప్రపంచము ఒక దీపము, ప్రజ్వలన తైలము సాగరములు   సంసారము  ఒక సాగరము ,సరంగు  ఆ పెరుమాళ్ళు   నామ సంకీర్తన దివ్యదేశములను పావనమొనరించె   శుభ సంకల్పము  విజయ శంఖమును పూరించెగ   నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని   పరమార్థము చాటిన పోగయి ఆళ్వారు పూజనీయుడాయెగ. పొయిగయాళ్వారు ముదలాళ్వారులలోని వాడు.తమిళములో పొయికై అంటే చెరువు.పుష్కరిణిలో తామర పుష్పములో అవతరించెను కనుక పొయికై ఆళ్వారుగా ప్రసిద్ధి చెందెను.వీరిని కాసార యోగి,సరోయోగి అని కూడ పిలుస్తారు.శ్రీ మహా విష్ణువు శంఖము పాంచజన్యమునకు అంశావతారమని భక్తుల విశ్వాసము.భగవద్దర్శనము లభించిన సమయమున పులకించి పాడిన నూర...

AMGEERASUDU NAANNA.

Image
 శ్లాఘించే సంతానమును చూడాలి అని,నమ్మి  శ్వాసించే బొమ్మను నాన్నకు అందించింది అమ్మ.  నాన్న ఇచ్చిన జ్ఞానముతో గాజుకన్ను చూస్తోంది  ఆఘ్రాణిత శక్తి నాసికను సుసంపన్నము చేస్తోంది  ఒదిగిన  వాక్శక్తి పెదవులతో పలుకరిస్తోంది  తథాస్తుగ మేథాశక్తి మధువులు చిలుకరిస్తోంది  చేవలేని విషయాలను చేయి చూపగలుగు తోంది  కాని పనులపై నేడు కాలుదువ్వ గలుగుతోంది  నా దశేంద్రియముల దిశానిర్దేశమే,నిరంతర  తన విద్యుక్త ధర్మముగా ఉద్యమించిన నాన్నను  గుండెగుడిలోని దేవునిగా గుర్తించలేని నేను  విజయోత్సవ సభలో విద్యుత్తు లేక,  మూగబోయిన  మైకును.

SIRIVENNELA

Image
   జన్మదిన శుభాకాంక్షలు   ******************  శ్రీ సీతారామ శాస్త్రిగారు  చేబ్రోలు  వినమ్ర వందనాలు వేలవేలు.  శారద నీరదతల్లికి గారపుబాలుడు ఇలను  సిరివెన్నెలలను కురిపించుట సిత్రమని అంటారా?    "చదువులతల్లి  పోలికేమో"  శ్రీ.సి.వి.యోగి తనయునకు ఇలను  అద్భుతయోగము ప్రాప్తించుట సిత్రమని అంటారా      "తండ్రిగారి పోలికయేమో"  శ్రీమతి సుబ్బలక్ష్మి తనయునికి,అబ్బురపు పాటలు సిత్రమా    " కన్నతల్లి పోలికేమో"  పూజ్యులు  శ్రీ సత్యారావుగారి శిష్యునికి,  జీవిత సత్యము చెప్పుట సిత్రమని అంటారా?    " గురువుగారి పోలికేమో"?  చిదానంద శివానంద కర్తకు,పది నందులు  సిత్తరమని  అంటారా?  "పరమేశ్వరుని పోలికేమో"  త్రిభువనముల శుభముకోరు సుకవికి, కలమును ఖడ్గముచేయుట   సిత్రమని అంటారా? "బహుశా ! సంస్కారపు పోలికేమో,"  కడలినే ఓడగ మలచు,ఘనకీర్తివరునికి ,నా పలుకులు       సిత్రమని అంటారా?    సిత్రముగాక మరేమిటి?  మనసు...