Posts

TIRUVEMBAVAY-18

Image
    తిరువెంబావాయ్-18   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీవామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."    సందర్భము    **********  స్వామి పాదపద్మముల ప్రాభవించిన సౌభాగ్యశీలురు ఏ విధముగా విష్ణువు/బ్రహ్మ/తక్కిన దేవతలు స్వామి పాదార్చన కు జపతప/స్నాన-వ్రతాదులను ఆచరించుచున్నారో,అట్టి పాదార్చనమునకు స్వామి అవ్యాజకరుణతో తమకు అనుగ్రహించినాడు ఓ చెలీ! సీఘ్రమే మేల్కొని శివనోమునకు సిద్ధముకమ్మని చెబుతున్నారు.    ప్రస్తుత పాశురములో స్వామి నిరాకార-నిర్గుణ-నిరంజన స్వరూపమును సంకీర్తిస్తున్నారు.    పాశురము    ******** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు...

TIRUVEMBAVAY-17

Image
   తిరువెంబావాయ్-17  ***********  కృపాసముద్రం  సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృదిభావయామి."      సందర్భము  ధీయతే రక్షతే.ధీయతే పశ్యతే దీక్ష అంటుంది సనాతనము.ధీ అంటే బుద్ధి.దానిని చైతన్యపరచి ఉపాధిలోని స్వస్వరూపమును అందించగలిగే ఏకైక మార్గము.శివనోమును సంకల్పించి,ప్రాతఃకాలమునక ఒకరినొకరు మేల్కొలుపుచుకొనుచు,స్నానఘట్టమునకు చేరిన మన భాగ్యశాలురు నిన్న కృపావర్షమున మునిగి పునీతులైనారు.   ప్రస్తుత పాశురములో స్వామి పాదపద్మముల విశిష్టతను ,కారుణ్యమును సంకీర్తిస్తున్నారు.     పాశురము    *********  శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె  శంగమల పొర్పాదం తందరుళం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారముదై  నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్  పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ .  కొంగుం-కురల్-అరుళీ-నల్లని అందమైన-పరిమళభరితమైన కేశపాశము కల...

TIRUVEMBAVAY-16

Image
    తిరువెంబావాయ్-16   ***************  కృపా సముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం  పార్వతీవామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి"    సందర్భము    *********  సకలచరాచరములలో సర్వకాల సర్వావస్థలలోను శివనామస్మరణము తక్క అన్యము లేదను స్థితిలో నున్న తమ చెలిని ప్రస్తుత పాశురములో వానకురుస్తున్న విశేషములను,ఆ వాన సందర్భమున మెరుస్తున్న మెరుపులను,ఉరుముతున్న ఉరుములను,హరి విల్లును జగన్మాత సాకార రూపముగా దర్శిస్తూ,చెలిని మేల్కొలుపుచున్నారు.     పాశురము.     ********* మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ"   గోదమ్మ తిరుప్పావై నోములో "ఆళిమళై కన్నా" అంటూ వర్షప్రాశస్త్యమును మనకు అందిస్తే తిరు మాణిక్యవాచగరు "మున్ ఇక్కడల్ పుక్కి" అంటూ వర్షస్వరూపమునకు-సుధాసారాభివర్షమునకు అన్...

TIRUVEMBAVAY-15

Image
    తిరువెంబావాయ్-15   **************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి.    సందర్భము    **********   ఇప్పటివరకు మడుగు,మడుగులోని జలము,ప్రవహాము,తెల్లని కొంగలబారు,వికసిస్తున్న నల్లకలువలు,ఎర్రని పద్మములు సకలము శివానుగ్రహ సంకేతముగా భావిస్తూ,దివ్యమంగళ స్నానము చేస్తూ మాయను విడిచిపెడుతున్న వారి దృష్టిని వారిలో ఒకరైన ధన్యురాలి వింతప్రవర్తనము వైపునకు మరల్చాడు ఆ చిదంబరేశుడు.ఈ పాశురము నామసంకీర్తనా వైభవమును,నామికి-నామమునకు కల అభేదమును మనకు అందిస్తుంది.    పాశురము   ***********   ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్   "మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా   ...

tiruvembaavaay-14

Image
    తిరువెంబావాయ్-14   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  ********  "గమాగమస్థం గమనాదిశూన్యం   చిద్రూపదీపం తిమిరాపహారం   పశ్యామి తం సర్వజనాంతరస్థం   నమామి హంసం పరమాత్మ రూపం.    ప్రస్తుత పాశురములో వారు చేయున్న స్నాన విశేషము,ఆ సమయమున వారి కేశములు,ధరించిన ఆభరనములు వదులుగా జరిగి శబ్దము చేయుట,వారి దివ్య సంకీర్తనము వారు సామీప్యభక్తి దశలో నున్నారని తెలియచేస్తున్నది.  పాశురము  ******** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... "నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం." యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్...

TIRUVEMBAVAY-13

Image
  తిరువెంబావాయ్-13  **************  "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  *********  శివనోమును సంక్ల్పించి,ఒకరినొకరు తన్మయావస్థ నుండి మేల్కొలుపుచుకొనుచు,స్వామి అనుగ్రహమనే మడుగులో మునకలు వేస్తూ,సకలము శివమే అను అనుభూతికి లోనవుతూ,మడుగు లోని జలము,కమలము,కలువ,హంసలు,వారు దర్శిస్తూ పొందుతున్న అనుభవమును మనకు తిరుమాణిక్య వాచగరు అందిస్తున్నారు.పురాకృత పుణ్యమే లేక పరమాత్మ అవ్యాజ అనుగ్రహమో వాటిని మనకు తెలియచేస్తున్నారు ఆ భాగ్య్శాలులు.   పాశురము   ********పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* శ్రీ దేవులపల్లివారికి సవినయ నమస్కారములతో, తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు...

TIRUVEMBAVAY-12

Image
     తిరువెంబావాయ్-12    ************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృదిభావయామి."    సందర్భము     ******   పరమాత్మను తక్క అన్యము దర్శించుటకు-కీర్తించుటకు ఇష్టపడని భాగ్యశీలురైన కన్నియలు శివనోమును ఆచరించుటకు స్నానఘట్తములోనికి ప్రవేశించి నీలలోహిత-బాలాంబిక అనుగ్రహమును మడూగులో దర్శించి కీర్తించుచున్నారు.   ప్రస్తుత పాశురములో కార్మిక-మాయక మలములు తొలగిపోయి-ఆర్ణవ మలమును సైతము ప్రక్షాళనము చేసుకొనుచున్నారు.మనకు సైతము సులభోపాయమును తెలియచేయుచున్నారు.  "పునరపి జననం-పునరపి మరణం-పునరపి జనని జఠరే శయనం" అన్న జన్మలచక్రములో పడి తిరుగకుండా కొండమీద నున్న మడుగులో స్నానము చేసే అనుగ్రహమును అందుకోకోబోతున్నారు.కనుకనే ఆ పుణ్యతీర్థము వారికి నటరాజస్వామిని దివ్యదర్శనమును ప్రసాదిస్తున్నది.   పాశురము   ్్్్్్్్ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శి...