Monday, January 31, 2022
LAMCHAM DANDAKAM.
థిస్ ఇస్ జుస్త్ ఫొర్ ఫున్.(నొత్ తొ బ్లమె అన్య్ ఒనె.)ప్ల్ ఎక్ష్చుసె స్పెల్లింగ్ మిస్తకెస్
"లంచం"దండకం
దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి,బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి.
ఓ విదుషీమణీ
మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై,
ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై,
మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై,
ఓ శుభలక్షణా
తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా
పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా
ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా
ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా
ఓ పరాత్పరీ
వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా
నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా
మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా
బీడుల-చివిటినేలల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా
అలివేణి కరుణామయి నీవు
తాత్సారపు వాత్సల్యమా
కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా
తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా
జతకూడననలేని
ఓ ఈప్సిత ప్రదాయినీ,మూఢులు
కాంచనంబొల్లకే ఇనుము కోరు చందంబునున్నారని
,
గ్రహింపచేసి,వారిని మార్చేసి,
మరికొందరు నిన్ను ఈతరులకు
ఉంచమని అందిస్తూ,లంచమని నిందిస్తూ,తుంచమని చిందులేస్తుంటే.
నీవు వారిని
....
సూతుడు శూరతనొందుట,శూరుడు నిర్వీర్యుడగుట(కర్ణుడు,ఏకలవ్యుడు)
వరవిక్రయ క్రయములు,పూర్ణమ్మ ఆక్రందనలు,మహరాణుల అరణ
ములు,విడిపోయిన భరణముల
వివరణలు కావాలంటూ ,చిరు మందహాసములు చిలికిస్తూ,నయగారములు ఒలికిస్తూ,నిలదీసినావమ్మా నీ చాకచక్యముతో
ఓ లోకేశ్వరీ
నిన్నెరుగ నేనెం
త వాడినమ్మా,నీ లీలలు ఎరుంగని నన్ను అవలీగా మన్నించి నాకు కనువిప్పు కలిగించి,బహు మెప్పు తరలించి,కొంగు బంగారమై,నన్నేలు ఓ కల్పవల్లీ నీవే సమస్తంబు,నమస్తే.నమస్తే,నమో నమ:.
YAMA AS DIKPALAKA
ధర్మ పరిరక్షకుడిగా ధర్మరాజు అని నియమపాలకునిగా (కఠిన )దక్షిణదిశాధిపతిగా ప్రపంచవ్యవస్థను పరిరక్షించేవాడు.సూర్యపుత్రునిగా వేదములప్రకారము కీర్తింపబడుచున్నాడు.
Saturday, January 29, 2022
AGNI AS DIKPALAKA
దక్షిణము-తూర్పు మధ్యభాగమైన ఆగ్నేయమూలాధిపతి మూడు చోట్ల మూడు రకములుగా వ్యాపించియుంటాడని ఇతిహాసము నమ్ముతుంది.
1భూమి మీద అగ్నిరూపముగాను
2పర్యావరనములో కాంతిరూపముగాను
3.ఆకాశములో సూర్య రూపముగాను విధులను నిర్వహిస్తుంటాడు అని వేదోక్తము.
అంతేకాకుండా ఒకచోట నున్న శక్తిని వేరొకచోటికి అనుకూలముగా మారుస్తూ అందచేసే నిపుణుడు అగ్ని.ఉపనిషద్ విజ్ఞాన రహస్యమును కూడా అగ్నిగానే గౌరవిస్తారు.
ఆద్యంతరహితుడైన జాతవేదుడు ఎన్నో తరములను దర్శించియున్నాడు.వారికి కావలిసిన శక్తిని తాను ముందు వహ్నిగా గాలితో పాటు సంచరిస్తూ,యజ్ఞయాగాదులందు దేవతలకు తనద్వారా హవిస్సులను అందచేస్తూ,తత్ఫలితములకు సహాయపడుతు ,వ్యర్థములను హుతముచేస్తూ జగత్ సంరక్షణమును చేస్తుంటాడు.
VAYU AS DIKPALA
పశ్చిమ-ఉత్తరదిక్కుల మధ్యన గల వాయవ్యమూలకు అధిపతిగా గంధవతి నుండి అడ్దంకులను తొలగించుచు,పంచభూత సమన్యమును కలిగించుచున్న వాయువు మరోపేరు అయిన "వాత" నామమునకు గుర్తుగా వాతావరణము అను పదము ప్రసిధ్ధికెక్కినదని పెద్దల అభిప్రాయము.
వేదోక్త ప్రకారముగా యజ్ఞ-యాగాదులలోని సోమరస ప్రథమ గ్రహీతగా వాయుదేవుడు కీర్తింపబడుతున్నాడు.
Thursday, January 27, 2022
INDRA AS DIKPALAKA
ఇదం ద్ర ఇంద్ర అన్నారు పెద్దలు.ద్ర గమనిస్తుందో-ఏది మన కదలికలను గమనిస్తుందో అది ఇంద్రుడు.దానికి కల సాధనములు ఇంద్రియములు.ఉత్తర దిక్పాలకునిగా కీర్తింపబడుతున్న ఇంద్రుడు గోచరముకాని మనలకు గోచరించుచున్న కదలికలకు కారణమైన బ్రహ్మపదార్థము.నింగి నేలకు సామరస్యమును కూర్చు సాధనము.
పురంధరునిగా ప్రస్తుతింపబడుచున్న నదీజలముల నడకకు కావలిసిన పరిస్థితులకు పర్వతములను నియంత్రిస్తూ,సూరెయకాంతిని అవరోధిస్తున్న ప్రతికూల పరిస్థితులను తొలగిస్తూ,స్థితికార్యమునకు సహాయపడుతున్న అద్భుత శక్తి కనుకనే 'వృత్రఘ్న" గా అడ్డంకులను అడ్డగించే ప్రజాపతి.
పురాణకథనము ప్రకారము ఐరావత వాహనుడుగా సచీసమేతుడై వజ్రాయుధమును ధరించి లోకసంరక్షకునిగా కీర్తింపబడుతున్నాడు.
Tuesday, January 25, 2022
KUBERA AS DIKPALAKA
కుబేరుడు
**********
ఇతిహాసములననుసరించి కుబేరుబి పులస్త్య ముని మనుమనిగాను,విశ్రవకుమారునిగాను భావిస్తారు.
వైశ్రావణ నామమును కీర్తిస్తారు.
కు బేర
బేరము అను పదమునకు శరీరము అను అర్థమును కనుక అన్వయించుకుంటే వికృత శరీరునిగా,మరుగుజ్జు రూపముతో,ధనరాశుల మూటను పట్తుకుని,పెద్దబొజ్జతో,పింగళాక్షునిగా సాకారతను వివరిస్తరు.
కు అను అక్షరమునకు భూమండలము అను అర్థమును స్వీకరిస్తే బేరుడు నాయకుడు గా మనము భూమండలమునకు సంపదలనొసగు నాయకునిగాను మనము అన్వయించుకోవచ్చును.
అలకాపురిని నివాసముచేసుకొని ఉత్తరదిక్భాగమునకు పాలకునిగా నున్న
కుబేరుడు మహాభారత కథనము ప్రకారముగా బ్రహ్మచే ధనాధిపతిగాను,శివమిత్రునిగా కామేశునిగాను,దుష్ట పరిహారకునిగాను వరప్రసాదితుడైనాడట.
నాగులను జయించిన సంకేతముగా ముంగిసపై కూర్చున్న విగ్రహములుకూడా మనకు దర్శనమిస్తుంటాయి.
విద్యాధరులు-కింపురుషులు-రాక్షసులు కుబేరుని సభకు విచ్చేసి,పరిపాలనలో అనుచరులుగా వ్యవహరిస్తారను నమ్మకము కూడా కలదు.ఎన్నో గుప్తశక్తులను నియంత్రిస్తుండుట వలన గుహ్యకాధిపుడుగా కుబేరుడు విష్ణుధర్మోత్తర పురాణ కథనము ప్రకారము అర్థమునకు మాత్రమే అధిపతిగా కాక అర్థశాస్త్రమునకు కూడ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు.
NIRUTI AS DIKPALAKA
నిరుతి దిక్పాలకురాలు/దిక్పాలకుడు ద్వంద్వమయములైన ప్రకృతిలోని దక్షిణ-పడమర మధ్య ప్రాంతములోని కృష్ణజ్ఞాన నగరమూ దీర్ఘాదేవి సహితుడు ఒక్కొక్కసారి అశ్వవాహనుడుగా/మరొక్కసారి నరవాహనునిగా దర్శనమిస్తుంటాదని పెద్దల అభిప్రాయము.
సంస్కృత భాష "నిరుతి" అను పదమును క్రమశిక్షణారాహిత్యము,అజ్ఞానాంధకారముగాను,అధర్మముగాను నిర్వచిస్తుంటుంది.
జ్యోతిష్య శాస్త్రము మూలానక్షత్రాధిపతిగా విశ్వసిస్తుంది.
పతనమునకు వాడు పదముగాను నిరుతిని విశ్వసిస్తారు.
మంచి-చెడుల మిశ్రమమున చెడును గుర్తించి,నిర్మూలనమునకు సహాయపడేవానిగాను సన్నుతిస్తారు.
Friday, January 21, 2022
VARUNADEVA
పశ్చిమాధిపతియైన వరుణుని పురాణములు కశ్యపప్రజాపతి కుమారునిగాను,వశిష్టుని తండ్రిగాను భావిస్తాయి.ఈయన నివాసమును శ్రధ్ధావతిగాను,శక్తిని వరుణిగాను కీర్తిస్తారు.మొసలి వాహనునిగా భావిస్తారు.
చుట్టుకొనుట అనే అర్థములో వరుణ పదమును భావిస్తే,భూమ్యాకాసములను చుట్తుకొనియున్నవాడు అని కూడా అంటారు.వీరి విభాగములు కర్తవ్యములు కాలానుగుణముగా మారే అవకాశమున్నందువలన,అంతరిక్షవిభాగమునకు అదనముగా జలవిభాగ నియంత్రనమును కూడా నిర్వహిస్తున్నట్లు శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
అంతరిక్ష జలవనరులతో పాటుగా-భూభాగముల జల సమృధ్ధికి ,నియంత్రణకు సమర్థునిగానుసన్నుతిస్తారు.
Thursday, January 20, 2022
ISHANA-VASUVU
ఈశానాయ నమః
*************
" ఈశానా సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం"
శుధ్ధస్పటిక సంకాశుడు,ఈశాన్యదిక్పాలకుడు ,అష్టవసువులలో ఒకడైన ఈశానుని,పంచబ్రహ్మలలో నొకరిగా ఐత్తరీయ అరణ్యకము కీర్తిస్తోంది.
వాక్ప్రదాతయైన ఈశానుని రూపము ఒకసారి స్వేతవృషభవాహన మూర్తిగా కొన్నిచోట్లను,పద్మాసన ధ్యానమూర్తిగా మరికొన్ని చోట్లను దర్శనమిస్తుంటుంది.
త్రిశూలధారిగా ఒకసారి/ఖట్వాంగధారియై మరొకసారి,గొడ్దలితో ఇంకొకసారి అవిద్యను ఖండిస్తూ,మన వాక్కును,శబ్దమును,శ్రవణమును సంరక్షిస్తుంటాడు.
విశ్వాత్మకుని వామనేత్రము నుండి ప్రభవించినట్లు కొందరి నమ్మిక.లింగపురాణము ఈశానుని సర్వాంతర్యామిగా సన్నుతిస్తున్నది.
ASHTA VASUVULU
"ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః"
పరబ్రహ్మము తూర్పుదిక్కునకు మహేందుని నామరూపములతో ఒక శక్తిని,తూర్పునకు దక్షిణమునకు మధ్యనున్న ఆగ్నేయ మూలకు అగ్ని అను ఒకశక్తిని,దక్షిణ దిక్భాగమునకు ధర్మ అను మరొక శక్తిని,దక్షిణమునకు పడమరకు మధ్యనున్న నైరుత మూలకు నైరుతి అను ఒక శక్తిని,పడమర దిక్కునకు ఆపః-వరున నామ జలశక్తిని,పడమర-ఉత్తర దిక్కునకు మధ్యనున్న వాయవ్య మూలకు అనిలః వాయు శక్తిని నిక్షిప్తపరచినాడు.
సూర్యోదయమునకు కలుగు అరుణోదయమున
ప్రత్యూషః-ప్రభాసః అను రెండు శక్తులను,ఉత్తర దిశవైపున ధృవ అను శక్తిని,సోమ అను (చంద్ర) శక్తిని అష్టవసువులుగా చెప్పుకుంటారు.
ఇంద్రోవహ్ని: పిత్రుపతి:నైర్రుతో వరుణో మరుత్,
కుబేర ఈశ: పతయః పూర్వాదీనాం దిశాంక్రమాత్.
ఇంద్రుడు (తూర్పు), అగ్ని(ఆగ్నేయం), యముడు(దక్షిణం), నిర్రుతి(నైరుతి), వర్ణుడు(పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) మొదలైన దిక్కులను పాలించే వారే అష్టదిక్పాలకులు.
Sunday, January 16, 2022
TIRUPALLI ELUCHCHI-10
తిరువెంబావాయ్-10
*************
బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం
పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి
శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్
తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం
అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై
పడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం
అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్
ఆరముదే పళ్ళి ఎరుందరుళాయ్
పరంజ్యోతియే పోట్రి
*********************
"శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః
అయే ధామాని దివ్యాని తస్థుః"
వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్య వర్ణః తమసః పరస్తాత్."
శివనోమును నిష్కళంకమనముతో నోచుకొనిన చెలులు మనతో
ఓ జీవులారా!
పరమేశుని అనుగ్రహముతో మేము ఇప్పుడు,
తమస్సునకు అవతలనున్న ప్రకాశ స్వరూపమును కనుకొనగలుచున్నాము.తద్వారా,
మేము చావు పుట్టుకలను చక్రము బారిన పడకుండా భవబంధ విముక్తులము కాబోతున్నాము.ఎందుకంటే,
దేహాభిమానమును వీడిన వెంటనే స్వస్వరూపమును తెలుసుకోగలముకదా.
సురలకు సైతము సాధ్యము కాని స్వామి సాంగత్యము -సంసేవనము -మనకు లభించబోతున్నదికదా.
ఆ పరమాత్మ పాద సంసేవనమునకై బ్రహ్మ-విష్ణు మిగిలిన దేవతలు సైతము మర్త్యలోకమునకు మరలుతున్నారు.
జంతూనాం నరజన్మ దుర్లభం
సులభోపాయముతో జీవాత్మను-పరమాత్మతో సంగమింపచేసే సోపానము.
అసలు ఇన్నిమాటలేల?
ఒక్క మాటలో చెప్పాలంటే,
మృణ్మయమూర్తి చిన్మయమూర్తిగా మారబోతోంది ఆ ఆత్మనాథుని అనుగ్రహముతో.
తరలిరండి-తరించండి.అంటూ
"తిరుపళ్ళి ఎళుచ్చి" మనలను తట్టిలేపుతున్నది.
గంగను జటలో బంధించిన గంగాధరుడు తన భక్తుని గొప్పదనమును ప్రపంచమునకు దాట దలచినాడో లేక
ప్రభువులో పరివర్తనమును కలుగచేయదలచినాడో కాని వైగైనది పరవళ్లతో పరుగులు తీస్తూ ఊళ్ళను ముంచేస్తోంది.
నీరైనా/నిప్పైన తన్ను కమ్ముకున్న వేళ మరింత నిశ్చింతతో నిటలాక్షుని నమ్ముకుని యున్నాడు భక్తుడు.
అహముతో /అజ్ఞానముతో తన బలమును/బలగమును నమ్ముకుని మానవప్రయత్నమును మాత్రమే చేస్తున్నాడు మహారాజు.
కాదనలేని కరుణగల పరమేశుడు నిర్దోషులను శిక్షించనీయదు
కదా.కనుక రాజాజ్ఞ ప్రకారము ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చి జలప్రవాహమునకు అడ్డువేయుచున్న వేళ,తానొక సేవకునిగా ఒక ముసలి అవ్వ ఇంటినుండి వచ్చి,పనిచేయక పవళించగానే,కుపితులైన రాజభటులు తమ కొరడాను అతని వీపుపై ఝళిపించారు..
జటాధారికి కావలిసినది అదేకదా.విశ్వాత్మకునికి తగిలిన దెబ్బ గుర్తు-బాధ విశ్వమం
తా భరించవలసివచ్చింది.
తన తప్పును తెలిసికొనిన పాండ్యరాజు పశ్చాత్తాపముతో పరమేశుని భక్తుని శిక్షించినందులకు బాధపడుతూ,స్వామిని బంధవిముక్తుని చేయమని వేడుకున్నాడు.
ప్రధానమంత్రి పదవిని
తృణ ప్రాయముగా వదిలివేసి,ప్రచార సాధనమై,చిదంబర నటరాజ దర్శనముతో "త్వమేవాహమై" ముందు తరముల వారికి మార్గదర్శకమైనాడు
"తిరు మాణిక్యవాచగరు.
ప్రియ మిత్రులారా! మీరందించినప్రోత్సాహమే "తిరువెంబాయ్" అను దివ్య స్తోత్రరాజమును స్మరించుకొనునట్లు చేసినది.
తిరుమాణిక్యవాచగరును కొందరు తిరువెంబావాయ్ అంటే ఏమిటి? అని కొంటెగా ప్రశ్నించారట.
దానికి వారు ప్రశాంతముగా కొండమీదనున్న స్వామిని చూపిస్తు అది అని, సవినయముగా బదులిచ్చారట.
నిజమునకు నామమునకు-నామికి భేదమేలేదుకద.
భావ దోషములు-భాషాదోషములు-భక్తి లోపములు కల ఈ నా ప్రయత్నమును స్వామితో పాటు మీరును పెద్దమనసుతో ప్రోత్సహించి,ఆశీర్వదించారు.
నేను ప్రారంభములో మీతో విన్నవించుకొనినట్లు నా "తాయ్ మొళి" మాతృభాష తమిళ
ము కాదు.పెద్దగా పరిచయము కాని/పాండిత్యము కాని లేదు.అయినప్పటికిని మహదేవ సంకల్పము మనలను ఈ మహాశివ నోములో భాగస్వాములను చేసినది.ఇప్పటికిని మించినదిలేదు.దీనిలోని దోషములను సవరించుకొనుటకు నేను సర్వదా సంసిధ్ధురాలను.
.స్వామి కృపతో మనమందరము పాదార్చకులమై,పునీతులమగుదాము.
శుభం భూయాత్-మీ సోదరి,
నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి, నమస్కారములతో.
నండ్రి.వణక్కం.
Saturday, January 15, 2022
TIRUPALLI ELUCHCHI-09
తిరుపళ్ళి ఎళుచ్చి-09
*******************
విణ్ణక్కత్ తేవరుం నన్నవుం మాట్టా
విళుప్పొరుళె ఉన తొళుప్పొడి యోంగళ్
మణ్ణగ తేవందు వాళచ్చేదానే
వన్ తిరప్ పెరుంతురై యాయ్ వళి అడియోం
కణ్ణగత్ తేనిన్రు కళిదరుతేనే
కడలముదే కరుంబే విరంబు అడియాల్
ఎణ్ణగ తాయ్ ఉలగిక్కు ఉయిరం ఆనాయ్
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుదరుళాయె.
.......
త్వమేవ విద్వా నమృత ఇహభవతి
నాన్యః పంధా అయనాయ విద్యతే
******************
పూదంగళ్ తోరున్ నిన్రాయ్ అంటు పరమాత్మ స్థూలరూపమును పరిచయముచేసిన మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో,
న-ఇతి,నేతి,
ఇది కాదు,ఇది కాదు అను సిధ్ధాంతముతో కానివాటిని గుర్తించి,వాటికి అతీతముగా నున్న దానిని పరబ్రహ్మముగా తెలుసుకోమని మనకు ఈ పాశురములో వివరిస్రున్నారు.
చెలులు మొలబ్రహ్మాన్వేషనమును మొదలుపెట్తారు.
వారు ,
విణ్ణక్కల్ తేవరు నన్నవు మాట్టా,
ఆకాశవాసులైన సురలకు స్వామిపాదములు కనపడలేదు అని అంటున్నారు.
ఇది బహిర్దర్శన సంకేతము.సామాన్యమైన చర్మచక్షువులతో చూడాలనుకోవటము.
దానిలో దాగి,దానిని నడిపిస్తున్న శక్తిని గుర్తించలేకపోవటము.కనుకనే వారు,
ఉలగిక్కు ఆనాయ్-ప్రపంచము నీవు,
అని ఆగిపోకుండా,
ఉయరిక్కు ఆనాయ్-అని అంటున్నారు.
కేవలము పంచభూతాత్మికమైన ప్రపంచము మాత్రమే నీవుకాదు,
పరమేశా!
దాని ఉనికికి కారనమైన ఊపిరివి కూడా నీవే,
అంటూ,
ఓ చేతనులారా!
యోపామాయతనవాం-
నీలో సూక్షమముగా నిండిన బ్రహ్మము చేయుచున్న కదలికలు నీవు సుమా
య ఏవం వేద
ఇది నీవు కాదనలేని సత్యము.
ఈ సత్యమును కనుక నీవు తెలుసుకోవాలంటే ఒకటే మార్గము,అది ఏమిటంటే,
ఆయతనవాం భవతి-
అంతర్ముఖమును పొంది,అంతర్వాసిగా నిన్ను నీవు మలచుకో అంటున్నారు.
దాని వలన ప్రయోజనమేముంది అను సందేహము కలుగవచ్చును,
దానికి వారు ఈ విధముగా,
కణ్నగ తేనిన్రు-కళిదరు తేనె,
అంతరంగ దర్శనముతో నీవు,
కడల్ అముదే-అమృత సాగర అనుభవమును పొందుతాఉ.నీ మనసు స్వామి దివ్య పాదారవింద దర్శన భాగ్యమును పొంది,అమృతపానము చేస్తుంది.
అట్టి శుభతరుణమున మనకు దర్శించుటకు,స్పర్శించుటకు మరొక పదార్థము కానరాదు.అదియే,
అంతర్వ్యాప్తి-బహిర్వ్యాప్తి-సర్వవ్యాప్తి.
అట్టి స్థితిలో.సముద్రము లోని కెరటము దానికి భిన్నముగా కాక సముద్రము యొక్క విశేషముగా భాసిస్తుంది.మూలము ప్రశాంతముగా ఉంటుంది.దాని శక్తి జలమున ప్రవేశించి అలల వలె పరవళ్ళు తొక్కిస్తుంది.
మనలోని బ్రహ్మము సైతము నిర్వికారముగా నుండి,మన ఇంద్రియములకు తన శక్తిని ఇచ్చి కదలికలను చేయిస్తూ సాక్షిగా ఉంటుంది అన్న సత్యమును తెలుసుకొని,శివనోమును అంతర్ముఖత్వముతో నోచుకొనుటకు కదులుచున్నారు.
ఈ రోజు పాండ్యరాజునకు-మాణిక్యవాచగరునకు మధ్యన నిలిచిన మారసంహారకుడు ఏమి గారడీలు చేయనున్నాడో.
గుఱ్ఱములను రాజునకు అప్పగించి,గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఆడాలన్నా/ఆడించాలన్నా నాకన్న మేటి ఆటగాడు లేడంటూ,అశ్వాలన్నింటిని అదృశ్యము చేశాడు.అంతటితో ఆగక వాటిబదులుగా గుంటనక్కలను రప్పించాడు.అవి పంటలు వేసుకుంటూ ఆడుకుంటున్నాయి.కొన్ని వెంటాడుతున్నాయి.మరికొన్ని అందినవాటిని పట్టుకుంటున్నాయి.పరుగులు తీస్తున్నాయి.ప్రమాదాలు తెస్తున్నాయి.
అడ్డు-అదుపులేకుండా విడ్డూరాలు చేస్తున్నాయి.
చూస్తున్న రాజునకు చేష్టలుడిగాయి.దానికి తోడుగా మాణి
క్యవాచగరుపై కోపము కట్టలు తెంచుకుని పనిపట్టమంటున్నది.
ఘోరేభ్యో-అఘోరేభ్యో నమో-నమః,
ఘోర రూపముతో రాజు,
అఘోర రూపముతో మాణిక్యవాచగరు,
సదాశివుని సంసేవాభాగ్యములో నున్నారు.
పెద్ద శిలకు మాణిక్యవాచగరును బంధించి,వైగీనదీతీరమున మండుటెండలో ,కాలే ఇసుకపై నుంచి,కఠినముగా శిక్షిస్తున్నారు.
కదలని చిత్తముతో కరుణాంతరంగుని ప్రార్థిస్తున్నాడు మాణిక్యవాచగరు.
అండ దండ అయిన ఆదిదేవుడు మాణిక్యవాచగరునకు కట్టిన గుదిబండను విడిపిస్తాడో లేదో తెలుసుకునే ప్రయత్నము రేపు చేద్దాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
Friday, January 14, 2022
TIRUPALLI ELUCHCHI-08
తిరుపళ్ళి ఎళుచ్చి-08
*******************
ముందియ ముదల్నడు ఇరుదియం మాణా
మువ్వరం అరికిలాల్ యవర్మట్రు అరివార్
పందణై విరళియుం నీయుం నిన్ అడియార్
పలంకుడి తొరుం ఎళుయుం అరుళియ పరనే
శెందడల్ పురైతిరు మేనియుం కాట్టి
తిరుపెరుం తురైయురై కోయిలుం కాట్టి
అందణన్ ఆవదుం కాట్టి వందండాయ్
ఆరముదయె పళ్ళి ఎళుందరుళాయె.
.....
"యత్ త్రికాలే అపి తిష్ఠతి తత్ సత్."
ఏదిసర్వకాల సర్వావస్థలందును స్వయం ప్రకటితమో అదియే సత్తు.
దాని ప్రకటనమే చిత్తు.
ఉన్నదాని ఉనికిని తెలిసికొనుట సత్చిత్.
తెలుసుకొనుటవలన లభించు దివ్య అనుభూతియే అలౌకికానందము.అదియే
సచ్చిదానందము.
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు చెలుల సంభాషనము ద్వారా మనకు ఆ దివ్యమైన అనుభూతిని
ఆరముదయె-మధురాతిమధురమైన మకరందమా అని సంబోధింపచేస్తున్నారు.
ఆ మందార మకరందమును ఆస్వాదింపగలిగే మధుపముగా మన మనసు మారాలంటే మన ఇంద్రియములు స్వామి అనుగ్రహపాత్రములై ఉండాలి.
మన కర్మలు స్వామి యొక్క నిజతత్త్వమును,
మున్ముదల్ ఆణాయ్-ప్రపంచ సృష్టికి ముందున్నది
ముదల్ ఆణాయ్-సృష్టి ప్రారంభమునందున్నది
నడు ఆణాయ్-మధ్యమ స్థితిలో నుండునది
ఇరుదియం ఆణాయ్-ప్రలమునండునదియును అనగా
స్వతంత్ర ప్రకటనముకల నిత్య్సత్యముగా గుర్తించగల వారలమై యుండాలి.
అంతే కాదు మన నయనములు సైతము,
శెన్-ఎర్రని
తడల్-అగ్ని స్వరూపముగా
తిరుమేనియుం-అగ్నిస్వరూపముగా/అరుణగిరిగా
మమ్మేలుతున్నది నీవే స్వామి
పరమాత్మనే
తిరుపెరుంతూరులోని ఆత్మనాథ్య్నిగా మమ్ములను అనుగ్రహించుచున్నావు.
అంటే నువ్వు నిత్యవస్తువు అంతేకాదు నీవు సత్య వస్తువు కూడా.
నీ రూపములు-కాలములు ఇవి అని చెప్పనలవికాడు.
కాని నీ కరుణావిశేషములను కీర్తించుటకు మాకు అనేకానేక నిదర్శనములు కలవు.
మువ్వరు అరికిలార్-బ్రహ్మవిష్ణు రుద్రాదులతో పాటుగా
యామట్రు అరివార్-ఎందరో దేవతలు నీ యొక్క స్వరూపమును-సత్కృపను కనుగొనలేకపోయినప్పటికిని,
పందణైవిరళియుం-నీయుం
పూబంతి పార్వతీదేవిని కూడి నీవు
నిన్ అడియార్-నీ పాదసేవకులయొక్క
హృదయములముదు కొలువైుం ప్రకాశిస్తున్నావు.
ఆ దివ్యమంఘళ సాక్షాత్కారమునకు నీవు వారినుండి
పణం-సంపదలను
పుహళ్- ఆడంబరములు ఆశించలేదు.
వారి నిష్కళంక నిశ్చలభక్తియే వారిపై నీ ఆశీ
ర్వచనమును అందించినదనుటకు ఆ పూసలర్ నాయనారు నిర్మించిన మనోమందిరమునందు నీవు అధిష్ఠించలేదా.
" యుక్తేనా చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యయతి." అనుచు,
చెలులు చిదానందములో మునకలు వేస్తూ,తనతోటివారికి కూడా ఆ బ్రహ్మానందమును అందచేయదలచి,
చేతనా!
నీ మనమును అన్యవిషయములవైపునకు పోనీయక,సాధన అను కర్మయందు నియంత్రించి,పరమజ్ఞానమయమయిన ఆత్మతత్త్వమునందు సదా సంచరించు/సంతసించు అనుచు శివనోమునకు సన్నధ్ధులగుచున్నారు.
*****
ఈ రోజు మాణిక్యవాచగరు జీవితములో జరిగిన విశేషములతోపాటుగా,అవనీమూలం రోజు గురించి తెలుసుకుందాము.
శ్రావణ -భాద్రపద మాసములలో వచ్చే మూలా నక్షత్ర తిథిని తమిళ సంప్రదాయానుసారులు పరమ పైత్రముగా భావిస్తారు.భూమిపూజచసి విత్తులు నాటు సంప్రదాయమును అనుసరిస్తారు.
రాజభటులు మానిక్యవాచగరు సమాధానము కొరకు పక్కనే నిలబడియున్నారు.చెక్కుచెదరని విశ్వాసముతో ముక్కంటి పాదములను వీడక వేడుకుంటున్నాడు తక్షణ కర్తవ్యమునకై.
క్షిప్రప్రసాదుడైన సోమసుందరుడు మాణిక్యవాచగరునకు కర్తవ్యమును తెలియచేసి,కానకున్నాడు.
మాణిక్యవాచగరు ప్రభువునకు
" అవనీమూల నక్షత్రము " నాటికి మన ఆశ్వములు మన రాజ్యమును చేరునని చెప్పి నిశ్చితగా,నిర్మల మనముతో నిటలాక్షుని సేవిస్తున్నాడు.
ముందురోజు వరకు గుఱ్ఱములజాడలేదు.కబురును లేదు.పనితీరును మెచ్చని రాజు మాణిక్యవాచగరును కారాగారములో బంధించుటకు ఆజ్ఞాపించెను.
కాఠిన్యము తోసివేస్తూ కారుణ్యము కదలాలికదా.
బయలుదేరాడు భక్తునికి పరీక్షలు మరింత భారముచేస్తూ,
అనుకున్న ప్రకారముగా అడవినక్కలను గుఱ్రములుగా మార్చి,తానొక అశ్వర సమ్రక్షకునిగా అవతరించి,పాండ్యరాజు వద్దకు వచ్చి,వాటి ఔన్నత్యమును వివరించి,తిరిగి వెళ్లిపోయాడు.
ఆనందించుచున్న రాజుగారి ముఖములో అంతలోనే రంగులుమారినవి.క్రోధావేశములతో ఊగిపోతున్నాడు.
జరిగిన వింతల గురించి,రేపు తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
అంబే శివే తిరువడిగళే శరనం.
Thursday, January 13, 2022
TIRUPALLI ELUCHCHI-07
తిరుపళ్ళి ఎళుచ్చి-07
******************
అదుపళచువ ఎన అముదెన అరిదర్కు
అళిదెన ఎళిదెన అమరరుం అరియార్
ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే
ఎంగళై ఆ
ండుకొండు ఇంగెళుందు అరుళం
మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ
మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా
ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె
.......
ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి
**************************
అరుణగిరినాథర్ తో పాఉగా మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన,
మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచెందుటక ఒక ఇతిహాసమును చెబుతారు.
ఉత్తిరం అనగా ఉపదేశము.ఇక్కడ పరమేశుడు పార్వతీదేవికి ఉపదేశమును చేసినాడట.
దేనిని ఉపదేశించెను అనగా
కోశై-రహస్యమును/వేద రహస్యములను
ఉత్తర కోశై మంగళనాథుడు/నటరాజు,తిరుపెరుంతూరు లోని ఆత్మనాథుడు ఒకరే అన్న రూపమును దాటిన తత్త్వమును మనకు పరిచయము చేయుచున్నారు.
కనుకనే
ఇదు అవన్-ఇది నీవే,
ఇవన్-అవన్ ఎనవే-ఇది-అది-నీవే అదియేకాదు,
అళుదెన-ఎళుదెన -కుడి-ఎడమ రెండును నీవే/అయ్య/అమ్మ అన్ని నీవే అనుచు
స్వామి నీ దివ్యలీలానుభూతులను నేను వేటితో పోల్చగలను?
అదు చువ-తేనెమాధుర్యముతోనా లేక
పళ చువ-పండ్ల అద్భుతరుచితోనా
కాదుకాదు అముదెన చువ-అమృతపు ఆస్వాదనతోనా అనుచున్న మాణిక్యవాచగరు మాటలను వినిన చెలులు అంతలోనే
ఆ సంభాషణమునకు ప్రభావితులైన చెలులలో ఒకరు క్షనములో తనను తాను రామదాసుగా ఊహించుకొనుచు,
పాలు-తేనియలకన్నా పంచదార-చిలుకలకన్న అనగానే
తేనె భవహరణ తారకమే కాని,నాకెందుకో స్వామి దివ్యలీలా అనుభూతులు,
కదలీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన అనగానే తలనూపుతు మరొకచెలి,
పనస-జంబు-ద్రాక్ష ఫలరసములకంటె
అనగానే ఆనందముతో మరొకచెలి తనను తాను ప్రహ్లాదునిగా భావించుకొనుచు,తేనె-పండ్లతో స్వామి అనుగ్రహము పోల్చుట సరియే కాని,
అంబుజోదరు దివ్య పాదార్వింద చింతనామృత మత్త.. అంటూ అంతర్ముఖమవబోతున్న సమయములో చెలులందరు భానురేఖలందించుచున్న భక్తిభావమును తమతో పాటుగా శివనోమునకు తీసుకుని వెళ్ళుచున్నారు.
......
ఈ రోజు మాణిక్యవాచగరు తిరుగురాకకై ఎదురుచూచిన పాండ్యరాజు ఆగ్రహించి ఆగ్రహించి తన చారులను మానిక్యవాచగరు జాడ తెలుసుకొనుటకై పంపించారు.స్వామిభక్తి పరాయణులైనవారు ప్రధానమంత్రి అశ్వములను ఖరీదు చేయలేదని రాజనగదును ఆలయనిర్మాణమునకు వెచ్చించినాడని రాకునకు విన్నవించారు.కట్టలు తెంచుకున్న క్రోధముగా పాండ్యరాజు గుర్రములను తీసుకుని తన దగ్గరకు రమ్మని చారులతో కబురుచేశాడు.ఐహికమువైపు మళ్ళని
మనసుతో ఆత్మనాథుని పాదములను పట్టుకుని యున్నాడు మాణిక్యవాచగర్.
రానున్న సంఘటనలను ఎంతటి రసపట్టుతో నడిపిస్తాడో ఆ ఘటనాఘటన సమర్థుడు రేపటి పాశురములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
Wednesday, January 12, 2022
TIRUPALLI ELUCHCHI-06
తిరుపళ్ళి ఎళుచ్చి-06
*******************
పప్పర విట్టిరుందునరుం నిన్ అడియార్
పందనై వందరుదా అవరుం పలరుం
మైపురు కణ్ణియ మానుడత్త ఇయల్బీ
వణంగు కిరార్ అనంగిన్ మణవాలా
శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్సోల్
తిరుపెరుంతురైయురై శివపెరుమానే
ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.
భవబంధ విమోచనాయ పోట్రి
************************
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామీ నీవు
మానుడత్తి ఇయల్బీ-తగిన వరుడవు
ఎవరికి నీవు సరియైన వరుడవు అంటే,
మైపురు కన్నియ-లేడి కనుల మా అమ్మకు/ఉమాదేవికి
ఇది వాచ్యార్థము.
సహజకవి బమ్మెర పోతమాత్యులు వివరించినట్లు,
"తగు నీచక్రి విదర్భరాజ సుతకున్
తథ్యంబు వైదర్భితుం తగునీ చక్రికి"
అన్నట్లుగా ఉమాదేవి నీకు తగిన కన్య-స్వామి నీవు మా ఉమాదేవికి తగిన వరుడవు
ఇంత మంచిదవునే దాంపత్యమీ ఇద్దరిని
తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా.
శివ పార్వతుల దాంపత్యము లౌకికముగా అన్వయించుకోలేనిది.
స్థితి-గతుల సమాగమమే సృష్టి సంకల్పము
శివ-శక్తుల సంగమమే సమస్త భువన భాండములు.
ఇది కాదనలేని ఒక సిధ్ధాంతమైతే,
మరొక విశ్లేషణ ప్రకారము పరమాత్మ యొక్కడే పురుషుడు/భర్త.
చేతనులన్నె పరమాత్మచే భరింపబడేవే.
ఏ విధముగా రాధామాయి,మీరాబాయి,సక్కుబాయి,అన్నమయ్య,గోపన్న స్వామి సేవించి,భగవత్-భక్త దాంపత్యమును మనలను దర్శింపచేసినారో,
అదేవిధముగా శివనోమును ఓచుకొనుచున మన చెలులు తిరుపెరుంతూరు లో జరుగుచున్న సంఘటనలను అర్థముచేసుకొనుచున్నారు.
అటుగా వెళుచున్న వారికి ఒక పెద్ద,
పందనై-సమూహము కనిపించింది.
వారు అడియారు-ఓ దైవమా అని పలవరిస్తూ,పులకరిస్తూ,కోలాహలమును చస్తూ వీరిని సమీపిస్తున్నారు.
ఇక్కడోక విచిత్రము ఏమిటంటే వారు,
"యతో యతో నిశ్చయతి మనస్ చంచలమస్థిరం
తతః తతో నియం ఏతత్ ఆత్మాన్ యేవ వశం నయేత్"
చంచలమైన మనసును మనము దైవము మీదకు కేంద్రీకరించుటకు ప్రయత్నించునపుడు,అది అప్రయత్నముగనే దానిని వీడి ఐహికములవైపునకు పరుగులు తీస్తుంది.అయినప్పటికిని మనము తిరిగి దానిని నిశ్చలత్వము వైపునకు నిర్విరామముగా ప్రయత్నమును చేస్తుంటే అది కుదురుకుని పరమాత్మ అనుగ్రహప్రాప్తిని పొదగలుగుతుంది.
అట్తి స్థితిలో ఆంతర్యము నిశ్చలమై ఆనందిస్తూ,బాహ్యము నర్తిస్తుందికదా చెలులారా.
పదండి.మనమును వారిని దర్శించుకుని పునీతులమగుదాము అంటు వారికి నమస్కరించి,వారి ఆనందోత్సాహములకు కారనమును తెలుసుకొనగోరిన వెంటనే వారు దయాంతరంగులై,
పప్పర విట్టిరుం-ప్రపంచ బంధములనుండి విముక్తులమైనామని,పరమాత్మ తత్త్వములో పరిమళిస్తూ/పరవశిస్తూ,తిరిగి వెంటనే అంతర్ముఖులైనారు.
వారి హృదయములవలె.మన చెలుల హృదయములు సైతము,
మలరుందన్-పుష్పములు విచ్చుకొనుచున్నట్లు,
శెన్-పొరు-శెప్పొరు -ఎర్రని బంగరు
కమలంగళ్ పద్మములు అవ్యును
వయల్సోల్-విచ్చుకొనుచున్న కెందామరల వంటి హృదయములతో శివనోమునకు
వెళ్ళుచున్నారు.
ఈ రోజు మనము మాణీక్యవాచగరులో కలిగిన పరివర్తనమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఓ అడియార్-ఓ మా సమ్రక్షకుడా
ఎన్ పప్పర్ విట్టినందు-నా ప్రపంచ బంధములు వీడినవి
నేను ఇప్పుడు నీ పరివ్రాజకుడను కాని పాండ్యదేశ ప్రధానమంత్రిని కాదు.
ఆశ్వముల అవసరము నాకులేదు.ఇంద్రియలౌల్యమును నేను కోరుకోను. అని స్థిరనిశ్చయుడై,అత్యంత వైభవముగా ఆత్మనాథుని కోవెల పునర్నిర్మాణమునకు ఉద్యుక్తుడై,సఫలీకృతుడైనాడు.
పది ఎకరముల విస్తీర్ణతతో యున్న స్థలములో నిర్మించబడిన ఈ కోవెలలోని మూల విరాట్టునకు రూపములేదు.ఆత్మ తత్త్వముగా భావించి ఆత్మనాథుడను నామముతో కొందరు పిలుస్తారు/కొలుస్తారు.
కొన్ని మెట్లు దర్శనమిస్తాయి కనుక అవుడియార్/మెట్లస్వామి అని అవుడియార్ కోవెల అని తలుస్తారు/కొలుస్తారు.
కొలిచేవారికి యోగ్యతను ప్రసాదిస్తారు కనుక ఇక్కడ నంది-నందివాహనుడు కానరాకున్నను,
యోగనాథుడు-యోగాంబిక అని ,జగతం పితరే వందే పార్వతీ-పరమేశ్వరం గాను ప్రార్థిస్తారు.
ఇదిక్కడ ఇలా ఉంటే అక్కడ పాండ్యరాజు గుర్రములను తీసుకొని వస్తున్న వధూరూరునకై వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు.
మూడుకన్నులవాడు ఏమివేడుకనో చేయబోతున్నాడో రేపటి పాశురములో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
Tuesday, January 11, 2022
TIRUPALLI ELUCHCHI-05
తిరుపళ్ళి ఎళుచ్చి-05
*****************
పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్
పొక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్
గీదంగళ్ పాడుదళ్ ఆడుదల్ ఆళ్ళాళ్
కేట్టరియోం ఉనై కణ్దరి వారై
శీదంకోళ్ వయల్తిరు పెరుంతురై మన్నన్
శిందనైక్కుం అరియా ఎంగన్మున్వందు
ఏదంగళ్ అరుదెమ్మై ఆండరుళుం పురియుం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె
తిరువడి తొళుకో పోట్ర్
స్వామిపాదకాంతులకు మంగళం
***********
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు సుక్షేత్రములుగా మారిన అంతరంగము కలిగిన
చెలుల సంభాషణమును వర్ణిస్తున్నారు.
తిరుపెరుంతురు మన్నన్,
తిరుపెరుతురునకు ప్రభువైన మా స్వామి,
శీదంగళ్ వయల్-మా మనోక్షేత్రములు భక్తి అను విత్తును నాటిన పుష్కలముగా పంటను అందించు సుక్షేత్రములుగా మారినవని మాకు నీ పంచభూత తత్త్వమును
ఆళ్ళాళ్-విజ్ఞులు మాకు తెలియచేస్తున్నారు.
వారేమో ఆడుతున్నారు-పాడుతున్నారు.
గీదంగళ్ పాడుదల్-ఆడుదల్ అల్లాల్
వారి సంతోషమునకు కారణమును తెలిసికోవాలని మేము వారిని ప్రశ్నిస్తే
పూదంగల్ తోరున్ నిండ్రాయ్
అని పంచభూత నిండి యున్న నీ విభవమును గురించి కీర్తిస్తున్నారు.
ఆనందాశ్రువులు నిండిన నయనములతో నర్తిస్తున్నారు-కీర్తిస్తున్నారు.
వారు తన్మయత్వమును అనుభవిస్తున్నారు.అర్చిస్తున్నారు.ముందు తరములకు స్వామి తత్త్వమును అందిస్తున్నారు.అని చెప్పగానే
చెలి! నాదొక సందేహము.నిజముగా వారు స్వామిని దర్శించితిరా స్వామిని?
స్వామి అర్చామూర్తి నామ-రూప-గుణ వైభవములగురించి మరిన్ని విశేషములను తెలుసుకుందామని వారిని సమీపించి,ప్రశ్నించగా,
వారు బహిర్ముఖులై,వారికి ఎందరో
స్వామి వారికి అందించిన అనుభవములను-అనుభూతులను వివరించినారే కాని ప్రత్యక్షముగా వారును దర్శించలేదట.
అయినప్పటికిని వారికి/ఇంద్రియములకు ప్రతి పరమాణువు స్వామిశక్తిగా కనపడుతున్నదట.
వారు నిశ్చలమనస్కులై ఇది స్వామిరూపము-ఇది స్వామి విభవము--ఇది స్వామి నివాసము అని స్వామి ఉనికిని పరిమితము చేయలేమని సర్వాంతర్యామితత్త్వమును వివరిస్తుంటే,
సెన్నియ అంజలి కుప్పినరొరుపాల్ -అందరును త్రికరశుధ్ధిగా నమస్కరించి,ఇవన్నీ మనలకు పరిచయము చేయుచున్న పరమాత్మ ఎంతటి దయార్ద్ర హృదయుడో అని తలుస్తూ, శివనోమునకు తరలి వెళుతున్నారు.
ఈ రోజు మణిక్యవాచగరును ఆకర్షించిన సుందర ఉద్యానవనములో జరిగిన విశేషముల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
ఇమైపొడుం ఎన్నెంజిల్ నీంగాదాన్ వాళ్గా
పరమేశా!
నా హృత్పుండరీకమునందు కొలువై క్షణమైనను ననువీడని నీ పాదములకు శాశ్వత మంగళమగుగాక.
పరమేశుని లీలలు పరిపరివిధములు.
ఎంతటి అద్భుత దర్శనము.ఒక మహావృక్ష నీడలో అనంతతేజోరాశిగా అవతరించిన ఆదిదేవుడు.
క్రింద స్థిమిత చిత్తములతో స్వామి బోధనమును శ్రవనము
చేస్తున్న సకలసురలు.
సత్-చిత్-ఆనందము పర-వ్యూహ-విభవ దశలను అధిగమించి,అర్చామూర్తిగా ఆటను ప్రారంభించిన సన్నివేశము.
ఓం నమః శివాయ
ఐహికము తొలగుతూ ఆధ్యాత్మికమునకు మార్గము వేయుచున్నదా అన్నట్లుగా అడుగులను కదిలిస్తున్నాడు అటువైపునకు
హర్షాతిరేకముతో మాణిక్యవాచగర్.
అర్ద్రత నిండిన /వాలిన భక్తి
స్వామి పాదపద్మములను ఆశ్రయించినది.అవ్యాజ వాత్సల్యము అనుగ్రహముతో ఆశీర్వదించినది.
కోవెల నిర్మాణమునకు బీజమువేసి కనుమరుగైనది కరుణామృతమును వర్షిస్తూ.
అంబే శివే తిరువడిగళే శరణం.
TIRU PALLI ELUCHCHI-04
తిరుపళ్ళి ఎళుచ్చి-04
*******************
ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్
ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్
తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్
తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్
సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్
తిరుప్పెరుంతురై శివపెరుమానే
ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె
......
"స్తుతిస్తు నామ-రూపాలు
కర్మణా బాంధవేనచ."
అన్నది ఆర్యోక్తి.
భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని ఆరాధించుచున్న చేతనుల భక్తి ఆధేయము.అనగా భాగవతుల
ద్వారా భగవత్తత్త్వము ప్రచోదమగుచున్నది.
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు రెండు పరమాద్భుతములను చెలుల సంభాషణము ద్వారా ఆవిష్కరింపచేస్తున్నారు.మొదటిది,
" తిరుపెరుంతురైయురై శివపెరుమానే"
అంటూ స్వామి నామ-రూపములను,గుణవైభవమును,నివాసమును కీర్తిస్తున్నారు
అంటే పరబ్రహ్మము తననుండి నామ-రూప-గుణములను/అనంత కళ్యాణగుణములను వేరుచేసుకొని,
అర్చామూర్తిగా తనను తాను మలచుకొనుట.
ఈ ప్రక్రియ కేవలము జీవులను ఉధ్ధరించుటకు లీలగా స్వామి ప్రకటనము
కాని మరే ఇతర ప్రయోజనమును లేదు.
ఏ విధముగా గర్భస్థ పిండము తాను
పెరుగుచున్న గర్భగుడిని పొందిన మాతృమూర్తిని చూడలేదో అదేవిధముగా మన చర్మచక్షువులు పర రూపముగా (నిర్వికారముగా/సూక్ష్మముగా) నున్న శక్తిని కనుగొనలేదు కనుక వ్యూహ-విభవ రూపములను దాటి అర్చామూర్తిగా ప్రకటనమగుతూ మనలను ఆశీర్వదిస్తున్నాడు.
అనగానే చెలులు నాలుగుదిక్కులును నాదార్చనముతో ఏ విధముగా తాదాత్మ్యతతో నిండినదో కదా అనుకొనుచు,ఒకవైపు చూడగానే
వీణానాదము వీనులవిందుగా స్వామిని కీర్తించుచున్నది.
దానికి తోడుగా యళి( తంబురా) తానును స్వామిని అర్చించుచు,ఆనందించుచున్నది
అనగానే మరొక్ చెలి అటుచూడు,
తోత్తిరం ఇయంబినాల్
"
ఆగమం ఆగి నిండ్ర అణ్ణిప్పన్ వాళ్గా"
వేదఘోష నీకు/మీకు వినబడుటలేదా? అనగానే
నేడు శ్రవణానందమే కాదు.
స్వామి మనలకు నయనానందమును సైతము అనుగ్రహించుచున్నాడు.
అటుపక్క చూడు,
తుణ్ణియపిణై మలర్-అప్పుడే వికసిస్తున్న /పరిమళిస్తున్న పూలతో/పూలహారములను దోసిళ్లలో పట్టుకుని వస్తున్నారు ఆనందపారవశ్యముతో.
అంతే కాదు ఎందరెందరో తమ హస్తములను ముకుళిస్తూ,
తొళుకయ్యర్-భుజములమీద పెడుతు
స్వామి శక్తిని తమ హృదయములలోనికి/దేహములోనికి
న్యాసము చేసుకుంటున్నారు.అంగన్యాస/కరన్యాసములతో ఆదిదేవుని అమృతజలములతో
" ఆ పాతాళ నభస్థలాంత" అంటూ అమృతధారలను ఆస్వాదిస్తూ-ఆనందిస్తున్నారు
మనకు పరిచయములవుతున్న పరమాత్మ లీలలు మనలను మంత్రముగ్ధులను చేస్తున్నవి.
చెలులారా ఇంక ఆలస్యము చేయక ఆత్మనివేదనముతో
శివనోమును ప్రారంభిద్దాము అని అనుకుంటున్నారు.
******
ఈ రోజు మాణిక్యవాచగరు చోళ మండల ప్రయాణములో జరిగిన విశేహము గురించి,
రావలిసిన వానిని తిన్నగాతనదగ్గరకు రప్పించుకుంటున్నాడు తిన్నని కాచినవాడు.
నమో అశ్వేభ్యో-అశ్వపతిభ్యః నమో నమః.
ఒక చిన్నవిషయము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
స్వామికార్యముగా మనకు అనిపించే స్వకార్యమునకు,.
అవకాశమును కల్పించినవాడు-మాణిక్యవాచగరును కదిలించినవాడు-దారి మళ్ళించినవాడు అన్నీ ఆ దయాంతరంగుడే.
స్వామికార్యము బలిష్ఠమైన అశ్వముల కొనుగోలునకై చోళమండలమునకు ప్రయాణము.
ఆ అశ్వములు మిక్కిలి బలిష్ఠమైనవి.ఆ బలము కేవలము శారీరకమే కాదు.యుధ్ధముచేసి విజయమో/వీరస్వర్గమో అను స్వభావముతో నున్నవి.ఇది కేవలము బాహ్యము.
అయితే దీనిలో దాగిన అంతరార్థము ఏమిటి? అనే సందేహము మనకు కలుగవచ్చును.
మన ఇంద్రియములే ఆ అశ్వములు.ఇద్రియవ్యామోహము వైపు మనలను మళ్లించే యుధ్ధమే అవి తీస్తున్న పరుగులు.ఆ యుధ్ధములో వాటికి విజయమైన /అపజయమునైన సమముగా తీసుకునే స్వభావము నిరూపించుటకు మనకు ఎందరెందరో మహానుభావుల జీవితములే ఉదాహరణములు.
"అశ్వేభ్యో-అశ్వపతిభ్యశ్చః"
ఆ అశ్వములను నియంత్రించగల అశ్వపతియే మన స్వామి.స్వామి వ్యూహముగా సృష్టించబడిన,
అత్యద్భుత సుందరవనము ఆహ్వానిస్తున్నది మన ప్రధానమంత్రిని రమ్మంటూ,
అక్కడ ప్రతి పుష్పము స్వామి పాదమే
అక్కడ ప్రతి పులుగు స్వామి నామమే
ఆ ఉద్యానవనపు పిలుపుతో, తిరుమాణిక్యవాచగరు జీవితములో ఏ మలుపు తిప్పబోతున్నాడో ఆ ఆత్మనాధుడు?
నమః శివాయ వాళ్గా
నాదన్ తాళ్ వాళ్గా.
అంబే శివే తిరువడిగళే శరణం.
Friday, January 7, 2022
TIRUPALLI ELUCHCHI-03
తిరుపళ్ళి ఎళుచ్చి-03
*******************
కూవిన పుంకుయిల్ కూవిన కోళి
కురుగుకళ్ ఇయంబిన ఇయంబిన శంగం
ఓవినై తారకై ఒళి ఒళి ఉదయత్తు
ఒరుప్పుడు కిన్రాడు విరొప్పుడు నమక్కు
తేవన చెరికళల్ కాడినై కాట్టాయ్
తిరుంపెరుంతురై యురై శివపెరుమానే
యాం వరుం అరివరియాయ్ యమక్కు అడియాయ్
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.
........
ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం
కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమోనమః"
***********
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్య వాచగరు బ్రాహ్మీముహూర్తము ఏ విధముగా పరమాత్మకు నాదార్చననో చేయుచున్నదో వివరిస్తున్నారు.
పోట్రి-అరుణన్ పాశురములలో ఏ విధముగా పరమాత్మ ముఖకాంతిని పద్మములు-సూర్యుడు తమ వెంట తెచ్చుకొని ప్రకాశిస్తున్నారో ప్రస్తుతించి,ఈ పాశురములో నాదోద్భవమును-నాదార్చనను వివరిస్తూ,చెలులు ఏ విధముగా స్వామి విరుప్పొడు నమక్కు
నీ దివ్య మంగళ విగ్రహమును దర్శించి సేవించాలి అని కోరుతూ,
అంతలోనే కాదు కాదు,
తేవన చెరికలల్ కాట్టాయ్-నీ యొక్క శోభాయమానముగా ప్రకాశించు పాదములు పటుకొనగలిగిన చాలును
ఓ పరమాత్మా!
మా యందలి అనుగ్రహముతో నీ యోగ నిద్రను (లాంఛన నిద్రను) చాలించి మేల్కాంచి,నీ పాదసంసేనా సౌభాగ్యమును ప్రసాదించు అని వేడుకుంటున్నారు.
యాం వరుం-మేమందరము వచ్చాము
నీ దగ్గరికి
పద్మములకు-పద్మాకరములకు స్వామి ముఖతేజము వెంటవచ్చి ప్రకాసముగా ప్రకటితమైనది.
పూంకుయిల్ కూవిన
కోయిలల కూజితములతో,కోళ్ళ మేల్కొలుపులతో,పక్షుల వైవిధ్య పిలుపులతో,శంఖనాదములతో సమస్త జీవరాశులు నిన్ను తమ శక్త్యానుసారముగా సంకీర్తిస్తున్నవి.
మనకు సందేశమును అందిస్తున్నవా అన్నట్లుగా చెలుల సంభాషణము అనిపిస్తున్నది.కోయిల పంచమ స్వరము వసంత ఋతువునకే పరిమితము.కోడి మేల్కొలుపు బ్రహ్మీ ముహూర్తమునకే మహోత్కృష్టం.వాటి ప్రాభవము కాలనకు/కాల పరిమితికి లోబడి యున్నది కదా అనగానే మరొక చెలి
ఓ సుభాషిణి అంతే కాదు.నాదము బహుముఖములుగా విస్తరిస్తూ గగన విహారము చేస్తున్నది.మన ఇంద్రియములను కోడికూతతో మేల్కొలిపినప్పటికిని,అనేకానేక ఆలోచనలనే పక్షులు,ఆశలనే తమ రెక్కలను చాచుకొని మనలను తికమక పెట్టుట ప్రారంభించినవా అన్నట్లు అనిపిస్తున్నది అనగానే
కాదు చెలి ఎందరో
అరివరియాయ్-యోగులు/జ్ఞానులు
అహంకార-మమకారములను రెక్కలను ఎగురనీయక ,భక్తి-శ్రధ్ధలను రెక్కలతో అజ్ఞానమును తరిమివేస్తు,ఆత్మానందముతో (ప్రణవమును-ఓంకారమును) శంఖనాదము ద్వారా చేస్తున్నారు.
సత్వగుణ సంపన్నులైనారు.సత్వరమే మనము సైతము స్వామి సుప్రభాతసేవకు సన్నధ్ధులమగుదాము.
మనము నిన్నటి భాగములో తిరు మాణిక్యవాచగరు పరమేశునిచేఏ విధముగా /ఎందులకు నునామకరణము చేయబడినాడో తెలుసుకున్నాము.
ఈ రోజు తిరుపెరుంతురై శివపెరుమానే అని తిరుపళ్లిఎళుచ్చిలో సంబోధింపబడుతున్న స్వామి కి మాణిక్యవాచగరునకు కల అనుబంధమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము( స్వామి కరుణతో)
.
తిరుపెరుంతురై తమిళనాడులోని పుదుక్కోట జిల్లాలోని పుణ్యక్షేత్రము.
మన కంచర్ల గోపన్నకు ,తిరుమాణిక్యవాచగరునకు దేవాలయ నిర్మాణ విషయములో పోలిక కలదు.
వృత్తి పరముగా తిరువడరూరు వరగుణపాండ్యరాజాస్థాన ప్రధానమంత్రి.రాజాజ్ఞగా కొన్ని సమర్థవంతమైన అశ్వములను కొనుటకు తగిన పైకమును తీసుకుని తిరుపెరుంతురై వైపునకు పయనమయినాడు.పాలించవాడు మాణిక్యవాచగరు పయనమును ఏ మలుపు తిప్పుతాడో తరువాతి పాశురములలో తెలుసుకుందాము.
అంబే శివే తిరువడిగలే పోట్రి.
Thursday, January 6, 2022
TIRUPALLI ELUCHCHI-02
తిరుపళ్ళి ఎళుచ్చి-02
******************
అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్
అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్
కరుణన్ శూరియన్ యలయళ నయన
కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా
తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం
తిరుపెరుంతురై శివపెరుమానే
అరుళిరి తరవరం ఆనందమలయే
అలకడలే పళ్ళి ఎళుందరుళాయె
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః
**********
పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖమలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమాణిక్యవాచగరు.
పళ్ళి ఎళుచ్చి పదిభాగములు భగవంతునికి-భాగవతులకు గల అవినాభావ సంబంధమును అందించుచున్నవే.
మన చెలులు స్వామి సుప్రభాత సేవకు వెళుతో కొలనులో వికసించుచున్న కెందామరలను తమ హృదయకమలముతో అనుసంధానము చేసుకొని అనుగ్రహపాత్రులైనారు.
కొంచము ముందుకు తమ అడుగులను కదిపారో లేదో వారి ఆలోచన కెందామరలను అనుగ్రహించిన భానుకిరణములవైపునకు మళ్ళించినాడు పరమాత్మ.
చెలి తామరలు స్వామి ముఖకాంతిని తెచ్చుకున్నాయనుకున్నాముకదా.వీటితో పాటుగా,
మలత్తిరు ముగత్తిన్-స్వామి ముఖారవింద కాంతులను,
ఈ భానుడు కూడా తనతో తెచ్చుకొని మనకు ప్రత్యక్షదర్శన (స్వామిదర్శన) భాగ్యమును అనుగ్రహిస్తున్నాడు.అనగానే
వేరొక చెలి అవునవును
అసలు ఈ సూర్యోదయమునకు స్వామి ముఖకమలమునకు అభేదము లేనేలేదు.
తూరుపు వేకువ చూస్తున్నావా చెలి
అది మన స్వామి కనులనుండి వస్తున్న
యళ యళ నయన-స్వామి కన్నుల కాంతియే కరుణతో సూర్యోదయము కదా.
స్వామి దర్శనమును పొందుచు మన కన్నులు ఆనందముతో కాంతివంతములైనవి కదా.
మన కన్నుల కాంతి-స్వామి కన్నుల కాంతికి బింబ-ప్రతి బింబలుగా భాసించుచున్నవి అని తేజస్వినులైన వారు తమ అడుగులను కదుపుతూ,మనసులో తమ ఆలోచనలను జరుపుతూ తిరిగి సంభాషణమునకు ఉపక్రమించారు.
ఇరుళ్పో-చీకట్లు బాహ్యములో-వారి ఆంతర్యములో
తొలగి,వేకువరేకలు వ్యాపించుచున్న సమయమున వారి మనసు
అలై కడలే గా మారినది.
స్వామి పూర్ణచంద్రుని ముఖదర్శనముతో ఆనందమను కడలిగా మారిన వారి మనసులో అర్చనాసక్తములైన హృదయములనే అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
వారి మనము కడలిగా మారిన సమయమున వారి దేహములు ఆనందమలయే గా ఆనందస్వరూపముగా/ఆనందపర్వతమైన అరుణగిరిగా తననుతాను మలచుకుంటున్నది.
నిద్రా-జాగ్రత్-సుషుప్తి దశలను అధిగమించి,అంతర్ముఖమై ఆనందావృష్టిలో/
సుధాసారాభివర్షములో మునకలు వేస్తున్నది.
తిరుమాణిక్యవాచగర్ మనలను సైతము ఆ దివ్యానుభూతికి పాత్రులను చేయుటకు
ఓ మనసా! మేల్కాంచు.
స్వామి అనుగ్రహవర్షములో అనుక్షణము ఆనందించు అని తెలియచేస్తున్నారు.
అసలు మనలను తిరుపెరుంతురైలోని స్వామి దగ్గరకు చేర్చుచున్న మహానుభావుని గురించితెలుసుకొనే (క్లుప్తముగా) ప్రయత్నముచేద్దాము.
శంభుపాదాశ్రితుడు-శివజ్ఞానవతుల పుణ్యఫలము మనకు తిరువాచకమును అందించిన మహనీయుడు.వడగూరుకు చెందినవాడు కనుక ఆయనను ప్రజలు తిరువడగూరార్ అని సంబోధించేవారు.సాక్షాత్తు జగదంబ అందించిన జ్ఞానక్షీరమును పానము చేసిన మహానుభావుడు.పరమేశుని గురించి పరవశిస్తూ పాడుకునేవాడే కాని పదిమంది కోసము వాటిని భద్రపరచవలెనన్న తలపును కూడ దరిచేరనీయని తన్మయత్వముతో తరించువాడు.
భగవంతుని లీలలు బహువిచిత్రములు.భావనాతీతములు.తాను వ్రాయసగాడుగా మారాలనుకున్నాడు ఆ మీనాక్షిసుందరేశుడు.అతిథిగా వచ్చి వ్రాసే అవకాశమును,సొంతము చేసుకున్నాడు.
ఆగని అమృతధారలను ఆస్వాదిస్తూ అతి పదిలముగా భద్రపరుస్తున్నాడు ఆదిదేవుడు.అసలేమి జరుగుతోందో కూడా అవసరములేని అంతర్ముఖము ను ఆశీర్వదిస్తు,నీ మాటలు మాణిక్యములు.మరేవియును వాటిసాటిరావు అని," మాణిక్యవాచగర్" అను నామకరణమును చేశాడు వాత్సల్యముతో.కన్నులు తెరిచి చూస్తే అక్కడ అతిథిలేడు.
ఆదిదేవుని కరుణ ఆఖరి వాక్యముగా వడగూరన్ చెప్పగా అంబల్వన్ వ్రాసినట్లుగాను,సంతకము
"తిరు చిట్రంబలం" గా దీవిస్తున్నది.
అంబే శివే తిరు వడిగళే శరణం.
Wednesday, January 5, 2022
TIRUPALLI ELUCHCHI-01
తిరుపళ్ళి ఎళుచ్చి-01
*********************
పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె
పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు
ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం
ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం
శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్
తిరుపెరుత్తురైయురై శివపెరుమానే
ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె.
......
జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత.
*********
పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద్యము మనలో సూక్ష్మముగా దాగిన పరంజ్యోతిని మేల్కొలిపి మన ఇంద్రియములను సన్మార్గమున నడిపించమని విన్నవించుటతో ప్రారంభమవుతున్నది.
ఆది శంకరుల హెచ్చరిక.
దీనిని అర్థము చేసుకోవాలంటే మనకు శివానుగ్రహముతో "తిరువాదిరై-ఆరుద్ర నక్షత్ర" దర్శనభాగ్యము కలుగవలసినదే.
మార్గళి పౌర్ణమి నాటి చిదాకాశములో జ్యోతి రూపములో కదులుచు మనలను చైతన్యవంతులను చేయు చిదంబర నటరాజ దర్శనము.
సాకార-నిరాకారములను మేళవించిన స్వామి సాక్షాత్కారము.అంబరమున అగుపడు అద్భుతలీల-అనుగ్రహ హేల.
జ్యోతి కదలికలు సామాన్యనేత్రము గ్రహించలేదు.స్వామి తన కదలికలతో సమస్త భువనభాండములను శక్తివంతము చేయుచున్న సర్వోత్కృష్ట సంయోగము.స్వామి అనుగ్రహించుచున్న అద్భుతశక్తుల సహాయముతో చేతనులు తమ ఉపాధిని సంస్కరించుకొని,సాకార-సామీప-సాంగత్య-సాయుజ్యములందించు చక్కని అవకాశము.
మన చెలులు శివనోమును భక్తిశ్రధ్ధలో పూర్తిచేసుకొని,ఆరుద్ర నక్షత్ర దర్శనమును ముగించుకొని,తిరుపళ్ళి ఎళుచ్చిని ప్రారంభిస్తున్నారు.
చెలులు తిరుపెరుంతురైలో కొలువైన ఆత్మనాథ స్వామిని మేల్కొలుపుటకు మందిరము వైపునకు తమ అడుగులను కదుపుచున్నారు.దారిలో వారి దృష్టి అప్పుడే లేలేత భానుకిరణములుసోకి మెల్లమెల్లగ విచ్చుకొనుచున్న కెందామరలపై పడినది.దానిని వారు సంకేతముగా తీసుకొని స్వామిని,
ఎం పెరుమానె-మా అందరి సంరక్షకుడా
పళ్ళి-నీయోగనిద్రను చాలించి
అరుళ్ -ఆశీర్వచనములనే కాంతులుకల
కళ్లను తెరిచి,
ఎళుందు-మేల్కాంచు.అని ప్రార్థిస్తున్నారు.
కోవెలలో కొలువైన పరమాత్మ తూర్పురేఖల కాంతులుకల భానుకిరణముల ప్రసరణముతో కెందామరలు విచ్చుకొనుచున్నవి.మమ్ములను ఆశీర్వదించుటకు నీ పుండరీకములను తెరచి/మేల్కాంచి మమ్ములను అనుగ్రహించు.
ఇది బాహ్యము-వాచ్యార్థము
కాని వారు వెంటనే తమలో కలిగిన కొత్త చైతన్యముతో ఒకరితో నొకరు
చెలి!
,ఈ తామరలు ఇంతకు ముందే స్వామి పాదపద్మములను సేవించి,వరముగా స్వామి తిరుముగ-ముఖమునుండి వెలువడుచున్న తొళుకోం-కాంతులను
తిరువడి-పాదపద్మముల కాంతులను తమతోపాటుగా తెచ్చుకొని ,సూర్యకిరణముల తాకిడిచే వికసించుచున్నవా అనునట్లు మనలను భ్రమింపచేయుచున్నవి.
అని స్వామి అనుగ్రహమును కొనియాడుతూ అదే సమయములో తమ హృదయములలో దాగిన పరమాత్మను నిదురలేపుచున్నారు.స్వామి నీవు మా పళ్ళి తమో నిద్రనుండి మమ్ములను జాగరూకులను చేసి, మా ఇంద్రియములను సన్మార్గమున నడిపించు అని ప్రార్థించుచున్నారు.ధర్మ మార్గమునకు అధిపతి కనుక వృషకేతనుడా అని/
ఏట్రియార్ కొడిఉడయార్-
కొడి-పతాకగా అనుగ్రహించిన
ఉడయార్-దైవమా నమస్కారములు.
ధర్మమునకు ప్రతిరూపమైన ఎద్దును నీ పతాకముగా/వాహనముగా ధరించి
న పరమేశా! పాహి పాహి యని ప్రార్థిస్తున్నారు.
ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి
Tuesday, January 4, 2022
PASURAM-20
తిరుచిట్రంబలం-పాశురం-20
**************************
పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్
పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్
పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం
పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్
పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్
పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం
పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్
పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్.
సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః
సత్కృతాయాశ్చ మంగళం
*******************
సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు.
భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును.
అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీలించగలిగితే ఒక విధముగా భగవంతునికి చేతనులు సమర్పించే కృతజ్ఞావిష్కారము అనుకోవచ్చును.
చేతనులు తమ కృతజ్ఞలను ఆవిష్కరించలవసినపుడు మంగళము ను సూచిస్తున్నారు కదా.వారు ఏ విధమైన సంస్కారముతో పరమాత్మకు మంగళము కోరుచు కీర్తిస్తున్నారు ,
వారి నోము ఫలించి పరమాత్మకు-ప్రపంచమునకు అభేదమును తెలిసికొనగలిగినారు.
సూక్ష్మము/నిక్షిప్తము పరమాత్మగా కనుక మనము గుర్తిస్తే దాని,
స్థూల రూపమే/విస్తరణయే కదా సకల భువన భాండములు.
స్వామి స్వేచ్ఛాలీలా వినోదములే కదా,సృష్టి-స్థితి-సంహారములను దాగుడు మూతలు.
త్వమేవ బ్రహ్మ-త్వమేవ విష్ణు-త్వమేవ రుద్ర
సకలం త్వమేవ.
పోట్రి ఎల్లా ఉయర్కు తోట్రామాం పొర్పాదం
బ్రహ్మ అను నామరూపములతో
సకలసృష్టికార్యమును నిర్వహించుచున్న నీ పొర్పాదం -బంగారు పాదములకు మంగళమగు గాక.
పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్కళల్గళ్
విష్ణు అను నామరూపములతో స్థితికార్యమును నిర్వహించుచున్న నీ పాదపద్మములకు మంగళ
మగుగాక.
పోట్రి ఎల్లా ఉయర్కు ఈరాం ఇనై అడిగల్.
రుద్ర అను నామరూపములను సకల చేతనులకు జీవనపరమార్థమైన ,గమ్యమైన నీ పొన్మలర్గళ్ కు మంగళాశాసనములు.
పరమేశా! నీవే ఆది-అంతము /ఆద్యంతరహితము అను అవగాహనను మాలో కలిగించిన నీ అనుగ్రహమునకు మంగళములు.
" దర్శనాత్ అప్రశిదాసి-జననాత్ కమలాలయే
కాశ్యంతు మరణాత్ ముక్తి-స్మరణాత్ అరుణాచలే"
భగవత్ బంధువులారా,
ఆ పరమాత్మ నన్నొక పరికరముగా అనుగ్రహించి తనను తాను తెలియచేసుకొన్న/నేను మీతో పంచుకొన్నానని భావించుకొనిన
దివ్య తిరువెంబాయ అను పవిత్ర పాశురముల గురించి చదివినా-వినినా-చర్చించినా/కనీసము దోషములను గుర్తించి హెచ్చరించినా ,
ఆ అరుణాచలేశుడు తన అవ్యాజకరుణతో మనకు అండ-డండగానుండి,
అనుక్షణము రక్షించును గాక.
పరమాత్ముని అనుగ్రహముతో
ఆరుద్ర నక్షత్ర దర్శనముతో నేనొక కలమునై
" తిరుపళ్లి ఎళుచ్చిని" మీ ముందుంచుటకు ప్రయత్నిస్తాను.
అందరకు సవినయ నమస్కారములతో.
అంబే శివే తిరువడిగళే శరణం.
PASURAM-21
శివ స్వరూపులారా!ప్రణామములు.
మనము "తిరుపళ్ళి ఎళుచ్చి" అను తిరుమాణిక్యవాచగరు చే విరచించబడిన సుప్రభాత సేవలోని పది భాగములను పంచుకునే ముందు,
ఆరుద్ర నక్షత్రదర్శనము,
ఆత్మనాథ దేవాలయమూ గురించి,
కొంచము ప్రస్తావించుకొందాము.
ఇప్పటివరకు మనము తిరువెంబావాయ్ అను శివతత్త్వగ్రంధము గురించి,శివానుగ్రహముతో తెలుసుకునే ప్రయత్నమును చేసాము.
మనము ప్రస్తుతము ఆరుద్రనక్షత్ర దర్శనము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
వేదవిదులు ఆరుద్ర నక్షత్రమును ఆకాశమున దాని ఉదయమును అధ్యాత్మిక విజ్ఞానమునకు జన్మస్థానముగా భాఇస్తారు.మన చెలుల నోము ఫలించి ఆరు ఆరుద్రనక్షత్రమును దర్శించి,సామి అనుగ్రహపాత్రులై,తిరుపళ్ళి ఎళుచ్చికి/సుప్రభాత సేవకు ఉద్యుక్తులగుచున్నారు. ఇది ఆచ్యార్థము అనుకుంటే దీనిలో దాగిన ఆంతర్యము ఏమిటి అని మనము ప్రశ్నించుకుంటే,
అరుద్రనక్షత్ర అధిష్టాన దైఅమైన రుద్రుడు,
ఎర్రని-పచ్చని కాంతుల జ్యోతిరూపమై దర్శనమిచ్చే పుణ్యసమయము.
చిదంబర నటరజ నృత్య పరమార్థమును గ్రహించగలిగే సదాకాశము.
జ్యోతి సరూపముగా పరమాత్మ చేయుచున్న అద్భుత నృత్యకేళి.
తిరువాదిరై/ఆరుద్ర నక్షత్ర దర్శనమను ఆధ్యాత్మిక ఆదిదేవ నైసర్గిక నృత్యము సమస్త జగములను శక్తివంతము చేయు సంకేతము.
pPASURAM-20
తిరుచిట్రంబలం-పాశురం-20
**************************
పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్
పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్
పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం
పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్
పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్
పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం
పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్
పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్.
సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః
సత్కృతాయాశ్చ మంగళం
*******************
సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు.
భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును.
అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీలించగలిగితే ఒక విధముగా భగవంతునికి చేతనులు సమర్పించే కృతజ్ఞావిష్కారము అనుకోవచ్చును.
చేతనులు తమ కృతజ్ఞలను ఆవిష్కరించలవసినపుడు మంగళము ను సూచిస్తున్నారు కదా.వారు ఏ విధమైన సంస్కారముతో పరమాత్మకు మంగలము కోరుచు కీర్తిస్తున్నారు ,
వారి నోము ఫలించి పరమాత్మకు-ప్రపంచమునకు అభేదమును తెలిసికొనగలిగినారు.
సూక్షమము/నిక్షిప్తము పరమాత్మగా కనుక మనము గుర్తిస్తే దాని,
స్థూల రూపమే/విస్తరణయే కదా సకల భువన భాండములు.
స్వామి స్వేచ్ఛాలీలా వినోదములే కదా,సృష్టి-స్థితి-సంహారములను దాగుడు మూతలు.
త్వమేవ బ్రహ్మ-త్వమేవ విష్ణు-త్వమేవ రుద్ర
సకలం త్వమేవ.
పోట్రి ఎల్లా ఉయర్కు తోట్రామా పొర్పాదం
బ్రహ్మ అను నామరూపములతో సకలసృష్టికార్యమును నిర్వహించుచున్న నీ పోపాదం-అంగారు పాదములకు మనగలమగు గాక.
పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్కళల్గళ్
విష్ణు అను నామరూపములతో స్థితికార్యమును నిర్వహించుచున్న నీ పాదపద్మములకు మంగలమగుగాక.
పోట్రి ఎల్లా ఉయర్కు ఈరాం ఇనై అడిగల్.
రుద్ర అను నామరూపములను సకల చేతనులకు జీవనపరమార్థమైన ,గమ్యమైన నీ పొన్మలర్గళ్ కు మంగళాశాసనములు.
పరమేశా! నీవే ఆది-అంతము /ఆద్యంతరహితము అను అవగాహనను మాలో కలిగించిన నీ అనుగ్రహమునకు మనగళములు.
" దర్శనాత్ అప్రశిదాసి-జననాత్ కమలాలయే
కాశ్యంతు మరణాత్ ముక్తి-స్మరణాత్ అరుణాచలే"
భగవత్ బంధువులారా,
ఆ పరమాత్మ నన్నొక పరికరముగా అనుగ్రహించి తనను తాను తెలియచేసుకొన్న/నేను మీతో పంచుకొన్నానని భావించుకొనినా
దివ్య తిరువెంబాయ అను పవిత్ర పాశురముల గురించి చదివినా-వినినా-చర్చించినా/కనీసము దోషములను గుర్తించి హెచ్చరించినా ,
ఆ అరుణాచలేశుడు తన అవ్యాజకరుణతో మనకు అండ-డండగా
అనుక్షణము రక్షించును గాక.
పరమాత్ముని అనిగ్రహముతో ఆరుద్ర నక్షత్ర దర్శనముతో నేనొక కలమునై
" తిరుపళ్లి ఎళుచ్చిని" మీ ముందుంచుటకు ప్రయత్నిస్తాను.
అందరకు సవినయ నమస్కారములతో.
అంబే శివే తిరువడిగళే శరణం.
Monday, January 3, 2022
PASURAM-19
తిరు చిట్రంబలం-పాశురం-19
****************************
ఉన్ కయ్యర్ పిళ్ళై ఉనక్కే అడిక్కలం ఎన్రు
అంగ పళంసోల్ పుదుక్కు ఎం అచ్చ్చత్తాల్
ఇంగళ్ పెరుమాన్ ఉనక్కొండ్రు ఉరేయ్ పోంగే
ఎం కొంగై నిన్ అంబర్ అల్లార్ తోళ్ శేరక్క
ఎంగై ఉన కళ్ళాదు ఎప్పడియుం శేయర్క
కంగుళ్ పగళ్ ఎం కణ్ మట్టొణ్డ్రు కాణార్క
ఇంగి ఇప్పరిశె యమకింకో నల్గుదియేల్
ఎంగళ్ ఎన్ న్యాయ ఇది యమక్కేలో రెంబావాయ్.
.......
ఆదరమొప్ప మ్రొక్కిడిదు అద్రిసుతా
హృదయానురాగ సంపాదికి.
*************
తిరుమాణిక్యవాచగరు,
శంకణ్ అవర్పాల్ అను పాశురములో చెలులు స్వామి,
ఎళుందరుళె ఇల్లంగళ్ తిరళుం అని
స్వామి మనందరి ఇళ్ళకు విచ్చేయనున్నడు అని చెప్పుకున్నారు.అది వాచ్యార్థము.కాని నిజమునకు స్వామి వారి అంతరంగమున కొలువైయుండుటకు విచ్చేసియున్నాడు.
అన్నా మలయా పాశురములో వారు స్వామి స్వరూప-స్వభావములను సమగ్రముగా తెలిసికొన్నారు/మనకు తెలియచేసినారు.
ప్రస్తుత పాశురములో చెలులు మనకు పంచేంద్రియ-పంచతన్మాత్రల అవినాభావ సంబంధమును అద్భుతముగా తెలియచేయచున్నారు.
ఇంద్రియము పరమాత్మ అయితే దాని ఆత్మ పరాభక్తి.కనుకనే వారు,
తమ దృక్కులకు స్వామి దివ్యమంగళ
స్వరూపము దృశ్యముగా మారాలని,వారి కాయకమునకు /చేతులకు స్వామి సేవనము కారణము/కార్యముగా మారాలని,అన్నింటికి మించి,వారి హృదయమునకు ఆలంబన స్వామి భుజము కావాలని,సఖ్యభక్తిని సమర్పిస్తున్నారు.
కాని చిన్న సందేహము వారి మదిలో
పుదుక్కుం అచ్చంతాల్-భయముగా కొత్తగా ప్రవేశించినది.
అది ఏమిటంటే తమ హృదయములో నిండిన స్వామి ,తమను విడిచి పోవునేమో అని.
తిరుమాణిక్యవాచగరు,
శంకణ్ అవర్పాల్ అను పాశురములో చెలులు స్వామి,
ఎళుందరుళె ఇల్లంగళ్ తిరళుం అని
స్వామి మనందరి ఇళ్ళకు విచ్చేయనున్నడు అని చెప్పుకున్నారు.అది వాచ్యార్థము.కాని నిజమునకు స్వామి వారి అంతరంగమున కొలువైయుండుటకు విచ్చేసియున్నాడు.
అన్నా మలయా పాశురములో వారు స్వామి స్వరూప-స్వభావములను సమగ్రముగా తెలిసికొన్నారు./మనకు తెలియచేసినారు.
ప్రస్తుత పాశురములో చెలులు మనకు పంచేంద్రియ-పంచతన్మాత్రల అవినాభావ సంబంధమును అద్భుతముగా తెలియచేయచున్నారు.
ముందు జాగ్రత్తగా వారు స్వామితో
ఉనక్కే అడిక్కలం-నిన్ను శరణుకోరిఉన్నవారలము. అంతేకాదు,
ఉన్ కయ్యర్ పిళ్ళై-నీ చేతిని పట్టుకుని,నీవు నడింపించునట్లు నడ
చువారలము.
పరమేశా! మాదొక చిన్న విన్నపము.
అదియే అద్భుతమైన జీవాత్మ-పరమాత్మల సంగమము.
నీవు కాదనకుండా
ఇప్పరిశె-ఆ వరమును/బహుమతిని మా అందరికి
నల్గుదియేల్-అనుగ్రహింపుము.
మొదటిది
1) సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు.
మా కన్నులు ఎప్పుడును నిన్నే చూస్తూ-పరవశిస్తూ ఉండగలగాలి.అవి
కంగళ్-పగల్-రేపవళ్ల వ్యత్యాసమును విడిచిపెట్టగలగాలి.
బాహ్యము నుండి బయటకు రాగలగాలి.
2) కన్నులతో పాటుగా
కమలాషు నర్చించు కరములు కరములు.
ఎంగై-ఎక్కడున్నా/ఎప్పుడైనా
ఎప్పణియుం శేయార్క-నిన్ను సేవిస్తూనే ఉండాలి.
కన్నులు-చేతులతో బాటుగా మా,
ఎన్ కొంగై-మా హృదయం
అంబర్క్-ప్రేమతో
అల్లార్తోళ్-పరాక్రమవంతమైన
తోళ్-నీ భుజములను ఆశ్రయించగలగాలి.
జగన్నాథా!
నీవొక్కడవే మమ్ములను రక్షింగల భర్తవు.
తక్కిన సకలజగములు నీచే భరింపబడుచున్నవే.
నీవు మా హృదయారవిందములలో స్థిరముగా నుండి మమ్ములను సన్మార్గమున నడుపువేళ మాకేల ఇతెర చింతనలు అనుకుంటూ పొయిగైలో మునిగి,వ్రతముచేయుటకు (నిత్యానుష్ఠానములను) కదులుచున్నారు.
అంబే శివే తిరువడిగళే శరణం.
Sunday, January 2, 2022
PASURAM-18
తిరుచిట్రంబలం-పాశురము-18
****************************
అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి
విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్
కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్
తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల
పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్
విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి
కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి
పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్.
.....
డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు,
" పురుషునకు నాకు భేదము పోరయదెందు
నరయనేకత్వమునకు హానిలేదు
వాడె నేనేనె వాడను వాడొకండె
ముక్తుడట్టుల గాకున్న మూఢుడతడె"
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు పరమాత్మ ప్రక్షిత-నిక్షిత స్వేఛ్చాలీలను విశదపరుస్తున్నారు.
కావున,
పెణ్ణే! నిన్రాన్ కళల్ పాడి అని అంటున్నారు.
సామాన్యార్థమును కనుక మనము భావించుకుంటే,
నిన్రాన్-నిలబడి స్వామి
కళల్ పాడి-పాదపద్మములను సంకీర్తించుట.
కాని ఇక్కడ మనకు అందవలసిన సందేశము మన శరీరము నిలబడి అని కాదు.
ఇక్కడ మనము నిలబెట్టవలసినది మన మనసును.త్రికరణశుధ్ధిని/ఏకాగ్రతను.
అన్నా మలయన్-అన్నా- అనురాగపూరితమైన
మలయన్-పర్వతము.
ఇక్కడ నిశ్చలభక్తి,నిర్హేతుక అనుగ్రహమునకు సంకేతములుగా
నిన్రాన్ అను శబ్దము పొదగబడినది.
నిశ్చలమైన నిష్కళంకమైన మనసు కనుక దర్శించగలిగితే మనకు అనేకానేక అద్భుతాలు దర్శనమిస్తాయి.
ముఖ్యముగా ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు స్వామి యొక్క రెండు మహిమలను నొక్కివక్కాణిస్తున్నారు.
మొదటిది స్వామి పరంజ్యోతి తత్త్వము.
రెండవది సర్వ ఉపాధికత్వము/సర్వ వ్యాపకత్వము.
ఏకరూపమనేకమగుట-అనేకములు ఏకమగుట పరమాత్మ స్వేఛ్చాలీలలు.
పాశురములోని ప్రథమభాగము,మొదటి నాలుగు వాక్యములు స్వామి ప్రకాశకత్వమును ప్రస్తుతించుచున్నవి.
మూడు సంఘటనలను జోడించి మనలను అబ్బురపరచుచున్నారు మాణిక్యవాచగరు.
సూర్యోదయం ఎంత భాగ్యముచేసుకొన్నదో స్వామి తేజమును మనలకు అర్థముచేయుటకు తానొక పరికరమై పరవశించుచున్నది.
కణ్ణార్-భానుడు తన సామంతత్త్వమునకు నిదర్శనముగా కొంతసమయము మాత్రమే తన కిరణముల ద్వారా వెలుగును-వేడిని ప్రసరించి,అస్తమించుచుచున్నాడు.
తణ్ణార్-తారగైగల్-చంద్రుడు-నక్షత్రములు తమ చల్లదనమును-తళుకుబెళుకులను కొంత సమయము వరకు మాత్రమే వ్యాపింపచేసి భానూదయమునకు చోటిస్తూ తరలిపోతున్నవి.
ఒక విధముగా చెప్పాలంటేఅవి పరమాత్మ ఆదేశానుసారముగా పరిమిత సమయము వరకు ప్రభావితముచేస్తున్నవి కాని స్వయం ప్రకాశములు కావు.
మూడవ ఉపమానము స్వామి పాదపద్మములను నమస్కరించుచున్న దేవతల(ఇరంజు-వంగిన) శిరోమకుటముల మణుల కాంతిప్రసరణములు.వీటికి సమయ నిర్బంధనము లేదు కాని ప్రకాశ వ్యాప్తికి
స్థల పరిమితి కలదు.కొంతదూరము వరకే తమ కాంతిని ప్రసరింపచేయగలవు.
పరంజ్యోతి .సర్వకాల-సర్వావ
స్థలయందును స్వతంత్ర సామర్థ్యముు కల మహాద్భుత తేజోరాశి.
శాక్తేయుల నమ్మిక ప్రకారము చిఛ్చక్తి తన సృష్టి విస్తరణలో పదిరూపములుగా తనను తాను (దశమహావిద్యలుగా) మలచుకొనునప్పటి రెండవశక్తి యైన తార గా అనుకుంటే,తేజముతో ప్రకటితమైన శక్తి,తనతో పాటుగా త్రిపురసుందరి-భువనేశ్వరిగా సృష్టి విస్తరనను కావించినది.అదియే మన
పాశురము రెండవభాగములో చెబుతున్నట్లు మనకు కనిపించుచున్న,
పెణ్ణాయ్ -ఆణాయ్-ఆళియుం
స్త్రీలు-పురుషులు-మిగిలినవి అన్నియును తానుగా,అనేకములుగా-ఏకముగా,తనకు తాను విస్తరిస్తూ,పోషిస్తూ,తనలో లీనముచేసుకుంటూ వినోదించు పరమాత్మ పాదములను శరణు కోరుదాము.
కణ్ణార్ అముదమాయ్-నేత్రోత్సవమును జరుపుకుందాము.
ఓ చెలి మన స్వామి,
" కలడాకాశంబునన్ కుంభినిన్
కలండగ్నిన్ దిశలన్
ఖద్యోత చంద్రాత్మలన్
వెతకంగానేల ఆ ఈడలన్"
అని నిశ్చయించుకొని,జ్ఞానకొలనులో మునిగి,ధ్యాననోమునకు, నోమునకు తరలి వెళ్ళుచున్నారు.
అంబే శివే తిరువడిగళే శరణం.
Saturday, January 1, 2022
PASURAM-17
తిరుచిట్రంబలం-పాశురం-17
*************************
శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్
ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా
కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి
ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె
శంగమల పొర్పాదం తందరుళం సేవగనై
అంగణ్ అరసై అడియోగళ్ కారముదై
నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్
పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్
.....
శివపాదము మీద నీ శిరమునుంచరాదా
భవసాగరమీద దుర్భరవేదన లేదా
శివ శివ శివ అనరాదా
శివనామము చేదా.
తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో నామసంకీర్తనము-పాద సంసేవనము అను రెండుభక్తి మార్గములను జోడించి
అనంతికలల-స్వామి తేజోవంతములైన ,దయా సముద్రములైన బంగారు పాదపద్నముల గురించి సంకీర్తించుచున్నారు.
మున్ ఇక్కదలి చురుక్కి పాశురములో చెలులు ఏ విధముగా అమృతవర్షములో పునీతులైనారో తెలుసుకున్నాము.త్రికరణములు శుధ్ధమైన వారి పదములు స్వామి పాదార్చన సౌభాగ్యమునకు ఉవ్విళ్ళూరుచున్నవి.
వారు తమతో తాము స్వామి పాదదర్శన వైశిష్ట్యమును ఈ వ్ధముగా ముచ్చటించుకొనుచున్నారు.
పోతనామాత్యుల వారు చెప్పినట్లు,
తను హృద్భాషణములను స్వామి కైంకర్యమునకు మరక్చుకొనుచున్నారు.
చెలి! నీకు ఈ విషయము తెలియునా?
మనమీది నిర్హేతుక కృపతో అనేకానేక ఆశీర్వచనములతో స్వామి తనకుతానుగా మన గృహములకు తరలివస్తున్నాడు.మనము ఏ మాత్రము అలస్త్వమును కాని/సోమరితనము కాని/అజాగరూకతను కాని పొందక స్వామి పాదములను అర్చించుకుందాము.
స్వామి పాదములు
కోద్-దోషములను/పాపములను
ఆట్టి-హరించివేయునవి/తొలగించునవి.
మనమందరము స్వామి రాకను స్వాగతించి,
పదములె చాలు దేవా నీ
పద ధూళులె పదివేళు అని సంకీర్తిస్తూ
తన్మయత్వముతో సేవించుకుందాము అని అనగానే
కొంఘుం-సువాసనతో కూడిన
కరుణ్-అందముగా ముడుచుకొనిన
కురలి-కేశములు గల ఒక చెలి/అరాల కుంటల
ఇందులో అంత విసేషమేమున్నది అన్న భావముతో నున్న సమయమున తక్కిన చెలులు ఆమెను సమీపించి,
చెలి మనము ఇప్పుడే స్వామిపాదపద్మముల యొక్క ప్రత్యేకతను తెలిసికొందాము.
ఒకసారి-
అడియోంగల్ కారముదై-స్వామి తిరుపాదములు సేవిద్దామంటే కానరాలేదు.
అనగానేఅమాయకముగా ఎవరికి కనపడలదు? ఎందుకు కనపదలేదు? అని తన చెలులను ప్రశ్నించింది.
ఎవరికంటే ,
1 శన్-కనవన్ పాల్-కెందామరల వంటి కన్నులున్న పుండరీకాక్షునకు /హరికి
2.తిశై ముగన్ పాల్-చతుర్ముఖుడైన బ్రహ్మకు
3.దేవర్ గణ్ పాల్-సకల దేవతా సమూహములకు
4.అంగణ్-రాజ్యాధిపతులకు
ఎందుకంటే -మనకు తెలియచేయుటకు వారందరు స్వామి అనుగ్రహముతో పేదర్శించిన లీలా విశషము అది.
కనుకనే,
ఎంగుం-ఎక్కడెక్కద వెతికినను వారు
ఇలాదరోర్-స్వామి పాదపద్మములను కనుగొ
నలేకపోయిరి.
స్వామి తనకు తానుగా మనలను కరుణించవలెను కాని స్వామి దర్శనము సేవనము మనకు/జీవులకు సాధ్యము కాదు అని,వారందరు జ్ఞాన పద్మములతో నిండిన ,స్వామి అనుగ్రహమనే పొయిగైలోకి,
పాయిం-దూకి/మునిగి
స్వామి గుణగనములనే జలములను దోసిళ్లలో నింపుకుని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ,ఒకరికి ఒకరు సాధనలో తోడ్పడుతూ శివనోమును నోచుకొనుటకు వెళ్ళుచున్నారు.
అంబే శివే తిరువడిగళే శరణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...