Posts

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-02

Image
  " యస్యామిదం కల్పితమింద్రజాలం   చరాచరం భాతి మనోవిలాసం   సచ్చిత్ సుఖైకా పరమాత్మరూపా   సాకాశికాహం నిజబోధరూపా."  పద విభజన  యస్యాం-ఇదం-కల్పితం+ఇంద్రజాలం+ భాతి+చరాచరం_ మనోవిలాసం+ పరమాత్మరూపా+సుఖ=ఏక సత్+చిత్+అహం+స+కాశికా+రూపా+నిజబోధ.  " ఎవ్వనిచే జనించు,జగమెవ్వని లోపలనుండు " అన్నారు మహాకవి పోతన.ఎందుకు పరమాత్మను ఎవ్వడు అన్నాడో ఆలోచిస్తే అపరిమిత మూలశక్తికి పరిమిత నామరూపములతో సంబోధించలేము కనుక."  దిక్కెవ్వరు ప్రహ్లాదుకు?దిక్కెవ్వరు పాండు సుతకు? దీనులకెపుడున్,  ఆనిర్వచనీయ పరమాత్మ ఇంద్రజాల ప్రసక్తి/ప్రశస్తియే ప్రస్తుత శ్లోకము.  యస్యాం ఇదం-ఇద్గా/దీనిగా/ప్రపంచముగా చెప్పబడుతున్న చరాచరము   స+ పరమాత్త్మ= ప్రపంచము. ఈ ప్రపంచము, 1.యస్యాం సః ఇదం పరమాత్మ నిర్మితం 2.యస్యాం సః ఇదం చరాచరమయం 3.యస్యాం సః ఇదం మనోవిలాస కల్పితం 4. యస్యాం సః ఇదం (భాతి)ప్రకాశం 5. యస్యాం ఇదం సః కాశికా నామం 6.యస్యాం సః ఇదం తత్త్వ బోధా రూపం 7. యస్యాం సః సత్+చిత్  ఇంద్రజాలం.   జగద్గురువులు మొదటి శ్లోకములో జీవుల మనో ప్రవృత్తి-నివృత్తుల ఫలితములను విశ్లేషించిన తదుపరి,ప్రస...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAMU -NIJABOEDHA-01

Image
   జగద్గురువులు "కాశీపంచక" స్తోత్ర రాజమును మనోనివృత్తిః అంటూ  ప్రారంభించి,కిం అస్తి అనిపూర్తిచేశారు.ఇదే విషయమును శ్రీకృష్ణభగవానుడు సైతము "శ్రీమద్భగవద్గీట"లో చివరిదైనమోక్ష సన్యాస యోగములో,  " ప్రవృత్తించ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే    బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః"     అంటూ సకల చరాచర బంధ-మోక్షములకు కారణము వారి మానసిక ఆలోచనల ప్రవేశము-నిష్క్రమణము (ప్రవృత్తి-నివృత్తుల) పేరిట చేయున్న వింతాసములు.   ప్రవృత్తులు అసత్తులో దాగియున్న సత్తును చూడనీయదు.దానికి కారనమును గుణత్రయవిభాగ యోగము  ' అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహమేవచ,తమస్యేతాని జాయంతే'  చీకటితోనున్న మనసులో ప్రవృత్తులు చేరి ప్రమాదకరమైన మోహమును కలిగిస్తూ,ప్రకాశమును చూడనీయవు.   ఆ చీకటి తొలిగించేందుకు ,వెలుతురునుచూపించేందుకు ఒక సహాయము కావాలి.ఆ సహాయము స్వఛ్చమైనదిగా-సారవంతమైనదిగా ఉండాలి.అదియే తీర్థరాజమైన జ్ఞానగంగా ప్రవాహము. ఆ ప్రవాహము నిన్ను మణికర్ణిక శ్రవనభాగ్యమునందించునదైన-శత్రువులను దహించగలిగినదైన మణికర్ణిక నుచేర్చుతుంది.  ఇదిమొదటి మజిలీ.  ఆ మణికర్ణిక మనచీకట్లను త...

ASYA ASTI ITI KASI@ KASI PAMCHAKAM-01

Image
 " మనో నివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికాచ    జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశీకాచ నిజబోధరూపా"    పదవిభజనము    మనోనివృత్తి-పరమ-ఉపశాంతి-సా-తీర్థవర్యా-మణికర్ణికాచ-జ్ఞానప్రవాహ-విమలాది గంగా-నిజబోధ రూపాచ-సా కాశికా.      సా-దేనినైతే ఇది అని వర్ణించలేమో/ఏదైతే నామరూపములు లేనిదానిగా    కాశికా-కాశ/ప్రకాశ స్వభావముతో నున్నదో     అది- ఆ మూలపదార్థము  నిజబోధ రూపా-తన గురించి మన బుద్ధికి తెలియచేసే స్వభావముతో ఉన్నది.  ప్రకాశము దాని రూపము  ప్రబోధము దానిలక్షణము.ప్రవాహ రూపముగా  ప్రకటనమగుచు జ్ఞానమును  ప్రబోధనము  చేయుట దాని  ప్రత్యేకత. చూడగలిగిన ఒక పుణ్య   క్షేత్రము  చూపిస్తూ అందులో సాక్షిగా నున్న మూలపదార్థమును దర్శింపచేయుట దాని ధ్యేయము.     ఆ బోధనము ఐదు ప్రయోజనములను జీవులకు కలిగిస్తున్నది.  1.మనో నివృత్తి  2.ఉపశమనము  3.మణికర్ణిక గట్టు పరిచయము  4.ఉపశమనము  5.ఆత్మబోధనము.         బాహ్యమునకు కాశీపట్తనము మానసిక అలజడులను తగ్గిస్తు...

ASYA ASTI ITI KAASI @ KAASI PAMCHAKAM

Image
     ఓం నమః శివాయ   **********  " దేహో దేవాలయః ప్రోక్తో సనాతనః    త్యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్"          (లక్ష్మీనారయణ సంహిత)    ఇదే వ్షయమును సులభశైలిలో కాశిపట్టనముతో పోలుస్తూ,పుణ్యక్షత్రముగా/పరమాత్మ నివాసముగా సమీక్షిస్తూ, జగద్గురు  ఆదిశంకరులు "కాశీ పంచకము" అను శీర్షికతో మనలను అనుగ్రహించారు.    ప్ర+ఉక్తః-ప్రకృష్టముగా చెప్పుచున్నది    సనాతనము ఏమని?   సః+అహం -పరమాత్మగానేనే నీదేహములోఉన్నాను అన్న సత్యమును.ఆవిషయం అర్థమయితేనే జీవుడు సోహం/అద్వైత భావముతో పరమాత్మను గమనించగలడు/దర్శించగలడు/సంస్కరింపబడగలడు.    కాని ఆ స్థితిని చేరనీయకుండా ఒక అవరోధము,అదే  దేహమేనేను అన్న భ్రాంతి హృదయము నిండా యుండి,  నేను దేహము కాదు-నాలో దాగి యున్న పరమాత్మయే నేను అన్న భావన కలగాలంటే ,ఏమి చేయాలో కూడా చెబుతోంది శ్లోకము.    నీ మనసులోఇన్నాళ్ళు నిలిచియున్న భావనలనే అజ్ఞానమును  త్యజేద-విడిచిపెట్టు.తత్ఫలితముగా క్నానము,ప్రకాశము,దైవము నీకు దర్శనమిస్తుంది.   ఐదు శ్లోకములతో ఆవిషకర...

FALASRUTI@ SIVATANDAVA STOTRAMU@ SIVATANDAVASTOTRAMU

Image
     స్తోత్ర పథనము-స్మరణము-లేఖనము అసేషఫలప్రదము.  "శివతాండ స్తోత్రము" అందులకు మినహాయింపు కాదు.   నర్మగర్భముగా దశవక్త్రగీతం అని ప్రస్తావించారు.పది ఇంద్రియముల ప్రార్థనమే పది నాలుకల ప్రార్థనము.  ఇంద్రియములను జయించినవారలు ఈ "శివతాందవ స్తోత్రము"ను పఠించిన/ధ్యానించిన వారికి "స్థిరముగా" రథములు-గజములు-తురగములు కూడియున్న లక్ష్మీదేవి సుముఖత్వముతో బహుప్రీతితో శంభుని ఆనగా దదాతి -ఇస్తుంది-ప్ర దదాతి-విశేషముగా ఇస్తుంది.  ఇది కథను అనుసరించి.      ఛందస్సు గురించి ఒక్క సారిప్రస్తావించుకుందాము.అతిముఖ్యమైన  "పంచ చామరవృత్తము"పదహారు అక్షరములు"పదహారుకళలు.పదహారు ఉపచారములు."  ఒక లఘువు+ఒక గురువు   శివశక్తులు-జీవుడు+దేవుడు+ వరము+ప్రదానము  పునరపి+పునరావృత్తి రహితము.    ఆ గురులఘువులలోని ఆంతర్యము.  ఇక్కడ స్థిరనివాసము చేసుకొన వలసిన గుఋఋఅములు-ఏనుగులు-రథము మనముచూసేవి కాదు.ఇవిసంకేతములు.ఇదేవిషయము "శ్రీసూక్తము"లో సైతము ప్రస్తావించబడినది.  "అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం" అంటూ.    స్థిరముగా మనహృదయమనే రథములో లక్...

TANOTU NAH SIVAH SIVAM@ SIVATANDAVA STOTRAM

Image
    వారిఎదలోశంభుదేవుడుప్రకాశించునునిరతము   వారిపలుకు శైవమంత్రము పరవశమ్మునమ్రోగును   వారె శంకరచరణ దాసులు వారి  దీవెన చాలును   కథానుసారముగా సమదృష్టినిపొంది సుఖమైన మనసుతో శంకరభజనమును చేయగలిగిన రావణునికి ఆ తారక మంత్రమును పదిమందికీందచేయాలనే న= అన్యథా గతి అని   'ఇమం హి నిత్యమేవ ముక్త ముక్తమోత్తమం   పథన్ స్మరన్ బ్రువన్నరోవిశుద్ధిమేతి సంతతం   హరే గురౌ సుభక్తిమాశు యాతి "నాన్యథాగతిం"   విమోహనం విదేహినాం "శు శంకరస్య"చింతనం   పూజావసాన సమయేదశవక్త్రగీతం    తస్యస్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం   లక్ష్మీ సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః   శివ అంటే చైతన్యం-ప్రాణం-స్పందన-శుభం-మంగళం.శివ తాందవం అంటే ప్రాణస్పందనకు ప్రతిరూపం.   ఆ తాండవంతిలకించుటకై ప్రకృతి వేయికన్నులతోఎదురుచూస్తు రంగం  సిద్ధం చేసుకుంటుంది.గాలులు పిలకింతలతో చల్లగావీవెనలు వీస్తుంటాయి.ఆకాశం బంగరువర్ణంపులుముకుని గుడుగుగుగా మారి స్వామిని సేవిస్తుంటుంది.పక్షుల కిలకిలలు వేదనాదము చేస్తుంటాయి.తుమ్మెద ఝంకారము సన్నాయినూదుతుంటుంది.గంగమ్మ వేదికను పునీతము చేస్తుంటుంది.నాగు...

TANOTU NAH SIVAH SIVAM=26@SIVATANDAVASTOTRAMU

Image
      "వాగర్థావివసంవృక్తౌ  వాగర్థప్రతిపత్తయే   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"   కథానుసారముగా స్తోత్రకర్త సుకృతమో సదాశివ అనుగ్రహమో ఒకదానిని మించి మరొకటి పోటీపడుతు,   ప్రతి సుఖమునకు కారనము తమ సామర్థ్యమే అన్న దేహ భ్రంతితొలగి న-మః నేనుకాదు నాలోదాగియున్న ఈశ్వరచైతన్యమే మూలకారణమన్న విషయము బోధపడినది.  " కదా నిలింపనిర్ఝరీ నికుంజ కోటరే వసన్    విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్    విముక్త లోలలోచనో లలాట ఫాలలగ్నక    "శివేతి" మంత్రముచ్చ్రేత్ సదా సుఖీభవామ్యహం"      జీవుని రెండువిషయములు సర్వం శివమయము అన్న భావనలో రమించుటకు అడ్డుపడుతున్నాయి.అవి,  చంచల నేత్రములు నిశ్చలత్వమును వీడి బాహ్యదర్శనము వైపునకు పరుగులు తీస్తున్నాయి.    దానికితోతోడుగా ,  చంచలమైన మనస్సు శిరసానమామి ఈశ్వరదివ్యతేజం అననీయుటలేదు.    ఈ రెండింటికి ఏకాగ్రత వస్తేకాని శివ మంత్రమును వాకునకు ఆభరనముగా,సవినయ శివచైతన్య దర్శనమునకు మనస్సునకు శిరసా నమామి అను ఉపచారముగా సమర్పించుటకు ఫాలనేత్రమున్న అజ్ఞాచక్రమున పరమాత్మనునిలిపి తురీయావ...