Posts

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM-05

Image
   "  కాశీక్షత్రం  శరీరం త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా   భక్తిః శ్రధ్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగః   విశ్వేశోయం తురీయం సకలజన మనఃసాక్షిభూతోంతరాత్మా   దేహే సర్వం  మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్కిమస్తి".    పదములవిభజన   సరీరం-కాశీక్షత్రం   జ్ఞానం-గంగా (వ్యాపినీ)   భక్తి+శ్రద్ధ-గయ అహం   గురుచరణ ధ్యానం-ప్రయాహ   ఇయం విశ్వేశ-తురీయం   మనఃసాక్షి-అంతరాత్మ   మదీయ దేహే వసతి-సర్వం   పునః-తిరిగి     నానుండి వేరుగా /పవిత్ర తీర్థముగా   అస్తి-కిం -ఏదిఉన్నది.    నా శరీరముకాశీక్షత్రముగా భాసించుచున్నది.అందులకు కారనము పవిత్ర గంగానది నా జ్ఞానముగా ప్రవహించుచున్నది. అందువలన నాలోని భక్తిశ్రద్ధలు గయ క్షత్రముగా పరిణితిని పొందినవి.నా శరీరమనే క్షత్రములో విశ్వేశ్వరుడు ఆత్మగా/అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు.అందువలన నాబుద్ధి ప్రచోనమై గురుపాదానురక్తి/గురుపాదభక్తి ప్రయాగ క్షేత్రముగా పవిత్రమొనరించుచున్నది.నేను కాశిగా ప్రకాశించుచున్న వేళ తిరిగి తిరిగి దర్శించవలసిన బాహ్య తీర్థములేమున్నవి.నా ...

ASYA ASTI ITI KASI @NIJABODHA-04

Image
   " గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః    యజ్ఞాయా చరితః కర్మ సమగ్రం ప్రవిలీయతే"     దేహాభిమానము -మమకారము ఏ మాత్రము లేనివాడు ప్రకాశమనే పరమాత్మ జ్ఞానము నందే మనసును లగ్నముచేయగలడు.తత్ఫలితముగా కర్మఫలితముల విముక్తుడై కాశిగా ప్రకాశించగలడు.  "నమాంకర్మాణి లింపతే-కర్మలు-కర్మఫలితములు నన్ను తాకవు" చేతనుడు,    అట్టిస్థితిని చేరాలంటే,  ఏది చూసినను-విన్నను-మనసునకు పట్టించుకొనక-వాటిని ఒకదానితో ఒకటి కలువనీయక ,  ఉదాహరణమునకు,   ఒకమాటను(నచ్చను) చెవి వినిపించినది.వెంటనే మన నోటితో వారికి బదులీయకౌండా నియంత్రించుట,   ఒక కన్ను ఏదో సుందర దృశ్యమును చూపించినది-వెంటనే మోహముతో దానిని స్పృశించకుండా,    ఇంద్రియ సంయమనములను చూస్తున్న రూపములను నిగ్రహ యజ్ఞమునందు ఆహుతి చేయుటమొదటి స్థితి.    ఇంద్రియ ప్రలోభమునకు కారణమగుచున్న విషయములను నిశ్చల  యజ్ఞమునందు కారణములను ఆహుతిచేయుట రెండవస్థితి.  శబ్దాదివిషయములు ఎదురుగా ఉన్నప్పటికిని లేనప్పటికిని వాటివలన ప్రభావితుడు కాని చేతనులు కర్మలను చేస్తున్నప్పటికిని,  న కర్తృత్వం న కర్మాణి లోక...

ASYA ASTI ITI KASI @ KASIPAMCHAKAM-04

Image
     కాశ్యాహి  కాశ్యత కాశీ సర్వప్రకాశికా  సా కాశీ విదితాయేన  తేన  ప్రాప్తాహి కాశికా".   పదవిభజన   అహికాశ్యా-అహి  కాశ్యతా-అహి   సర్వప్రకాశికా   కాశ్యత కాశి   స్వభావము.కాశి  కాశ్యత  నామము    తేన-ఈవిషయమును  యేన-ఎవరు    విదిత-గ్రహింతురో  వారికి   కాశిగా  నేను/ప్రకాశముగా  నేను ప్రాప్తిస్తాను/లభిస్తాను.   కాశి కాశి నామముతో  క్షేత్రముగాను,ప్రకాశ అంతర్యామిగా జీవునిలోను సాఉన్నది ప్రకాశముగా.అటువంటి కాశి స్వరూప స్వభావములను తెలుసుకొనినవాడు కాశిగా మారును.       చేతనుడు కాశిని చూడవలెనన్న తెలుసుకొనవలెనన్న ,  'కర్మణ్యోపి బోద్ధవ్యం   బోద్ధవ్యంచ వికర్మణః   అకర్మణశ్చ బోధవ్యం   గహనా కర్మణో గతిః"  కర్మయందు అకర్మను,అకర్మయందుకర్మను దర్శించు స్థితికి రావలెను.    ఎందుకంటే కర్మలు  1.కామ సంబంధములు  2.జ్ఞాన సంబంధములుగా భావిస్తే    ఇంద్రియ ప్రేరితమైన కామసంబంధ కర్మలు బంధములను అందిస్తేర్,ఇంద్రియ ప్రేపితములు కాన...

ASYA ASTI ITI KASI @KASIPAMCHAKAM TATVABODHA-03

Image
    "విశ్వేశేయం తురీయః    సకలజన  మనస్సాక్షి భూతోంతరాత్మ"     భూతము  అనగా ఉన్నది/కనులకు కనబడుతున్నది.నింగి-నేల-నీరు-నిప్పు-గాలి అనుపంచభూతములుగా  విశ్వములో/జీవునిలో నిండియున్నవి.నిజమునకు అవిచేతములుగా  అనిపించే అచేతనములు.వానిలో దాగిన చిత్శక్తి వాటిని చైతన్యవంతముచేస్తుంది.కాని కొంతకాలము మాత్రమే.ఆ కొంతకాలములో  జీవిస్తున్న శరీరములు కోశములు అను నామముతో ఐదు విభాగములుగా /తొడుగులుగా  ఉండి  జీవులచే ఐదు తప్పులను/ఒప్పులుగా  భావింపచేస్తుంటాయి.    కానివిచిత్రము వానిలో పరిమితముగా-పరిమిత కాలము సంచరిస్తున్నప్పటికిని వాని ప్రభావమునకు లోనుగాక సత్+చిత్ శక్తివాటిచర్యలను గమనిస్తున్నప్పటికిని వాటి కర్మలను-కర్మఫలితములను పట్టించుకోదు.కనుకనే  సాక్షీభూతము అని కీర్తింపబడుచున్నది.       " ఆట కదద్వైతంబు-ఆట  అద్వైతంబు       ఒకటి-రెండు ఒకటే-ఆటనీకు.(తనికెళ్ళ భరణిగారు)   పంచకోశములుగా నిర్మితమైన ఐదు తొడుగులు చీకటిలో  నుండి తమను చేతనులుగా భావింపచేస్తున్న చిత్ప్రకాశమును కాంచలేవు. 1.మొదటిదైన అన్నమ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-03

Image
      "కోశేషు పంచ్ర్హస్వధిరాజమానా   బుద్ధిర్భవానీ ప్రతి దేహ గేహం   సాక్షీ శివః సర్వగతోంతరాత్మా   సా కాశికాం నిజబోధరూపా."  పదవిభజనము   ప్రతి దేహగేహం-ప్రతి దేహమనే ఇంటిలో   కోశేషు పంచః- అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-    ఆనందమయ అని ఐదు ప్రత్యేక స్వభావములు గల తొడుగులలో    అదిరాజ మాన-విరాజమానమై యుండియును   వానిచర్యలను గమనిస్తున్నప్పటికిని   సాక్షీ శివః-వాటిని పట్టించుకోకుండా   సాక్షిగా చూస్తున్న శివుడే/ ఆ ప్రకాశమే తత్త్వబోధను తెలియచేయుచున్న ప్రకాశము.    పరమాత్మ కర్తృత్వము-భోక్త్వత్తమును ద్ధ్తానేనిర్వహ్పిస్తున్నప్పటికిని  రెండుగా ప్రకటితమగుచున్నాడు.ఒక్కదానిని అర్థముచేసుకొనుటకు రెండు స్వరూప-స్వభావములు సహాయపడుతుంటాయి.   అవే, 1. భవాని-దేహము-----భవుడు   ఆత్మ 2.భవాని-జీవాత్మ-భవుడు-పరమాత్మ 3.భవాని-విభాజ్యము (పంచకోశములు-పంచేంద్రియములు-పంచతన్మాత్రలు -భవుడు-అవిభాజ్యము 4.భవాని-సగుణము-భవుడు నిర్గుణము 5.భవాని-సాకారము-భవుడు నిరాకారము 6.భవాని-ఇంద్రియసహితము-భవుడు ఇంద్రియ రహితము 7.భవాని క్షత్రము...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM NIJABODHA-02

Image
     జగద్గురువులు కాశీపంచక స్తోత్ర రెండవ శ్లోకమును "యస్యాం ఇదం కల్పితం" అంటూ ప్రారంభించి నిజబోధరూపా అంటూ ముగించారు.    ఈ కల్పితములో దాగి ప్రకాశిస్తున్నది సత్+చిత్ రూపము.శాశ్వతమైన తాను అంతర్యామిగా ఉన్నట్లుగా మనము భావించనీయనిది మన మనస్సు.అది లేనిదానిని ఉన్నట్లుగా/ఉన్నదానిని లేనట్ల్యుగా మనలను భ్రమింపచేస్తుంది.అదేకాదా "ఇంద్రజాలం"    లేని నీరు ఉన్నట్లుగా ఎడారిలోనిమృగతృష్ణ ,తిరుగుచున్న భూమి నిశ్చలముగా నున్నట్లు,సూర్యుడు ఉదయాస్త్తమయములు చేస్తున్నట్లు,కేవలము శరీరమే "నేను" అని అనుకునేలా చేస్తుంది ఆ ఇంద్రజాలం.       ఇంద్రియాతీతము/ఇంద్రియాధీనము అను రెండు అంసములను గమనిస్తేజీవులు/వారి మనోభావములుఇంద్రియాధీనములు.వారు కాశిని క్షేత్రముగా మాత్రమే భావించగలరు కాని తమ హృదయ స్థానముగా గమనించలేరు.గంగను తీర్థముగాను దేవతామూర్తులను మాత్రమే దర్శించగలరు కాని వానిలో దాగి ప్రకాశిస్తున్న పరమాత్మను " ఏకం సత్" గా భావించలేరు.నేను-నీవు అనే ద్వంద్వములకు బందీలు వారు.  పంచభూతములకు-పంచేంద్రియమూలకు సైతము  గల    అవినాభావ సంబంధము ప్రపంచముగా ఉన్నట్లుంటుంది. ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-02

Image
  " యస్యామిదం కల్పితమింద్రజాలం   చరాచరం భాతి మనోవిలాసం   సచ్చిత్ సుఖైకా పరమాత్మరూపా   సాకాశికాహం నిజబోధరూపా."  పద విభజన  యస్యాం-ఇదం-కల్పితం+ఇంద్రజాలం+ భాతి+చరాచరం_ మనోవిలాసం+ పరమాత్మరూపా+సుఖ=ఏక సత్+చిత్+అహం+స+కాశికా+రూపా+నిజబోధ.  " ఎవ్వనిచే జనించు,జగమెవ్వని లోపలనుండు " అన్నారు మహాకవి పోతన.ఎందుకు పరమాత్మను ఎవ్వడు అన్నాడో ఆలోచిస్తే అపరిమిత మూలశక్తికి పరిమిత నామరూపములతో సంబోధించలేము కనుక."  దిక్కెవ్వరు ప్రహ్లాదుకు?దిక్కెవ్వరు పాండు సుతకు? దీనులకెపుడున్,  ఆనిర్వచనీయ పరమాత్మ ఇంద్రజాల ప్రసక్తి/ప్రశస్తియే ప్రస్తుత శ్లోకము.  యస్యాం ఇదం-ఇద్గా/దీనిగా/ప్రపంచముగా చెప్పబడుతున్న చరాచరము   స+ పరమాత్త్మ= ప్రపంచము. ఈ ప్రపంచము, 1.యస్యాం సః ఇదం పరమాత్మ నిర్మితం 2.యస్యాం సః ఇదం చరాచరమయం 3.యస్యాం సః ఇదం మనోవిలాస కల్పితం 4. యస్యాం సః ఇదం (భాతి)ప్రకాశం 5. యస్యాం ఇదం సః కాశికా నామం 6.యస్యాం సః ఇదం తత్త్వ బోధా రూపం 7. యస్యాం సః సత్+చిత్  ఇంద్రజాలం.   జగద్గురువులు మొదటి శ్లోకములో జీవుల మనో ప్రవృత్తి-నివృత్తుల ఫలితములను విశ్లేషించిన తదుపరి,ప్రస...