Friday, October 30, 2020

ginjalu


 


    మీడుష్టమ శివతమ-06

    *********************


  ' ఒకపరి జగముల వెలుపల "ఒకసారి ప్రత్యక్షము అవుతాడు.అంతలోనే అంతర్ధానమవుతాదు.చిత్రవిచిత్రములతో నన్ను చిత్తుగా మోసము చేసాడు.కనపడనీకడిగేస్తా ననుకొన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది కూడా అదేగా అదేనండి అభిషేకములు.క్షణములో ఎదురుపడ్డాడు.


  ఊరకపోనీయడు కదా సాధకుని వాని సాధనను.ఊసుబోక అడుగుతున్నా అంతా సుభిక్షమే కదా అన్నాడు .ఊహించినదే జరిగింది.


 ఉడుకుమోత్తనముతో చాల్లే సంబడం.అక్షుతుశ్చమ్మే అని అడిగాని.న క్షుత్తు చ మే నాకు ఆకలి లేకుండా ఉండాలి అని అడిగాను.అనుగ్రహించానన్నావు.ఆనందించాను.కాని,


   కాని ఎక్కడిపోయింది ఆకలి.నా పక్కనే పొంచిఉండి,అదును చూసుకొని నాపై దాడిచేస్తున్నది.


  ఇక నేను నిన్ను అడిగిందేమిటి? నువ్వు నాకు ఇచ్చిందేమిటి?ఏమి తెలియనట్లు అంతా సుభిక్షమేనా అంటూ కొంటె ప్రశ్నలు.


   నువ్వే నాతో అన్నవు కదా ఒకటి వస్తే మరొకటి వెళ్ళిపోతుందని.ధాన్యరాశులను అనుగ్రహిస్తే దారి మళ్ళుతుందని ఆకలి.అందుకేగా,


    నేను నీకు అందరిచేత ఇష్టముగా స్వీకరింపబడెడి వడ్లను ఇచ్చాను నువ్వు "వ్రీహాశ్చమే" అనగానే.ఆ ఆల్పోచనలు అంతటితో ఆగిపోకూదదని ,ఆలోచనలుగానే మిగిలిపోకూడదని వీటిలో ఆధ్యాత్మికతను కలిపాను.ఏదో నువ్వు "యవాశ్చమే" అన్నావని.ఆధ్యాత్మికతతో కలిపిన ఆలోచనలను నీ జీవనవిధానము వైపు మళ్ళించాను మాషాశ్చమే అన్నవని.


  నేను అంతటితో ఆగలేదు.మళ్ళించిన దానిని నీవు గుర్తించగలుగుతావో/లేదోనని వాటికి తోడుగా స్నేహమును పెంచే తిలలను కలిపాను.వాటి స్నేహ సౌశీల్యములు నిన్ను సంతోషపరచుటకు అవి చెదిరిపోకుందా-నిన్ను విడిచి పోకుండా వాటిని ఒక్కటిగా కలిపి ఉంచే శనగలను ఇచ్చానూన్నాడు రుద్రుడు నొచ్చుకుంటున్నట్లుగా.


   అబ్బురమే ఇది.ధాన్యమును-ధ్యానమును సమగ్రముగా .ఎంతటి చమత్కారివి.అవగతమైనది నీ అద్భుత లీల.

ఆనందముతో అవధరిస్తాను-అనుసరిస్తాను.మరి అది అరికట్టుతుందా నా ఆకలిని ఇంతలోనే సందేహము ఆ దేహికి.


   అందుకేగా లౌకికదృష్టి అనే ఆకలిని కంపింపచేసి-పెకలించివేసే పెద్దశక్తిని గోధుమ అని ముద్దుగాపిలుస్తూ నీకు ఇచ్చాను.అది నీలోచిగురించి-పిందెగా మారి-కాయగా పెరిగి ఉన్న ఆద్యాత్మికతను పండుగా మార్చేందుకు మసురాశ్చమే అన్నావని వాటినికూడ కొసరి కొసరి అందించాను అనగానే ఆనందముతో సాధకుడు నామరూపములను నమ్ముకుంటే నట్టేట మునకలే కనుక తత్త్వమనే నావ తారణము అనుకుంటూ తన్మయుడై ఉన్నవేళ 


   కథలన్నీ కదిలేవే-కదిలించేది కరుణే.


    అణువణువు శివమే-అడుగడుగు శివమే.


    సర్వం శివమయం జగము.


    ఏక బిల్వం శివార్పణం.


AKALILEKUNDA

 


 మీడుష్టమ శివతమ-05

 **********************


 ఈశ్వరా నా ఈ ఆకలి నన్ను వివశుణ్ణిచేస్తున్నది.అడిగే లోపే అంతర్ధానమవుతావు.అన్నీ ఇచ్చాగా అంటావు.కనికరించు-కనిపించు వేడుకుంటున్నాడు సాధకుడు.వేదనను తీర్చకుండా ఉండగలడా వేదమయుడు.వచ్చేశాడు వరములను ఇచ్చేయాలని.


   స్వామి అక్షుతిశ్చమే-నాలోని ఆకలి లేకుండా పోవాలి.అది పోవాలంటే ,


 అక్షితిశ్చమే-కూయవాశ్చమే--- తరిగిపోని ధాన్యరాశులు నాకు కావాలి.అలాగా.అంటే ?అర్థము కానట్లు నటించడం-సాధకుని విజ్ఞతను పరీక్షించడము అదొక ఆట .


    నాకు ధాన్యము కావాలి.ఉండు-ఉండు ముందుగా నాకు ఏయే-ఏయే ధాన్యములు కావాలో చెబుతాను.వాటిని ప్రసాదించు అన్నాడు ఆర్తితో.అనుగ్రహిస్తానన్నాడు పరమాత్మ మనస్పూర్తితో.


  ఆకలిని తీర్చు వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-నువ్వులు-గోధుమలు-నీవరి ధాన్యములు కావాలీనగానే చిరునవ్వు నవ్వాడు రుద్రుడు అందుకేగా నేనున్నది అంటూ.


   అంతలోనే ఆదుర్దా ఆ సాధకునికి.ఇదిగో నన్ను పూర్తిగా అడగనీ.తికమక పెట్టకు.ఇస్తానన్నా కదా అని అంతో-ఇంతో ఇచ్చి ఇచ్చేసాను అంటావేమో.నేను ససేమిరా ఒప్పుకోను.నేను ఎంతెంత కావాలో కూడా చెబుతాను అన్నాడు చాకచక్యముతో.


   సరే చెప్పు అన్నడు రుద్రుడు చనువుగా.


    విభుచమే-ప్రభుచమే-బహుచమే-పూర్ణంచమే-పూర్ణతరంచమే అంటూ నొక్కిచెబుతున్నాడు మక్కువతో.


   అధికమైనవిగా-కాదుకాదు అధికమంటే అధికము మాత్రమే కాదు-కొంచము అధికము-కాదుకాదు కొంచము అధికము మాత్రమేకాదు-మిక్కిలి అధికముగా.


  పరిణామమే ప్రమాణమా అన్నాడు పరమాత్మ ప్రసన్నముగా.ఆలోచనలో పడ్డాడు సాధకుడు.అసలీ అధికములు ఏమిటి? దానికి అంతమెక్కడ? అదిగో నన్ను అడుగుటకు సందేహములు-సంకోచములు ఎందుకు? ఇచ్చేందుకు నేను సిధ్ధముగానే ఉన్నాను కదా అంటూ సుతిమెత్తని స్వరము సూచనలను అందిస్తున్నది.


    అదే అదే ఈ సారి వివరముగా అడుగుతాను.పూర్ణముగా-పూర్ణ తరముగా లోటు అనేది అసలు లేకుండా అనుగ్రహించు. ఆ అనుగ్రహమే ఆకలిని తరిమివేస్తుంది అన్నాడు సాధకుడు డగ్గుత్తికతో కనులు మూసుకుంటూ.కదిలాడు కాలకాలుడు సాధకుని కరుణిస్తూ.


  కదిలేవికథలు-కదిలించేది కరుణ.


     సశేషము.


   సర్వం శివమయం జగం.


   ఏక బిల్వం శివార్పణం.

MEEDUSHTAMA SHIVA-04

 



   మీడుష్టమ శివతమ-04.

  ***********************


  సాక్షాత్కరించాడు రుద్రుడు సాధకుని శిష్యత్వమునకు చిన్ని జిలుగు దిద్దటానికి.ఏమయ్యా సాధకా! ఎలా ఉంది నీ గురువుగారిపాఠము? అంటు గుట్టువిప్పించాలనుకున్నాడు 


 క్షత్రాణాంపతయే నమోనమః అంటు కరములు జోడించాడు సాధకుడు.


    క్షత్రమేమిటి?దానికి పతి ఏమిటి?దానికి నాకు ఉన్న సంబంధమేమిటి?ఎందుకు నన్ను అలా సంబోధించావు అంటూ అడిగాడు ఆశ్చర్యమునునటిస్తూ ఆ ఆటలాదేవాడు.


    పరాత్పరా! కదిలేవి కథలు వాటిని కదిలించేది నీ కరుణ.కాదనకుందా నేను చెప్పేది పూర్తిగా విను.అవగాహనారాహిత్యమును అడ్డగించు.మా గురువులు సృష్టి రహస్యములను సులువుగా అర్థము చేయించారు.


    ఏమిటా రహస్యములు? అన్నాడు ఆ ఎరుకలవాడు.


    ఇప్పుడు మనము అనాత్మకముగా భావించే జగతి ఒకప్పుడు ఆత్మస్వరూపమే.అది అప్పుడు గుప్తముగా నున్నది.అందులో నేను నా సంసారము కూడా ఉంది.అయితే అది గుప్తముగా ఉంది.కాని నిజమునకు ఇప్పుడు జగము ఆత్మ స్వరూపమే-అప్పుడు ఆత్మస్వరూపమే.అప్పుడు గుప్తము.ఇప్పుడు ప్రకటనము అన్నాడు రుద్రునితో .


  బాగున్నావయ్య! గుప్తమంటావు-ప్రకటనము అంటావు.రెండింటిలో ఆత్మ ఉందని అంటావు.అదెలా సాధ్యం అన్నాడు అంతర్యామి అలవోకగా నవ్వుతూ.


    నేను నీకొక ఉదాహరణతో వివరిస్తాను విను శ్రద్ధగా అన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది అదేకదా.ఒక మఱ్ఱివిత్తనము భూమిలో పాతబడుతుంది.కొన్నాళ్ళు అది భూమిలోనేఉంటుంది.(గుప్తముగా) మనకు కనబడకుందా.అదే భూమి సహాయముతో అది కొత్త రూపమును కొమ్మలతో-రెమ్మలతో-ఆకులతో-ఊడలతో విస్తరిస్తుంది.కాలకర్మేణ మళ్ళీ విత్తుగా మారిపోతుంది.ఇక్కదమార్పులు జరుగుతున్నది విత్తనమునకు-వృక్షమునకు కాని భూమికి కాది.మరొక విషయమేమిటంతే విత్తనము భూమిని ఆధారము చేసుకొనే గోప్యముగా నున్నది.చెట్టుగా విస్తరించి రూప్యముగాఉన్నది.కాని భూమి మాత్రము తన అస్థిత్వమును కోల్పోలేదు.అంతేకాదు రెండింటికి ఆధారభూతమైనది.


    అబ్బో చాలా విచిత్రమే ఇది అన్న రుద్రుని చూస్తూ,నీవేక్షేత్రపతివి-వృక్షాణాం పతివి వాటికి మూలమైన ఆత్మ స్వరూపానివి అంటూ స్తుతిస్తున్నాడు సాధకుడు.


    నామరూపాలతో ఆగిపోతే ఇసుకలో దిగబడిపోయిన కాలు ఏ విధముగా కదలలేదో,అదే విధముగా తత్త్వమును గ్రహించే ప్రయత్నము చేయలేకపోతే అక్కడే ఆగిపోతుంది.దాన్ని చూస్తూనే నన్ను పట్టుకో అంటూ అంతరాత్మ పలుకుతున్న వేళ కనులు తెరిచిన సాధకునికి కానరాలేదు రుద్రుడు ఎదురుగా.


   అణువణువు శివమే-అడుగడుగు శివమే.


    సశేషము.


   సర్వం శివమయము జగము.

MEEDUSHTAMA SIVATAMA-03

 


 మీడుష్టమ శివతమ-03

 *********************


  " న రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రును భజించలేడు.అని ఆర్యోక్తి. జీవుడు రుద్రుడు ఎలా అవుతాడు?అనే సందేహము మనకు రావచ్చును.సకలము వికలముగా మారుతున్నాప్పుడు విస్తృతరూపమును ప్రకటించుకొనునప్పుడు అందులోని చిన్న శకలమే జీవుడు.ఇది కాదనలేని నిజము .సాధకుడు రుద్రుని అనుగ్రహము వలన అన్నాదులను వాటి ఉపయోగములను తెలుసుకున్నాడు.తృప్తిచెదాడా వాటితో అని అంటేలేదనే చెప్పాలి.చ మే నాకు కావాలి.అది కావాలి-ఇది కావాలి-ఇంకా--ఇంకా అంటూ ఇబ్బంది పడుతున్నాడు.


 ముసిముసి నవ్వులతో ముక్కలను కదిలిస్తున్నాడు ముక్కంటి.మరింక నేను వెళ్ళిరానా అంటూ ముక్తాయింపు పలికాడు.


   ఆగవయ్యా ఆదిదేవా! అన్నీఅడుగు-అన్నీ అడుగు అంటూనే ఆలోచించుకోనీయక్యండా -అడుగనీయకుండా అయిపోయిందా అంటున్నావు.అమ్మో చమత్కారివే.


  ద్రవిణంచమే-యంతాచమే అని కద నీచమకము చెబుతున్నది.నన్ను ఉధ్ధరించగలుగు మంచి గురువును అనుగ్రహించు అన్నాడు సాధకుడు సాగిలపడుతూ.


  సరే అలాగే కానీ.గురువుద్వారా నీవు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నాడు రుద్రుడు అమాయకముగా.


   సంవిచ్ఛమే శివా అనగానే అంటే,అదిగో మళ్ళీ అదేఅల్లరి అంటూ ఆనందముతో,


    వేదశాస్త్రముల విజ్ఞానమును పొందుతాను.పొందిన దానిని పదిమందికి పంచే శక్తి నాకు కావాలి అందుకే జ్ఞాత్రంచమే అది నువ్వేఇవ్వాలి.అంతే కాదు పదిమందికి చెప్పేందుకే నీతులు అని నేననిపించుకోకూడదు.నేను సత్ప్రవర్తనను కలిగియుండాలి కనుక సుగంచమే.


    ఆ ఆర్ష సంస్కారము చేత ప్రతి సుప్రభాతము సుదినముగా పరిణితిని పొందాలి అన్నాడు సాధకుడు భక్తిపారవశ్యముతో.అంతర్థానమయ్యాడు వాడినెదుట నున్నావాడు.


  అణువణువణువు శివమే-అడుగడుగు శివమే.


   సశేషం.


  సర్వం శివమయం జగం.


    

Saturday, October 24, 2020

MEEDUSHTAMA SIVATAMA-02

 


    మీడుషటమ శివ-02

   ***********************


   న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.


  సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.


   నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు  వస్యశ్చమే అని అడిగాను.  .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అని అడిగాను.ఆ నాగలి స్థితప్రగ్నతకు ప్రతిరూపమా అన్నట్లుండాలి.


  అంతే కాదు.నేను చ కూద  కూద అంటుంటూనే ఉంటాను.నీ అనుగ్రహిస్తూనే ఉండాలి అన్నాడు సాధకుడు. 


   మందహాసముతో మారసంహారకుడు మరినేను వెళ్ళిరానా అన్నాడు.


   మారాముగా సాధకుడు నాకు శాస్త్రప్రమాణములు స్నేహితులవలె సౌమనస్కులుగా కావాలి అన్నాడు.ప్రస్తుతము వీటిని స్వీకరించి పనిని ప్రారంభించు అన్నాడు పరమేశ్వరుడు.


  అణువణువు శివమే-అడుగడుగుశివమే


       సశేషం


  సర్వం శివమయం జగం.

MEEDUSHTAMA SIVATAMA-01

 


    మీడుస్టమ శివ-వరములను వర్షించు-01

    ***********************************


  శం చ మే-


   మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?


 శం అనగా ఐహిక సుఖము.


   ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.

  తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.


     గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.


   ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.


 మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.


   కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.


   నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మాదరిచేరనీయకు. అయక్ష్మంచమే.


   అయినా అవి మా ప్రారబ్దమును అనుభవింపచేయుటకు మాదరిచేరితే వానిని పారద్రోలే ఔషధములను మాకిమ్ము.-జీవాశ్చమే.


   ఆ కాలుడు కోరలు చాచి మాపై కొక్కెము వేయాలని చూస్తున్నాడేమో? వానిని గద్దించి అపమృత్యుభయమును తొలగించుము-దీర్ఘాయుశ్చమే.


   సరే నేను నీవుచెప్పినవన్నీ చేస్తాను.అప్పుడు నువ్వు వాటితో ఏమిచేస్తావు? అని ప్రశ్నించాడు శివుడు.


  అంటూనే ఉన్నాను కదయా మయశ్చమే అంటూ అన్నాడు జీవుడు


   అణువణువు శివమే-అడుగడుగుశివమే.


   అది ఏమితో రేపు తెలుసుకుందాము.


  సర్వం శివమయం జగం.

Thursday, October 22, 2020

009

 


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో


   ప్రసీద మమ సర్వదా-09

     *******************

  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.


 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి

   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"


  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.


   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.


   ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.




  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.

టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.


  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.


 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.


  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.


   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము

   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో


   ప్రసీద మమ సర్వదా-09


  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.


 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి

   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"


  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.


   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.


  మీరు ఏ మనుకోమంతే ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.




  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.

టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.


  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.


 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.


  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.


   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము

   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో

   ప్రసీద మమ సర్వదా-09

  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.

 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి
   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"

  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.

   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.

  మీరు ఏ మనుకోమంతే ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.



  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.
టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.

  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.

 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.

  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.

   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము
   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.
అమ్మే అండదండ యైనప్పుడు బ్రహ్మానందమే.

  అమ్మ ధ్యాసే మన శ్వాసగా జీవిద్దాం.

  శుభం భూయాత్.

0008

  అమ్మకు   సభక్తిపూర్వక నమస్కారములతో



  ప్రసీద మమ సర్వదా-08

  **************


 మహాగౌరి నమోస్తుతే


 "శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుచిః

  మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా"


 అష్టవర్షా భవేద్గౌరీ -తల్లి ఎప్పుడు ఎనిమిది సంవత్సరముల వయసుగల మూర్తిగా దర్శనమిస్తుందట.


  ' కర్పూరగౌరం కరుణావతారం

    సంసారసారం భుజగేంద్రహారం

    సదావసంతం హృదయారవిందే

    భవం భవానీ సహితం నమామి."


   అయ్య కర్పూరకాంటివంటి తెల్లని కాంతిగలవాడని,అమ్మ బ్రహ్మచారిణిగా ఘోరతపమాచరించుటచే,నల్లని శరీరకాంతితో నున్నదని.కాళి అని స్వామి మేలమాడినందుకు తల్లి తన శరీరఛాయను ఆకాశగంగా జలముతో పునీతము చేసుకొని గౌరవర్నమును పొంది గౌరి నామధారియైనదని ఒక కథనము.స్వామి అమ్మ కన్నులు సరదగా మూసినందులకు చీకటి తల్లి శరీరకాంతిని పొందినదని మరొక కథనము.ఏది ఏమైనప్పటికిని ఆదిశక్తి తన చర్మ కాంటిని నల్లగా ప్రకటించుకొనుట-తదుపరి తెల్లగా ప్రకాశించుట లోని పరమార్థము ప్రశస్తనీయము.


  మనము ముందర చర్చించుకొనినట్లు అసురులు తమ జీవితమును-మరనమును అత్యంత ప్రత్యేకముగా తీర్చిదిద్దుకుందురు.ఆ చాతుర్యము అమ్మ వారికి ప్రసాదించినదే.కారుచీకట్లను చీల్చుకొని ప్రకటింపబడిన కాంతి కళ్యానకారకము.మహా భుజబల సంపన్నులు-బుధ్ధి సంపన్నులు మాయపొరచే కప్పబడిన వారై,మహాద్భుతములను మనకు అనుగ్రహిస్తారు.వారిమీది వాత్సల్యముతో తల్లి వారు కోరిన విధముగా ప్రకటింపబడుతూ వారిని అనుగ్రహిస్తుంటుంది.ఏ విధముగా మన అమ్మ మనతో బొమ్మలాటలాడుతూ,మన చేతి గుజ్జనగూళ్ళు ఆస్వాదిస్తూ,మనతో దాగుడుమూతలాడుతూ మనలను మురిపిస్తుందో అదే విధముగా జగన్మాత జగతితో క్రీడిస్తూ,తనలోని చిఛ్చక్తిని వివిధశక్తి రూపములుగా ప్రకటిస్తూ,పాలిస్తూ,పరమపదము చేరుస్తుంది.


   అమ్మ లీలను గారడిగా భావించే శుంభనిశుంభులు అతి చాకచక్యముతో బ్రహ్మను తమ తపముతో ప్రసన్నుని చేసుకొని( చావులేని వరమును బ్రహ్మ ప్రసాదించలేడు కనుక) అయోనిజ శరీరమునుండి జన్మించిన మరో అయోనిజ చేతిలో తక్క అన్యులచే తమకు చావులేని వరమును పొంది,అహంకారులై అఖిలజగములను అస్తవ్యస్తము చేయసాగిరి.దైవకార్య నిమిత్తము జగదంబ మానససరోవరమున మునక వేయగానే నల్లని చర్మము తల్లినుండి విడివడినది.తల్లి మహా అత్యంత గౌర వర్నముతో ప్రకాశించసాగినది.అమ్మ కఠినత్వమే కటాక్షమనుటకు నిదర్శనముగా మాత నుండి వెలువడిన నల్లని చర్మము మరొక మహత్తర శక్తియై,కౌశికి నామధారియై వెలువడి నిశుంభుని నశింపచేసింది.జగదంబ కౌసికి శుంభ-నిశుంభులను నిర్జించి తమ స్పర్శచే వారిని అనుగ్రహించిరి.తమస్సు ఉషస్సును చేరి,ఉధ్ధరింపబడినది.






.ఎంతటి దయామయి గౌరీదేవి. సాధకులు గతములో చేసిన పాపములను-వర్తమానములో చేయుచున్న పాపములను తన క్షమాగుణముతో తొలగించి వేసి,భవిష్యత్తులో పాపములు చేయని వారుగా బాగుపరచును. 


  మనలను పునీతులను చేసి సిధ్ధిధాత్రి వద్దకు 

  చేర్చుట అమ్మ సంకల్పము.


  అవరోధములను అధిగమించి అమ్మ దయను పొందుట మన 

  సంకల్పము.






 . అమ్మ చెంతననున్న మనకు అన్యచింతనలేల?



   అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది.





 అమ్మ చరణములే శరణము.

Tuesday, October 20, 2020

0007

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. కాళరాత్రిః మహారాత్రిః మోహరాత్రి చ దారుణా" రాత్రిసూక్తము. అంటూ రాత్రి తత్త్వము నాలుగు విధములుగా ప్రస్తుతించబడినది.దీపావళి ముందురోజువచ్చే చతుర్దశిరాత్రి కాళరాత్రి.దీపావళినాటి రాత్రి మహారాత్రి.శ్రీకృష్ణజన్మాష్టమి మోహరాత్రి.అక్షయతృతీయ దారుణరాత్రి అని పెద్దలు చెబుతారు. అసలు మనము రోజు నిద్దరపోయే సమయమే రాత్రియా లేక రాత్రి శబ్దము ఇంకేమైన అంతరార్థమును కలిగియున్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రతిజీవి అంతర్ముఖమే రాత్రి.బహిర్ముఖమే పగలు.కర్షణాత్ కృష్ణః.సమస్తమును తనలోనికి ఆకర్షించుకొనుశక్తి కృష్ణతత్త్వము.అదియే కాళరాత్రి తత్త్వము. పరాపరాణాం పరమం త్వమేవ పరమేశ్వరి. ఇక్కడ జీవుని పరా గాను-ప్రకృతిని అపరముగాను వీటి రెండింటిలో చైతన్యమును ప్రసాదిస్తూ,ఈ రెండింటికి అతీతమైన శక్తియే కాళి. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరళమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారార్థమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రార చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొని ఆనందాబ్ధిలో తేలియాడుతుంటారు. మనశరీరమే ఆయుధగారము.మన ఇంద్రియమే మనకు సహాయకారి అను విషయమును కాళరాత్రి మాత ఆదిశక్తి నుదురునుండి ఆవిర్భవించి,వరప్రసాదుడైన రక్తబీజుని అంతము చేయుటకు,తన నాలుకనే ఆయుధముగా మలచుకొని,విస్తరింపచేసి రక్తబిందువును తాను స్వీకరిస్తూ,వానిని శక్తిహీనునిగా (రక్తహీనునిగా) చేసి,సంహరించినది. అసురుని రక్తము అమ్మను ఆవేశముతో భీకరనాట్య ప్రక్రియగా అడుగులను కదిలించినది.కాళి కదలికలు భూమిని నిర్వీర్యము చేస్తున్నవి. .ధర్మము అధర్మరక్త ప్రభావమునకు బలికాకూడదు .కరుణతో శివుడు తటస్థుడుగా అమ్మ గమనముగా అడ్డుగా పడుకుని,అమ్మను శాంతింపచేసినాడు . కాలమే కాళరాత్రి.అది.మనకున్నట్లు దానికి భూత-వర్తమాన-భవిష్యత్ దశలుండవు.దాని సంకేతమే తల్లి ఆభరణముగా ధరించిన ముండమాల.జీవుల చేతలే(పనులే) శక్తి నడుముకు కట్టుకున్న చేతుల ఆచ్ఛాదనము. .అద్భుతశక్తివంతమైన కాలము తన ప్రయాణములో మనలను(జీవులను)తనతో ప్రయాణింపచేస్తూ,సమయము వచ్చినప్పుడు మనలను విడిచివేస్తుంది.దాని వలన ఏమి ప్రయోజనము అను సందేహము రావచ్చును.మన తప్పటడుగుల సమయమున మనలను తన చేతిని పట్టి నడిపించిన అమ్మ మనకు నడక వచ్చిన తరువాత నడిచేటప్పుడు వదిలివేస్తుంది.అదే విధముగా కాలస్వరూపమైన కాళరాత్రి మాత తనతో కలిసి మనము చేస్తున్న ప్రయాణములో కొన్ని అద్భుతాలను చూపిస్తూ,ఆవేదనలను కలిగిస్తూ,అత్మ శోధనకై మనలను సవరిస్తూ-సంస్కరిస్తూ,సాధక దశ నుండి ముముక్షువుగా మలుస్తూ,స్వయంసిధ్ధతను అనుగ్రహిస్తూ,మనలను విడిచివేసి,తన ప్రయాణమును కొనసాగిస్తుంది.శరీరమనే వాహనమును నిచ్చెనవలె ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుటకు మాత్రమే ఉపయోగించుకొవాలనే వివరము ఇస్తుంది.మేడ ఎక్కిన వాడు నిచ్చెనను తనతో పైకి తీసుకువెళ్ళడు కదా.పని ముగియగానే పరిత్యజిస్తాడు. కాల స్వరూపమై కాంతిమార్గమును చూపుట అమ్మ సంకల్పము అంతర్ముఖులమై అమ్మ తత్త్వమును అర్థముచేసుకొనుట మన సంకల్పము. అమ్మ చెంతన నున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము. 00

0006

 


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో


   ప్రసీద మమ సర్వదా-06

   **************************

 

  కాత్యాయనీమాతా నమోనమః.


 " చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా

   కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ."


  అమరకోశం పార్వతీదేవిని కాత్యాయనీ నామంతో కీర్తించింది.అనేక నామ-రూపాలు అమ్మ క్రీడలు.సింహవాహిని యైన తల్లి ఘోరాఘోర రూపిణి.


  అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కత్యమహర్షిచే అమ్మాయి అని పిలిపించుకుంటూ ఆనందించింది,తండ్రిగా మునిని అనుగ్రహించింది.కత్యగోత్ర సంభవురాలు కనుక కాత్యాయినీ నామముతో కళ్యాణములను అనుగ్రహించింది.ఇది వాచ్యార్థము.


   సాధకుడు తత్ ను దర్శించవలెనన్న ,


 కతిః యానం? ఏది మార్గము? కతిః అయనం? ఎటువైపు పయనము? అని దారితెన్ను తోచని స్థితిలో నుండగా తల్లి తానే మార్గమై వారిని ఉధ్ధరించునది కనుక కాత్యాయని.ఇది పరమార్థము.


  కాత్యాయనీ మాత బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశము.ఆజ్ఞా చక్ర అధిష్ఠాన దేవతగా సాధకునకు ఏకాగ్రతను అనుగ్రహిస్తుంది.మహిషాసుర ఆగడములవలన ధర్మము క్షీణిస్తూ,గ్లనిని పొందే సమయమున క్రోధరూపిణియై ఆదిశక్తి మహిషాసుర మర్దనమున సహాయకారియైనది.ఈ రాక్షసులు తమ వాక్చమత్కారముతో విచిత్రమైన విధముగా తమ మరణములకు ప్రణాళికలనేర్పరుచుకొని,మన కొరకు జగన్మాత ఆ అవతార విశేషములను ప్రకటింపచేస్తారు.తల్లి వారిని తన ఆయుధస్పర్శచేగాని-అనుగ్రహ వీక్షణముచే కాని వీలైతే సంస్కరిస్తుంది.కాదంటే సంహరిస్తుంది.

       


  " వైయత్తు వాళ్వీరాళ్" తిరుప్పావై రెండవ పాశురములో ఆండాల్ తల్లి చెప్పినట్లు కాత్యాయనీదేవి రాక్షస సంహారమునే కాదు రక్షణ భారమును కూడా వహిస్తుంది.

 వాచక నిర్వచన ప్రకారము కాత్యాయనీవ్రతము పెళ్ళికాని కన్యలు-సంతానమును కోరు సౌభాగ్యవతులు-సంపదలను కోరు పురుషులు విధివిధానము ప్రకారము చెరుకు ముక్కలను సమర్పించి అర్చించి,అభీష్టములు తీరునని ఆనందిస్తారు.


  ఇక్కడ మనము గమనించవలసిన విషయము గోపికలు శ్రీకృష్ణుని తమ భర్తగా కోరుకుంటారు.ఇది మానవ భార్య-భర్తల సంబంధముకాదు.అనుకూల దాంపత్యము అనగా జీవాత్మ పరమాత్మను దర్శించి-స్పర్శించి-సంతుష్టినందుట.సామీప్య-సాయుజ్యములను స్వానుభములోనికి తెచ్చుకోగలుగుట.అదియే రసవత్తరమైన రాసలీల.దానికి దారిగా మారి దరిచేర్చునది కాత్యాయనీమాత.అందులకే తల్లి అనపగామిని.అంటే అపమార్గమున నున్నవారికి సన్మార్గమును చూపునది.


  ' కాత్యాయనీ నామ విద్మహే కన్యకుమారి ధీమహి

    తన్నో దుర్గి ప్రచోదయాత్."


  తన సంతానమును సంస్కరించుట తల్లి సంకల్పము.

  తత్ ను ఆవిష్కరింపచేసుకొనుట మన సంకల్పము.


 అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలేల?

  అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది.


   అమ్మ చరణములే శరణము.

 


Monday, October 19, 2020

0005

. అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-05 ****************** స్కందమాత నమోనమః ******************* "సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ" ఇంతవరకు జగన్మాత నిర్ద్వంద్వ రూపిణిగా నిరుపమాన ప్రతిభతతో జగములను సృష్టించింది."ఏకైవాహం బ్రహ్మం" అన్న నానుడి మరొక శుభపరిణామమునకు శ్రీకారముగా మహాశక్తి తన ఒడిలో మరొక అద్భుత శక్తితో మనకు దర్శనభాగ్యమును అందిస్తున్నది. ఎంత తియ్యటిమామిడి పండో అంటూ నేడు మనము ఆస్వాదించగలుగుతున్నామంటే ,ఎంతో కాలానికి ముందు.ఎవ్వరో మహానుభావుడు మామిడిటెంకను భూమిలో నాటడము జరిగిదింది.భూమి దానికి తనశక్తిని అందించి,అగ్ని చైతన్యమును అందించి మొలకగా మార్చినది.వరుణుడు అందించిన జలములతో మొలక మొక్కగా మారినది.మొక్క సూర్యకిరణములనుండి పత్రహరితమునుచంద్రుని వెన్నెలలోని ఔషధశక్తులను తనలో నింపుకుంటూ కొమ్మలతో వాయువందిస్తున్న శక్తిని తనలో నింపుకుంటూ పంచభూతాత్మక పోషణలో మహా వృక్షముగా రూపుదిద్దుకుని మధురఫలములను మనకు అందిస్తున్నది.ఇది లౌకిక ఉదాహరణము. పంచభూతాత్మికం పరమశివం అన్నది కాదనలేని సత్యము.త్రిపురారహస్య కథనము ప్రకారము స్కందోత్పత్తికి సనత్కుమారునికి వచ్చిన కల,దాని పరిణామములు అలౌకిక ఉత్ప్రేరకము. సనత్కుమారుడు దైవకార్య నిమిత్తము శివ పుత్రుడుగా జన్మించుట మహద్భాగ్యమే అంతటి జ్ఞాని శివుని ఆజ్ఞాపాలన ఆనందముగా అంగీకరించి,అందులో ఒక చిన్న వెసులుబాటును వరముగా కోరుకున్నాడు.అదియే మాతృగర్భవాసము లేకుండా మహాస్కందోత్పత్తి.అసురీభావ మర్దనమునకు (తారకాసుర) నాంది-పునాది. . స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును భూమి-అగ్ని-గంగ-తటాకరూపమున పార్వతిదేవి నిక్షిప్త పరచిన. రెల్లునుండి తారకుని దుండ గములను చెల్లు చేయుటకు ఆరుగురు అద్భుత బాలురుగా ఆవిర్భవించినది..కృత్తిక నక్షత్ర శక్తులు వారికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షణ్ముఖుని ఆరు ముఖములు పంచభూత తత్త్వమునకు-ఆత్మతత్త్వమునకు అద్దముపట్టుచున్నవి స్కందమాత మనకు షణ్ముఖుని ప్రసాదించుట అసుర సంహారమునకు అత్యవసరమైనది.అదెప్పుడో జరిగిన కథ దానివలన ఇప్పుడు మనకేమిటి ఉపయోగము? అనుకోవద్దు.ఆ కథాకాలమునాడు జరిగిన మంచి-చెడు గుణార్విభావము ఇప్పుడు జరుగుతూనే ఉన్నది.కాసేపు మనలను మనము ఒక నాణెముగా ఊహించుకుందాము. . గుణావిర్భావము జరిగి ఒకే నాణెము మంచి-చెడు,సుర-అసుర రూపములను సంతరించుకొని సమరమునకు దారితీస్తున్నది.అంటే మనము అని చెప్పుకునే నాణెము కూడ ఒకవైపు చీకటి-మరొకవైపు వెలుగు అను రెండు తత్త్వములను ముద్రించుకొని,గిరగిర తిరుగుతుంటుంది.ఎక్కువ శాతము అది చీకటినే చూస్తుందనుకోండి అది విచక్షణను కోల్పోయి విచారగ్రస్థమవుతుంది.వెలుగును చూడలేక దిగులుతో ఉంటుంది.నిలకడలేక తిరుగుతూ చీకటినే చూస్తున్న నాణెమును వెలుగువైపునకు స్థిరముగా నుండునట్లు దాని చీకటి ముద్రించిన వైపును కిందివైపునకు మూసివేసి ఉంచుటయే దానికి తగిన జ్ఞానమును అందించుట. ఆ జ్ఞాన-క్రియా శక్తుల సంగమమే గుహ్యానుగ్రహము. మూర్తీభవించిన జ్ఞానశక్తిని మనకు అందించుట అమ్మ సంకల్పము. ముడులరూపమున నున్న అజ్ఞానమును విప్పుకొను ప్రయత్నము మన సంకల్పము. . అమ్మ చెంతనున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Sunday, October 18, 2020

0004

అమ్మకు సభక్తి పూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-04 ********************* మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్ణ కలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాండమాత. నమో పూర్వజాయచ-పరజాయచ" అని రుద్రములో చెప్పబడినట్లుగా,సృష్టికి పూర్వమును హిరణ్యగర్భయై తల్లి తత్స్వరూపిణిగా ముందు ఉన్నది-ఇప్పుడు ఉన్నది-భవిష్యత్తు లోను ఉంటుంది. రుద్రము పరాశక్తి ప్రాభవమును "ఉగణాభ్యస్య" అంటు ఉత్తమమైన సమర్థవంతమైన స్త్రీగణముల గురించి ప్రస్తావించినది.వారు దేనిలో సమర్థులు అను ప్రశ్నకు? తృహంతి-అనగా తుంపుటకు-దుష్టత్వమును తుంపుటకు అని శక్తిస్వరూపమును వివరిస్తున్నది. సినిమాతెర వలె తాను నిశ్చలముగా నుండి మనకు దానిపై కదిలే చిత్రములతో పాటుగా తాను కదులుతున్నట్లుగా భ్రమింపచేయుట తల్లి క్రీడ.లోక ధర్మములను నిర్వర్తించుటకు ఆత్మ-శరీరము అను రెండు రూపములను తానే ధరించి,ఒక దానిని స్థిరముగా అలౌకికముగా నిలబెట్టి(ఆత్మ) రెండవదానిని తన చైతన్యముతో కదిలిస్తూ ఉన్నప్పటికిని,మనను ఆవరించిన మాయ పొర శరీరము లోని ఆత్మను గుర్తించలేదు.గుడ్డులోపలి పదార్థము దానిని ఛేదిస్తే కాని కనపడదు.అదే విధముగా మనలోపలి ఆత్మ బాహ్యమును మనము ఛేదించగలిగితే కాని బోధపడదు. ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్యయై వేడిని-వెలుతురును ఆదాన-ప్రదానముల ద్వారా అందించుచు మనలను ఆశీర్వదించుచున్నది. తల్లీ నీవందించుచున్న ఉషోదయ కాంతితో,నా బుధ్ధి యనెడి పద్మము వికసించి,విశ్వమంతయు నిండియున్న నీ స్వరూపంబును-నా స్వస్వరూపముతో అనుసంధానముచేయుచున్నది. అసలు తత్త్వమును అందించుట అమ్మ సంకల్పము. ఆత్మతత్త్వమును అర్థము చేసికొనుట మన సంకల్పము. అమ్మ చేతిని పట్టుకుని ఆనందాబ్ధిలో ఓలలాడుదాము.. అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలే. అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది అమ్మ చరణములే శరణము.

Saturday, October 17, 2020

003

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-03 ********************* చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి. "చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనోభావములకు అధిపతి అయినప్పుడు వృధ్ధి-క్షయ స్వభావము కల చంద్రకళలు మన మనోభావములపై తమ ప్రభావమును చూపుతాయి.అవి అనేకానేకములై-ఆలోచనా రహితములై-ఆందోళనా పూరితములై-అసహాయకములై మనసు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానమును కోల్పోవునట్లు చేస్తాయి.అసమర్థమైన మనసు సత్యాన్వేషణను చేయలేక మూగపోయి ఉంటుంది.సత్-చిత్-సాక్షాత్కారమును సందిగ్ధములో పడేస్తుంది.ముముక్షత్వానికి ముందరికాళ్ళ బంధమవుతుంది. అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-03 ********************* చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి. "చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనోభావములకు అధిపతి అయినప్పుడు వృధ్ధి-క్షయ స్వభావము కల చంద్రకళలు మన మనోభావములపై తమ ప్రభావమును చూపుతాయి.అవి అనేకానేకములై-ఆలోచనా రహితములై-ఆందోళనా పూరితములై-అసహాయకములై మనసు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానమును కోల్పోవునట్లు చేస్తాయి.అసమర్థమైన మనసు సత్యాన్వేషణను చేయలేక మూగపోయి ఉంటుంది.సత్-చిత్-సాక్షాత్కారమును సందిగ్ధములో పడేస్తుంది.ముముక్షత్వానికి ముందరికాళ్ళ బంధమవుతుంది. మన మనసులోని ఆలోచనలు మన చర్యలను ఎలా నిర్దేశిస్తాయో మనము చిన్నప్పటినుండి చదుకున్న మన ముందు తరలకు అందించుచున్న రెండుపిల్లలకథ మనకు చెప్పకనే చెబుతోంది.వాటికి ఆకలివేసినది.ఆహారము రొట్టెగా దొరికినది.అదేవిధముగా నేను-నాది నీవు-నీది అని ద్వంద్వభావములు తత్ అను తమ ఉనికిని తెలుసుకోవాలన్న తపన (ఆకలి కలిగింది) తల్లి అనుగ్రహమనే ఆహారము లభించింది.అయినప్పటికి అవి ద్వంద్వభావాన్వితములు కనుక నీకుసగము-నాకు సగం అని భాగాలు చేసుకున్నాయి.అదియే గదా తమోగుణ ప్రకోపము.అంతటితో ఆగాయా లేదు.నీకు కొంచము ఎక్కువ వాటా వస్తుందేమో నాకు తక్కువ మిగులుతుందేమో నన్న నేనే చూసాను అని ఒక పిల్లి అంటే రెండో పిల్లి నేను దానిని అక్కడి నుండి తెచ్చానన్న ఆధిపత్య ప్రక్రియ (రజోగున ప్రేరణతో) తమ దగ్గర నున్న రొట్టెను తినలేక ఆకలితోనే ఉన్నాయి.అవి అక్కడనున్న కోతిని తమ ఆహారమును పంచుటకు పెద్దగా నిర్ణయించినవి.అసలే చంచల స్వభావము కలది కోతి.మన మనసు కూడా అంతే కదా.పంచుతున్నట్లు నటించి అనుగ్రహమును రెండుపిల్లులుగా భావించే ద్వంద్వములకు అందకుండా అడ్డుపడ్డది.అదియే మాయ అను పొర.ప్రకాశవంతమైన తమ బుధ్ధిని గమనించక మనసుకు అధికారమునిస్తే మాయ అనే లోయలే పడిపోతాము.ఆ విధముగా మనలను పడిపోకుండా తన శబ్దమనే జ్ఞానముతో మనలను రక్షిస్తుంది చంద్రఘంట మాత. అమ్మ మనలను అటువంటి పరిస్థితిలో ఉంటే ఆదుకోకుండా ఉంటుందా? అందుకే ఓంకార ప్రతీకమైన ప్రణవనాద మూర్తిగా, తన ఘంటానాదమునుతో నిశ్శబ్దమును నిష్క్రమింపచేస్తుంది.నిశ్చలత్వమును నిర్మిస్తూ మన మనస్సునుకు బుధ్ధి అనే శక్తిని జోడించి,నాదమయియై వేదమాతయై విషయమును వివరిస్తుంది.విజయపథము వైపుకు మనలను నడిపిస్తుంది. శివశక్తి స్వరూపమై శుభములకు శ్రీకారము చుట్టుట అమ్మ సంకల్పము. ఆ తల్లి తత్త్వదర్శనమునకు అడ్డుపడుతున్న అరిషడ్వర్గముల ఆటను అర్థముచేసుకోవలెననుకొనుట మన సంకల్పము. అమ్మ చెంతనున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Thursday, October 15, 2020

oo2

ప్రసీద మమ సర్వదా-02 *********************** అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో, నవదుర్గ ప్రస్తావన వరాహపురాణములో వచ్చినదని,పురాణాలు ప్రణవము నుండి పుట్టినవని పెద్దలు చెబుతారు. సూర్యుడు కన్యారాశిలో నుండు సమయము కనుక పరమాత్మ తత్త్వమును స్త్రీమూర్తిగా భావించి-పూజించు సంప్రదాయమును అనుసరించేవారు ఉన్నారు. శరత్కాలముులోని నవరాత్రులను దేవిశరన్నవరాత్రులంటారని దీనినే బతుకమ్మాగా ప్రకృతిని కొలిచే సంప్రదాయమును మనము చూస్తూనే ఉన్నాము. నవ శబ్దమునకు నూతనత్వమును సంతరించుకొనిన అనగా కొత్త కొత్త నామరూపములతో ఏ ఆకారములేని తత్ అనేక ఆకారములై,నామరూపములతో అలరారుతూూ.అసుర సంహారమునుచేసి,ఆనందోత్సాహములనులను నింపిన సమయము ఇది.పురాణము అను పదమునకు పూర్వకాల కథా విశేషముగా అన్వయించుకుంటే ఇది సరిపోతుంది.తల్లి అనుగ్రహము మనలను అంతటితో ఆపేస్తుందా? అన్వేషణను కొనసాగిస్తుందా? అంటే రెండవది తథ్యము.సంఖ్యా పరముగా నవ అను శబ్దము తొమ్మిది"9" అను సంఖ్యను సూచిస్తుందికదా.తొమ్మిది అను సంఖ్యను హెచ్చవేస్తూ వచ్చినదానిని కూడుతుంటే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.అంతే అమ్మ అనేక రూపాలను దర్శిస్తూ,దయను అన్వయము చేసుకుంటే అన్నిరూపాలలోను అమ్మ ఏకత్వమే బోధపడుతుంది.ఇది కాదనలేని సత్యము. కథలో పిట్టకథలు దాగి నీతిబోధను చేయునటుల అమ్మ నవదుర్గ కథనము కూడా నాలోని నేను ని చూపుతుంది కొంచము విజ్ఞతతో చూడగలిగితే కథాప్రకారముగా ప్రస్తావించుకుంటే,సతీదేవి తిరిగి శైలపుత్రి గా ఆవిర్భవించి,పరమేశునికై తపముచేసి,పెండ్లాడి,అర్థభాగమై,తదుపరి దైవకార్య నిమిత్తమై స్కందమాతగా సన్నుతించబడుతోంది.ఇక్కడి నుండి అసలు కథ ప్రారంభం.మంచిచెడుల మధ్యన జరిగే ఘర్షణ-ఘటన-శిష్తరక్షణ-దుష్ట శిక్షణ.మనకు పరోక్ష జ్ఞానదాతలనదగిన తారకాసురుడు-మహిషాసురుడు-రక్తబీజుడు-శుంభనిశుంభులు-చండ-ముండులు ఇలా ఎన్నో రూపములు తమ త్రిగుణ సమతౌల్యతను కోల్పోయి, అరిషడ్వర్గ అధీనులై అమ్మతో అహంకరించి ఆడిన ఆటలు.అమ్మ అనుగ్రహముతో ప్రత్యర్థియై రక్తికట్టించిన రక్షణలీలలు.మంచిచెడుల పంచన ఉన్న మనము తల్లి ఇచ్చిన రెండు రెక్కలతో ప్రదర్శనను చూడటమేకాదు.పాఠాలను నేర్చుకొని పరిణితిని పొందుదాము. మొదటి దుర్గ శైలపుత్రి మన ఆత్మ పరిశీలనమునకు నాందిపలుకుతుంది.రెండవ దుర్గ బ్రహ్మచారిణి పరిశీలనను ప్రయాణముగా మారుస్తున్నది.మూడవ దుర్గ ప్రయాణ ఫలితమునకు ఘోరములను అఘోరములుగా మారుస్తూ,ఆత్మ దర్శనమునకు అనువైన సహాయమును చేస్తున్నది.నాల్గవ దుర్గ కూష్మాండాదేవి స్థూల-సూక్ష్మములను అండ రూపములో పరిచయము చేస్తూ,వానిని అలవోకగా-అలసటలేకుండా నిక్షిప్తము చేస్తూ,నిఖిల నూతనత్వమును సూచిస్తున్నది.ఐదవ దుర్గ స్కందమాత తానొక అద్భుతసృష్టికి అమ్మయై జన్మసార్థకత జయనికేతనమును ఎగురవేస్తున్నది. ఆరవ శక్తి అమ్మతనమును .అది అందించిన అద్భుతశక్తుని ఆవశ్యకతను,అరిషడ్వర్గముల ఉనికిని,వానికి ఆలంబన అయిన ఇంద్రియ చర్యల ఫలితములను దర్పణమై దర్శింపచేయుచున్నది.ఏడవ శక్తి కాళరాత్రి రూప అశాశ్వతత్త్వమును-ఆత్మ శాశ్వతత్త్వమును ఆవిర్భవింపచేస్తు,విశ్వకళ్యానమునకు తన్ను తాను మలచుకొను మహత్ విన్యాసమును మనముందుంచుచున్నది.ఎనిమిదవ దుర్గ యైన మహాగౌరి " క్షమయా ధరిత్రి"తన తేటతెలుపు మేని కాంతితో అజ్ఞానమను నల్లని చీకట్లను తరిమివేసి,గౌరవమను ప్రసాదించునది.పదవ దుర్గ తరణోపాయయై ఉన్నస్థితి నుండి ఉత్తమస్థితిని చేర్చగల సిధ్ధిధాత్రి. ఈ పదిరోజులు అమ్మ పరిపూర్ణ అనుగ్రహమును పొందుటకు ప్రయత్నిద్దాము. అమ్మ చెంతన ఉన్న మనకు అన్య చింతనలేల? అమ్మ దయతో ప్రయానము కొనసాగుతుంది.

Wednesday, October 14, 2020

01NAMONAMAHA

నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తుకు-పై ఎత్తులను వేయుచు ఆట ముగించి అందరిని తన దయ అనే పెట్టెలో దాచివేస్తుంది తల్లి. ఈ జగన్నాటకములోని పాత్రధారులైన మనలను తల్లి తన అవ్యాజకరుణతో తన అనుగ్రహమును వ్యక్తపరుస్తూ,(కొత్తకొత్త-తొమ్మిది-నవ) కుమాతా న భవతి అనే నానుడిని సార్థకము చేస్తుంది. పారమార్థిక తత్త్వమును తెలియచేయుటయే కాక ,ప్రాపంచిక మాయ యనెడి సాగరమున మునిగి,దారి తెన్ను తోచని స్థితిలో నున్న మనకు వివేకము-అవలోకనము అను రెండు రెక్కలను అతికించి విహరించమటుంది. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా కీర్తించబడినది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్ఠం కాత్యాయినీతి సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిధ్ధిధాత్రీచ నవదుర్గ ప్రకీర్తితః." అమ్మదయతో కొనసాగుతుంది. శరణం నీ దివ్య చరణం. శ్రీమాత్రే నమః.

Friday, October 9, 2020

PRASEEDA MAMA SARVADAA-09

ప్రసన్న మమ సర్వదా-09 మాత సిధ్ధిధాత్రి నమోనమః "సిధ్ధ గంధర్వ యక్షాద్యైః అసురైః అమరైరపిః సేవ్యమానా సదా భూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయినీ". ధాత్రీ అను శబ్దమునకు అనుగ్రహించునది-ప్రసాదించునది అని అర్థము.అమ్మ మనకు సిధ్ధులను ప్రసాదిస్తుంది కనుక సిధ్ధిధాత్రి నామముతో కీర్తింపబడుచున్నది.తల్లి మనతో పాటు ఉంటూ,మనలను చైతన్యవంతులను చేస్తూ,సన్మార్గమును చూపిస్తూ,దానికి కావలిసిన సిధ్ధులను అనుగ్రహిస్తుంటుంది. మనలోని సద్గుణాల సమ్మేలనమే సిధ్ధులు.కాని ముఖ్యముగా అష్టసిధ్ధులు మనకు అనేక విషయములను తెలియచేస్తాయి.వాటికి అనుగునముగా మన ఇతిహాస కథలు వాటి ఉపయోగవిధానమును మరింత వివరించినవి.ఉదాహరనకు సూక్ష్మావస్థలో కూడా భగవ్తత్త్వమును గ్రహించగలగటము అణిమ-భగవతత్త్వమును అన్నింటా దర్శించకలగటము మహిమ-అంటే సూక్షముగా -స్థూలముగా నున్న భగతత్త్వమును గుర్తించగలుగుట.గరిమ-లఘిమ మరొక రెండు సిధ్ధులు.అతి తేలికగా మారుట-అత్యంత బరువుగా (రూపములో ఏమార్పులేకుండ) మారుట.ప్రాప్తి-ప్రాకామ్యము మరొక రెండు శక్తులు.శూన్యముగా పైకి కనిపించేదానిలో శక్తిని గ్రహించగలుగుట ప్రాప్తి అయితే దానిని పొందగలుగుట ప్రాకామ్యము.ఈశిత్వము-వశిత్వము చివరి రెండు అష్టసిధ్ధులు.ఈశావాస్యం ఇదం సర్వం అని గుర్తించగలిగితే ఈశిత్వసిధ్ధి అనుగ్రహమే-తద్వార మన ఇంద్రియములను మంచిపనులకు మాత్రమే నియంత్రించగలిగితే అదియే వశిత్వసిధ్ధి.సుందరకాందలో హనుమ ఈ శక్తులను ప్రదర్శించి స్వామికార్యమును సఫలము చేసుకొనినాడు.కృఇష్నపరమాత్మ సమయసందర్భములకు తగినట్లు వానిని ప్రదర్శించి ప్రస్తుతింపబడుచున్నాడు. ఇప్పుడు సిధ్ధిధాత్రి మాత తత్త్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.మన పరతత్త్వ చింతన పర్వతము నుండి ప్రారంభమై పరిణిటి పొందిన ప్రతిభ వద్ద ముగినది.అంటే మనము మనలోనిక్షిప్తమైన శక్తిని ఎంతో లోతునుమ్న నిలిచి చూశాము.అందుకోవాలని అడుగులను ఊర్థ్వముఖముగా కదిపాము.ఎన్నో నిత్యసత్యములను నిస్సందేహముగా నేర్చుకున్నాము.ఎనిమిది శక్తులు ఎదోఒక విపత్తును నిర్మూలించుటకు,ఎంతో ఉన్నతమైన తత్త్వమును నేర్పించుటకు ఆవిష్కరింపబడినవి. అమ్మ చేయి పట్టుకుని మనలను నడిపిస్తూ,ఎన్నో పనులను నేర్పిస్తూ,గుడ్డులో దాగిన పదార్థము వంటి మనలను గట్టి రెక్కలను అందించిన పక్షులుగా తీర్చిచిద్దినది.సిధ్ధిధాత్రి మాత్ర వద్దకు మనము వచ్చాము.ఇప్పుడు అమ్మ అసురసంహారము చేయవలసిన పనిలేదు.ఆగ్రహమును వ్యక్తము చేయవలసిన పని లేదు. ఇప్పుడు మనకోసము ఎక్కడినుండో-ఏదో ఒక రూపముతో-ఏదో ఒక ప్రయోజనము కోసము ఆవిర్భవించవలసిన పనిలేదు.అమ్మ ఇప్పుడు దిగిరాదు.తిరిగి కొత్తావతారమును ధరించుతకై వెళ్ళిపోదు.మనతో పాటుగా తానుండి మనలో వచ్చిన పరిణితి పారిపోకుండా హెచ్చరికలు చేస్తూ,ముచ్చటగా మనతోనే-కాదు కాదు మనలోనే ఉంటుంది మాతృరూపిణిగా.మరింక కావలిసినదేముంది మనకు. అమ్మే అండదండ యైనప్పుడు బ్రహ్మానందమే. అమ్మ ధ్యాసే మన శ్వాసగా జీవిద్దాం. శుభం భూయాత్.

PRASEEDA MAMA SARVADAA-08

ప్రసీద మమ సర్వదా-08 మహాగౌరి నమోస్తుతే శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుభాః మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా" అష్టవర్షా భవేద్గౌరీ మహా అత్యంత గౌరి తెల్లని శరీరకాంతి కలది.అత్యంత గౌరవ ప్రదాయిని. శుంభ-నిశుంభులను రాక్షసులు తమకు పార్వతీదేవి పుత్రికతో తప్ప అన్యులతో మరణమును పొందని వరము కలవారైరి.వరబల గర్వితులైన వారు యుక్తాయుక్తములను మరచి ధర్మమునకు గ్లానిని కలిగించసాగిరి. పరమేశ్వరి లీలలు పరమదాయార్ద్రశీలములు.ధర్మసంస్థాపనకు శుంభనిశుంభులు నిర్గమించాలి.దానికి తన సరీరమునుండి ఒక మహాశక్తి తన పుత్రికగా ఆవిర్భవించాలి.దానికొక బాహ్య కారణమును చూపించాలి(మనకు అర్థమగుటకు) కనుక తల్లి తన కాళి రూపము లోని నల్లని రంగును నెపముగా మలచుకొని,దానిని విడనాడుటకు మానససరోవములో మునిగినది.తల్లి తలచుకుంటే కానిది ఏముంది? మానస సరోవరము తన బాధ్యతగా తల్లి నల్లని చర్మమును తల్లి నుండి వేరుచేసి,మహాగౌరిగా అమ్మను ప్రకాశింపచేసినది. తల్లినుండి విడివడిన చర్మమునుండి మహాద్భుత శక్తి "కౌశికి" గా (కోశమునుండి వెలువడినది) ఆవిర్భవించి,అసురుని అస్తమింప చేసినది.తమస్సు ఉషస్సును చేరినది.ఎంతటి దయామయి గౌరీదేవి. సాధకులు గతములో చేసిన పాపములను-వర్తమానములో చేయుచున్న పాపములను తన క్షమాగుణముతో తొలగించి వేసి,భవిష్యత్తులో పాపములు చేయని వారుగా బాగుపరచును. అంతే కాదు.పరబ్రహ్మమును చేరుటకు శిష్యురాలిగా బ్రహ్మచారిణియై,తన గమనమును ప్రారంభించి,మార్గ మధ్యములో అనేక అద్భుతములను మనకు పరిచయము చేస్తూ-మనలను ప్రభావితులను చేస్తూ,గురుస్థానమునకు చేరి గౌరవమునకు పాత్రతను కల్పిస్తూ,మనలను సిధ్ధిదాత్రిమాత వద్దకు చేర్చుచున్నది.ఇంక మనకు కావలిసినది ఏమున్నది. అమ్మ చెంతననున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Thursday, October 8, 2020

PRASEEDA MAMA SARVADAA-INTRODUCTION

ప్రసీద మమ సర్వదా నవదుర్గ మాతా నమో నమః యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్ఠం కాత్యాయినీతి సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిధ్ధిధాత్రీచ నవదుర్గ ప్రకీర్తితః." వేద-వేదాంతవిదులు తల్లి అనుగ్రహించిన విజ్ఞతతో నవదుర్గావిర్భావ ప్రాశస్త్యమును పారమార్థికముగా అందించుటయే కాక ప్రాపంచిక మాయ యను సాగరమున మునిగి ,దారి-తెన్ను తోచని సామాన్యునకు- సాధకునకు సన్మార్గమును చూపుతు సద్గతిని చేర్చే చల్లని తల్లి కనుకనే " కుమాతా న భవతి" అని ఆర్యోక్తి. మొదటి దుర్గ శైలపుత్రి మన ఆత్మ పరిశీలనమునకు నాందిపలుకుతుంది.రెండవ దుర్గ బ్రహ్మచారిణి పరిశీలనను ప్రయాణముగా మారుస్తున్నది.మూడవ దుర్గ ప్రయణ ఫలితమునకు ఘోరములను అఘోరములుగా మారుస్తూ,ఆత్మ దర్శనమునకు అనువైన సహాయమును చేస్తున్నది.నాల్గవ దుర్గ కూష్మాణ్డాదేవి స్థూల-సూక్ష్మములను అంద రూపములో పరిచయము చేస్తూ,వానిని అలవోకగా-అలసటలేకుండా నిక్షిప్తము చేస్తూ,నిఖిల నూతనత్వమును సూచిస్తున్నది.ఐదవ దుర్గ స్కందమాత తానొక అద్భుతసృష్టికి అమ్మయై జన్మసార్థకత జయనికేతనమును ఎగురవేస్తున్నది. ఆరవ శక్తి అమ్మతనమును .అది అందించిన అద్భుతశక్తుని ఆవశ్యకతను,అరిషడ్వర్గముల ఉనికిని,వానికి ఆలంబన అయిన ఇంద్రియ చర్యల ఫలితములను దర్పణమై దర్శింపచేయుచున్నది.ఏడవ శక్తి కాళరాత్రి రూప అశాశ్వతత్త్వమును-ఆత్మ శాశ్వతత్త్వమును ఆవిర్భవింపచేస్తు,విశ్వకళ్యానమునకు తన్ను తాను మలచుకొను మహత్ విన్యాసమును మనముందుంచుచున్నది.ఎనిమిదవ దుర్గ యైన మహాగౌరి " క్షమయా ధరిత్రి"తన తేటతెలుపు మేని కాంతితో అజ్ఞానమను నల్లని చీకట్లను తరిమివేసి,గౌరవమను ప్రసాదించునది.పదవ దుర్గ తరణోపాయయై ఉన్నస్థితి నుండి ఉత్తమస్థితిని చేర్చగల సిధ్ధిధాత్రి. ఈ పదిరోజులు అమ్మ పరిపూర్ణ అనుగ్రహమును పొందుటకు ప్రయత్నిద్దాము. అమ్మ చెంతన ఉన్న మనకు అన్య చింతనలేల? అమ్మ దయతో ప్రయానము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Wednesday, October 7, 2020

PRASEEDA MAMA SARVADAA-07

ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరలమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారాథమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రా చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొని ఆనందాబ్ధిలో తేలియాడుతుంటారు. మనశరీరమే ఆయుధగారము.మన ఇంద్రియమే మనకు సహాయకారి అను విష్యమును కాళరాత్రి మాత ఆదిశక్తి నుదురునుండి ఆవిర్భవించి,వరప్రసాదుడైన రక్తబీజుని అంతము చేయుటకు,తన నాలుకనే ఆయుధముగా మలచుకొని,విస్తరింపచేరి రక్తబిందువును తాను స్వీకరిస్తూ,వానిని శక్తిహీనునిగా (రక్తహీనునిగా) చేసి,సంహరించినది. అసురుని రక్తము అమ్మను ఆవేశముతో భీకరనాట్య ప్రక్రియగా అడుగులను కదిలించినది.తల్లి అడుగుపడిన భూమి నిర్వీర్యము చేస్తున్నది.ధర్మము అధర్మరక్త ప్రభావమునకు బలికాకూదదు.కరుణతో శివిడు తటస్థుడుగా అమ్మ గమనముగా అడ్డుగా పడుకుని,అమ్మను శాంతింపచేసినాడు. కాలమే కాళరాత్రి.అది.మనకున్నట్లు దానికి భూత-వర్తమాన-భవిష్యత్ దశలుందౌ.అద్భుతసక్తివంతమైన కాలము తన ప్రయాణములో మనలను(జీవులను)తనతో ప్రయాణింపచేస్తూ,సమయము వచ్చినప్పుడు మనలను విడిచివేస్తుంది.దాని వలన ఎమి ప్రయోజనము అను సందేహము రావచ్చును.మన తప్పటదుగుల సమయమున మనలను తన చేతిని పట్టి నడిపించిన అమ్మ మనకు నడక వచ్చిన తరువాత నడిచేతప్పుడు వదిలివేస్తుంది.అదే విధముగా కలస్వరూపమైన కాళరాత్రి మాత తనతో కలిసి మనము చేస్తున్న ప్రయాణములో కొన్ని అద్భుతాలను చూపిస్తూ,ఆవేదనలను కలిగిస్తూ,అత్మ శోధనకై మనలను సవరిస్తూ-సంస్కరిస్తూ,సాధక దశ నుండి ముముక్షువుగా మలుస్తూ,స్వయంసిధ్ధతను అనుగ్రహిస్తూ,మనలను విడిచివేసి,తన ప్రయానమును కొనసాగిస్తుంది. అమ్మ చెంతన నున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Tuesday, October 6, 2020

PRASEEDA MAMA SARVADAA-06

ప్రసీద మమ సర్వదా-06 కాత్యాయినిదేవి నమోనమః " చందరహాసోజ్వలకరం శార్దూల వరవాహనం కాత్యాయినీం శుభం ధధాత్దేవి దానవ ఘాతినీ" దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా" కాత్యాయినీ మాత గుహ్యాతిగుహ్యముల గూఢతత్త్వము.పురుషసూక్త ప్రకారము తల్లి సమస్త విశ్వములోని నాల్గవ భాగమును మాత్రమే ప్రపంచముగా మనకు వ్యక్తముగా ప్రకటించి,మిగిలిన మూడు భాగముల అమృతమయమైన అవ్యక్తమునకును అధిస్ఠాత్రియై అలరారుచున్నది. నామరూపములను పరిశీలిస్తే,దైవకార్యార్థము "కతుడు" అనే ముని పుంగవుని ఆశ్రమములో జన్మించి-పెరిగినందున కాత్యాయినీ నామముతో కీర్తింపడుతున్నది తల్లి.తల్లి స్వభావమును పరిశీలిస్తే జ్ఞాన విజ్ఞతను అందిస్తూనే దానికి ఏల క్రియాశీలకత్వమును అనుసంధిస్తుందో సాక్షాత్తు గాయత్రీ స్వరూపముగా సకల శాస్త్ర విజ్ఞానమును సంహార రూపముతో యోధ గా క్రియాశక్తిని మేళవించి వాటిని సఫలీకృతము చేస్తుంది తల్లి. మరొక్క ముఖ్యమైన విషయము తల్లి తాను క్రోధస్వరూపిణిగా ఆవిర్భవించినది.కాని దానికి అరిషడ్వర్గములు కావు.కామ-క్రోధముల ఫలితములు వానిని ప్రేరేపించిన మూలకారణల బింబ-ప్రతిబింబములు.తల్లి ధర్మము నాలుగు పాదములతో నడువవలెనని,గ్లాని ఎటువంటి దుష్టశక్తుల ప్రకోపనముచే లోపించరాదని కోరుకున్నది.కాని అసురీశక్తుల అహంకారముతో ధర్మము క్షీణదశలోనుండి లుప్తమై పరిస్థి ఏర్పడినప్పుడు క్రోధము తల్లికి సహాయకారియై లీలగ ప్రకటింపబడుతుంది.అదే మహిషాసుర-కాత్యాయినీ యుధ్ధమునకు కారణమైనది.సమర్థనీయము కదా.బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశమే కాత్యాయినీ తత్త్వము.తనను నమ్మిన వారికి ఏకాగ్రతను-నిబధ్ధతను కలిగిస్తుంది. శీఘ్ర కళ్యానమునకు-అనుకూల దాంపత్యమునకు గోపికలు తల్లి ఆండాళ్ తో కాత్యాయిని వ్రతము చేసినట్లు "తిరుప్పవై" రెందవ పాశురము తల్లిని ప్రస్తుతించుచున్నది.గోర రూపిగా దుష్ట శిక్షణను-అఘోర రూపిగ జ్ఞాన రక్షణను చేస్తూ,నీ అనుగ్రహముతో మమ్ములను పాలించు తల్లీ,నీ పాదములు విడువమమ్మా. అమ్మ చెంతన అన్య చింతనలేల? అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Sunday, October 4, 2020

PRASEEDA MAMA SARVADA05

ప్రసీద మమ సర్వదా-06 స్కందమాత నమోనమః సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ అరవ నవదుర్గ స్కదమాతాదేవి.కూష్మాందా మాత అండరూపములో సమస్తమును తన గర్భములో నిక్షిప్తము చేసునినది కదా.దానిని ధర్మ రక్షనకు ప్రకటించవలసిన సమయమాసన్నమైనందున స్కందమాత గా అమ్మదనముతో మనలనందరిని తారకాసురుని బారి నుండి నెమ్మదింపచేయుటకై తన జాన-క్రియాశక్తులను శివశక్తితో కలిపేసి స్కందుని దేవసేనాధ్యక్షునిగా చేసినది తల్లి. స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును వాయువు-అగ్ని దాచిన గంగ దేవి ఒడిని చేరినదట.ఆ తల్లి ఆ దివ్యతేజమున రెల్లునందు దాచినదట. రెల్లునుండి తారకుని దుందగములను చెల్లు చేయుటకు అద్భుత బాలురు ఆవిర్భవించిరట.కృత్తిక నక్షత్ర శక్తులు ఆరు ఆ బాలునికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షన్ముఖుని ఆరు ముఖములు పంచభూత తత్త్వమునకు-ఆత్మతత్త్వమునకు అద్దముపట్టుచున్నవి. అవ్యక్తం-వ్యక్తం-మహత్-అహంతత్త్వం పంచభూతాత్మికమై ప్రాణికోటిగా పరిఢవిల్లుతోంది.మనలో దాగిన నీవారసూక పరమాత్మ కానరాకుండ గుహ్యమై ఉంటుండి కద.ఆ సక్తియై ధర్మసంస్థానమునకై అదే గుహ్యుడు.శక్తి ప్రాణ శక్తిగా ప్రకటింపబడుట-పరిస్థితులను చక్కదిద్దుట ,దానికి మూలమైన మహాశక్తి మాతృరూపముగా మనకు ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తుల మేలుకలయిక సంస్కారమును మేలుకొలుపుటే అని వివరించుట .చేయవలెనను సంకల్పము తటస్థస్థితివంటిది.కాగౄత కుండలిని అది.దానిని జాగృత పరచవలెన్న జ్ఞానశక్తి అవసరమైన.జాగృత కుండలిని తన ఊర్థ్వ ప్రయాణములో అడ్డుపడు తారకుని వంటి ముడులను విప్పుకునే క్రియాశక్తి తప్పనిసరి.ఈ మూడు శక్తులు సమర్థవంతమైతేనే సాధకుడు అమృతపానముచేయగలుగుతాడు.సాధకుని ఈ మూడుశక్తులు సేనలైతే వాటిని నడిపించే అద్భుతశక్తి సేనాపతి. జ్ఞానము క్రియాశీలకత్వముగా మారుట స్కందోత్పత్తి అయితే ఆ క్రియాశీలకత్వమునకు కృతకృత్యతను అందించేది స్కందమాత శక్తి అమ్మ చెంతన్నున మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

PRASEEDA MAMA SARVADA04

ప్రసీద మమ సర్వదా-04 మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్నకలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాందమాత. ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్యయై వేడిని-వెలుతురును ఆదాన-ప్రదానముల ద్వారా అందించుచు మనలను ఆశీర్వదించుచున్నది. తల్లీ నీవందించుచున్న ఉషోదయ కాంతితో,నా బుధ్ధి యనెడి పద్మము వికసించి,విశ్వమంతయు నిండియున్న నీ స్వరూపంబును-నా స్వస్వరూపముతో అనుసంధానముచేయుచున్నది. అమ్మ చేతిని పట్టుకుని ఆనందాబ్ధిలో ఓలలాడనీ. అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలే. అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది అమ్మ చరణములే శరణము.

Saturday, October 3, 2020

PRASEEDA MAMA SARVADAA-03

ప్రసీద మమ సర్వదా-03 చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి. "చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనోభావములకు అధిపతి అయినప్పుడు వృధ్ధి-క్షయ స్వభావము కల చంద్రకళలు మన మనోభావములపై తమ ప్రభావమును చూపుతాయి.అవి అనేకానేకములై-ఆలోచనా రహితములై-ఆందోళనా పూరితములై-అసహాయకములై మనసు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానమును కోల్పోవునట్లు చేస్తాయి.అసమర్థమైన మనసు సత్యాన్వేషనను చేయలేక మూగపోయి ఉంటుంది.సత్-చిత్-సాక్షాత్కారమును సందిగ్ధములో పడేస్తుంది.ముముక్షత్వానికి ముందరికాళ్ళ బంధమవుతుంది. అమ్మ మనలను అటువంటి పరిస్థితిలో ఉంటే ఆదుకోకుండా ఉంటుందా? అందుకే ఓంకార ప్రతీకమైన ప్రణవనాద మూర్తిగా, తన ఘంటానాదమునుతో నిశ్శబ్దమును నిష్క్రమింపచేస్తుంది.నిశ్చలత్వమును నిర్మిస్తూ మన మనస్సునుకు బుధ్ధి అనే శక్తిని జోడించి,నాదమయియై వేదమాతయై విషయమును వివరిస్తుంది.విజయపథము వైపుకు మనలను నడిపిస్తుంది. అమ్మ చెంతనున్న మనకు ఇతరచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరనము.

PRASEEDA MAMA SARVADAA-02

ప్రసీద మమ సర్వదా-02 బ్రహ్మచారిణి మాతా నమోనమః "దధనాకర పద్మాభ్యాం అక్షమాలా కమందలా దేవీ ప్రేదతుమయీ బ్రహ్మే చారిణ్యనుత్తమం." ఒకచేత జపమాల-మరొకచేత జలపాత్రతో "అజాయమాన బహుదా విజాయతే" అను సూక్తిని శుభకరము చేస్తూ,తల్లి తన రెండవ దుర్గారూపమైన బ్రహ్మచారిణిగా ప్రకటితమగుచున్నై.ఎంతటి భాగ్యశాలురమో మనము.ఈ తల్లికి ఏటువంటి వాహనముమనకు గోచరమగుటలేదు.దానికి కారణము తల్లి చారిణి.నిరంతరము సంచరించు స్వభావము కల చలనశక్తి. బ్రహ్మచారిణి అను నామము రెండుపదముల ద్వారా రెండు విషయములను తెలియచేయుచున్నవి.అందులో మొదటిది బ్రహ్మము.రెండవది అందులో తల్లి సంచారము. " పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే" పురుషసూక్త ప్రకారము అపరిమితమైన బ్రహ్మములోని ఒక భాగమును సమస్తచరాచర విశ్వముగా మనము చూడగలుగుతున్నాము.అమృతమయమైన మిగిలిన మూడు భాగములు మనకు అగోచరములు-అనూహ్యములు. నాశనమయ్యే మన దేహములోని నాశరహిత చైతన్యమే బ్రహ్మము.విజ్ఞులు బ్రహ్మమును భగవతత్త్వము అని కూడా భావిస్తారు.వారి సిధ్ధాంతము ప్రకారము "భ" శబ్దము తేజోవంతమైతే"గ" శబ్దము గమనశీలత్వము.తేజోవంత గమన చైతన్యమే బ్రహ్మము. నిరాకార-నిర్గుణ-నిరంజన-నిరుపమాన బ్రహ్మమును నిర్వచించుట అసాధ్యము.ఒకవేళ ఆ ప్రయత్న్మే చేసినచో అపరిమితమును మన మూర్ఖత్వముతో పరిమితముగా భావించుచున్నటే.ఆ మూర్ఖత్వము మనలను వీడాలంటే తేజము వైపు మన గమనమును ప్రారంభించాలి.ఆ ఆలంబన శక్తియే బ్రహ్మచారిణి. ఎందరో మహానుభావులు.అందులో అన్నమాచార్యులు ఒకరు.ఆయన ద్రష్ట కనుకనే అంతర్యామియై,"బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అని ప్రస్తుతించగలిగారు. బ్రహ్మము అను పదమునకు తపము (తెలిసికొనుటకు తపించుట) అని కూడా అంటారు .సర్వకాల-సర్వావస్థలయందు సత్తుగా ఉండే పరబ్రహ్మమును చేరుటకు (మన భాషలో పరమేశ్వరుని పరిణయమాడుటకు) తల్లి తపో మార్గములో సంచరించుచున్నది కనుక బ్రహ్మచారిణి. చారణము అనగా కదులుతూ ఉండుట.బ్రహ్మములో తిరుగుట సత్తులో తిరుగుట కనుక సంచరించుట.మనము స్త్రీమూర్తిగా భావించే తల్లి బ్రహ్మములో శివశక్త్యైక మూర్తిగా రూపుదిద్దుకొనుటకు సంచరించుచున్నది కనుక తల్లి బ్రహ్మచారిణి. మనకొరకు అమ్మ చేయుచున్నటుగా లీలావిసేషమును చూపుతు,దానికి కావలిసిన రెండు పరికరములైన జపమాలను-జలపాత్రను సంకేతములు మనకు చూపుచున్నది.ఇవి రెండు జ్ఞాన-వైరాగ్యములకు ప్రతిబింబములు. జపమాల చలనశక్తియే కాక అక్షమాల స్వరూపమైన (అక్షరమాల0జ్ఞాన సంకేతము.అది నిరంతరము కదులుతూనే ఉండాలి.అంతే నిరంతరము అమ్మ తన కృపాకటాక్షవీక్షణములను సర్వత్ర ప్రసరిస్తూ సమస్తమును పాలించుచున్నది.మనకు సాధన మార్గమును సూచించుచున్నది. నిరంతర సాధన ఫలితము నీ చేతికినిర్మల జలపాత్రను అందించగలుగుతుంది.పూర్వము ఎండిన గుమ్మడి కాయను జలపాత్రగా ఉపయోగించేవారట.దానిలోని విత్తనములను అహంకారముగా-గుజ్జును మమకారముగా భావించి,వానిని తీసివేసి శూన్యమును అర్థము చేసుకొనేవారట.కాలక్రమేణా లోహపాత్రలు వచ్చినప్పటికిని దాని లోపలి భాగము శూన్యసంకేతమే.అదేవిధముగా మనలను అంటిపెట్తుకున్న విషయవాసనలు కుళ్ళిపోవునవే అని గమనించి,వానిని తొలగొంచివేసిన పాత్ర జలముతో అమృతమయమై,సకలదేవతా నివాసమైనట్లు మన అంతరంగము నిర్మలమై సత్-చిత్తుతో నిండి ప్రకాశిస్తుంది.మలినములు తొలిగి బ్రహ్మమును దర్శించగలిగి బ్రహ్మానందమమవుతుంది. పరమేశుని ఇల్లాలగుట పరమేశ్వరి సంకల్పము పరమాత్మను మనలో దర్శించగలుగుట మన సంకల్పము. అమ్మ చెంత నున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయానము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

Friday, October 2, 2020

PRASEEDA MAMA SARVADAA-01

ప్రసీద మమ సర్వదా-01 మాతా శైలపుత్రీం నమోనమః " వందేవాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం' వృషభవాహినియై(ధర్మమును అధిష్టించి) కుడిచేతిలో త్రిశూలమును-ఎడమచేతిలో పద్మమును ధరించి భక్త రక్షణచేయుతల్లికి నమస్కారములు. సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను చేయుతల్లి,తిరోధానము ముగిసిన తరువాత,అనుగ్రహమను ఐదయకృత్య విశేషమే నవదుర్గావిష్కారము.ఇందులో శైలపుత్రీ గా తల్లి ప్రథమ రూపమును ప్రకటించుకొనినది. అమ్మ అవ్యాజ కరుణను నేనేమని వర్ణించగలను? తల్లి తన నిర్హేతుక కృపాకటాక్షమునకు నిదర్శనముగా మనతో తన నవదుర్గా అవతార విశేషములను తెలియచేస్తూ,ఎంతో ఓర్పుతో-నేర్పుతో మనందరి చేయి పట్టుకుని,నవనవోన్మేష మార్గమున మనలను నడిపించదలచినది. మొట్తమొదట మనము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఆదిపూజలందు తల్లి శైలపుత్రీ లీలా విశేషములను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము. మూలపదార్థము కొత్తరూపమును ధరించు ప్రక్రియను మనము సృష్టికార్యముగా భావిస్తే,దక్షవాటికలో తన అవతారమును స్వఛ్చందముగా ముగించుకొనిన సతీదేవి,సతీదేవి గ్లానియైన ధర్మమును తిరిగి స్థాపించుటకు ,తన శక్తిని సమర్థవంతము చేయగల శివుని కూడి,శివశక్త్యైకరూపిణిగా పరిమాణమునొందు ప్రహసనములోని ప్రథమ ఘట్ట శైలపుత్రీదేవి.మిగిలిన ఎనిమిది దుర్గలలో మనకు పుత్రిక రూపము కానరాదు.స్థితి-గతులు రెండు తానైన తల్లి పుత్రిక అను స్థానమునుండి జరిగి,సత్యాన్వేషణకు సాధనమైన మూలాధారము వైపు (కుండలినిని జాగృతపరచుటకు) తన అడుగులను కదుపుచున్నది. తల్లి అనవరతము చంద్రుని కదలికలను తన కనుసన్నలలో నుంచిన "ఋతుచక్ర స్వరూపిణి"త్రిమూర్తిశక్త్యాత్మిక.తల్లి తన పయనమనే నెపముతో నిస్త్రాణమైయున్న విశ్వ(స్థూల) మూలాధార చక్రము లోని కునలినిని జాగృతపరచుటకు సన్నధ్ధురాలవుతున్నది. అమ్మకదా.అందుకే మన చేతిని కూడా పట్టుకుని,నవనవోన్మేషమైన నవదుర్గలను చూపించటానికి తీసుకువెళుతున్నది. అసలు ఈ అమ్మ పేరు శైలపుత్రీ.అంటే పర్వతము యొక్క కుమార్తె.అంతేనా లేక అంతరార్థమేమైన ఉన్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే అసలు తత్త్వము అర్థమవుతుంది. కొంచము తార్కికముగా ఆలోచిస్తే శైలపుత్రీమాత భూతత్త్వముగా ఆవిష్కరింపబడినది.ఓర్పునకు సాటిలేనిది.పర్వతములు భూమిని తమ స్థావరముగా చేసుకొని, ఊర్థ్వముఖముగా ఎదుగుతయి.అది వాటి నైజము.పర్వత ఊర్థ్వ విస్తరణను గమనిస్తే,స్థూలము నుండి సూక్ష్మము వైపు చేరుతున్నట్లుంటాయి. మధ్యలో ఎన్నో చ్పెట్ల చదరముగా,కొన్నిచోట్ల త్రికోనముగా,మరికొన్ని చోట్ల స్థూపములాగ వివిధాకృతులతో విరాజిల్లుచుంటాయి.కొంత ఎత్తులో గులకరాళ్ళతో,మరికొంత ఎత్తులో గండ శిలలతో ,వివిధ పరిమాణములతో-వివిధ పరిణామములో ,విభేదములను సంధించుకుంటూ,సమన్వయపరచుకుంటూ, స్వస్వరూపమును సాక్షాత్కరింపచేస్తూ,శిఖరాగ్రమున సూటిగా స్పష్టతను ప్రకటిస్తూ,దానినలంకరించిన కేతనమై కేరింతలు కొడుతుంది.కేరింతల కేతనము క్రిందనున్నవారికి సైతము స్పష్టముగా గోచరిస్తుంది.దానికి కారణము అన్ని అడ్దంకులను అధిగమించి అధిస్ఠించిన అసలు తత్త్వము.క్రింద స్థూలరూపముగా పరవతభాగము మనకు అతిదగ్గరగా నున్నను దానిని కప్పివేసిన దుమ్ము-ధూళి,మలినముల వలన అది స్వస్వరూపమును చూపలేని అశక్తురాలు.శిఖరాగ్రము దూరముననున్న అది ఏ దోషములు తాకలేని స్వయంప్రకాశిని. ఆ స్వయంప్రకాశమే శైలపుత్రీ.మన ప్రయాణములో అడ్డుపడు దుష్టశక్తులను నిర్మూలించుటకు అంకుశము(పట్టుదల)జ్ఞానమను (సామర్థ్యము) అను పద్మమును చేతబట్టుకొని,అమ్మ ఏ విధముగా ధర్మమను ఎద్దునెక్కి,సాగుచున్నదో,అదేవిధముగా అమ్మచేతిని పట్టుకుని,ధర్మమార్గములో అమ్మ చేతిని వీడక నడుస్తుంటే అంతా ఆనందమయమే.అలుపెక్కడుంటుంది? పుట్టినింటిని వీడి మెట్టినింటికి చేరుట అమ్మ సంకల్పము విషయవాసనలను వీడి విభవమును చేరుట మనసంకల్పము. అమ్మ చెంతనున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ దివ్యచరణములే శరణము.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...