SAUNDARYA LAHARI-38

 సౌందర్య లహరి-100

  పరమ పావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  పురాణములనన్నిటిని పుక్కిలించానని
  నిగమాగములన్నిటి నిగ్గుతేల్చానని

  జ్ఞాన యజ్ఞములెన్నో జ్ఞప్తిలోనున్నాయని
  పారాయణములన్నిటిలో  బాదరాయుణుడనని

  నిఖిలము నియంత్రించుటకు మంత్రోపదేశములని
  అవనీ ఉద్ధరణకై నేను అవతరించాననుకొను

  చిత్తములోని చిత్తును గ్రహించలేని,నా
  పటాటోపములన్నీ పటాపంచలమగుచున్న వేళ

  నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.
 " పాహిమాం శ్రీ  రాజరాజెశ్వరి-దయాకరి శంకరి" భక్తిలేని బాహ్యాడంబరములు చేయుచు


  తత్త్వమును తెలిసికొంటిననుకొన్న నేను అమ్మ దయతో అసలు నిజమునుతెలుసుకొని" ఏహి సుఖం దేహి" అని అర్థించగా-దయా వాహినికి అసాధ్యమేమున్నది? గుర్తించి మనము వేడుకొనవలెను కాని.దర్శనముతో  మనలనురంజింపచేయుతల్లి నిరంజని.(ఎట్టి కళకములేనిది).శ్రీ లలితా సహస్రములో "నిష్కళంకా" అనికీర్తింపబడుచున్నది.మోహిని, సింహవాహినియై, మన మోహపాశములను తొలగించుచు,కీర్తింప బడుచున్న సమయమున,చెంతనేనున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI