TIRUVEMBAVAY-17
తిరువెంబావాయ్-17 *********** కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృదిభావయామి." సందర్భము ధీయతే రక్షతే.ధీయతే పశ్యతే దీక్ష అంటుంది సనాతనము.ధీ అంటే బుద్ధి.దానిని చైతన్యపరచి ఉపాధిలోని స్వస్వరూపమును అందించగలిగే ఏకైక మార్గము.శివనోమును సంకల్పించి,ప్రాతఃకాలమునక ఒకరినొకరు మేల్కొలుపుచుకొనుచు,స్నానఘట్టమునకు చేరిన మన భాగ్యశాలురు నిన్న కృపావర్షమున మునిగి పునీతులైనారు. ప్రస్తుత పాశురములో స్వామి పాదపద్మముల విశిష్టతను ,కారుణ్యమును సంకీర్తిస్తున్నారు. పాశురము ********* శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్ ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె శంగమల పొర్పాదం తందరుళం సేవగనై అంగణ్ అరసై అడియోగళ్ కారముదై నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్ పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ . కొంగుం-కురల్-అరుళీ-నల్లని అందమైన-పరిమళభరితమైన కేశపాశము కల...